Latest Post

BSS11 Announced On Sri Rama Navami

 Bellamkonda Sai Sreenivas, Koushik Pegallapati, Sahu Garapati, Shine Screens Production No 8, #BSS11 Announced On Sri Rama Navami Evening



Hero Bellamkonda Sai Sreenivas who is busy with his 10th film signed another exciting project which was announced today, on the auspicious occasion of Sri Rama Navami. The dynamic and passionate producer Sahu Garapati, who is known for making commercial films with deeper emotions, announced the ambitious project, written and directed by Koushik Pegallapati, with an awe-inducing poster that depicts in-depth detailing that leaves an impression of a scary fairy tale.


What really grabs our attention is Lord Sri Rama is seen with a bow and arrow aiming at a monster in the sky. Someone performs shadow puppetry. We can also see a deserted forest, an antenna tower, and a hornet. It’s a perfect poster for Sri Rama Navami occasion.


After the sensational success of Bhagavanth Kesari, Shine Screens returns to the silver screen with this electrifying Horror Mystery that promises to offer an unforgettable cinematic experience. The film is poised to redefine the tale of Light vs. Dark with a modern narrative. 


The filmmaker assures to push the boundaries by offering a technically brilliant and visually exhilarating film with an original story that instills hope by invoking fear.


Smt. Archana presents Production No. 8 of Shine Screens banner. The makers roped in well-known technicians to take care of different crafts. Chinmay Salaskar will crank the camera, while B. Ajaneesh Loknath of Kantara fame provides the music. Manisha A Dutt is the production designer, whereas D Siva Kamesh is the art director. Niranjan Devaramane will edit the movie.


Creative Head G Kanishka and Co-Writer Darahas Palakollu form the creative backbone of this movie, each bringing their unique expertise to craft a film that promises to be a technical marvel.


The other details of the movie will be revealed soon.


Cast: Bellamkonda Sai Sreenivas


Technical Crew:

Written & Directed by - Koushik Pegallapati 

Producer - Sahu Garapati

Banner - Shine Screens

Presents - Smt. Archana

Music - B. Ajaneesh Loknath 

DOP - Chinmay Salaskar

Production Design - Manisha A Dutt

Art Director - D Siva Kamesh

Editor - Niranjan Devaramane

Co-Writer - Darahas Palakollu 

Creative Head - G Kanishka 

Co-Director - Lakshman Musuluri

PRO - Vamsi-Shekar

Publicity Designer - Ananth Kancherla

Marketing - First Show

Producer Akhilesh Kalaru Interview About Market Mahalakshmi

మా సినిమా "మార్కెట్ మహాలక్ష్మి" పెద్ద హిట్ అవుతుంది: ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు



బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ ఉండగా, ఈ క్రమంలో ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు.


1) మీ పేరు, మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా? 

నా పేరు అఖిలేష్ కలారు. నేను ఇండియానాపోలిస్, USలో ఉంటున్నాను & ఫార్చ్యూన్ 500 కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను.


2) మీరు సినిమా లోకి రావడానికి ఇన్స్పిరేషన్ అండ్ రీజన్ ఏంటి? 


చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. సినిమా పరిశ్రమలో పనిచేయాలని అనుకున్నాను. కుటుంబ కమిట్‌మెంట్‌ల కారణంగా, నేను మొదట ఆ బాధ్యతలను పూర్తి చేసి, ఆపై నా అభిరుచిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను.


3) డైరెక్టర్ ముఖేష్ మీకు ఎలా పరిచయం? & మార్కెట్ మహాలక్ష్మి మూవీ కి ప్రోడ్యుజ్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? 


దర్శకుడు విఎస్ ముఖేష్ నాకు దాదాపు రెండేళ్లుగా తెలుసు. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎలా వచ్చాడో నాకు తెలుసు. 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్. "మార్కెట్ మహాలక్ష్మి" కథను ఆయన చెప్పినప్పుడు, నేను దానిని ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నాను.


4) ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ప్రోడ్యుజ్ చేస్తున్నందుకు మీకు రిస్క్ అనిపించలేదా? 

రిస్క్ లేని వ్యాపారం లేదు. దర్శకుడు ముఖేష్‌ స్క్రిప్ట్‌ని నమ్మి ఆ రిస్క్‌ నేను తీసుకున్నాను.


5) మార్కెట్ మహాలక్ష్మి కథ ఏంటి? ప్రేక్షకులని మీ కథ ఆకట్టుకుంటుంది అని అనుకుంటున్నారా? 


"మార్కెట్ మహాలక్ష్మి" కథ చాలా సింపుల్. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ ఇది. మేము మా ప్రమోషన్‌లలో  ఒక మెయిన్ పాయింట్ నీ చెప్పలేదు. ఆ పాయింట్ 19వ తేదీన ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందని ఆశిస్తున్నాం.



6) మీరు US లో ఉంటూ, India లో షూటింగ్ ఎలా మేనేజ్ చేయగలిగారు? 


మొదట్లో నాకు ఆ డౌట్స్ ఉండేది ఇండియాలో షూటింగ్ మేనేజ్ చేస్తూ, ఇక్కడ యూఎస్ లో జాబ్ ఎలా మేనేజ్ చేయాలా అని. అయితే, మా చేతిలో మంచి టీమ్ ఉంది, డైరెక్టర్ ముఖేష్ వాళ్లని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశాడు. నా పని కొంచెం ఈజీ అయిపోయింది.


7) సినిమాలో హీరో & హీరోయిన్ తమ పాత్రలకి న్యాయం చేసారు అని అనుకుంటున్నారా?


నటీనటులు తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. పార్వతీశం మరియు ప్రణీకాన్విక ఇద్దరూ తమ పాత్రల్లో జీవించారు. వారి కెమిస్ట్రీ చాలా బాగుంది.


8) సినిమా కంప్లీట్ అయ్యాక చూసి, పెద్ద ఆర్టిస్ట్ లతో వెళ్లి ఉంటె బాగుండు అని ఫీల్ అయ్యారా? 


పెద్ద నటీనటులతో ఈ సినిమా చేస్తే బాగుండేదని నాకెప్పుడూ అనిపించలేదు. పార్వతీశం, ప్రణీకాన్విక, అవినాష్, బాషా మరియు ఇతర నటీనటులు వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.


9) మొదట్లో మీకు ఏదయితే డైరెక్టర్ కథ చెప్పాడో అది పెర్ఫెక్ట్ గా డెలివరీ చేశాడా? 


