Latest Post

Mishan Impossible Pre Release Event Held Grandly

మిషన్ ఇంపాజిబుల్ ఎవ‌రినీ నిరాశ‌ పరచదు, న‌న్ను న‌మ్మి సినిమా చూడండి - మెగాస్టార్ చిరంజీవి



తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు  `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్  స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె. ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్ల‌లు గా రోష‌న్‌, బానుప్ర‌కాష్, జైతీర్థ న‌టించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారంనాడు ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌ లోని ఓ హోట‌ల్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగా గెస్ట్‌ గా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు.


 


ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, కొన్ని ఫంక్ష‌న్ల‌కు ప్రేమ‌తో వ‌స్తాం. అలా నిర్మాత నిరంజ‌న్‌ రెడ్డిపై వున్న సోద‌ర ప్రేమ‌తో వ‌చ్చాను. చాలా త‌క్కువ స‌మ‌యంలో నాకు అత్యంత ఆప్తుడిగా, సోద‌రుడిలా క‌లిసిపోయాడు. ఒక‌వైపు సుప్రీం కోర్డు లాయ‌ర్‌ గా బాధ్య‌త‌లు నిర్వర్తిస్తూ ఎంతో బిజీగా వున్నా మ‌రోవైపు సినిమాలు తీయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగింది. నాతో ఆచార్య చేస్తున్నాడు. ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ చేశారు. ఈ సినిమా గురించి నాకు చెబుతూ ద‌ర్శ‌కుడి తీసిన `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా గురించి చెప్పాడు. అప్పుడు నేను చూడ‌లేక‌పోయా. ఇప్పుడు త‌ప్ప‌కుండా చూస్తాను. నేను చేసిన చంట‌బ్బాయ్ స్పూర్తి అని ద‌ర్శ‌కుడు అన్నాడు. మంచి కాంబినేష‌న్ కుదిరింది. నిర్మాత నిరంజన్ వైల్డ్ డాగ్ సినిమా తీసిన‌ప్పుడు న‌న్ను పిల‌వ‌లేదు. నా ఫ్రెండ్ నాగార్జున పిలిచాడు అంటూ స‌ర‌దాగా గుర్తు చేశారు.


