Latest Post

Akshay Kumar Joins the shoot of Kannappa in Hyderabad

విష్ణు మంచు ‘కన్నప్ప’ షూట్‌లో అడుగు పెట్టిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్



డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా రాబోతోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో రెండు భారీ షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేశారు.


ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆల్రెడీ ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌కు మోహన్ బాబు, విష్ణు మంచు గ్రాండ్‌గా స్వాగతాన్ని పలికారు. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ మీద సీన్లను చిత్రీకరించనున్నారు. 


పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలు. కన్నప్ప సినిమాను పాన్ ఇండియాగా అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. కన్నప్ప కథను అందరికీ తెలియపర్చే విధంగా కామిక్ బుక్స్‌ని కూడా రిలీజ్ చేయగా.. వాటికి మంచి స్పందన వచ్చింది. 

Paarijatha Parvam Pre Release Event Held Grandly

అంగరంగ వైభవంగా 'పారిజాత పర్వం' ప్రీరిలీజ్ ఈవెంట్



చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌‌ను మేళవించి రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ దసపల్లా హోటల్‌ లో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించింది. ‘పారిజాత పర్వం ప్రీ కిడ్నాప్ ఈవెంట్’ పేరుతో వెరైటీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘పారిజాత పర్వం’ బిగ్ టికెట్‌ ను చీఫ్ గెస్ట్, స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు లాంచ్ చేశారు.



ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ..‘‘ఈ సినిమాలో నేను ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ సాంగ్ రాశాను. ఇంత మంచి పాట నాతో రాయించినందుకు సంతోష్ కంభంపాటి గారికి, అలాగే అనంత్ సాయి గారికి థ్యాంక్యూ. ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా ట్రెండీగా ఉంది. ఈ సినిమా టీమ్ అందరికీ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నా. ఈ నెల 19న అందరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నా.’’


మ్యూజిక్ డైరెక్టర్ రి మాట్లాడుతూ..‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో ఐదు పాటలున్నాయి. ఈ సినిమాలో శ్రద్ధా ఒక పాట పాడారు. ఫస్ట్ ఆమె పాడుతుందనగానే షాక్ అయ్యా. కానీ ఆమె చాలా బాగా పాడి సర్‌ప్రైజ్ చేశారు. మా నిర్మాతలకు థ్యాంక్యూ. ఇందులో హర్ష, సునీల్ గారి కామెడీ చాలా బాగా వచ్చింది. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’.


ఆర్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ..‘‘కో ప్రొడ్యూసర్ అనంత్ గారి ఆధ్వర్యంలో, డైరెక్టర్ సంతోష్ గారి సూచనల మేరకు ఆర్ట్ వర్క్ చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా’’.


నటుడు గుండు సుదర్శన్ మాట్లాడుతూ..‘‘ఇక్కడ అందరి చేతుల్లో గన్నులు ఉన్నాయి.  అయితే కనిపించని గన్ ఒకటి ఉంది. దాని పేరు పెన్ను. అది మా డైరెక్టర్ సంతోష్ కంభంపాటిది. అందరికీ గన్స్ ఇచ్చారు. నేను అందులో ఒక బులెట్‌ని. సునీల్ గారు ఒక ఏకే47. శ్రద్ధాదాస్ గారు ఒక మిస్సైల్, వైవా హర్ష ఫుల్ ఆఫ్ ఫన్ బులెట్స్ నింపుకుని రెడీగా ఉన్నాడు. ఈ ఈవెంట్ కు ప్రీ కిడ్నాప్ ఈవెంట్ అని పేరు పెట్టడంలోనే డైరెక్టర్ క్రియేటివిటి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిర్మాతలకు ఇదొక అద్భుతమైన విజయాన్నివాలని కోరుకుంటూ అందరికి బెస్ట్ విషెస్’’.



ఎడిటర్ శశాంక్ ఉప్పుటూరి మాట్లాడుతూ..‘‘ముఖ్య అతిథిగా వచ్చిన విశ్వప్రసాద్ గారికి థ్యాంక్యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థ్యాంక్యూ. ఎడిటింగ్‌లో కొన్ని సీన్స్ కట్ చేయడానికి కూడా నాకు ఇబ్బంది కలిగింది. వైవా హర్ష రష్ చూసే నేను చాలా నవ్వుకున్నా. సినిమా చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా’’.



డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమా నేను చూశాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమాను మేము ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నాం. 125కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’.



సహ నిర్మాత అనంత్ సాయి మాట్లాడుతూ..‘‘ఈ సినిమా స్టార్ట్ అవడానికి కారణం శ్రద్ధాదాస్, సునీల్ గారు. వాళ్లిద్దరూ ఓకే చెప్పిన వెంటనే సినిమా మొదలు పెట్టాం. ఒక పది పదిహేను నిమిషాలు తప్ప సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.’’



వైవా హర్ష మాట్లాడుతూ..‘‘ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి వాళ్ల సపోర్ట్ ఎంతో ఎంకరేజ్‌‌మెంట్‌ గా ఉంటుంది. రెగ్యూలర్ సినిమాలు కాకుండా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు రావాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్లు బాగా నవ్వుకునే సినిమా ఇది. డైరెక్టర్ సంతోష్ గారు చాలా సెన్సిబుల్‌ గా ఈ సినిమాను తీశారు. ఏప్రిల్ 19న మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నా’’.



నిర్మాత మహీధర్ రెడ్డి మాట్లాడుతూ..‘‘చాలా ప్యాషనేట్‌ గా ఈ సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్టిస్టులందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ సంతోష్ ప్రాణం పెట్టి చేశారు. 19న థియేటర్లలో ఈ సినిమా చూడండి. అందరూ ఎంజాయ్ చేస్తారు.’’


నిర్మాత దేవేష్ మాట్లాడుతూ...‘‘నేను నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్‌ గా ఈ సినిమా చూశా. చాలా బాగా వచ్చింది. యాంకర్ సుమ గారిని కిడ్నాప్ చేశాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా.’’



డైరెక్టర్ సంతోష్ కంభంపాటి మాట్లాడుతూ..‘‘ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఏ సినిమా చేయాలన్నా నిర్మాతలు.. డైరెక్టర్, నటీనటులను నమ్మాలి. కానీ ఇలాంటి సినిమా చేయాలంటే ఇంకా ఎక్కువగా నమ్మాలి. ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. దానికి ఒక చిన్న థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటితే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అలా అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకే నా మీద నమ్మకం ఉంచిన నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్తున్నా. నేను ఏ క్యారెక్టర్‌ కు ఎవరు కావాలని రాసుకున్నానో వాళ్లందరినీ ఇచ్చారు. మాలాంటి చిన్న సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నవాళ్లకు థ్యాంక్యూ. కీడాకోలాతో చైతన్యరావు నిరూపించుకున్నారు. మిగతావాళ్లంతా ఎంత ఫన్ చేస్తారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2 గంటల 10 నిమిషాల సినిమా ఇది. ఇందులో ఫస్ట్ 25 మినిట్స్ క్యారెక్టర్స్ గురించి చెప్పడానికి తీసుకున్నా. ఆ టైమ్ తప్ప మిగతా టైమ్ అంతా నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా బాగుంటే ప్రేక్షకులందరూ ఇంకో పదిమందికి చెప్పండి. బాగా లేకపోతే వద్దని చెప్పండి. ఈ నెల 19న థియేటర్లలో మా సినిమాను చూసి ఆదరించండి.’’


హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ..‘‘కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు సినిమా చేశా. గ్లామర్ పరంగా కాకుండా నటనకు స్కోప్ ఉన్న సినిమా ఇది. ఇందులో నా క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుంది. నా కోసం ఈ పాత్రను రాసిన డైరెక్టర్ సంతోష్ గారికి థ్యాంక్యూ. ఇందులో కొంచెం సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి నిర్మాతలు ఉంటే ప్రతి ఒక్కరికీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సునీల్, హర్ష, చైతన్యతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. వాళ్ల కామెడీ టైమింగ్‌ ను మ్యాచ్ చేయడం చాలా కష్టం. కానీ నేను కొంచెం ట్రై చేశా. ఈ సినిమాను ఏప్రిల్ 19న అందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా’’.


చీఫ్ గెస్ట్ ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు మాట్లాడుతూ..‘‘నిర్మాత మహీధర్ నాకు 20 ఏళ్ల నుంచి ఫ్రెండ్. మేమిద్దరం సియాటెల్‌లో ఉండేవాళ్లం. మేము అక్కడ సినిమా చూడాలంటే వేరే ప్రాంతానికి వెళ్లి చూసేవాళ్లం. అయితే చిరంజీవి గారి స్టాలిన్ సినిమా నుంచి సియాటెల్‌లో మహీధర్ సినిమాలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంత ప్యాషన్ ఉన్న మహీధర్ కచ్చితంగా ఒక మంచి సినిమా తీశారని నమ్ముతున్నా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమా పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’’.


హీరో చైతన్య రావు మాట్లాడుతూ..‘‘ఎక్కడో కరీంనగర్‌లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మంచి పేరు తెచ్చుకుని మంచి సినిమా చేయాలనుకుని చేస్తున్నా. ఎప్పటికైనా నా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ కి సుమ గారు యాంకరింగ్ చేయాలని అనుకున్నా. ఈ రోజు చేశారు. ఇది పెద్ద సక్సెస్‌ గా భావిస్తున్నా. 300పై చిలుకు సినిమాలు చేసి 90శాతం సక్సెస్ రేట్ ఉన్న సుమ గారు మా సినిమా చేయడం మాకు గౌరవం. మా సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. నిర్మాతలు మహీధర్, దేవేష్ నిజంగా అద్భుతమైన నిర్మాతలు. ఎంతో బిజీగా ఉన్న ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి సినిమా చేయడం చాలా కష్టం. మా డైరెక్టర్ అక్కడే ఫస్ట్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి ఇంకో మంచి డైరెక్టర్ రాబోతున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఇది చిన్న సినిమా కాదు.. కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. ఏప్రిల్ 19న థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్‌తో చూడాల్సిన సినిమా ఇది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. అందరూ మా సినిమాను ప్రమోట్ చేయండి’’.