నిజానికి దర్శకుడు ముఖేష్‌ నాకు చెప్పిన కథనే తెరపైకి తెచ్చారు. ముఖేష్ కథ చెప్పినప్పుడు నేను వారి పాత్రలను విజువలైజ్ చేసుకున్నాను. ఫైనల్ గా సినిమా చూసాక, నేను ఊహించిన వాటిని తెరపై చూసినట్టు అనిపించింది.


10) మీరు పెట్టిన డబ్బులు రికవరీ అవ్వుతుందని మీరు నమ్ముతున్నారా? 


నేను పెట్టుబడి పెట్టిన డబ్బును "మార్కెట్ మహాలక్ష్మి" రికవరీ చేస్తుందని నమ్ముతున్నాను. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం చాలా కష్టం, కానీ మేము దానిని విజయవంతంగా పూర్తి చేసాము.  ఏప్రిల్ 19న విడుదల కూడా చేయబోతున్నాము. మా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందన్న నమ్మకం ఉంది.


11) ఈ ఫ్రైడే వేరే సినిమాలతో పాటు, మీ సినిమా కూడా రీలిజ్ అవ్వుతుంది? మీ సినిమా హిట్ అవ్వుతుందని మీరు భావిస్తున్నారా? ఎందుకు? 


నాకు సినిమాలంటే ప్రాణం. ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి సినిమా నిర్మాతను ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాను. అందులో నా సినిమా మరింత విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.


12) మీకు ఇది ఫస్ట్ మూవీ కదా? సినిమా ప్రోసెస్ ఏమైనా కొత్తగా అనిపించిందా? 


ఈ సినిమా పూజా కార్యక్రమం నుంచి షూటింగ్ ముగిసే వరకు ఫస్ట్ కాపీ వరకు చాలా నేర్చుకున్నాను. ఇది నాకు గొప్ప అవకాశం. ముఖేష్ సినిమా గురించి నాకు ప్రతిరోజూ అప్‌డేట్ చేస్తూ సపోర్టుగా నిలిచారు.


13) ఈ సినిమా తరువాత మీ ప్ల్యాన్ ఏంటి?


సినిమాలంటే చాలా ఇష్టం, ఎన్నో కష్టాలతో ఈ స్థాయికి చేరుకున్నాను. "మార్కెట్ మహాలక్ష్మి" కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. గ్రాండ్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. మరిన్ని సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో ఒక ప్రముఖ స్థానం సాధించాలని ఆశిస్తున్నాను. 

Dream Catcher First Look Posters Unveiled

సి ఎల్ మోషన్ పిక్చర్స్  వారి “డ్రీం క్యాచర్  ” ఫస్ట్ లుక్ పోస్టర్స్  విడుదల !

డ్రీమ్ బేస్డ్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ! 



పోస్టర్స్ చూస్తుంటే కొత్త దర్శకుడి గా కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమా అనిపించడం లేదని, హీరోగా  అందరు  కొత్త గా చేసిన ఈ సినిమా కి చాలా మంచి భవిష్యత్ ఉందని “డ్రీం క్యాచర్ ”  డ్రీమ్ బేసిడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ .

ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు , బెస్ట్ విషెష్ తెలిపారు . 

సి ఎల్ మోషన్ పిక్చర్స్   పతాకంపై సందీప్ కాకుల ప్రొడ్యూసర్ గా మరియు నిర్మాణం సారధ్యం లో ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ , శ్రీనివాస్ రాంరెడ్డి  , ఐశ్వర్య హోలక్కల్ , సందీప్ కాకుల  నిర్మించిన “డ్రీం క్యాచర్ ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల వేడుక హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్  లో ఘనంగా జరిగింది.

సందీప్ కాకుల  టాలెంటెడ్  డైరెక్టర్ తెలుగు తెరకు పరిచయమవుతుండడం సంతోషదాయకమని, ఫస్ట్ లుక్ లో, టీజర్ లో సక్సెస్ కళ ప్రస్పుటంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా అతిధులు  పేర్కొన్నారు. “డ్రీం క్యాచర్ ” చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే  దర్శకుడిగా, మరియు ప్రొడ్యూసర్ గా  తెరకెక్కించానని, ఈ ఏడాది మంచి  చిత్రం గా  నిలిచే చిన్న చిత్రాల జాబితాలో సూపర్  చిత్రంగా మలచిన " డ్రీం క్యాచర్ " చిత్రం కచ్చితంగా చేరుతుందని, క్లైమాక్స్  చిత్రీకరించి తీరు చూస్తే హౌరా అనిపించే విధంగా ఉంటుంది అని చెప్పారు.   “డ్రీం క్యాచర్ ” చిత్రంలో నటించడం చాలా సంతృప్తినిచ్చిందని నటులు ప్రశాంత్ కృష్ణ, పేర్కొన్నారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శకడు కి హీరోయిన్ అనీషా ధామ  కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రోహన్ శెట్టి మరియు ఛాయాగ్రహణం: ప్రణీత్ గౌతమ్ నంద తదితరులు పాల్గొని “డ్రీం క్యాచర్ ” ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు. నటి నటులు: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ , శ్రీనివాస్ రాంరెడ్డి  , ఐశ్వర్య హోలక్కల్ ,  ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి… సాంకేతిక వర్గం: పి.ఆర్.ఓ: శ్రీపాల్ చొల్లేటి,  డి.ఐ: శ్రీనివాస్ మామిడి , వి.ఎఫ్.ఎక్స్: శ్రీకాంత్ శాఖమూరు , సంగీతం: రోహన్ శెట్టి  ఛాయాగ్రహణం: ప్రణీత్ గౌతమ్ నంద , కూర్పు: ప్రీతం గాయత్రి ,  నిర్మాత: సందీప్ కాకుల  రచన – దర్శకత్వం: సందీప్ కాకుల. 

Robinhood Worldwide Theatrical Release On December 20th

నితిన్, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ రాబిన్హుడ్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న థియేట్రికల్ రిలీజ్



వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్హుడ్ లో హీరో నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నాడు. వెంకీ కుడుముల తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు నితిన్ని పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, బర్త్ డే గ్లిమ్ప్స్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. రాబిన్హుడ్ డిసెంబర్ 20న విడుదల కానుంది. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు ఈ సినిమాకి కలిసి రానున్నాయి. కమర్షియల్ అంశాలే కాకుండా తగినంత వినోదాన్ని కలిగి ఉండే సినిమాకి ఇది సరైన విడుదల. రిలీజ్ డేట్ పోస్టర్ లో నితిన్ ముఖం లో ఇంటెన్సిటీ కలిగి ఉండి  స్పోర్ట్స్ బైక్పై మ్యాచో లా కనిపిస్తున్నాడు


నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. సాయి శ్రీరామ్ లెన్స్మెన్, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.


నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


తారాగణం: నితిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు


సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: వెంకీ కుడుముల

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్

CEO: చెర్రీ

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

DOP: సాయి శ్రీరామ్

ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల

లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న

PRO: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో 

Nara Rohit Sundarakanda First Look Unveiled

నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ చిత్రం “సుందరకాండ” ఫస్ట్ లుక్ విడుదల , సెప్టెంబర్ 6, 2024న థియేట్రికల్ రిలీజ్

 
హీరో నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ చిత్రం “సుందరకాండ”.దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ను పరిచయం చేస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళి నిర్మించిన వినోదభరితమైన రొమ్-కామ్ చిత్రం “సుందరకాండ”. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా జీవితం లో ఉండే అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది
 
నారా రోహిత్ కూల్ అండ్ క్లాసీ అవతార్ లో చేతిలో కుండతో, మరో చేతిలో పుస్తకంతో ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమాకు సుందరకాండ అనే టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. పోస్టర్ లో కాలేజీ విద్యార్థులు వ్యతిరేక దిశలో నడుస్తున్నట్లు మనం చూడవచ్చు. ఈ సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. ఇది గణేష్ చతుర్థి (సెప్టెంబర్ 7) సందర్భం గా సెప్టెంబర్ 6,2024 న ప్రేక్షకుల ముందుకి రానుంది.
 
సుందరకాండ హిందూ ఇతిహాసం రామాయణంలో ఐదవ పుస్తకం. సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించడానికి శ్రీరామ నవమి పర్వదినాన్ని సరైన సందర్భం గా భావించి మేకర్స్ ఈ రోజు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది        
 
వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు.
 
ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ప్రొడక్షన్ డిజైనర్, రోహన్ చిల్లాలే ఎడిటర్.
 
తారాగణం: రోహిత్ నారా, వృతి వాఘని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు.
 
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి
నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళ్లి
బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP)
DOP: ప్రదీష్ ఎం వర్మ
సంగీత దర్శకుడు: లియోన్ జేమ్స్
ఎడిటర్: రోహన్ చిల్లాలే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ గుడ్డపు
ప్రొడక్షన్ డిజైనర్: రాజేష్ పెంటకోట
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
కాస్ట్యూమ్ డిజైనర్లు: హర్ష & పూజిత తాడికొండ
యాక్షన్ కొరియోగ్రఫీ: పృథ్వీ
డాన్స్ కొరియోగ్రఫీ: విశ్వ రఘు, యష్
VFX సూపర్వైజర్: నాగు తలారి, అశోక్ మోచర్ల
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ - ప్రవీణ్ & హౌస్ ఫుల్ డిజిటల్


THANGALAAN Glimpse Unveiled

 స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న "తంగలాన్" సినిమా నుంచి హీరో చియాన్ విక్రమ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్




చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇవాళ చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ "తంగలాన్" సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో ఈ గ్లింప్స్ చూపించింది. అలాగే విక్రమ్ ఎలా తన పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడో ఈ వీడియోతో తెలుస్తోంది. "తంగలాన్" సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది.


ఈ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ - "తంగలాన్" సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాం. ఆ అడ్వెంచర్ స్టోరీని రూపొందించడంలో హీరో విక్రమ్ తో పాటు మూవీ టీమ్ నాకు ఎంతో సపోర్ట్ చేసింది. ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ జియో స్టూడియోస్ "తంగలాన్" సినిమా కోసం స్టూడియో గ్రీన్ తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. జియో స్టూడియోస్ రాకతో మా సినిమా గ్లోబల్ ఆడియెన్స్ కు మరింతగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. హీరో విక్రమ్ "తంగలాన్" సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ఈ గ్లింప్స్ మీకు చూపిస్తుంది. అన్నారు.


"తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.



నటీనటులు - చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు


టెక్నికల్ టీమ్


సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్

ఆర్ట్ - ఎస్ ఎస్ మూర్తి

ఎడిటింగ్ - ఆర్కే సెల్వ

స్టంట్స్ - స్టన్నర్ సామ్

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

బ్యానర్స్ - స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్

నిర్మాత - కేఈ జ్ఞానవేల్ రాజా

దర్శకత్వం - పా రంజిత్


Actress Samyuktha Launches 'Adishakti For Women's Empowerment

 మహిళా సాధికారత కోసం "ఆదిశక్తి" సేవా సంస్థను లాంఛ్ చేసిన హీరోయిన్ సంయుక్త




స్టార్ హీరోయిన్ సంయుక్త నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది. సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఈ స్టార్ హీరోయిన్ అడుగు ముందుకు వేసింది. ఇవాళ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిశక్తి అనే సేవా సంస్థను అనౌన్స్ చేసింది. ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతోంది.


మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఆదిశక్తి సంస్థను స్థాపించింది సంయుక్త. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనివ్వనుంది. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళలకు సపోర్ట్ గా నిలవనుంది ఆదిశక్తి సంస్థ. మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని, అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ఆదిశక్తి సంస్థ ఉద్దేశమని సంయుక్త తెలిపింది.

Heroa Satyam Rajesh Interview About Tenant

ఈ సినిమా మనం చూస్తూ ఉండే కథ. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అలాగే అంటారు - సత్యం రాజేష్ 



‘పొలిమేర-2’తో ఊహించని సక్సెస్ అందుకున్న సత్యం రాజేష్ హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్‌ నోరోన్హా, భరత్‌ కాంత్‌ కీలక పాత్రలు పోషించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్తగా పెళ్లైన జంట .. వేరు కాపురం .. అందమైన జీవితం. ఎన్నో ఆశలతో ఆ జంట కొత్తకాపురాన్ని మొదలుపెడుతుంది. ఆనందంగా .. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలోకి అతని వైపు నుంచి మరదలు .. ఆమె వైపు నుంచి ఒక ఫ్రెండ్ ఎంటరవుతారు. ఆ ఇద్దరితో పాటే ఈ దంపతుల మధ్య అపోహలు .. అపార్థాలు మొదలవుతాయి. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది కథ. ఒక వైపున క్రైమ్ .. మరోవైపున సస్పెన్స్ .. ఇంకోవైపున రొమాన్స్‌తో కూడిన ఈ సినిమాపై బజ్ పెరుగుతూ వచ్చింది. ఈ చిత్రానికి సాహిత్య సాగర్ అందించిన సంగీతం మరో ప్లస్ అయింది. సినిమా విడుదల దగ్గర పడడంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్రయూనిట్. అందులో భాగంగా హీరో సత్యం రాజేష్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆ విశేషాలు...



టెనెంట్ ఎవరు? ఎవరు ఎవరింటికి వస్తున్నారు? ఏంటి ఈ సినిమా కథ?

ఇది ఎదురింట్లో లేదా పక్కింట్లో జరిగే కథ. భార్యభార్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూపించే కథ. ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగే స్టోరీ. అన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లాగే ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్పారో అది పర్‌ఫెక్ట్‌గా తీశారు. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. సినిమా థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పేలా ఉంటుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుంది.


టెనెంట్‌కు ‘A’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు?

సినిమా ట్రైలర్‌లో మేడమీద నుంచి పడి చనిపోయే సీన్ ఉంది కదా.. అది సినిమాటిక్‌గా చూపిస్తే క్లీన్ సర్టిఫికెట్ వస్తుంది. కానీ రియాలిటీకి దగ్గరగా చూపిస్తేనే ఆడియన్స్‌కు ఒరిజినల్ ఫీల్ కలుగుతుంది. ఈ సీన్‌ను రియాలిటీకి దగ్గరగా చూపించడం వల్లే ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి.


మీరు ఇలాంటి సినిమాలనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు?

నేను మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు యాక్షన్, డ్యాన్స్‌లు, రొమాంటిక్, మాస్ ఎలిమెంట్స్, భారీ బడ్జెట్ లాంటి సినిమాలను ఎంచుకోను. నేను ఆర్టిస్ట్‌గా చేస్తూనే.. మంచి పాయింట్ ఉన్న సినిమాలు చేయాలనేది నా కోరిక. ఇప్పుడు ఎవరితోనే పోటీ పడాలనే కోరిక నాకు లేదు.


ట్రైలర్‌లో ఎడిటింగ్ కట్స్ చాలా బాగున్నాయి. సినిమాలో షార్ట్సే వాడారా? ట్రైలర్ కోసం సెపరేట్‌గా కట్ చేయించారా?

ఒక్క షాట్ కూడా ట్రైలర్ కోసం అని చేయలేదు. అన్నీ సినిమాలో షార్ట్సే వాడాము. డైరెక్టర్ యుగంధర్ గారు కథ చెప్పినప్పుడే నేను హ్యాపీ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను కథ వింటూనే ఉన్నా. ఇది భలే ఉందే అని ఫీలయిన కథ ఇది.


ఇది ఓటీటీ కోసం తీసిన కథ అని చెప్పారు. కానీ థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు. ‘పొలిమేర-2’తో సక్సెస్ రావడం వల్ల థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారా?

కథ చాలా బాగుందని చిన్న సినిమాగా స్టార్ చేశాం. ఓటీటీ కోసమే అనుకుని చేస్తున్న క్రమంలో సినిమా అవుట్‌పుట్ చూసుకుంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. అందుకోసం ఇంకా ఇంప్రూవ్ చేశాం.


ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలకు రైటింగ్ చాలా ముఖ్యం.. ఈ సినిమా రైటింగ్‌లో ఉన్న మ్యాజిక్ ఏంటి?

ఈ సినిమా కథను వర్మ శ్రీనివాస్ గారు రాశారు. ఆయన రైటింగ్ చాలా నేచురల్‌గా ఉంది. ఇందులో ఓవర్ డైలాగ్స్ ఉండవు. సినిమాలో నేను మాట్లాడేదే చాలా తక్కువ ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది.


మీరు అన్నీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు కదా.. మీరు పర్టికులర్‌గా ఇలాంటివే సెలెక్ట్ చేసుకుంటున్నారా? లేక ఇలాంటి కథలే మీ దగ్గరికి వస్తున్నాయా?

నా దగ్గరకు వచ్చిన వాటిలో నేనే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేని సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో పది కాలాలపాటు చల్లగా ఉంటాం. పోటీలో దిగి ఫైట్ చేసి ఓడిపోతే ఇంటికి వెళ్లిపోవాలి. మనం కుమ్మేస్తా.. కొట్టేస్తాం అని చెప్పే అలవాటు నాకు లేదు. నా జీవితం ఏంటో అందరూ చూసేశారు కదా. నాకు నప్పే సినిమాలనే నేను చేస్తా.


థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.. పొలిమేర-2లో కూడా మ్యూజిక్ బాగా హైలైట్ అయింది. ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుంది?

ఈ సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్కే ప్రాణం. క్లైమాక్స్‌లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేనే అలా అలా పాజ్ అయ్యా. ఒక ఆడియన్‌లాగా నాకే కన్నీళ్లు వచ్చాయి. సినిమాలో మ్యూజిక్ ఫీల్ అంతగా ఉంటుంది. సాహిత్య సాగర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.


ఇకపై హీరోగానే చేస్తారా? ఆర్టిస్ట్‌గా కూడా కొనసాగుతారా?

నేను ఆర్టిస్టుగా చేస్తా.. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేస్తున్నా. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే.. నాకు సూట్ అవుతాయనుకుంటేనే హీరోగా చేస్తా.


హీరో అంటే చాలామంది ఎలివేషన్స్ కోరుకుంటారు.. మీ సినిమాల్లో అలాంటివి లేవు. భవిష్యత్తులో ఏమైనా ఉంటాయా?

నాకు అలాంటి ఎలివేషన్స్ నచ్చవు. నేను మెయిన్ క్యారెక్టర్‌లో స్ట్రీట్ ఫైట్ అనే ఒక కామెడీ సినిమా చేస్తున్నా. అందులో ఎలివేషన్స్ ఉండవు కానీ.. కమర్షియల్ సినిమాలా ఉంటుంది.


మీ కెరీర్‌లో ‘క్షణం’ చెప్పుకోదగ్గ సినిమా కదా.. అలాంటి క్యారెక్టర్స్ మీ దగ్గరకు రాలేదా? వచ్చినా మీరు చేయలేదా?

క్షణం తర్వాత దగ్గర దగ్గర 50 సినిమాల్లో పోలీస్ రోల్స్ వచ్చాయి. కానీ మళ్లీ అలాంటి పాత్రలే చేస్తే బాగోదని చేయలేదు. కొన్ని పోలీస్ పాత్రలు కామెడీ చేసేలా ఉంటాయి. అలాంటివి చేయను. కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటే చేయొచ్చు. ప్రకాష్ రాజ్, రఘువరన్ లాంటి వాళ్లలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక.