ఇక ఈ సినిమా గురించి నిరంజ‌న్ నాకు చెబుతూ, ఈ సినిమాను మీరు చూసి న‌చ్చితేనే ఫంక్ష‌న్‌కు ర‌మ్మ‌న్నారు. సినిమా చూశాను. ఫ్యాబ్యులెస్ సినిమా. తాప్సీ ది చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర వుంటుంది. `పింక్‌`లో ఎంత అద్భుతంగా న‌టించిందో తెలిసిందే. ఝుమ్మంది నాదం చేసిన‌ప్పుడు వేడుక‌లో చూశాను. అప్పుడు చూసిన అమ్మాయేనా అనిపించింది. వృత్తిప‌రంగా నిబ‌ద్ధ‌త‌తో త‌న‌కంటూ ఓ మార్క్ వేసుకుంది. త‌ను న‌టించిన ఘాజ సినిమా చూశాను. ఇక ముగ్గురు పిల్ల‌లు ఎంట‌ర్‌టైన్ చేశారు. వీరిని చూస్తుంటే, నేను న‌టుడిగా అవ్వాల‌నుకునే బీజం ఏర్ప‌డిన రోజు గుర్తుకు వ‌స్తుంది. చిన్న‌త‌నంలో నేను 8వ త‌ర‌గ‌తి చ‌దువుతుండ‌గా బాల‌రాజు క‌థ‌లో `మ‌హాబ‌లిపురం..`అని పాట పాడిన పిల్లాడు ప్ర‌భాక‌ర్ ప్ర‌భావం నాపై వుంది. అలా ప‌డిన బీజం న‌న్ను న‌టుడిగా మారేలా చేసింది. ఈ సినిమాలో పిల్ల‌లు బాగా చేశారు. డాన్స్ అద్భుతంగా చేశారు. చాలా అమాయ‌క‌త్వంతో చేసిన న‌ట‌న బాగుంది. వారు క్రైంలో ఇరుక్కోవ‌డం చాలా ఎంట‌ర్‌ టైన్‌మెంట్ ఇస్తుంది. సెకండాఫ్‌లో ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ అద్భుతంగా మ‌లిచాడు. మేట‌ర్‌, మెటీరియ‌ల్‌, టాలెంట్ వున్న ద‌ర్శ‌కుడు స్వ‌రూప్‌. ఈ సినిమాతో మ‌రింత నిరూపించుకుంటాడు. చిన్న పిల్ల‌ల సినిమా అంటాం. కానీ ఇది పెద్ద‌లు చూడాల్సిన సినిమా. నిర్మాత నిరంజ‌న్ రెడ్డి క‌థ ఎంపిక చేశారంటే ఒక మార్క్ వుంటుంది. నిర్మాత అనేవాడు కేషియ‌ర్ కాదు.  క‌థ‌లో, ప్రాసెస్‌లో నిర్మాత ప్ర‌మేయం వుండాలి. అశ్వ‌నీద‌త్‌, అరవింద్‌, కె.ఎస్‌. రామారావు, దేవీప్ర‌సాద్ వంటి నిర్మాత‌లు క‌థ‌లోనూ, సంగీతం, కాస్ట్యూమ్ ఇలా అన్ని రంగాల్లో ఇన్‌వాల్వ్‌మెంట్ అవుతారు. అప్పుడే ఆర్టిస్టుకు భరోసా వుంటుంది. ఈ సినిమా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి నిల‌బెట్టాల‌నే భ‌రోసా క‌లిగిస్తారు. కానీ క్ర‌మేణా నిర్మాత ప‌రిస్థితి కేషియ‌ర్‌ లా మారిపోయింది. మ‌ళ్ళీ ఇన్నాళ్ళ త‌ర్వాత అటువంటి నిర్మాత నిరంజ‌న్ రెడ్డి అని చెప్పుకోవ‌డం గ‌ర్వంగా వుంది. ఆచార్య తీస్తున్న‌ప్పుడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో త‌న అభిప్రాయాన్ని చెప్పే స్థాయి వుంది. ద‌ర్శ‌కుడు, నిర్మాత ఒకేలా ఆలోచించేవిధంగా వుండాలి. ఒక ఈ సినిమాకు కెమెరామెన్‌గా చేసిన దీప‌క్‌, సంగీతం ఇచ్చిన‌ మార్క్‌, క‌ల‌ర్‌ఫొటో హీరో సుహాస్ ను పేరుపేరున ప‌లుక‌రించారు. పాండ‌మిక్ టైంలో క‌ల‌ర్‌ఫొటో సినిమా చూశాను. బాగా న‌టించాడు. అలాగే కంచ‌ర‌పాలెం ద‌ర్శ‌కుడు మ‌హా, అర్జున్ రెడ్డి వంగా వంటి యంగ్ ద‌ర్శ‌కులు మాకూ అసోసియేష‌న్  ఉంది. మీ సినిమా చూసి ఇన్ స్పైర్ అయ్యామ‌ని చెబుతుంటే ఆనందంగా వుంది. ఇలా మీ అంద‌రినీ క‌ల‌వ‌డం చాలా సంతోషంగా వుంది.


 


తాప్సీ ఝుమ్మంది నాదం టైంలో చాలా క్యూట్‌గా వుంది. ఆ టైంలో నేను రాజ‌కీయాల్లోకి వెళ్ళిపోయాను. అందుకే ఆమెతో న‌టించ‌లేక‌పోయాను. కానీ ఇప్పుడు నిరంజ‌న్‌రెడ్డి ఆమెతో మెయిన్ కాంబినేష‌న్‌ గా మా ఇద్ద‌రినీ క‌లిపే క‌థ చూడండి అంటూనే. పింక్‌ లా అమితాబ్‌ను డామినేట్ చేస్తే నేను ఒప్పుకోను. అంటూ చ‌మ‌త్క‌రించారు.