తారాగణం: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి


సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం - సంతోష్ కంభంపాటి

ప్రొడక్షన్: వనమాలి క్రియేషన్స్

నిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్  

సహ నిర్మాత -అనంత సాయి

డీవోపీ-బాల సరస్వతి

సంగీతం-రీ

ఎడిటర్- శశాంక్ వుప్పుటూరి

ఆర్ట్ డైరెక్టర్ - ఉపేందర్ రెడ్డి

డిజైనర్ - చిన్మయి కాకిలేటి

పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచెర్ల

సౌండ్ ఎఫెక్ట్స్- పురుషోత్తం రాజు

సాహిత్యం-రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్, రాంబాబు గోసాల

పీఆర్వో -వంశీ శేఖర్

 

Bhavanam Movie Trailer Launched

సూపర్ గుడ్ ఫిల్మ్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'భవనమ్' ట్రైలర్, యాదమ్మ సాంగ్ విడుదలకు అనూహ్య స్పందన



హీరోలను స్టార్ హీరోలుగా చేసిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ 'భవనమ్'. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే 'భవనమ్' ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేయగా అనూహ్య స్పందన లభించింది.


తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను, జానపద పాటయైన యాదమ్మ.. సాంగ్ ను మంగళవారంనాడు ప్రసాద్ ల్యాబ్ లో విడుదలచేసి విలేకరులకు ప్రదర్శించారు. ఈ సాంగ్ జానపద బాణీలతో వుంటూ అలరించింది. ట్రైలర్  మరింత ఆకట్టుకుంది.


అనంతరం ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ,మా బేనర్ లో ఇది 95 వ సినిమా. మలయాళంలో 96 వ సినిమా చేస్తున్నాం. అలాగే 97, 98 సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలో  100 సినిమాలకు చేరుకోబోతున్నాం. దర్శకుడు బాలాచారి భవనమ్ సినిమాను చక్కగా తీశాడు. ఆల్ రెడీ సాంగ్స్ వెరీ గుడ్. సంగీత దర్శకుడు చరణ్  గొప్ప టాలెంట్ పర్సన్. ఇందులో పనిచేసిన అందరికీ మంచి విజయం రావాలని కోరుకుంటున్నానని అన్నారు.


సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, రామ్ చరణ్ రచ్చలో ..మిల్క్ మిల్క్ చిలక.. పాట చేశాను. అదే నన్ను బతికిస్తుంది. అదే సూపర్ గుడ్ బేనర్ లో మరో అవకాశం దక్కేలా చేసింది. నల్గొండ గద్దర్ నర్సన్న.. రేవంత రెడ్డి గారికి ఎలక్షన్ సమయంలో పాట పాడారు. ఆ పాట విన్న దర్శకుడు బాలాచారిగారు యాదమ్మ.. పాటను నర్సన్న తో పాడించారు. తనకు ఈ సినిమా నుంచి మంచి విజయాలు దక్కాలి.ఈ పాటటకు మంగ్లీ వాయిస్ చాలా ప్లస్ అయింది. ఇలా అందరి కాంబినేష న్ లో పనిచేయడం నాకూ చాలా ఆనందంగా వుంది. నిర్మాత అంజన్ కుమార్ సపోర్ట్ మర్చిపోలేను. నాకు గతంలో లారెన్స్ నన్ను ప్రోత్సహించారు. అందరికీ ఈ సినిమా మంచి గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.


ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన విఎస్.ఆర్. మాట్లాడుతూ, సూపర్ గుడ్ అంటే గౌరవం. అదే సంస్థలో పనిచేయడం ఆనందంగా వుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవకాశం ఇచ్చిన చౌదరిగారికి ఈ సినిమా పెద్ద హిట్ అయి, చరణ్ కు బ్రేక్ రావాలని కోరుకుంటున్నా అన్నారు.


నల్గొండ గద్దర్ నర్సన్న మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాజకీయ నేపథ్య పాటలు పాడినా త్రుప్తి లేదు. కానీ ఒక్క సినిమా చేయాలనే కోరిక ఇరవై ఏళ్ళుగా వుంది. స్నేహితుడు చరణ్ అర్జున్ ఏదోరోజు నీకూ వస్తుంది అని ప్రోత్సహించారు. భవనం లో   నా పాటకు డాన్స్ లు వేయడం మర్చిపోలేని అనుభూతి కలిగించింది. యాదమ్మ పాటలో జానపదబాణీలకు చరణ్ చక్కటి బాణీలు సమకూర్చారు. రచయితలు చక్కగా ప్రాసలతో రాశారు అన్నారు.


నటి స్నిగ్థ మాట్లాడుతూ, ఆర్.బి. చౌదరి గారి నిర్మాణ సంస్థలో చేయడం గొప్ప వరం.. ఈ మూవీ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ రోప్ కట్టి నాతో కఠినమైన ఫైట్లు కూడా చేయించారు. అవి తెరపై బాగుంటాయి. పాటలు చాలా బాగున్నాయని అని అన్నారు.


ఆర్ట్ డైరెక్టర్ ఆంథోని మాట్లాడుతూ, ప్రేమలు సినిమా చేశాను హిట్ అయింది. ఇది కూడా కావాలని కోరుకుంటున్నానన్నారు.

 

కొరియో గ్రాఫర్ శ్యామ్ తెలుపుతూ, ఆర్.బి. చౌదరి బేనర్ లో చేయడం అద్రుష్టం. అదే సక్సెస్ అనుకుంటున్నాను. దర్శకుడు నమ్మి అవకాశం ఇచ్చారు. యాదమ్మ సాంగ్ లో షలకలశంకర్, సప్తగిరి. బిత్తిరి సత్తి.. స్నేహా ఉల్లాల్ బాగా నటించారు. సాంగ్ హిట్ కావాలి. ఈ సాంగ్ ను అందించిన నల్గొండ గద్దర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.


బిత్తిరి సత్తి మాట్లాడుతూ, సూపర్ గుడ్ లోగో అనేది పెద్ద బ్రాండ్. గతంలోనే సినిమా చేయాలనుకున్న నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. దర్శకుడు నా పాత్రను సరికొత్తగా క్రియేట్ చేశారు. ఇదంతా టీమ్ వర్క్. పాటల్లో సోల్ వుంది అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.


చిత్ర దర్శకుడు బాలాచారి మాట్లాడుతూ, సూపర్ గుడ్ బేనర్ లో ఇరవై ఏల్ళ నాడు విద్యార్థి చేశాను. మరోసారి చౌదరి గారు అవకాశం ఇచ్చారు. చరణ్ అర్జున్ సంగీతం ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. విఎస్ ఆర్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా పనితనంతో మరింత బాగా భవనమ్ సినిమా వచ్చింది అన్నారు.


షకలకల శంకర్ మాట్లాడుతూ, తనదైన శైలిలో మాట్లాడుతూ, దర్శకులు ఓ భవనాన్ని కట్టి మా చేత కూలీలుగా చేయించారు. గ్రుహ ప్రవేశం కోసం మేం వెయిట్ చేస్తున్నాం. నాకు సూపర్ గుడ్ అనే పేరు ఎంతో ఇష్టం. చిన్నతనంలో చదువుకన్నా థియేటర్లలో ఎక్కువగా వుండేవాడిని సూపర్ గుడ్ లోగో చూసి బొమ్మలు వేసేవాడిని. అలా అగ్రహీరోల బొమ్మలు కూడా వేశాను. ఇప్పుడు అటువంటి గొప్ప సంస్థలో నటించడం చాలా ఆనందంగా వుంది. హార్రర్ సినిమాలు తీసే వారు ఆశ్చర్యపరిచేలా మా దర్శకుడు సినిమాను తీశారు. ప్రేక్షకులకు గగుర్పాటును కలిగించడంతోపాటు కడుపుప్ప నవ్విస్తుంది అన్నారు.


అతిథి దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, సూపర్ గుడ్ బేనర్ లో 95 వ సినిమాగా భవనమ్ రావడం ఆనందంగావుంది.  ఎవిఎం. సురేష్ సంస్థలా త్వరలో  100 సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. ఈ బేనర్ లో వచ్చే సినిమాలలో ఆడియో చాలా బాగుంటుంది. అలా ఇందులో పాటలు చాలా బాగున్నాయి అని చెప్పారు.


 

Galla Yetthi From Nara Rohit Prathinidhi 2 is out now

నారా రోహిత్, మూర్తి దేవగుప్తా, వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ 'ప్రతినిధి 2' నుండి మాస్ నంబర్ గల్లా యెత్తి విడుదల



నారా రోహిత్ హీరో గా ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడు గా పరిచయం అవుతున్న చిత్రం ప్రతినిధి 2 ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. వానరా ఎంటర్టైన్మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ పతాకాలపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ చిత్రం టీజర్ మరియు  పబ్లిసిటీ మెటీరియల్ తో సినీ అభిమానులలో ఆసక్తిని సృష్టించింది.


ఈ చిత్రం నుండి మొదటి సింగిల్- గల్లా యెత్తిని విడుదల చేయడం ద్వారా చిత్ర యూనిట్ మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించింది. ఈ మాస్ నంబర్ ను మహతి స్వర సాగర్ స్కోర్ చేశారు.

కాసర్ల శ్యామ్ సాహిత్యం సమాజంలో మంచి చెడుల గురించి ఆలోచింపజేసే లా ఉంది, రామ్ మిరియాల వాయిస్ మంత్రముగ్ధులను చేసింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ లో నారా రోహిత్ ఉత్సాహంగా కనిపిస్తూ డాన్స్ మూవ్స్ కూడా చాలా బాగా చేశారు. గల్లా యెత్తి పాట సినిమా ప్రమోషన్స్ కి సరైన ప్రారంభాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు


ప్రతినిధి 2 అనేది ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో నారా రోహిత్ నటించాడు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


నాని చమిడిశెట్టి కెమరామెన్ కాగా యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి


సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: మూర్తి దేవగుప్తపు

నిర్మాతలు: కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని

బ్యానర్లు: వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్

సంగీతం: మహతి స్వర సాగర్

ఎడిటర్: రవితేజ గిరిజాల

DOP: నాని చమిడిశెట్టి

కళ: కిరణ్ కుమార్ మన్నె

ఫైట్ మాస్టర్స్: శివరాజు & పృధ్వి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల

పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను

PRO: వంశీ-శేఖర్

డిజిటల్: ప్రవీణ్ & హౌస్ఫుల్ డిజిటల్


Rudrakshapuram Releasing on April 26

 హీరోగా మణి సాయితేజను

మరిన్ని మెట్లు ఎక్కించే చిత్రం

ఆర్.కె. గాంధి "రుద్రాక్షపురం"

ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు



ఆర్.కె.గాంధి దర్శకత్వంలో మ్యాక్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథాచిత్రం "రుద్రాక్షపురం". "మెకానిక్" ఫేమ్ మణిసాయితేజ- వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నాగ మహేష్ కీలక పాత్ర పోషించగా... ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ సురేష్ కొండేటి, బి.వీరబాబు, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రల్లో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. 


తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ నటి - ఎన్నారై ప్రశాంతి హారతి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ బాపిరాజు, గణేష్ భేరి, బోగాల సుధాకర్, మెకానిక్ దర్శకుడు ముని సహేకర్, ప్రముఖ దర్శకుడు శ్రీరాజ్ బల్లా ముఖ్య అతిథులుగా హాజరై  "రుద్రాక్షపురం" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. "రుద్రాక్షపురం" చిత్రంతో హీరోగా మణిసాయితేజ మరిన్ని మెట్లు ఎక్కాలని అభిలషించారు.


రేఖా, రాజేశ్, అజయ్ రాహుల్, పవన్ వర్మ , శోభరాజ్, శ్రీవాణి, వెంకటేశ్వర్లు, అక్షర నీహా, ఆనంద్ మట్ట తదితరులు ఇతర పాత్రల్లో  నటించిన ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం ఆర్ కె గాంధీ, సంగీతం: ఎం.ఎల్. రాజా - ఘంటాడి కృష్ణ - జయసూర్య బొంపెం, స్టంట్స్: థ్రిల్లర్ మంజు- బాజి- స్టార్ మల్లి, కెమెరా: నాగేంద్ర కుమార్ ఎం, ఎడిటర్: డి.మల్లి, నృత్యం: కపిల్ అన్నారాజ్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ!!

Silk Saree Movie First Look and Teaser Launched

 వాసుదేవ్ హీరో  గా ‘ సిల్క్ శారీ  ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్  ! 




చాహత్  బ్యానర్ పై కమలేష్ కుమార్  నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో  మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్  రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా  టి . నాగేందర్  స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ రాజకందుకూరి గారి చేతుల మీదుగా  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.


రాజ్  కందుకూరి గారు మాట్లాడుతూ, సినిమా    టైటిల్  సిల్క్ శారీ అద్భుతంగా   గ్రాండియర్‌  ఉందని ,   డైరెక్టర్  నుండి ఆశించిన అద్భుతమైన పనితనం కనిపించింది .  టీజర్ మరియు ఫస్ట్ లుక్ చాల బాగున్నాయి అని .. ప్రొడ్యూసర్ గారికి మరియు డైరెక్టర్ గారికి పేరుతో పాటు మనీ కూడా రావాలి అని ఆశిస్తున్నాను . ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఈ సిల్క్ శారీ పై  నమ్మకాన్ని  చేశాడు.


హీరోగా నటిస్తున్న వాసుదేవ్ రావు  మాట్లాడుతూ  మా డైరెక్టర్ నాగేందర్ ఒక  మంచి సబ్జెక్టు తో ఈ సినిమా ని తెరకెక్కించారు.  ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా మంచి చిత్రాన్ని నిర్మించారు . టైటిల్ రిలీజ్ చేసినందుకు రాజుకందుకూరి గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను . 

బలమైన కథ, దానికి తగ్గట్టుగానే డ్రామా  సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని  ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ "సిల్క్ శారీ " చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని,   మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


నటీనటులు: వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ    తదితరులు.

డైరెక్టర్ :టి . నాగేందర్ 

నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్  చండక్ 

బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్ 

సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి 

కెమెరా : సనక రాజశేఖర్ 

పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి

PMF Production No 36, A Super Yodha Film's Title Announcement On April 18th

 సూపర్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టంనేని, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం 36, సూపర్ యోధ నేపథ్యం లో సినిమా ఏప్రిల్ 18న టైటిల్ ప్రకటన



హను-మాన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక విజయం సాధించిన  తర్వాత, సూపర్ హీరో తేజ సజ్జా ప్రతిభావంతులైన యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేనితో కలిసి టాలీవుడ్ యొక్క అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 36 గా  నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఒక గ్రాండ్ స్కేల్ పాన్ ఇండియా మూవీ ఈరోజు అధికారికంగా ప్రకటించబడింది.

 

ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ లో సూపర్ హీరో తేజ సజ్జ తన ముఖంలో ఇంటెన్సిటీ తో బ్యాక్ పోజ్ లోహుందా గా ఉన్నాడు. హనుమాన్ చిత్రం లో సాంప్రదాయ దుస్తులలో కనిపించిన తేజ ,ఇక్కడ మాత్రం స్టైలిష్ మేక్ ఓవర్ తో సూపర్ యోధాగా అద్భుతంగా కనిపించాడు. పోస్టర్ లో తన దుస్తులు మంటల్లో అంటుకోవడం గమనించవచ్చు .ఈ సినిమా టైటిల్ ని మేకర్స్ ఏప్రిల్ 18న ప్రకటించనున్నారు.

 

ఈగిల్ తర్వాత కార్తీక్ ఘట్టంనేని మరియు పి ఎం ఎఫ్ కు ఇది వరుసగా రెండవ ప్రాజెక్ట్. అద్భుతమైన టెక్నీషియన్ అయిన కార్తీక్ ఘట్టంనేని,తేజ సజ్జను భారీ క్యారెక్టర్లో ప్రెజెంట్ చేస్తూ లార్జర్ దాన్ లైఫ్ స్టోరీని రాశాడు. ఇది సూపర్ యోధా యొక్క సాహసోపేతమైన కథ.

 

హై టెక్నికల్ మరియు ప్రొడక్షన్ స్టాండర్డ్స్ లో నిర్మించే ఈ చిత్రానికి గొప్ప సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు

ఏప్రిల్ 18న ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. తేజ హనుమాన్ తో పెద్ద హిట్ సాధించడంతో, దేశం మొత్తం అతని తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది

 

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ

 

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: కార్తీక్ ఘట్టంనేని

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కృతి ప్రసాద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి

ఆర్ట్ డైరెక్టర్: శ్రీనాగేంద్ర తంగాల

రచయిత: మణిబాబు కరణం

 

PRO: వంశీ-శేఖర్


Aa Okkati Adakku Releasing On May 3rd

 అల్లరి నరేష్, మల్లి అంకం, రాజీవ్ చిలక, చిలక ప్రొడక్షన్స్ “ఆ ఒక్కటి అడక్కు” మే 3న విడుదల



కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కుతో ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యారు, ఇప్పటికే విడుదలైన టీజర్ నవ్వుల జల్లులు కురిపించింది,సినిమా పై అంచనాలు పెంచింది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.


ఈ రోజు, మేకర్స్ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ తో ముందుకు వచ్చారు. వేసవి సెలవులను పురస్కరించుకుని మే 3న ఆ ఒక్కటి అడక్కు విడుదల కానుంది. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ని పూర్తిగా ఫన్ క్యారెక్టర్ లో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఒక్కటి అడక్కు ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అవుతుందని అల్లరి నరేష్ వీడియో ద్వారా హామీ ఇచ్చారు.


టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి AP మరియు తెలంగాణ కు సంబందించిన థియేట్రికల్ హక్కులను పొందింది. తెలుగు రాష్ట్రాల్లో వారి బ్యాకప్తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కానుంది.


సూర్య సినిమాటోగ్రాఫర్ కాగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ మరియు ఇతరులు.


సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు- మల్లి అంకం

నిర్మాత - రాజీవ్ చిలక

సహ నిర్మాత - భరత్ లక్ష్మీపతి

బ్యానర్ - చిలక ప్రొడక్షన్స్

విడుదల - ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP

రచయిత - అబ్బూరి రవి

ఎడిటర్ - చోటా కె ప్రసాద్

DOP - సూర్య

సంగీత దర్శకుడు - గోపీ సుందర్

ఆర్ట్ డైరెక్టర్ - జె కె మూర్తి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అక్షిత అక్కి

మార్కెటింగ్ మేనేజర్ - శ్రావణ్ కుప్పిలి

మార్కెటింగ్ ఏజెన్సీ - వాల్స్ అండ్ ట్రెండ్స్

ప్రో - వంశీ శేఖర్

పబ్లిసిటీ డిజైన్ - అనిల్ భాను



First Dialogue Poster First look Unveiled for "Lakshmi Kataaksham

 తెలుగు సినిమాలో మొదటి సారి - లక్ష్మీకటాక్షం నుండి మొదటి డైలాగ్ పోస్టర్ ఫస్ట్ లుక్ విడుదల



ఇప్పటి వరుకు తెలుగులో చాలా తక్కువ సటైరికల్ కాన్సెప్ట్స్ వచ్చాయి అందులోను పోలిటికల్ సటైరికల్ కామెడీ మాత్రం ఇంకా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులని నవ్వించడానికి లక్ష్మీకటాక్షం సినిమా నుండి డైలాగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రాజకియనాయకులు ఒక ఓటు కి ఇంత డబ్బులు అని నిర్ణయిస్తారు, కాని ఈ డైలాగ్ పోస్టర్ లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు. 


మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ “లక్ష్మీకటాక్షం : ఫర్ ఓట్” కు రచన, దర్శకత్వం సూర్య అందించారు, యు. శ్రీనివాసుల రెడ్డి నిర్మించగా. అభిషేక్ రుఫుస్ సంగీతం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి చాలా ఆప్ట్ గా ఉంది ఈ డైలాగ్ పోస్టర్, అన్ని తరహ ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. 


సీనియర్ నటులు సాయి కుమార్ మెయిన్ ముఖ్య పాత్రలో, వినయ్, అరుణ్, దీప్తి వర్మ మెయిన్ లీడ్స్ గా చేస్తున్నారు. ఈ కథ నేపధ్యం మొత్తం తాడిపత్రిలో చిత్రీకరించినట్టు యూనిట్ పేర్కొన్నారు. త్వరలోనే సరదాగా ఉండే టీసర్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం అని వెల్లడించారు


నటీ నటులు:

వినయ్

అరుణ్

దీప్తి వర్మ

చరిస్మా శ్రీకర్

హరి ప్రసాద్

సాయి కిరణ్ ఏడిద

ఆమనీ


సాంకేతిక నిపుణులు:

బ్యానర్: మహతి ఎంటర్టైన్మెంట్

నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి

రచన, డైరెక్టర్: సూర్య

మ్యూజిక్: అభిషేక్ రుఫుస్

డి ఓ పి: నని ఐనవెల్లి

ఎడిటర్: ప్రదీప్ జే

సౌండ్ డిజైన్: మురళీధర్ రాజు

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్. రంగనాథ్ బాబు

పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను , ధీరజ్- ప్రసాద్

Lyca Productions' Bharateeyudu2 (Indian2) in Post Production

 పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘భార‌తీయుడు 2’.. జూన్‌లో వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌




ఇండియ‌న్ సినీ రంగంలో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి చెప్పాలంటే క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. భార‌తీయుడు (ఇండియ‌న్‌) సినిమాతో అది నిరూపిత‌మైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి ‘భార‌తీయుడు 2’తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతున్నారు. భార‌తీయుడు బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత వీరిద్ద‌రూ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. 


అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ తిరుగులేని విజ‌యాన్ని సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ రానుండ‌టంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. గ్రిప్పింగ్ క‌థ‌నంతో ఈ మూవీ మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  


‘భార‌తీయుడు 2’ సినిమాపై ముందు నుంచి భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. దానికి అనుగుణంగానే ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో  సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన శంక‌ర్ ఇప్పుడు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టంపై దృష్టి సారించారు. మే నెలాఖ‌రున ప‌వ‌ర్‌ప్యాక్డ్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్‌లో భారీ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 


‘భార‌తీయుడు 2’ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి, మూవీ ఎలా ఉండ‌బోతుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో ‘జీరో టాల‌రెన్స్‌’ లైన్ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 


ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ క‌ల‌యిక ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. 


 లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్  రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్‌తో ‘భార‌తీయుడు 2’లో క్రియేటివ్ బ్రిలియ‌న్స్  క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమా ప్ర‌పంచంలో ఓ స‌రికొత్త మైలురాయిని క్రియేట్ చేయ‌టానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్ష‌కుల్లో గొప్ప ఆలోచ‌న రేకెత్తించేలా సినిమాలు చేస్తూ త‌న అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జూన్‌లో ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 


న‌టీన‌టులు:


క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్:  ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌:  ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌:  హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌:  వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ:  బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు:  శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌:  కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ :  లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌:  రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు):  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌:  సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌.


The birthday celebrations of Bigg Boss 7 Solo Boy Hero Gautam Krishna Held Grandly

 సోలో బాయ్ అంటూ మన ముందుకు వస్తున్న బిగ్ బాస్ సెవెన్ గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి





బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సోలో బాయ్. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సోలో బాయ్. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నేడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్ గారు, సెవెన్ హిల్స్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ కుమార్ గారు, అనిత చౌదరి గారు, కమెడియన్ భద్రం, పింగ్ పాంగ్( సూర్య ) పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అనిత చౌదరి గారు మాట్లాడుతూ : నన్ను అమ్మగా, అక్కగా, చెల్లిగా, వదినగా అన్ని పాత్రల్లోనూ ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముందుగా గౌతమ్ కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలో గౌతమ్ కి తల్లి పాత్రలో చేస్తున్నాను. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు అందరి గురించి ఆలోచిస్తాడు. సెవెన్ హిల్స్ సతీష్ గారు ఈ సినిమాని ఎంతో పాషన్ తో నిర్మించారు. డి ఓ పి గా త్రిలోక్ పనితీరు చాలా బాగుంది. ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది అదేవిధంగా ఈ సోలో బాయ్ సినిమాలో కూడా ఒక మంచి ఫీల్ ఉంది. ప్రేక్షకుల సినిమా ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


డైరెక్టర్ పి. నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ : నాకు ఈ అవకాశాన్నిచ్చిన సెవెన్ హిల్స్ సతీష్ గారికి రుణపడి ఉంటాను. ముందుగా గౌతమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిన్న సినిమా పెద్ద సినిమాను ఉండదు మంచి సినిమా నే ఉంటుంది. సోలో బాయ్ కూడా ఒక మంచి సినిమా. ఈ సినిమాలో నటించిన పోసాని కృష్ణ మురళి గారు, అనిత చౌదరి గారు, భద్రం గారు, సూర్య గారు ఎవరికి పాత్ర కి చాలా బాగా నటించారు. మా హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు. సాంగ్స్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ అన్నిటిలోనూ తనదైన శైలితో నటించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


డిఓపి త్రీలోక్ మాట్లాడుతూ : గౌతమ్ కృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశాన్నిచ్చిన ఒక ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గారికి డైరెక్టర్ నవీన్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ : ముందు నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా మీడియా అలాగే ప్రేక్షకులు మంచి సినిమా వస్తే ఆదరిస్తారు. ఈ సోలో బాయ్ సినిమా కూడా అలాగే ఒక మంచి సినిమా. ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి టెక్నీషియన్ కి కృతజ్ఞతలు. అదేవిధంగా మంచి క్యారెక్టర్స్ అని చెప్పగానే ముందుకు వచ్చి మేము చేస్తాము అని వచ్చిన పోసాని కృష్ణ మురళి గారికి, అనిత చౌదరి గారికి కృతజ్ఞతలు. భద్రం, సూర్య కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. అదేవిధంగా నా తమ్ముడు గౌతమ్ కృష్ణ. ఈ సినిమాతో నాకు సొంత తమ్ముడిలాగా సపోర్ట్ ఇచ్చాడు. గౌతమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. డైరెక్టర్ నవీన్ చెప్పిన కథ చాలా బాగా అనిపించింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని అన్నారు.


హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నా పుట్టినరోజు పూట మూవీ టీం ఇలా ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్న ఇలా నాకు ఒక టీం ఉంది నవీన్ అనే ఒక కొత్త డైరెక్టర్ ఉన్నాడు అనగానే కథ విని సింగిల్ సిట్టింగ్లో కథను ఓకే చేశారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్న. ఈ టీమ్ అందరూ కూడా సినిమా మీద ఇష్టంతో పని చేసినవారే. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్‌ ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా అనితా చౌదరి గారు, పోసాని కృష్ణ మురళి గారు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఫస్ట్ సినిమా నుంచి, బిగ్ బాస్ జర్నీ నుంచి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అతి త్వరలో టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మీ ముందుకు వస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.


నటీనటులు - గౌతం కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు


సాంకేతిక బృందం:

కాస్ట్యూమ్స్ - రిషిక, వీణాధరి

సినిమాటోగ్రఫీ - త్రిలోక్ సిద్ధు

సంగీతం - జుడా సంధ్య

కో-డైరెక్టర్ - కినోర్ కుమార్

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - SK నయీమ్

లిరిక్ రైటర్స్ - శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి

కొరియోగ్రాఫర్: ఆటా సందీప్

బ్యానర్ - సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్

నిర్మాత - సెవెన్ హిల్స్ సతీష్ కుమార్

దర్శకత్వం - పి. నవీన్ కుమార్

పి ఆర్ ఓ : మధు VR

Tenant Release Trailer Launched

'టెనెంట్' రిలీజ్ ట్రైలర్ చాలా నచ్చింది. కాన్సెప్ట్, కంటెంట్ చాలా కొత్తగా వుంది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ప్రియదర్శి



'టెనెంట్' సినిమా అద్భుతంగా వచ్చింది. డబ్బింగ్ చెబుతున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి. తప్పకుండా సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది: హీరో సత్యం రాజేష్

'పొలిమేర2' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో ప్రియదర్శి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

సత్యం రాజేష్ ప్రేమకథ, పెళ్లి సన్నివేశాలతో ఫీల్ గుడ్ గా మొదలైన ట్రైలర్ తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం కట్టిపడేసింది. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ చాలా ఎక్సయిటింగ్ గా వుంది. పోలీస్ అధికారి ఎస్తర్ ''నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వే చంపేయడం ఏమిటి? అని ప్రశించగా.. ‘రావణాసురుడు  సీతని చెరబడితే శిక్ష సీతకెందుపడింది?’ అని సత్యం రాజేష్ ఎదురు ప్రశ్నించడం కథ పై మరింత క్యురియాసిటీని పెంచింది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు సత్యం రాజేష్. ట్రైలర్ లో కనిపించిన మిగతా నటులు కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారు. దర్శకుడు  వై. యుగంధర్ ఎంచుకున్న పాయిటింగ్ చాలా ఎమోషనల్, థ్రిల్లింగ్ గా వుంది. నేపధ్య సంగీతం థ్రిల్ మని మరింత ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.

రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. రాజేష్ అన్నకి ముందుగా హ్యాపీ బర్త్ డే. రాజేష్ అన్నకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్దె కట్టకుండా టెనెంట్ గా ఉంటున్నాడు రాజేష్ అన్న(నవ్వుతూ).  నటుడిగా ఆయన ప్రయాణం, ట్రాన్స్ ఫర్మేషన్ స్ఫూర్తిదాయకం.  ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ తో పాటు ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ బాగా నచ్చింది. నిర్మాతలు చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి గారికి, దర్శకుడు యుగంధర్ గారి టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నిర్మాతల కళ్ళలో ఆనందం చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్ధమౌతోంది. సినిమా ఆల్రెడీ హిట్. ఎక్కువ మంది ప్రేక్షకులకు టెనెంట్ సినిమా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. కంటెంట్ చాలా కొత్తగా వుంది. ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి' అని కోరారు.  


హీరో సత్యం రాజేష్ మాట్లాడుతూ... దర్శకుడు యుగంధర్ గారు 'టెనెంట్' కథని ఎంత అద్భుతంగా చెప్పారో అంతే అద్భుతంగా సినిమాని తీశారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు క్లైమాక్స్ లో కన్నీళ్లు వచ్చేశాయి. అంత అద్భుతంగా వచ్చింది సినిమా. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి చదువరి. ఆయన ఆలోచనలో ఉన్నతంగా నెక్స్ట్ జనరేషన్ గా వుంటాయి. ఈ సినిమాని చాలా ప్రేమించి చేశారు. తప్పకుండా ఇది ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. చందన అద్భుతంగా నటించారు. ఎస్తెర్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. భరత్ చందు అనురాగ్ పోటాపోటీగా నటించారు. సాగర్ గారు చాలా చక్కని సంగీతం అందించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదలౌతుంది. ప్రతీ ఒక్కరూ తప్పకుండా సినిమాని ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తారు' అన్నారు.