టెనెంట్‌లో ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఎంతవరకూ ఉంటాయి?

ఈ సినిమాలో ట్విస్ట్‌లు ఉండవు కానీ.. సస్పెన్స్ ఉంటుంది. మర్డర్ మిస్టరీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ చూసి ఆడియన్స్ సింపతీతో బయటకు వస్తారు.


నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు?

స్ట్రీట్ ఫైట్ అని నేను మెయిన్ లీడ్‌లో ఒక సినిమా చేస్తున్నా. మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

 

Chitralayam Studios Production No 2 has Announced

 శ్రీరామ నవమి సంద‌ర్భంగాచిత్రాల‌యం స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 అనౌన్స్‌మెంట్‌...  ‘జర్నీ టు అయోధ్య’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టిన నిర్మాత వేణు దోనేపూడి



 జగదభిరాముడు, సకల గుణధాముడు..ధర్మ రక్షకుడు, ఏకపత్నివ్రతుడైన అయోధ్య రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రీరామనవమి. ఈ ప‌ర్వ‌దినాన‌ ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్ వేణు దోనేపూడి త‌న చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేశారు. ‘జర్నీ టు అయోధ్య’ అనేది వ‌ర్కింగ్ టైటిల్.  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.ఎన్‌.ఆదిత్య క‌థ‌ను అందిస్తున్నారు.


రామాయ‌ణంపై, రామాయ‌ణంను ఆధారంగా చేసుకుని ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు వ‌చ్చాయి. ఎంద‌రో గొప్ప గొప్ప న‌టీన‌టులు సీతా రాములుగా, రావ‌ణ‌, ల‌క్ష్మ‌ణ‌, ఆంజ‌నేయులుగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు అదే బాట‌లో రామాయ‌ణంను తెర‌కెక్కించ‌టానికి నిర్మాత వేణు దోనేపూడి సిద్ధ‌మ‌య్యారు. వి.ఎన్‌.ఆదిత్య‌ నేతృత్వంలో ఒక‌ టీమ్ ఈ చిత్రానికి సంబంధించి అయోధ్య స‌హా ప‌లు చోట్ల‌ లోకేషన్స్ రెక్కీ నిర్వహిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.


ఒక యంగ్ డైరెక్ట‌ర్ దర్శకత్వంలో  తెర‌కెక్కించ‌బోతున్న ఈ సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌న్నారు మేక‌ర్స్‌. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో,  భారీగా నిర్మించబోతున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి నిర్మాణ సారధ్యం తమ్మారెడ్డి భరద్వాజ.


ప్ర‌స్తుతం చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ పీపుల్ మీడియా బ్యాన‌ర్‌తో క‌లిసి గోపీచంద్‌, శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో ‘విశ్వం’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.


LINK - 




#90s web series Director Aditya Hasan's feature film titled "Teacher"

క‌ల‌ర్స్ స్వాతి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతోన్న హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘టీచర్’

90స్ టీమ్ నుంచి వ‌స్తోన్న మ‌రో న‌వ్వుల జ‌ల్లు



ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో తెరకెక్కుతోంది టీచర్‌. తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్‌ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుంది. సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం... ప్రేక్షకుల మనసులను టచ్‌ చేస్తుందనడంలో అసలు సందేహం లేదు.

ఇటీవల 90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న టీమ్‌ నుంచి వస్తోంది టీచర్‌. ఆదిత్య హసన్‌ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. నవీన్‌ మేడారం నిర్మించారు. ఎంఎన్‌ఓపీ (మేడారం నవీన్‌ అఫిషియల్‌ ప్రొడక్షన్స్) సంస్థ నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది.


నటీనటులు

స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి), నిఖిల్‌ దేవాదుల (బాహుబలి ఫేమ్‌), నిత్యశ్రీ (కేరాఫ్‌ కంచరపాళెం ఫేమ్‌), రాజేంద్ర గౌడ్‌, సిద్ధార్థ్‌ (90స్‌ ఫేమ్‌), హర్ష, పవన్‌ రమేష్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ తదితరులు


సాంకేతిక నిపుణులు

రచన - దర్శకత్వం: ఆదిత్య హసన్‌

కెమెరా: అజీమ్‌ మహమ్మద్‌

సంగీత దర్శకత్వం: సిద్ధార్థ్‌ సదాశివుని

ఎడిటర్‌: అరుణ్‌ తాచోత్‌

ఆర్ట్ డైరక్టర్‌: తిపోజి దివ్య

లిరిక్స్ : కందికొండ

కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రేఖ బొగ్గారపు

లైన్‌ ప్రొడ్యూసర్‌: వినోద్‌ నాగుల

సహ నిర్మాతలు: శ్రావిన్‌, రాజశేఖర్‌ మేడారం

ప్రొడక్షన్‌: ఎంఎన్‌ఓపీ - అమోఘ ఆర్ట్స్ సహకారంతో...

పీఆర్‌ఓ : నాయుడు - ఫణి (బియాండ్‌ మీడియా)

సమర్పణ: రాజేశ్వర్‌ బొంపల్లి

నిర్మాత: నవీన్‌ మేడారం 

Maruthi Nagar Subramanyam's 2nd Single Madam Sir is Unveiled

అల్లు అర్జున్‌ సినిమాల్లో సీన్లు రీక్రియేట్‌ చేస్తూ 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో రొమాంటిక్ సాంగ్... 'మేడమ్ సార్ మేడమ్ అంతే'



రావు రమేష్ హీరోగా నటించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట 'మేడమ్ సార్ మేడమ్ అంతే'ను ఇవాళ విడుదల చేశారు.

'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద 'మేడమ్ సార్ మేడమ్ అంతే' పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు. అందుకని, ఆయన అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకున్నారు.

'తొలి తొలి సారి తొలిసారి

గుండె గంతులేస్తున్నదే!

ఏంటీ అల్లరి అంటే వినకుందే!

ఎందుకనో నువ్వు నచ్చేసి

వెంట వెంట పడుతున్నదే!

కన్ను తోడు రమ్మని పిలిచిందే!

నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత

నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత

ఒక్క మాట చెప్పు ఇంటి ముందు వాలిపోతా

ఏదో మాయ చేశావటే

నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెళ్ళిపోతా

నక్సలైటు లాగ నేను నీకు లొంగిపోతా

ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఎప్పుడు లేదే

తనందం ఎంతటి గొప్పది అంటే

తలెత్తి చూడక తప్పదు అంతే

తలొంచి మొక్కిన తప్పేం కాదే

మేడమ్ సారు మేడమ్ అంతే' అంటూ సాగిందీ పాట.


'మేడమ్ సార్ మేడమ్ సార్'ను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు. ఇప్పటి వరకు ఆయన ఇంత హుషారైన పాటను పాడలేదని చెప్పాలి. కళ్యాణ్ నాయక్ అందించిన అద్భుతమైన బాణీని తన గాత్రంతో మరో స్థాయికి తీసుకు వెళ్లారు. భాస్కరభట్ల పాటను రాశారు.  


'మారుతీ నగర్ సుబ్రమణ్యం' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''టైటిల్ పాత్రలో రావు రమేష్ గారి లుక్, ఆల్రెడీ విడుదల చేసిన టైటిల్ సాంగ్ 'నేనే సుబ్రమణ్యం... మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం'కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. భాస్కరభట్ల గారు తొలి పాటతో పాటు ఈ పాటకూ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ రోజు సన్నాఫ్ సుబ్రమణ్యంగా నటించిన అంకిత్ కొయ్య సాంగ్ విడుదల చేశాం. అతను పోషించిన పాత్రకు, అల్లు అర్జున్ గారికి సినిమాలో చిన్న కనెక్షన్ ఉంటుంది. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 'జోహార్', 'తిమ్మరుసు', 'మజిలీ', 'శ్యామ్ సింగ రాయ్'తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన అంకిత్ కొయ్య మంచి నటన కనబరిచారు. రమ్య పసుపులేటి ఈ జనరేషన్ ఇన్నోసెంట్ అమ్మాయి రోల్ చేశారు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి. లిధా మ్యూజిక్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా మా సినిమాలో పాటల్ని విడుదల చేస్తున్నాం.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.


రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, క్రియేటివ్‌ హెడ్‌: గోపాల్‌ అడుసుమల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య. 

Chitravaahini and RYG Banners Announced TUK TUK Title For Their Film


"టుక్ టుక్" - చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌లచే ఆవిష్కరించబడిన సరి కొత్త టైటిల్



చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌లు తమ తాజా చలనచిత్రం టైటిల్ "టుక్ టుక్" టైటిల్ పోస్టర్ ని శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేశారు. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.


చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్ లుక్ ఉంది. సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, "టుక్ టుక్" ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంది, అసలు కథలో ఆ ఆటో పాత్ర ఏంటి అనేది ముందు ముందు యూనిట్ సభ్యులు ఇచ్చే అప్డేట్స్ లో చూసి తెలుసుకోవాలిసి ఉంది.

 

పోస్టర్ లో అంశాలని బట్టి ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో సెట్ చేయబడింది. అనేక ఫాంటసీ ఎలెమెంట్స్ కూడా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి.  రాహుల్ రెడ్డి, లోక్కు సాయి వరుణ్ మరియు శ్రీరాములు రెడ్డి నిర్మించిన "టుక్ టుక్" క్రియేటివ్ తరహాలో ప్రేక్షకుల మనన్నలు పొందుతుంది. పోస్టర్ లో హీరో నో హీరోయిన్ ఓ కాకుండా ఈ ఆటో పెట్టడం వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనికి సంతు ఓంకార్ సంగీతం అందించారు మరియు హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.


"టుక్ టుక్" ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నట్టు ఈ పోస్టర్ రెస్పాన్స్ బట్టి అర్ధమవుతుంది.


తారాగణం:

హర్ష రోషన్

కార్తికేయ దేవ్

స్టీవెన్ మధు

సాన్వీ మేఘన

నిహాల్ కోధాటి


సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ

సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్

సంగీతం: సంతు ఓంకార్

ఎడిటర్: అశ్వత్ శివకుమార్

నిర్మాతలు:

రాహుల్ రెడ్డి

లోక్కు శ్రీ వరుణ్

శ్రీరాముల రెడ్డి

సుప్రీత్ సి కృష్ణ

పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు

డిజిటల్ మీడియా : పిక్చర్ పిచ్

 

Osey Arundhati title Song creates a Stir Online

 నెటింట్లో 'ఒసేయ్ అరుంధతి' పాట హల్చల్



మోనికా చౌహాన్,  కమల్ కామరాజు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లిరికల్ సాంగ్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.


దర్శకుడు ఈ పాటను బాగా రాశారు...

ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఒసేయ్ అరుంధతి పాటను చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ చాలా బాగా రాశారని ఆయన పేర్కొన్నారు. లిరిక్స్ క్యాచీగా ఉండటంతో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చామన్నారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారని తెలిపారు.


త్వరలో సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తాం....

చిత్ర నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘అంద‌రికీ శ్రీరామ‌న‌వమి శుభాకాంక్ష‌లు. ఈరోజు ఒసేయ్ అరుంధ‌తి అంటూ సాగే టైటిల్ ట్రాక్‌ను విడుద‌ల చేయ‌టం ఆనందంగా ఉంది. కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.


కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం

చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ... ‘‘హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలుఅరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.


నటీనటులు:


మోనికా చౌహాన్, కమల్ కామరాజు, వెన్నెల కిషోర్‌, పృథ్వీరాజ్, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ తదితరులు


సాంకేతిక వర్గం:


నిర్మాత- గూడూరు ప్రణయ్ రెడ్డి, దర్శకత్వం - విక్రాంత్ కుమార్, సినిమాటోగ్రఫీ - సాయి చైతన్య మాటేటి, మ్యూజిక్ - సునీల్ కశ్యప్, ఎడిటర్ - మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వెంకట్ మద్దిరాల, లైన్ ప్రొడ్యూసర్ - ఎన్.మురళీధర్ రావు, ప్రొడక్షన్ కంట్రోలర్ - వాసు, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా.

Sree Vishnu Lightbox Media Completed 60 percent Shoot

 శ్రీవిష్ణు హీరోగా లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌.. 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి



వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్‌గా సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, ఓం భీమ్ బుష్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఈరోజు ప్ర‌క‌టించారు. హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై సందీప్ గుణ్ణం, విన‌య్ చిల‌క‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


‘సామజవరగమన’ చిత్రంలో శ్రీవిష్ణుకి జంట‌గా న‌టించిన రెబా జాన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ ఎగ్జ‌యిటింగ్ థ్రిల్ల‌ర్ ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. మేక‌ర్స్ వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వీర్ ఆర్య‌న్‌, అయ్య‌ప్ప శ‌ర్మ‌, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.