అదేవిధంగా మిషన్ ఇంపాజిబుల్ అనేది చిన్న సినిమా కాదు. పెద్ద మ‌న‌సుతో చూడ‌త‌గ్గ సినిమా. ఇందులో చ‌క్క‌టి ఆర్ట్ వుంది. మ‌న‌సును రంజింప‌చేస్తుంద‌ని నేను హామీ ఇస్తున్నా. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు ప‌బ్లిసిటీ అవ‌స‌రంలేదు. ఇలాంటి సినిమాకు కావాలి. ఇక ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా ద్వారా తెలుగు ఖ్యాతిని ప్ర‌పంచ దేశాల‌కు తీసుకెళ్ళేలా చేసిన రాజ‌మౌళి, అత‌ని టీమ్‌ కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నా. ఇలాంటి చిన్న సినిమాను ఆద‌రిస్తే యంగ్ టాలెంట్ మ‌రింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఏప్రిల్ 1న మీరంతా మాకు ఇచ్చే గిఫ్ట్ మిషన్ ఇంపాజిబుల్ అంటూ ముగించారు.


 


తెలుగులో చేశాను. చేస్తాను.- తాప్సీ ప‌న్ను


 


తాప్సీ ప‌న్ను మాట్లాడుతూ, ఝుమ్మంది నాదం సినిమా ఆడియోకు చిరంజీవిగారు వ‌చ్చారు. నాకు స్పెష‌ల్ మూవీ. ఆయ‌న ఆశీస్సులు మ‌రోసారి ద‌క్కాయి. నిరంజ‌న్‌రెడ్డిగారు నాకు ఘాజి సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమా నాకు హ్యాట్రిక్ మూవీ కావాలి. ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ చాలా స‌పోర్ట్ చేశారు. నా డేట్స్‌, ప్ర‌యాణం వ‌ల్ల ఇబ్బందులున్నా ఎంతో స‌హ‌క‌రించారు. ఈ సినిమాకు ముగ్గురు పిల్ల‌లే హీరోలు. నేను చేసిన సినిమాల‌న్నింటిలోకీ యంగెస్ట్ హీరోలు వీరే. నేను రెండేళ్ళుగా హిందీలో బిజీగా వున్నా తెలుగులో చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటంటే లాజిక్ గా ఏమీ చెప్ప‌లేను. నేను తెలుగులో చేశాను. చేస్తాను. చేస్తూనే వుంటాను అని తెలిపారు.


 


చిత్ర ద‌ర్శ‌కుడు స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె మాట్లాడుతూ, చిరంజీవిగారు మా సినిమాకు స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చినందుకు థ్యాంక్స్‌. ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన మ‌హేష్‌బాబుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. నేను చేసిన `ఏజెంట్‌..` సినిమాకు స్పూర్తి చిరంజీవిగారి `చంట‌బ్బాయ్‌`. నేను చిరంజీవిగారి అభిమానిని. తిరుప‌తిలో సినిమాలు వ‌స్తే క‌టౌట్లు క‌ట్టేవాడిని. ఇక ఈ సినిమా తెర‌రూపం రావ‌డానికి కార‌ణం నిర్మాత‌లే. కోవిడ్ మొద‌టివేవ్‌లో క‌థ చెప్పాను. అప్ప‌డు థియేట‌ర్లు ఓపెన్ అవుతాయో లేవో అనే గంద‌ర‌గోళం నెల‌కొంది.  అలాంటి స‌మ‌యంలో ముగ్గురు పిల్ల‌ల క‌థ వెండితెర‌పై చూపాల‌న్న నిర్మాత ఆలోచ‌న‌తో ముందుకు సాగారు. ఈ క‌థ రీత్యా స్ట్రాంగ్ హీరోయిన్ కావాల‌నుకున్నాం. తాప్సీగారు హిందీలో పింక్‌వంటి అద్భుత‌మైన సినిమాలు చేశారు.. ఆమె ఈ క‌థ‌లో 45 నిముషాలు మాత్ర‌మే వుంటుంది. అనుమానంగానే ఆమెను ముంబైలో క‌లిశాం. క‌థ విని వెంట‌నే చేస్తాన‌న్నారు. పాత్ర‌లో నిడివికాదు. క‌థ న‌చ్చి అంగీక‌రించారు. షూటింగ్‌లో ఎటువంటి స‌మ‌స్య వున్నా అన్వేష్ రెడ్డిగారు ప‌రిష్క‌రించేవారు.