దర్శకుడు వై.యుగంధర్ మాట్లాడుతూ.. ముందుగా సత్యం రాజేష్ గారికి హ్యాపీ బర్త్ డే. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతి ఇంట్లో మహిళలకు కనెక్ట్ అయ్యే కథ ఇది. మహిళలు చూస్తే తప్పకుండా చూడాలని అబ్బాయిలకి చెబుతారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. అలాగే మా సహా నిర్మాతలకు ధన్యవాదాలు. కంపోజర్ సాహిత్య సాగర్, డీవోపీ  జెమిన్ జోమ్ సపోర్ట్ వలనే ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాను. సాగర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సత్యం రాజేష్ గారు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. ఎస్తర్ గారు చాలా చక్కని సమన్వయంతో ఎంతగానో ప్రోత్సహిస్తూ ఈ సినిమాని చేశారు. భరత్,చందన పాత్రలు కూడా గుర్తుండిపోతాయి. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా. ఎమోషన్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు' అన్నారు.

ఎస్తర్ నోరోన్హా మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నేను చేసిన మోస్ట్ ఎవైటెడ్ సినిమాలో 'టెనెంట్' ఒకటి. ఎవరడిగినా ఈ సినిమా గురించే చెబుతున్నాను. డైరెక్టర్ గారు ఇందులో నా పాత్రని సరికొత్తగా ప్రజెంట్ చేశారు. ఆయన విజన్ అద్భుతంగా వుంది.  డబ్బింగ్ చెప్పినప్పుడు నా పాత్ర ఇంకా నచ్చింది. మరింత నమ్మకం పెరిగింది.రాజేష్ గారితో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.టీం అందరికీ పేరుపేరునా థాంక్స్.  ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరిఆశీస్సులు కావాలి' అన్నారు.

చందన మాట్లాడుతూ.. రాజేష్ గారితో కలసి ఈ సినిమా చేయడం, ఎన్నో విషయాలు నేర్చుకోవడం చాలా ఆనందంగా వుంది. 'టెనెంట్' మంచి మెసేజ్ ఒరియంటెడ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఏప్రిల్ 19న వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూసి మూవీ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.  

భరత్ మాట్లాడుతూ... 'టెనెంట్'లో ఎమోషన్స్ అద్భుతంగా వుంటాయి. అవి ప్రేక్షకులు కనెక్ట్ అవుతాయి. యూనిట్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడు చాలా గొప్ప విజన్ తో ఈ సినిమాని చేశారు. సత్యం రాజేష్ అన్నతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. చందన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తప్పకుండా ఈ సినిమాని, మమ్మల్ని సపోర్ట్ చేయండి' అని కోరారు.

నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..  'టెనెంట్'.. బలగం, కాంతార లాంటి సహజత్వంతో కూడుకున్న సినిమా. ఇందులో ఎమోషన్ అద్భుతంగా వుంటాయి. రాజేష్ గారు, ఎస్తర్ గారు నటీనటులంతా చాలా అద్భుతంగా నటించారు. యుగంధర్ గారు నిర్మాతల దర్శకుడు. సినిమా  చాలా అద్భుతంగా వచ్చింది.  మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

నటీనటులు: సత్యం రాజేష్ , మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ , తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తెర్ నొరోన్హ, ధనా బాల, చందు , అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న

స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & దర్శకత్వం: వై. యుగంధర్
నిర్మాత: మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి
సహ నిర్మాత : రవీందర్ రెడ్డి .ఎన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ
సంగీతం : సాహిత్య సాగర్
DOP: జెమిన్ జోమ్ అయ్యనేత్
ఎడిటర్: విజయ్ ముక్తవరపు
కథ: యస్ శ్రీనివాస వర్మ
 కో-డైరెక్టర్: అనిల్ కడివేటి
స్టంట్స్: రబిన్ సుబ్బు
ఆర్ట్: కరకరల చంద్ర మౌళి, సాయి  
ప్రొడక్షన్ కంట్రోలర్:బి. రాంబాబు  
డిజిటల్ మీడియా : వినీత్-సందీప్
PRO : తేజస్వి సజ్జా 

Pratinidhi 2 Theatrical Rights Bagged by Amogha Entertainments

నారా రోహిత్, మూర్తి దేవగుప్తపు, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ 'ప్రతినిధి 2' థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమోఘా ఎంటర్‌టైన్‌మెంట్స్- ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్



హీరో నారా రోహిత్ 'ప్రతినిధి 2'చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నారా రోహిత్ తన ఇంటెన్స్ నటనతో  ఆశ్చర్యపరిచారు. మూర్తి రచన, దర్శకత్వంకు మంచి ప్రశంసలు వచ్చాయి.


తాజాగా 'ప్రతినిధి 2' థియేట్రికల్ రైట్స్ ను డిస్ట్రిబ్యుషన్, ప్రొడక్షన్ సంస్థ అమోఘా ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం  ఏప్రిల్ 25నప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'ప్రతినిధి' 10 సంవత్సరాల క్రితం 2014లో ఇదే తేదీన విడుదల కావడం విశేషం.

 

'ప్రతినిధి 2' ... ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


నాని చమిడిశెట్టి డీవోపీగా చేస్తుండగా, యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి


సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు

నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని

బ్యానర్లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్

సంగీతం: మహతి స్వర సాగర్

ఎడిటర్: రవితేజ గిరిజాల

డీవోపీ: నాని చమిడిశెట్టి

ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె

స్టంట్స్: శివరాజు & పృధ్వి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల

పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్: ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్


Pottel Releasing on April 18th

యువ చంద్ర కృష్ణ, సాహిత్ మోత్ఖూరి, నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ 'పొట్టేల్'  పవర్ ఫుల్ టీజర్ ఏప్రిల్ 18న విడుదల



గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాల్లో ఫ్రెష్ నెస్ , హానెస్టీ ఉంటుంది. పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే అద్భుతాలు సృష్టిస్తాయి.యువ చంద్ర కృష్ణ హీరోగా సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించిన పొట్టేల్  గ్రామీణ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం . ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించగా, పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి


తాజాగా మేకర్స్ టీజర్ అప్డేట్ తో వచ్చారు. పొట్టేల్ పవర్ ఫుల్ టీజర్ ఈనెల 18న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.


నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కథానాయిక.


శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం - సాహిత్ మోత్ఖురి

నిర్మాతలు - నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె

బ్యానర్లు - నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్

సంగీతం- శేఖర్ చంద్ర

సినిమాటోగ్రాఫర్ - మోనిష్ భూపతి రాజు

ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్

లిరిక్స్  - కాసర్ల శ్యామ్

ఆర్ట్ డైరెక్టర్ - నార్ని శ్రీనివాస్

ఫైట్స్ - పృథ్వీ, రబిన్ సుబ్బు

పీఆర్వో- వంశీ- శేఖర్

డిజిటల్ మీడియా - హ్యాష్‌ట్యాగ్ మనోజ్ 

Director Shiva Turlapati Interview About Geethanjali Malli Vachindhi

అన్నిటికీ సమాధానం గీతాంజ‌లి 3లో ఉంటుంది!

- శివ తుర్ల‌పాటి



అంజలి 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శక‌త్వంలో  MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని  ఏప్రిల్ 11న విడుదల చేశారు. సినిమాకు వ‌స్తున్న స్పంద‌న గురించి, త‌న గురించి, గీతాంజ‌లి 3 గురించి శివ తుర్ల‌పాటి మీడియాతో మాటా మంతీ...

 సినిమాకు వ‌స్తున్న స్పంద‌న గురించి చెప్పండి?

- రెస్పాన్స్ జెన్యుయ‌న్‌గా బావుంది. రివ్యూలను కూడా చూశాను. రివ్యూల్లో చెప్పే విష‌యాల‌ను నేనెప్పుడూ పాజిటివ్‌గా తీసుకుంటాను. సినిమాలో చాలా వాటికి ఆన్స‌ర్ చేయ‌కుండా వ‌దిలేశార‌ని కొంద‌రు రాశారు. అయితే, ఆ లాజిక్కుల‌న్నిటికీ స‌మాధానం చెబుతూ పోతే, యానిమ‌ల్ సినిమాలాగా మూడు గంట‌ల నిడివి వ‌స్తుంది. నేను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది అది కాదు. ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ సినిమా. కాంజూరింగ్ టైప్ హార‌ర్ ఇందులో చేయాల‌నే థాట్ మాకు లేదు. ఎంట‌ర్‌టైనింగ్ సినిమాగానే చేశాం. కోనగారి మార్కు రైటింగ్‌ని ఆస్వాదించేవారికి చాలా బాగా న‌చ్చుతోంది. సినిమా చూసిన వారు నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. వీకెండ్ కాబ‌ట్టి, యుఎస్‌లో ఇప్పుడు అంద‌రూ సినిమా చూస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది అక్క‌డి నుంచి. సునీల్‌, స‌త్య కామెడీ సెకండాఫ్ లో పేలింది. క్లైమాక్స్ ని కొంద‌రు ఎక్స్ ట్రార్డిన‌రీ అని మెచ్చుకుంటున్నారు. కొంద‌రు స‌డ‌న్‌గా పూర్త‌యింది అని అన్నారు. మ‌రికొంద‌రు అదేంట‌ని అన్నారు. ఇలాంటి అనుమానాలు అన్నిటికీ థ‌ర్డ్ పార్ట్ లో స‌మాధానం ఉంటుంది. ఈ విష‌యాల‌న్నిటినీ నేను కోన‌గారితోనూ డిస్క‌స్ చేశాను.


 పార్ట్ 2 చేస్తున్న‌ప్పుడే థ‌ర్డ్ చాప్ట‌ర్ గురించి అనుకున్నారా?

 - పార్ట్ 2 చేస్తున్న లాస్ట్ మూమెంట్‌లో పార్ట్ 3 కోసం మంచి ఐడియా వ‌చ్చింది. అలా దాని గురించి ఓ డిస్క‌ష‌న్ జ‌రిగింది. దాని గురించి మ‌ళ్లీ మాట్లాడుదాం...

 పార్ట్ 3 అవ‌స‌రం ఉందా?

- పార్ట్ 2 లో పార్ట్ 3కి లీడ్ ఇచ్చాం. రావు ర‌మేష్ ఆత్మ‌ని అమ్మాయి బొమ్మ‌లో కేప్చ‌ర్ చేస్తుంది. అత‌ను వెళ్ల‌లేదు. ఆమెనే వెళ్లింది. తండ్రికోసం వ‌స్తాడు ఆ కొడుకు,  ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు చ‌నిపోయాడు. అలాంట‌ప్పుడు అత‌నేం చేస్తాడు? ఈ పాయింట్ పార్ట్ 3లో అద్భుతంగా పేలుతుంది.