హీరో శ్రీవిష్ణు కెరీర్ ప్రారంభం నుంచి డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తెర‌కెక్కుతోంది. విద్యాసాగ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. కాల భైర‌వ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా,మ‌నీషా ఎ.ద‌త్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

Versatile Actor Thiruveer next Movie Poster Unveiled

 శ్రీరామనవమి సందర్భంగా వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 పోస్టర్ రిలీజ్



డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ నాలుగో ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది. RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్ బ్యానర్ల మీద రాధాకృష్ణ తేలు, రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ వన్‌ను శ్రీరామ నవమి సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తిరువీర్‌కు జోడిగా మలయాళీ భామ కార్తీక మురళీధరన్ నటిస్తున్నారు.


బిల్లా, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన రామకృష్ణ రెడ్డి (ఆర్కే) ఈ మూవీతో నిర్మాతగా పరిచయం కానున్నారు. అర్దశతాబ్దం, లూట్ వంటి ప్రాజెక్టు‌లు నిర్మించిన రాధాకృష్ణ తేలు, ఆర్కేతో కలిసి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. శ్రీకాంత అడ్డాల వద్ద అసిస్టెంట్‌గా కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రమ్మోత్సవం వంటి సినిమాలకు దర్శకుడు ఘంటా సతీష్ బాబు పని చేశారు. బట్టర్ ఫ్లై సినిమాతో దర్శకుడిగా మారి ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దం అవుతున్నారు.


ఈ మూవీ మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. త్రేతాయుగానికి, కలియుగానికి మధ్య ఈ కథ జరుగుతుంది. ఎంతో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో అయ్యప్ప పి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, మీసాల లక్ష్మణ్, పంకజ్ కేసరి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి రామి రెడ్డి కెమెరామెన్‌గా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


నటీనటులు  : తిరువీర్, కార్తీక మురళీధరన్, అయ్యప్ప పి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, మీసాల లక్ష్మణ్, పంకజ్ కేసరి తదితరులు


సాంకేతికబృందం

బ్యానర్ : RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్

నిర్మాత : రాధాకృష్ణ తేలు, రామకృష్ణ రెడ్డి

దర్శకుడు : ఘంటా సతీష్ బాబు

కెమెరామెన్ : రామి రెడ్డి

ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్

పీఆర్వో  : వంశీ కాకా

Actress Samyuktha Debuting in Bollywood

Rising Star Samyuktha: From Tollywood Sensation to Bollywood Debutante



Samyuktha: Bridging the Gap Between Tollywood Success and Bollywood Debut


In the glitzy realm of Tollywood, one name has been shining brighter than ever – Samyuktha. With a string of consecutive successes under her belt, this talented actress has quickly ascended the ranks to become a household name synonymous with meaningful roles and stellar performances.


Since her debut in the industry, Samyuktha has captivated audiences with her versatility and charm. Her journey to stardom reached new heights with five consecutive super hit films: "Bheemla Nayak," "Bimbisara," "SIR," "Virupaksha," and "Devil." Each role showcased her depth as an actress and solidified her status as a rising star in Tollywood.


Currently, Samyuktha is gearing up for two highly anticipated projects. She is set to star opposite Nikhil in the Pan India movie *Swayambhu*, promising audiences an unforgettable cinematic experience. Additionally, she is slated to be the leading lady in Sharwanand's upcoming film, further solidifying her presence in the industry.


However, amidst her flourishing career in Telugu cinema, rumors have been swirling about Samyuktha's potential foray into Bollywood. Speculation is rife that she has received an enticing offer for an interesting project in Hindi cinema. Recently, photos of Samyuktha at the Hyderabad airport, bound for Mumbai, have sent social media into a frenzy, fueling further speculation about her Bollywood aspirations.


It seems that Samyuktha is on the brink of making a significant announcement regarding her Bollywood debut. As she sets her sights on new horizons, the actress is poised to conquer hearts on a national scale with her talent and dedication. With her sights set high, Samyuktha is ready to mesmerize audiences across the country with her enthralling performances.

Director V S Mukesh Interview About Market Mahalakshmi

 మార్కెట్ మహాలక్ష్మి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: దర్శకుడు విఎస్ ముఖేష్



బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ ఉండగా, ఈ క్రమంలో దర్శకుడు వియస్ ముఖేష్ మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు.


నా పేరు విఎస్ ముఖేష్. YouTube ప్లాట్ ఫామ్   ‌లో దాదాపు 100+ షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అలా ఒకరోజు నేను అఖిలేష్‌ గారిని కలవడం "మార్కెట్ మహాలక్ష్మి" స్క్రిప్ట్‌ను నరేట్ చేయడం జరిగింది.


"మార్కెట్ మహాలక్ష్మి" స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. చాలా మంది తమ సినిమాలలో కొత్త పాయింట్ ని టచ్ చేశామని చెప్తుంటారు. అలానే మేము కూడా నిజాయితీగా, ఇప్పటి వరకు ఆడియన్స్ కి తెలియని ఒక కొత్త పాయింట్‌ను టచ్ చేసాము. ఆ మేజర్ పాయింట్ ని ప్రమోషన్ల కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే టీజర్, ట్రైలర్‌లో చూపించలేదు. ఆ కొత్త పాయింట్   అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము.


పార్వతీశం నాకు చాలా కాలంగా తెలుసు, అతను నాకు మంచి స్నేహితుడు. నేను పార్వతీశం & కొత్త నటిని ఎంచుకోవడానికి కారణం వాళ్ళు ఈ పాత్రలకి సరైన న్యాయం చేయగలరని నమ్మకమే. ఒక కొత్త దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఆ తర్వాతే స్టార్స్ అవకాశాలు ఇస్తారు.


"మార్కెట్ మహాలక్ష్మి" పూర్తి లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అది బేస్ చేసుకొని సినిమా కథ గా రాయడం జరిగింది.  రియల్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. 

వాస్తవికత కు దగ్గర గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. అల్లాగే, నేను మార్కెట్‌లో కొంతమంది వ్యక్తులను కూడా గమనించాను.


"మార్కెట్ మహాలక్ష్మి" బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు అద్భుతంగా మరియు ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. థియేటర్లలో ఒకసారి సినిమా చూస్తే, మీకు ఆ ఫీల్ కలుగుతుంది.