ఈ సినిమాకు మార్క్‌.కె. రాబిన్ చ‌క్క‌టి BGM తోపాటు సంగీతం బాగా ఇచ్చారు.   కెమెరామెన్ దీప‌క్ నాకు బ‌లం.  ఆర్ట్ డైరెక్ట‌ర్‌, నా ద‌ర్శ‌కుల టీమ్‌కు ధ‌న్య‌వాదాలు. ఇక ముగ్గురు పిల్ల‌లను ఎంపిక చేసి రెండు నెల‌ల‌పాటు వ‌ర్క్‌షాప్ చేశాం. ఆ వ‌య‌స్సులో వున్న కాన్ఫిడెన్స్ నాకు బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఈ సినిమా త‌ర్వాత ఈ ముగ్గురికీ మంచి పేరువ‌స్తుంది. కోవిడ్ టైంలో వారి త‌ల్లిదండ్రులు మ‌మ్మ‌ల్ని న‌మ్మి పంపించారు.  ఏప్రిల్ 1న సినిమా విడుద‌ల‌వుతుంది. ఇది చిన్న పిల్లల సినిమాకాదు. పెద్ద‌ల్లోనే చిన్న పిల్ల‌ల అమాయ‌క‌త్వం వుంటుంది. మ‌నం పెద్ద‌య్యాక మ‌న‌కు ఆరోజులు గుర్తుకు వ‌స్తాయి. ఈ సినిమా బాల్యంలోకి తీసుకెళుతుంది. మంచి సినిమా చూసిన‌ రెండుగంట‌లూ న‌వ్వేలా వుంటుంద‌ని హామీ ఇస్తున్నాను అన్నారు


 


నిర్మాత‌ల్లో ఒక‌రైన నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ, మ‌హేష్‌బాబు ట్రైల‌ర్ లాంచ్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. చిరంజీవిగారు రావ‌డం స‌క్సెస్‌ గా భావిస్తున్నాం. స్వ‌రూప్ చేసిన మొద‌టి సినిమా చూడ‌లేదు. `ఏజెంట్‌..` పెద్ద టైటిల్ ఏమిటి? అని మొద‌ట అనిపించింది. నా స్నేహితులు బాగుంద‌ని చెప్పారు. సినిమా చూశాక ద‌ర్శ‌కుడితో బాగుంద‌ని చెప్పాను. ఏదైనా క‌థ వుంటే ర‌మ్మ‌న్నాను. కథ చెప్పాడు. ఆ క‌థ వింటూనే న‌వ్వుతూనే వున్నాను. ఈ క‌థ స్నేహితుల‌కు చెప్పాను. వారు తెగ‌న‌వ్వారు. ఇలాంటి క‌థ‌కు కీల‌క పాత్ర‌లో తాప్సీ వుంటే బాగుంటుంద‌ని ఆమెకు క‌థ చెప్పాం. ఇప్పుడు మ‌నం పాన్ ఇండియా సినిమా అంటున్నాం కానీ, తాప్సీ పాన్ ఇండియా హీరోయిన్‌ గా ఎప్పుడో అయిపోయింది. మంచి ద‌ర్శ‌కుడు, మంచి యాక్టర్ తోడ‌యితే ఆచార్య‌, మిష‌న్ ఇంపాజిబుల్ వంటి సినిమాలు వ‌స్తాయ‌ని అన్నారు.