 మీరిందులో చిన్న కేమియో చేసిన‌ట్టున్నారు?

- నాకు న‌టించాల‌నే ఉద్దేశం లేదు. ఊటీలో కొంత‌మందిని ఆడిష‌న్ చేశాం. కానీ క‌రెక్ట్ ఆర్టిస్ట్ దొర‌క‌లేదు. అక్క‌డ మేం చాలా స్పీడ్‌గా షూటింగ్ చేశాం. ఎక్కువ టేకులు తీసుకునే వారిని మేం భ‌రించే సీన్ లేదు. డేట్లు, టైమింగ్‌... ఇలాంటివ‌న్నీ దృష్టిలో పెట్టుకుని టూరిస్ట్ కేర‌క్ట‌ర్ నేను  చేస్తాను సార్‌ అని కోన‌గారికి మెసేజ్ పెట్టాను. బెస్ట్ అని రిప్లై ఇచ్చారు ఆయ‌న‌. అలా జ‌రిగిపోయింది అది. ఆ సినిమాలో న‌న్ను గుర్తించారు.. సంతోషం

 డైర‌క్ట‌ర్‌గా శాటిస్‌ఫై అయ్యారా?

- శాటిస్‌ఫై అయ్యానండీ. ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో అనే త‌ప‌న ఎప్పుడూ ఉంటుంది. కాక‌పోతే ఈ సినిమా నాకు చాలా చాలా నేర్పింది. నెక్స్ట్ సినిమాకు ఇంకా బాగా చేస్తానేమో.

 మోస్ట్ అన్ ఎక్స్ పెక్టెడ్ కాంప్లిమెంట్ ఎవ‌రి నుంచి వ‌చ్చింది?

- అంద‌రూ నా మంచిని కోరుకునేవారే. 20 - 25 ఏళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్నా. నా క‌ష్టాల‌ను ఎవ‌రూ చూడ‌లేదు. ఇప్పుడు చూస్తున్న శివ‌, ఆ శివ వేరు. అందుకే నేను స‌క్సెస్ కావాల‌ని అంద‌రూ కోరుకున్నారు.

 కోన‌గారి కోస‌మే సినిమా చేశారా?  లేకుంటే డైర‌క్ష‌న్ చేయాల‌ని ముందే అనుకున్నారా?

- డైర‌క్ష‌న్ చేయాల‌న్న‌ది నా క‌ల‌. అందుకోస‌మే కోన‌గారికి కొన్ని స్క్రిప్టులు చెప్పా. ఈ సినిమాకు ముందు కూడా ఓ క‌థ చెప్పా. ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌ధ్య‌లో ర‌మ్మంటే నాకు కుద‌ర‌లేదు. కాక‌పోతే ఈ సినిమా డైర‌క్ష‌న్ నాకు ఇస్తార‌ని నేను ఊహించ‌లేదు. ఈ సినిమా చేస్తే లాంచ్ బావుంటుంద‌ని నాకు చెప్పారు. స‌రేన‌ని చేశాను.

 సీక్వెల్ అన‌గానే భ‌యం ఉంటుంది క‌దా...

- నిజ‌మేనండీ. ఫ‌స్ట్ పార్టు కూడా డైర‌క్ట‌ర్  బ్ల‌డ్ పెట్టి చేశారు. చాలా పెద్ద స‌క్సెస్ అయింది. అందుకే ఆ ప్రెజ‌ర్‌ని నేను తీసుకోలేదు. అలాగే అంజ‌లిగారికి 50వ సినిమా అని కూడా నాకు తెలియ‌దు. సినిమాను సినిమాగా చేశాం

 మీరు కొరియోగ్రాఫ‌ర్ క‌దా.. అది ఈ సినిమాకు ప్ల‌స్ అయిందా?

- బిగ్ టైమ్ ప్ల‌స్ అయింది. నేను చేసిన పాట‌లు చాలా మందికి తెలియ‌దు. నేను క‌నిపించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ను కాబ‌ట్టి తెలిసే ఛాన్సే లేదు. తేజ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో న‌వ‌దీప్ జైకి కొరియోగ్ర‌ఫీ చేశా. బ్ర‌హ్మాస్త్రం చేశా. శంక‌రాభ‌ర‌ణం చేశా... ఇంకా చాలా చాలా సినిమాలు... ప‌దివేల‌కు, ఐదు వేల‌కు సాంగ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగులు నాకు పెద్ద‌గా రాలేదు. కానీ, నేను చేసిన ప్ర‌తి పాట‌లోనూ క‌థ చెప్పేవాడిని. కోన‌గారికి నాలో న‌చ్చిందే అది.

 అప్‌క‌మింగ్ సినిమాలు ఏమున్నాయి?

- చెప్తాను. నా ద‌గ్గ‌ర చాలా క‌థ‌లున్నాయి. నేను బాగా ఇష్ట‌ప‌డేది సెంటిమెంట్‌, ఎమోష‌న‌ల్ జోన‌ర్‌. ఏ సినిమా అయినా ఎమోష‌న్‌, సెంటిమెంట్ లేనిదే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని నేను అనుకోను. సో.. ఇప్పుడు ఇమీడియేట్‌గా ఏది సెట్స్ మీద‌కు వెళ్తుందో చూడాలి.

 గీతాంజ‌లి3కి మీరే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా?

- ఇంకా తెలియ‌దండీ. కానీ, ఎవ‌రైనా త్వ‌ర‌లోనే మొద‌లవుతుంది.

 మీ గురించి చెప్పండి?

- చిన్నప్ప‌టి నుంచీ చిరంజీవిగారి సినిమాలు చూసి డ్యాన్సులు నేర్చుకున్నా. కోటిలో శ్రీను మాస్ట‌ర్ అని గురువుగారి ద‌గ్గ‌ర డ్యాన్సు నేర్చుకున్నా. అప్ప‌ట్లో ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ కార్డు ఇప్పించారు. బ‌ద్రిలోబ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా ఫ‌స్ట్ టైమ్ చేశాను. రాకేష్ మాస్ట‌ర్‌, హ‌రీష్ మాస్ట‌ర్ ఎంక‌రేజ్ చేశారు. అప్పుడే తేజ‌గారు పిలిచి కొరియోగ్రాఫ‌ర్‌గా చేయ‌మ‌న్నారు. నేను డ్యాన్స్ మాస్ట‌ర్ కార్డు తెచ్చుకున్నా. మాస్ట‌ర్ అయ్యాక బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా చేయ‌డానికి లేదు. అప్పుడు త‌మిళ్ డ్యాన్స్ మాస్ట‌ర్ల హ‌వా ఉండేది. ఆ టైమ్‌లో నేను ముంబైకి వెళ్లా. అక్క‌డ డ్యాన్స‌ర్‌గా చేసుకోవ‌చ్చ‌నే వెళ్లా. భ‌రున్ ముఖ‌ర్జీ అని.. మ‌న వీయ‌స్ ఆర్ స్వామి గారికి గురువుగారున్నారు. ఆయ‌న్ని క‌లిశాను. ఆయ‌న‌తో ఏడు యాడ్ ఫిల్స్మ్ చేశా. ఆయ‌నరెమోసార్ ద‌గ్గ‌రికి పంపారు. ఆ త‌ర్వాత ఫైన‌ల్‌గా అమెరికాకి వెళ్లా. అప్పుడు నా గ‌ర్ల్ ఫ్రెండ్ అమెరికాలో ఉండేది. నాకూ వీసా రావ‌డంతో పెళ్లి చేసుకుని వెళ్లిపోయా. నేన‌లా వెళ్లానో లేదో... ఇలా  స్టార్‌వార్‌, ఢీలు మొద‌ల‌య్యాయి. ఫిల్మ్ సిటీలో నేను నాలుగేళ్లు ప‌నిచేశా. కానీ అప్పుడు లేని షోలు.. ఇప్పుడు మొద‌ల‌య్యాయే అనిపించింది. కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ నేను డ్యాన్స్ స్కూలు పెట్టుకున్నా. హైద‌రాబాద్‌లో సెటిల‌య్యా. మా డ్యాన్స్ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పుడు కూడా 500 - 600 మంది ఉన్నారు. నీ ఇంటికి ముందో గేటు.. అనే పాట‌కు మా స్టూడెంట్స్ తో క‌లిసే క‌వ‌ర్‌సాంగ్ చేశా. అస‌లు క‌వ‌ర్ సాంగ్స్ ఉంటాయ‌ని కూడా నాకు తెలియ‌దు. అది చూసి కోన‌గారికి న‌చ్చి మ‌ళ్లీ పిలిచారు. ఇలా ఇప్పుడు మీముందున్నా.


Konchem Hatke Releasing on April 26th

 ‘కొంచెం హట్కే’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను : ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి



గురు చరణ్, కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో అభిమాన థియేటర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మాణంలో అవినాష్ కుమార్ తీసిన చిత్రం ‘కొంచెం హట్కే’. ఈ సినిమాకు కృష్ణ రావూరి కథను అందించారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు.  ఏప్రిల్ 26న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా...


నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూసి చాలా నవ్వుకున్నాను. ఇంతలా నవ్వుకుని చాలా రోజులైంది. పదమూడేళ్ల క్రితం నేను కూడా చిన్న సినిమాను తీశాను. ఎవ్వరికీ అంతగా తెలియని ఆర్టిస్టులతో సినిమా తీశాను. మీడియా సహకారంతో ఆ సినిమా ఆడియెన్స్‌లోకి వెళ్లింది. ఈ మూవీని కూడా మీడియా అలానే ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. అలా మొదలైంది టైంలో మా సినిమా ఈవెంట్‌కు గెస్టులుగా ఎవరిని పిలుద్దామని అనుకున్నాం. ఆ టైంలో కళ్యాణీ మాలిక్ వల్ల రాజమౌళి గారు, కీరవాణి గారు వచ్చారు. నేను ఓ దర్శకురాలిని అయితే.. ఎవరైనా పిలిస్తే తప్పకుండా వెళ్లాలని ఆ టైంలోనే ఫిక్స్ అయ్యాను. చిత్ర దర్శకుడు అవినాష్ విజన్ కనిపిస్తోంది. కృష్ణ రైటింగ్ బాగుంది. కేఎం రాధాకృష్ణ గారు ఈ సినిమా వెనకాల ఉండటం అదృష్టం. మంచి కంటెంట్‌తో సినిమా వస్తే తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


దర్శకుడు అవినాష్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నందినీ రెడ్డి గారు నాకు ఇష్టమైన దర్శకురాలు. కళాతపస్వీ విశ్వనాథ్ గారి వల్లే కొత్త కథ, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా తీయాలని అనుకున్నాను. అందుకే టైటిల్ కూడా కొత్తగా పెట్టాం. ఇందులో హీరో హీరోయిన్లుండరు. పాత్రలే ఉంటాయి. వేరే వేరే ప్రపంచాల్లోంచి వచ్చిన మనుషులంతా కలిసి సినిమా తీసే కాన్సెప్ట్‌తో ఈ మూవీ సాగుతుంది. ఎంతో వినోదాత్మకంగా ఉండేలా సినిమాను తీశాం. మా చిత్రానికి మీడియా సహకారం కావాలి’ అని అన్నారు.


