Chitravaahini and RYG Banners Announced TUK TUK Title For Their Film


"టుక్ టుక్" - చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌లచే ఆవిష్కరించబడిన సరి కొత్త టైటిల్



చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌లు తమ తాజా చలనచిత్రం టైటిల్ "టుక్ టుక్" టైటిల్ పోస్టర్ ని శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేశారు. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.


చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్ లుక్ ఉంది. సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, "టుక్ టుక్" ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంది, అసలు కథలో ఆ ఆటో పాత్ర ఏంటి అనేది ముందు ముందు యూనిట్ సభ్యులు ఇచ్చే అప్డేట్స్ లో చూసి తెలుసుకోవాలిసి ఉంది.

 

పోస్టర్ లో అంశాలని బట్టి ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో సెట్ చేయబడింది. అనేక ఫాంటసీ ఎలెమెంట్స్ కూడా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి.  రాహుల్ రెడ్డి, లోక్కు సాయి వరుణ్ మరియు శ్రీరాములు రెడ్డి నిర్మించిన "టుక్ టుక్" క్రియేటివ్ తరహాలో ప్రేక్షకుల మనన్నలు పొందుతుంది. పోస్టర్ లో హీరో నో హీరోయిన్ ఓ కాకుండా ఈ ఆటో పెట్టడం వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనికి సంతు ఓంకార్ సంగీతం అందించారు మరియు హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.


"టుక్ టుక్" ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నట్టు ఈ పోస్టర్ రెస్పాన్స్ బట్టి అర్ధమవుతుంది.


తారాగణం:

హర్ష రోషన్

కార్తికేయ దేవ్

స్టీవెన్ మధు

సాన్వీ మేఘన

నిహాల్ కోధాటి


సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ

సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్

సంగీతం: సంతు ఓంకార్

ఎడిటర్: అశ్వత్ శివకుమార్

నిర్మాతలు:

రాహుల్ రెడ్డి

లోక్కు శ్రీ వరుణ్

శ్రీరాముల రెడ్డి

సుప్రీత్ సి కృష్ణ

పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు

డిజిటల్ మీడియా : పిక్చర్ పిచ్

 

Post a Comment

Previous Post Next Post