 


సంగీత ద‌ర్శ‌కుడు మార్క్‌రాబిన్ మాట్లాడుతూ, స్వ‌రూప్‌తో `ఏజెంట్‌..` సినిమా చేశాను. అందుకే క‌ష్టంగా అనిపించ‌లేదు. అవ‌కాశం ఇచ్చిన నిరంజన్ గారికి ధ‌న్య‌వాదాలు. నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. ముఠామేస్త్రీలోని పాట‌లు విని ఇంట్లో డాన్స్ వేసేవాళ్లం. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి.  కృష్ణ‌, హసిత్ గోలి, ఎ.కె. గ‌ణేష్‌.. చ‌క్క‌టి సాహిత్యం ఇచ్చారు. ఇందులో ముగ్గురు పిల్ల‌లు బాగా న‌టించారు. వీరికి పెద్ద కెరీర్ వుంటుందని భావిస్తున్నాన‌ని అన్నారు.

 ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో వినోద్‌, మ‌హ‌,  ర‌వీంద‌ర్ విజ‌య్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, సుహాస్, సందీప్ రాజ్‌, కెమెరామాన్ దీప‌క్‌, రాహుల్ యాద‌వ్ పాల్గొన్నారు.


ఇందులో న‌టించిన బాల న‌టులు రోష‌న్‌, బానుప్ర‌కాష్, జైతీర్థమెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోని పాట‌ల‌కు అనుగుణంగా డాన్స్ చేసి అల‌రించారు. అనంత‌రం మెగాస్టార్ ఆశీర్వ‌చ‌నాలు పొందారు.


Tiger Nageswara Rao Grand Launching & Pre-Look On April 2nd

 Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao Grand Launching & Pre-Look On April 2nd



Mass Maharaja Ravi Teja will be doing his first ever Pan India project titled Tiger Nageswara Rao to be directed by Vamsee and produced prestigiously by Abhishek Agarwal under Abhishek Agarwal Arts banner, while Tej Narayan Agarwal presents it. This is going to be biggest budgeted movie in Ravi Teja's career.


Tiger Nageswara Rao will have its grand launching event on Ugadi Day (April 2nd) in Novatel at HICC, Madhapur, in presence of the film’s core team. The film's pre-look will be out at 12:06 PM on Ugadi. It’s a dream project for producer Abhishek Agarwal who made grand entry in Bollywood with the blockbuster Pan India film The Kashmir Files.


Tiger Nageswara Rao is a periodic film in era of 1970’s based on real incidents of a notorious and courageous thief of South India and the people of Stuartpuram. Ravi Teja undergoes complete makeover to play the powerful role. His body language, diction and getup will be completely different and it will be never before character for the actor.


Director Vamsee locked the script and he too worked on the subject like his dream project that will be made in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.


The life story of ‘Tiger’ Nageswara Rao is a perfect cinema material and Ravi Teja, who best suits for playing such mass and authoritative roles, is obviously the right choice.


The film’s title poster garnered massive response and it alone raised curiosity on the film that will be packed with high intense action sequences. Given the story is set in 70s, popular technicians are brought in to be part of this project.


It’s going to be very visually brilliant with R Madhie ISC and GV Prakash Kumar handling camera and music departments respectively. Avinash Kolla is going to be the production designer. Srikanth Vissa is the dialogue writer, Mayank Singhaniya is the co-producer.


Other details of the project will be unveiled soon.


Cast: Ravi Teja

Writer, Director: Vamsee

Producer: Abhishek Agarwal

Banner: Abhishek Agarwal Arts

Presenter: Tej Narayan Agarwal

Co-Producer: Mayank Singhaniya

Dialogues: Srikanth Vissa

Music Director: GV Prakash Kumar

DOP: R Madhie

Production Designer: Avinash Kolla

PRO: Vamsi-Shekar

Nupur Sanon Comes On Board For Ravi Teja Pan Indian Film Tiger Nageswara Rao

Nupur Sanon Comes On Board For Ravi Teja , Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao



Mass Maharaja Ravi Teja’s first Pan India project Tiger Nageswara Rao generated enough interest with its title poster. Directed by Vamee and produced by Abhishek Agarwal of Abhishek Agarwal Arts who made the critically acclaimed and commercial blockbuster film The Kashmir Files, the film will be made on massive scale with highest budget in Ravi Teja’s career. It’s indeed the most ambitious project of the producer. Tej Narayan Agarwal presents the film.