రచయిత కృష్ణ రావూరి మాట్లాడుతూ.. ‘కష్టపడితే సక్సెస్ వచ్చిందని కొందరు, లక్ వల్లే సక్సెస్ వచ్చిందని ఇంకొందరు అనుకుంటూ ఉంటారు. కానీ టైం వల్లే అంతా జరుగుతుంది. అన్నీ కలిసి వస్తేనే సక్సెస్ వస్తుంది. కష్టపడితేనే విజయం వరిస్తుంది. ఏప్రిల్ 26న ఈ చిత్రం రాబోతోంది. బయటి ప్రపంచాన్ని చూస్తే కొత్త పాత్రలు, కొత్త కథలు వస్తాయి. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది. జనాల వరకు సినిమా వెళ్లేందుకు మీడియా సహకారం కావాలి’ అని అన్నారు.


గురు చరణ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో మాధవ్ పాత్రను పోషించాను. నటుడిగా ఎదగాలనే ప్రయత్నాలు చేసే కారెక్టర్‌లో కనిపిస్తాను. సినిమాలో సినిమా తీయడం బాగుంటుంది. అందరినీ నవ్వించేలా ఈ మూవీ ఉంటుంది. రెగ్యులర్‌గా కాకుండా చాలా కొత్తగా ఉంటుంది. ఈ మూవీలో పాటలు థియేటర్లో బాగా ఎక్స్‌పీరియెన్స్ చేస్తారు. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. మీ మీ గ్రూపులతో ఈ సినిమాను చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించండి’ అని అన్నారు.


కృష్ణ మంజూష మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో నేను ప్రియాంక రెడ్డి పాత్రను పోషించాను. ఎంతో స్వేచ్చగా జీవించే కారెక్టర్‌లో కనిపిస్తాను. తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా డైరెక్టర్ అవ్వాలని అనుకుంటుంది. తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనేది బాగుంటుంది. సినిమా ట్రైలర్ చూసి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియా సహకారం అందించాల’ని కోరారు.


నటీనటులు గురు చరణ్, కృష్ణ మంజూష తదితరులు


బ్యానర్ :  అభిమాన థియేటర్ పిక్చర్స్

దర్శకత్వం : అవినాష్ కుమార్

నిర్మాణం : అభిమాన థియేటర్ పిక్చర్స్

రచయిత : కృష్ణ రావూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

ఎడిటర్ : మంజు కే రెడ్డి

కెమెరామెన్ : అనిల్ మల్లెల

లైన్ ప్రొడ్యూసర్ : నవ్య  పొట్ల

పీఆర్వో  : వంశీ కాకా

Addressing Social Media Misinformation: TFJA Takes Action

తెలంగాణ డిజిపి రవిగుప్తా, సిపి. కొత్తకోట. శ్రీనివాసరెడ్డిగార్లను కలిసిన టిఎఫ్‌జెఎ ప్రతినిధులు...

సోషల్‌ మీడియాలో పిచ్చిరాతలు రాసేవారి ఆటకట్టు



తెలుగు సినిమా పరిశ్రమలో సోషల్‌ మీడియా వేదికగా ఈ మధ్య రకరకాలైన వ్యక్తులు తమ స్వార్ధం కోసం అనేక విధాలుగా మీడియాలో విషం చిమ్ముతున్నారు. వీరంతా వ్యక్తిగతమైన ధూషణలు చేస్తూ తెలుగు సినిమా మీడియాలో కీలకంగా ఉన్నవారిని టార్గెట్‌ చేస్తూ మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి అనేక చర్యలకు పాల్పడటంతో సినిమా నిర్మాణంలో కీలకంగా ఉన్న కొంతమంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా వీరికి బాధితులే. అందుకే తెలుగు ఫిలిమ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టి.ఎఫ్‌.జె.ఎ) ప్రెసిడెంట్‌ వి.లక్ష్మీనారాయణ, జనరల్‌ సెక్రటరీ వై.జె రాంబాబులు  తమ అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిల్మ్‌ డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌లోని (టి.ఎఫ్‌.డి.ఎ) ప్రెసిడెంట్‌ ప్రేమ, ట్రెజరర్‌ శివమల్లాలతో కలిసి డిజిపి రవిగుప్తా,  హైదరాబాద్‌ సిపి. కొత్తకోట. శ్రీనివాసరెడ్డిగార్లను కలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించారు. పరిస్థితిని విన్న అధికారులు నిజంగానే కొన్నివార్తలు మా దృష్టికి వచ్చాయని మీరు కూడా కరెక్ట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌తో ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలిస్తే సోషల్‌ మీడియాని వెబ్‌సైట్లలో, యూట్యూబ్‌ల్లో  విచ్చలవిడి రాతలు రాసే వారిని తీసుకువచ్చి తగుచర్చలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా (టి.ఎఫ్‌.జె.ఎ),  (టి.ఎఫ్‌.డి.ఎ)  అసోసియేషన్‌లో జరిగే మంచి పనులను ఎలా చేస్తున్నామో వివరించారు మీడియా ప్రతినిధులు . మరో రెండు రోజుల్లో రూమర్లు పుట్టించి తమ పబ్బం గడుపుకునే వారిని పట్టుకుని విచారిస్తామని హామి ఇచ్చారు. మరో రెండురోజుల్లో పోలీస్‌ ప్రతినిధులతో కీలకమై సమావేశాన్ని నిర్వహించనున్నారు యూనియన్‌ ప్రతినిధులు. 

Global Star Ram Charan conferred doctorate by the Prestigious Vels University in Chennai

 వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవటం మరచిపోలేని అనుభూతి..నాకు ద‌క్కిన ఈ గౌర‌వం నా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, తోటి న‌టీన‌టులు, నా అభిమానుల‌కే ద‌క్కుతుంది : గ‌్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌



అద్భుత‌మైన సినిమాలు చేస్తూ త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీర్తి కిరీటంలో మ‌రో డైమండ్ చేరింది. చెన్నైకు చెందిన ప్ర‌ముఖ వేల్స్ యూనివ‌ర్సిటీ ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అందించింది. వివిధ రంగాల్లో విశిష్ట వ్య‌క్తుల‌ను గుర్తించి వారికి గౌర‌వ డాక్ట‌రేట్స్ ఇవ్వ‌టంలో వేల్స్ యూనివ‌ర్సిటీ ప్ర‌సిద్ధి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంట‌ర్‌ప్రెన్యూర‌ర్‌గా రామ్ చరణ్ చేసిన సేవ‌ల‌కు వేల్స్ యూనిర్సిటీ 14వ వార్షికోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అందించింది. అందులో రామ్ చ‌ర‌ణ్‌తో పాటు డా.పి.వీర‌ముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ చంద్ర‌యాన్‌, ఇస్రో), డా.జి.ఎస్‌.కెవేలు (ఫౌండ‌ర్‌, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్‌), అచంట శ‌ర‌త్ క‌మ‌ల్ (ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత‌, ప్ర‌ముఖ టేబుల్ టెన్నిల్ ప్లేయ‌ర్‌)ల‌ను కూడా గౌర‌వించారు. ఈ సంద‌ర్భంగా.... 


గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి గౌర‌వంతో డాక్ట‌రేట్ బ‌హుక‌రించిన వేల్స్ యూనివ‌ర్సిటీ వారికి మ‌నస్ఫూర్తిగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను. 45వేల‌కు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. 38 సంవత్స‌రాల‌కు పైగా ఈ యూనివ‌ర్సిటీని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. అలాంటి యూనివ‌ర్సిటీ నుంచి  నాకు గౌర‌వ డాక్ట‌రేట్ ఇస్తున్నార‌నే విష‌యం తెలియ‌గానే మా అమ్మ‌గారు న‌మ్మ‌లేదు. ఆర్మీలాంటి గ్రాడ్యుయేష‌న్స్ మ‌ధ్య‌లో నేను ఈరోజు ఇలా ఉండ‌టం ఊహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి నాకు ద‌క్కిన గౌర‌వం నాది కాదు.. నా అభిమానుల‌ది, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, నా తోటి న‌టీన‌టుల‌ది. వేల్స్ యూనివ‌ర్సిటీని ఇంత విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళుతున్న యాజ‌మాన్యానికి, టీచింగ్ సిబ్బందికి, విద్యార్థులుకు మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను. 


చెన్నై నాకెంతో ఇచ్చింది. నాకే కాదు, మా నాన్న‌గారు త‌న ప్ర‌యాణాన్ని ఇక్క‌డ నుంచే ప్రారంభించారు. నా సతీమ‌ణి ఉపాస‌న వాళ్లు అపోలో హాస్పిట‌ల్స్‌ను కూడా ఇక్క‌డ నుంచే మొద‌లు పెట్టారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎన‌బై శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాల‌ని క‌ల‌లు క‌ని చెన్నైకి వ‌స్తే అది నేర‌వేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్ప‌త‌నం. అన్ని రంగాల వారికి ఈ భూమి క‌ల‌ల‌ను నేరవేర్చేదిగా ఉంటూ వ‌స్తుంది. నేను ఇక్క‌డ విజ‌య హాస్పిట‌ల్‌లోనే పుట్టి పెరిగాను. 


సినిమాల విష‌యానికి వస్తే ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారితో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తున్నాను. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయాల‌ని చాలా మంది అనుకుంటారు. నేను ఇప్పుడు ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌టం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. శంక‌ర్‌గారు ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. డిఫ‌రెంట్ స్టోరీతో ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతుంది. ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్-అక్టోబ‌ర్ నెల‌ల్లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం’’ అన్నారు.

Trailer of "CAP" movie released in Tirumala

 శ్రీనివాసుడు కొలువై వున్న తిరుమలలో వైభవంగా రిలీజ్ అయిన  "కాప్" మూవీ ట్రైలర్ !!