శ్రీముఖి మరియు పార్వతీశంతో ఒక ఇంటర్వ్యూలో, వైరల్ చెంప దెబ్బ సంఘటన వంటి వినూత్న ప్రమోషన్స్ సినిమాకి బజ్ ని పెంచాయి


మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. నా నమ్మకం నటీనటులపై కాదు, నా స్క్రిప్ట్‌పై, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నాను.


మార్కెట్ మహాలక్ష్మి సెన్సార్ పనులన్నీ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి థియేటర్ లో ఈనెల 19న వచ్చేస్తుంది. ఈ సినిమా మొదటి నుంచే కథతో ప్రారంభమవ్వుతుంది అందుకే, సినిమాలో ఎక్కడ మీకు డ్రాగ్ అనిపించదు. కొంతమంది పరిశ్రమ వ్యక్తులకు కూడా మేము చిత్రాన్ని ప్రదర్శించాము. సినిమా విడుదలైన తర్వాత గర్వంగా తమ అభిప్రాయాలను పంచుకుంటారని ఆశిస్తున్నాను.


మా సినిమా లో 6 పాటలు, ఒక ఫైట్‌తో సహా మొత్తం షూటింగ్ భాగాన్ని 24 రోజుల్లో పూర్తి చేసాము. ముందు నుంచే ప్రీ-ప్రొడక్షన్ మీద కూర్చోవడం వళ్ళ త్వరగా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో నా పొటెన్షియల్ ఏంటో చూపించాలి అనుకున్నాను. అందుకే, చాలా జాగ్రత్త గా ప్లాన్ చేసి షూట్ చేసాము. 


పార్వతీశం మరియు ప్రణీకాఅన్విక ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పార్వతీశంకి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని భావిస్తున్నాను.


మాకు చాలా OTT ఆఫర్‌లు వచ్చాయి, కానీ మా టీమ్ థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆడియన్స్ ఆదరిస్తారనే భావంతో రిస్క్ తీసుకున్నాం.


మా సినిమా అందరికీ నచ్చుతుంది. థియేటర్లలో నా సినిమాను ఒక్కరు చూసినా, తప్పకుండా నచ్చుతుందని నమ్మకంతో చెప్పగలను.

50 Million Streaming Minutes For Gaami

 ZEE5లో విశ్వక్ సేన్ ‘గామి’ సెన్సేషన్.. 72 గంటల్లోపు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్  క్రాస్ చేసిన చిత్రం



తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. తాజాగా ‘గామి’ చిత్రంతో ZEE5 ప్రేక్షకులను అలరిస్తోంది.  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది.  విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ  మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. జీ 5లో గామి చిత్రానికి అపూర్వ ఆదరణ దక్కుతోంది. 72 గంటల్లోపే ఈ చిత్రం 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టుకోవటం విశేషం. 


హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం.


నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ  సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. 


జీ5 గురించి:

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Police Vaari Hecharika in Song Shooting

 పాటల  చిత్రీకరణలో

"" పోలీస్ వారి హెచ్చరిక ""



నల్లపూసలు ఫేం  " బాబ్జీ" 

దర్శకత్వం లో  తూలికా  తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై

బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న

"" పోలీస్  వారి  హెచ్చరిక ""

చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను

పూర్తి చేసుకొని  ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది.....!


ఈ సందర్భంగా  దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్ ను తెలుపుతూ  " అరకులోయ , కాఫీ వనం , ఆపిల్ రిసార్ట్స్ ,

వైజాగ్  యారాడా  బీచ్ , నకిరేకల్  లాండ్స్ , యస్ స్టూడియో మొదలైన  లొకేషన్ లలో యీ చిత్రం లోని పాటలను చిత్రీకరించమని ...."

తెలిపారు....!

గత రెండు దశాబ్దాలుగా  రెండు

తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో  ఐదు లక్షల ప్రైవేట్  సాంగ్స్ ను  స్వరపరచి సంచలనం సృష్టించి , రెండు రాష్ట్రాలలోని ప్రైవేటు పాటల గాయనీ గాయకులకు , పాటల రచయితలకు అభిమాన పాత్రుడైన  సంగీత దర్శకుడు

" గజ్వేల్  వేణు" ను  యీ సినిమా ద్వారా వెండితెరకు 

పరిచయం చేస్తున్నామని ..."

దర్శకుడు బాబ్జీ తెలిపారు...!


చిత్ర నిర్మాత   బెల్లి జనార్థన్ 

మాట్లాడుతూ  " రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని , ఆ వెంటనే  నల్గొండ లో  క్లైమాక్స్

సన్నివేశాలను చిత్రీకరించడం తో  సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని " తెలిపారు....!


అఖిల్ సన్నీ , అజయ్ ఘోష్ , రవి కాలే , షియాజీ షిండే , శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , సంజయ్ నాయర్, జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ , 

హిమజ , జయ వాహిని , శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి , రుచిత తదితరులు ఈ చిత్ర తారాగణం.....!


కెమెరా : నళినీ కాంత్ , సంగీతం : గజ్వేల్ వేణు ,

ఎడిటర్ : శివ శర్వాణి ,

పి ఆర్ ఓ .మధు వి .ఆర్

ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : హను మంతరావు ,

నిర్మాణ నిర్వహణ : ఎన్. వై. సుబ్బరాయుడు ,

నిర్మాత : బెల్లి జనార్థన్ ,

రచన , దర్శకత్వం :  బాబ్జీ

Tremendous Response for Rathnam

 మాస్‌ను మెప్పించే విశాల్ ‘రత్నం’ ట్రైలర్.. యాక్షన్ సీక్వెన్స్‌తో ఊచకోత




మాస్, యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. హరి దర్శకత్వంలో రాబోతుండటంతో  రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా  ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నారు. 


ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆధరణను దక్కించుకున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన రత్నం ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.  రత్నం ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ,తమిళనాడు బార్డర్ గొడవల ఆధారంగా ఈ కథ నడిచేలా ఉంది. ఇక హీరోయిన్ కోసం హీరో చేస్తున్న ఊచకోతను చూస్తుంటే మాస్ యాక్షన్ జానర్లను ఇష్టపడే ఆడియెన్స్‌కు పండుగలానే కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌లో దేవీ శ్రీ ప్రసాద్ ఆర్ఆర్ అదిరిపోయింది. యాక్షన్, లవ్ సీన్లకు తగ్గట్టుగా మంచి ఆర్ఆర్ ఇచ్చారు.


కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీ ఎస్ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.