The makers have finalized the actress to play opposite Ravi Teja in the film. Bollywood actress Nupur Sanon comes on board for this crazy project. Hailing from an academically sound family, Nupur Sanon had only one role model to follow which is her sister Kriti Sanon who risked it by venturing out into showbiz. So, when Nupur followed her to Mumbai, she had her set of hurdles to face before she made a foray into the on-screen world. She is now making her debut in Telugu with Tiger Nageswara Rao. This indeed is first film for Nupur who previously appeared in a music video alongside Akshay Kumar. She is sister of popular Bollywood actress Kriti Sanon.


Tiger Nageswara Rao will be launched on Ugadi Day (April 2nd) in Novatel at HICC, Madhapur. The film’s pre-look will also be unveiled on the same day.


Vamsee who penned powerful script is going present Ravi Teja in a completely mass look in the film to be made in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.


R Madhie ISC will take care of cinematography, while GV Prakash Kumar scores music. Avinash Kolla is the production designer, while Srikanth Vissa is the dialogue writer and Mayank Singhaniya is the co-producer.


Cast: Ravi Teja, Nupur Sanon


Technical Crew:

Writer, Director: Vamsee

Producer: Abhishek Agarwal

Banner: Abhishek Agarwal Arts

Presenter: Tej Narayan Agarwal

Co-Producer: Mayank Singhaniya

Dialogues: Srikanth Vissa

Music Director: GV Prakash Kumar

DOP: R Madhie

Production Designer: Avinash Kolla

PRO: Vamsi-Shekar

BBC NorthStar Entertainment's ZEE5 web series is titled 'Gaalivaana' Trailer Out Now

 BBC NorthStar Entertainment's ZEE5 web series is titled 'Gaalivaana'



Akkineni Nagarjuna unveils trailer for the emotional crime thriller


Hyderabad, 31st March 2022: ZEE5 has been in a top-notch form. After presenting the comedy-drama 'Oka Chinna Family Story' from Pink Elephant Pictures and 'Loser 2' from Annapurna Studios stable, the streaming giant is now bringing out 'Gaalivaana', which is jointly produced by BBC Studios and NorthStar Entertainment. The drama is an adaptation of a European drama written to suit the sensibilities of the Telugu audience. The ZEE5 original will stream from April 14.


Today, the web series' trailer was released at the hands of 'King' Akkineni Nagarjuna at 5 pm. At 1 min 39 seconds, the trailer is nerve-wracking and suspenseful. Family emotions and gripping crime thriller elements are what the series is about. That's what we get to sense from the trailer. Besides mouthing sentimental lines, we see Radhika Sarathkumar's character vengefully saying that the killer of her daughter and son-in-law. "Even God won't be able to save that bas*ard from me," she screams. Revenge is a key element of the series' story. Quality-wise and visually, the series is going to be strong. While crime thrillers are many, 'Gaalivaana' has motherly sentiment at its core. Emotional scenes are organic. Sai Kumar's character is not only rich in emotions but also is the anchor of familial bonds.