ప్రముఖ నటుడు రవిశంకర్ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ  హీరోలుగా శ్రీమతి రాధా సురేష్ సమర్పణలో స్వశ్రీ క్రియేషన్స్- వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్స్ పై యువ వ్యాపార వేత్త మాధవన్ సురేష్ నిర్మిస్తోన్న చిత్రం "కాప్". శత్రుపురం, 'మన్యం రాజు' చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొన్న దర్శకుడు  బి. సోముసుందరం ఈ "కాప్" చిత్రానికి దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైర్స్ తో పాటు కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సమాజానికి ఉపయోగపడే  ఒక మంచి సందేశం వుంటుంది.. అందర్నీ  ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సోము.. కాగా ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం ఏప్రిల్ 12న తిరుపతి ఎస్ వి ఇంజినీరింగ్ కాలేజ్ లో వందలాదిమంది స్టూడెంట్స్ మధ్య వైభవంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలనంతరం ఎస్వీ కాలేజ్ డైరక్టర్ డా. యన్. సుధాకర్ రెడ్డి స్వశ్రీ బ్యానర్ లోగోనీ ఆవిష్కరించారు. 


 అనంతరం డా. యన్. సుధాకర్ రెడ్డి మట్లాడుతూ.. "* ఎస్వీ కాలేజ్ లోనే చదువుకొని జాబ్ చేస్తూ.. యుయస్ వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ సినిమా తీసే స్థాయికి ఎదిగాడు.. మాధవన్ సురేష్. టెక్నికల్ గానే కాకుండా బిజినెస్ సైడ్ కూడా మంచి పట్టు వున్న వ్యక్తి సురేష్. అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన నితిన్ కూడా మన కాలేజ్ కుర్రాడే. అతను కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.. కానీ సరైన గుర్తింపు రాలేదు.. ఈ కాప్ సినిమా మంచి సక్సెస్ అయి నితిన్ కి మంచి బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను.. అలాగే దర్శకుడు సోముకి సినిమా అంటే పిచ్చి. మన తిరుపతి లో వున్న ఆర్టిస్టులకు ఛాన్స్ ఇస్తూ ఈ కాప్ సినిమా తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం వుంది.. అన్నారు. 


 చిత్ర దర్శకుడు సోముసుందరం మట్లాడుతూ.. " శత్రుపురం, మన్యం రాజు, చిత్రాల తర్వాత నేను డైరక్ట్ చేస్తున్న మూడవ చిత్రం ఇది. చాలా కష్టపడి ఈ సినిమా చేశాను. ముఖ్యంగా మా రాధా మేడం గారు లేకపోతే ఈ సినిమా లేదు. కథ విని ఎంతో ఇంప్రెస్ అయి మా నిర్మాత మాధవన్ సురేష్ గారు ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఆయనకి నా స్పెషల్ థాంక్స్. మా టీమ్ అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేసి  సినిమా బాగా రావడానికి సహకరించారు. ట్రైలర్ అందరికీ నచ్చుతుంది. సినిమా కూడా ప్రతి ఒక్కరికీ నచ్చేలా వుంటుంది.. ఈ సమ్మర్లోనే సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు. 


 సమర్పకురాలు రాధా సురేష్ మాట్లాడుతూ.. "మూడేళ్లుగా డైరక్టర్ సోముతో ట్రావెల్ అవుతున్నాను. సోము కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అప్పటినుండీ ఎవరూ ప్రొడ్యూస్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ గా మా అబ్బాయి మాధవన్ సురేష్ ఈ సినిమా నేను తీస్తాను అని ముందుకు వచ్చాడు.. అలా సినిమా స్టార్ట్ అయింది. సినిమా అంటే ఎంతో ప్యాషన్ వున్న వ్యక్తి సోము. చాలా కష్టపడి ఈ చిత్రం తెరకెక్కించాడు. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది.. మేము అంతా చాలా హ్యాపీగా ఉన్నాం.. డెఫినెట్ గా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడు సోము. మా "కాప్" సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు. 


 చిత్ర నిర్మాత మాధవన్ సురేష్ మాట్లాడుతూ.. " మా పేరెంట్స్ లేకపోతే నేను లేను.. వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివించి ఇంతవాడ్ని చేశారు. నేను ఎస్వీ కాలేజ్ లోనే చదువుకున్నా.. ఇక్కడ ఎంతో నేర్చుకున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే.. మా అమ్మ ఈ కథ నాకు ఎక్స్ ప్లెయిన్ చేసింది. నేను చాలా ఎక్సైట్ అయి మనమే ఈ సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పాను. దర్శకుడు సోము చాలా ప్రాపర్ గా ప్లాన్ చేసి  ఈ చిత్రాన్ని ముప్పై రోజుల్లో పూర్తి చేశాడు. ట్రైలర్ అధ్భుతంగా వుంది. సినిమా కూడా అదే రేంజ్ లో వుంటుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చేలా ఈ చిత్రం వుంటుంది.. అన్నారు. 


 ఈ చిత్రంలో నటించిన హీరోలు నిఖిల్, రాజశేఖర్ మాట్లాడుతూ.. " కాప్" చిత్రంలో మంచి క్యారెక్టర్స్ చేశాం.. యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలా డైరక్టర్ సోము గారు ఈ సినిమాని ఎక్స్ లెంట్ గా రూపొందించారు. ఈ సినిమాతో మా అందరికీ మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాం.. అన్నారు. 


ఇంకా ఈ కార్యక్రమంలో నటులు కేజియఫ్ ఫేం హరీష్ రాయ్, క్రేన్ మనోహర్, జయచంద్ర, మ్యూజిక్ డెరైక్టర్ మిలన్ జోషి,  ఫైట్ మాస్టర్ కుంగ్ ఫు సెంథిల్, కో- ప్రొడ్యూసర్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.


 రవిశంకర్, తేజ, నిఖిల్, రాజశేఖర్, కెజియఫ్ హరీష్ రాయ్, క్రేన్ మనోహర్, జయచంద్ర, సోనీ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా; అల్లి కట్టి, మ్యూజిక్; మిలన్ జోషి, ఎడిటర్; వెంకటేష్, ఫైట్స్; కుంగ్ ఫు సెంథిల్, కొరియో గ్రాఫర్; పవన్ విక్కీ, పి.ఆర్.ఓ; జిల్లా సురేష్, కో-ప్రొడ్యూసర్; పుష్పలత, నిర్మాత; మాధవన్ సురేష్, కథ-మాటలు- పాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం; బి. సోమసుందరం.


MAKE UP MAN Movie Launched

 అంగరంగ వైభవంగా మేకప్ మ్యాన్ చిత్ర ప్రారంభోత్సవం



అభిరామ్ మూవీస్ బ్యానర్ పై సీనియర్ మేకప్ మ్యాన్

 కుమార్ మెట్టుపల్లి నిర్మాతగా, దివాకర్ యడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మ్యాకప్ మ్యాన్. దివంగత ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడు శ్రీకాంత్ అవుటూరి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. పోలూరు ఘటిక చలం డైలాగ్స్, ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు.

శనివారం ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  దర్శకుడు రవి కుమార్ చౌదరి, నిర్మాతలు లయన్ సాయి వెంకట్, భరత్ పారేపల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


దర్శకుడు రవి కుమార్ చౌదరి క్లాప్ కొట్టారు. లయన్ సాయి వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, భరత్ పారేపల్లి తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.


ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో... అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకులు రవి కుమార్ చౌదరి మాట్లాడుతూ.."నేను దర్శకుడిగా పరిచయం అయినప్పుడు మా గురువు  సాగర్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు కూడా నేను అంతే ఆనందం గా ఉన్నాను. నా దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన దివాకర్ మంచి స్టోరీ టెల్లర్. చాలా ప్యాషన్ తో పని చేస్తాడు. ఈ కథను చాలా అద్భుతంగా రాశాడు. తనతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.."ప్రతి చిత్రానికి మేకప్ మ్యాన్ పాత్ర చాలా కీలకం గా ఉంటుంది. అలాంటి  మేకప్ మ్యాన్ ప్రాముఖ్యతను ఈ  చిత్రంలో  చూపించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా" అని అన్నారు.


భరత్ పారేపల్లి మాట్లాడుతూ.."దర్శకుడు దివాకర్ మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంచి విజయం సాధించి దర్శకుడుగా మరిన్ని చిత్రాలు తెరకెక్కించాలని కోరుతున్నా" అని అన్నారు.


చిత్ర హీరో శ్రీకాంత్ కవుటూరి మాట్లాడుతూ.. "నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పట్నుంచీ మామయ్యను చూసి పెరగడం తో సినిమాలపై ఆసక్తి కలిగింది. ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో హీరోగా పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.


చిత్ర దర్శకుడు దివాకర్ యడ్ల మాట్లాడుతూ.."చిత్ర పరిశ్రమలో మేకప్ మ్యాన్ ప్రాముఖ్యత చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి మేకప్ మ్యాన్ ల జీవితాలను ఇందులో చూపిస్తాము. వాళ్ళ లైఫ్ స్టైల్,  వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించబోతున్నాం. త్వరలో షూటింగ్ మొదలు పెడుతున్నాం" అని చెప్పారు.


చిత్ర నిర్మాత కుమార్ మెట్టుపల్లి మాట్లాడుతూ.."సినిమా నిర్మించాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నా.  ఇన్నాళ్లకు మంచి కథతో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం హ్యాపీ గా ఉంది" అని చెప్పారు.


సీనియర్ రచయిత ఘటిక చలం, నటులు కట్టా రంజిత్ ఆనంద్ భారతి చిట్టిబాబు, రచయిత నాగరాజు చిత్ర యూనిట్ కు తమ అభినందనలు తెలియజేశారు.


తారాగణం : శ్రీకాంత్ కవుటూరి, కట్టా రంజిత్, ఆనంద్ భారతి, చిట్టిబాబు తదితరులు..


బ్యానర్:: అభిరామ్ మూవీస్

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ : దివాకర్ యడ్ల

డైలాగ్స్ : ఘటక చలం

నిర్మాత : కుమార్ మెట్టుపల్లి

డిఓపి, ఎడిటర్ : వాసు వర్మ

సంగీతం : ఎం ఎం శ్రీలేఖ

రచనా సహకారం : శ్రీను గ్రంధి

వి ఎఫ్ ఎక్స్ : సూర్య, వంశీ, విజయ్

వీఆర్వో : జీకే మీడియా.