Cast Details:


1 Kommaraju as Sai Kumar

2 Saraswathi as Radhika Sharthkumar

3 Shravani as Chandini Chowdary

4 Tulasi as Ashritha Vemughanti

5 Mathand as Chaitanya Krishna

6 Jyothi as Sharanya Pradeep

7 Nandini as Nandini Rai

8 Anji as R. Ramesh

9 Shakunthala as Srilaxmi

10 Geetha as Nikhitha

11 Ajay Varma as Charith

12 Suribabu as Jayachandra

13 Srikanth as Md. Armaan

14 Satyanarayana as Sathish Saripalli

15 Patamata Srinu as Nanaji

16 David Raju as Naveen

17 Dev as Surya Srinivas


Crew Details:


Director: Sharan Kopishetty

Director of Photography Sujatha Siddhartha

Producer: Sharath Marrar

Executive Producer: Neelima Marar

Project Head: Keerthi Manne

Creative Head: A. Sai Santosh

Costume Designer: Rekha Boggorappu

Art Director: Pranay Naini

Editor: Santhosh Naidu

Music: Sricharan Pakala

PRO: Naidu Surendra Kumar - Phani Kandukuri (Beyond Media)

Production Controller: Vaisakh Nair

Production Manager: Ravi Mulpuri

Production Manager Assit.: Ram Prasad

Co-Director: K. Prabhakar

Chief AD: Hanumanthu Srinivasa Rao  

Ramsilaka Lyrical Video Out Now from Ashoka vanam Lo Arjuna kalyanam




 '‘ఉరికే నా సిల‌కా నీ స‌క్క‌నైన పాట మెళిక‌

గ‌ట్టు దాటి పుట్ట దాటి.. ఏడేడు ఏర్లు దాటి

కొండా దాటి కోన దాటి .. కోసు కోసు దార్లు దాటి

సీమా సింత నీడ‌కొచ్చానె రంగు రంగు రామ్ చిల‌క సింగ‌రాల సోకులు చూశానె’’


అని అల్లం అర్జున్ కుమార్ తనకు కాబోయే భార్య గురించి పాట పాడుకుంటున్నారు. అసలు ఇంతకీ అల్లం అర్జున్ కుమార్ ఎవ‌రు?  దాని బాధేంటి? అనే విష‌యం తెలియాలంటే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.


‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్‌. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న‌ విడుద‌ల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి ‘రామ్ చిలక..’ అనే పాటను రిలీజ్ చేశారు.


జె క్రిష్ సంగీతం అందించిన ఈ పాటను విజయ్ కుమార్ భల్లా, రవి కిరణ్ కోలా రాశారు. రవి కిరణ్ కోలా పాటను పాడారు. జానపదం స్టైల్లో పాట ఉంది. ఇందులో విశ్వక్ సేన్ లుక్ డిఫరెంట్‌గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన పాట‌ల‌కు, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.


ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ చిత్రానికి.. సూప‌ర్ హిట్ మూవీ  ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. విద్యా సాగ‌ర్ చింతా చిత్రాన్ని తెర‌కెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.  ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి  విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


న‌టీన‌టులు:


విష్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:


ద‌ర్శ‌క‌త్వం:  విద్యాసాగ‌ర్ చింతా

స‌మ‌ర్ప‌ణ‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

కథ, మాటలు, స్క్రీన్ ప్లే : ర‌వి కిర‌ణ్ కోలా

బ్యాన‌ర్‌: ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌

నిర్మాత‌లు:  బాపినీడు, సుధీర్ ఈద‌ర‌

సినిమాటోగ్ర‌ఫీ:  ప‌వి కె.ప‌వ‌న్‌

సంగీతం:  జై క్రిష్‌

ర‌చ‌న‌:  ర‌వికిర‌ణ్ కోలా

ఎడిట‌ర్‌:  విప్ల‌వ్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి

పి.ఆర్‌.ఓ :  వంశీ కాకా


aha contest Pawan Kalyan’s bike from Bheemla Nayak

 aha is running an exciting contest to subscribe and win Pavan Kalyan’s bike from Bheemla Nayak



Bheemla Nayak is currently streaming on aha and the OTT platform has recently launched a contest to win the bike Pavan Kalyan has used in the film. Audience who subscribe to aha before April 15th, 2022 will get a chance to win the bike Pavan Kalyan has used in the film Bheemla Nayak. The music director of Bheemla Nayak; S Thaman in a recent video launched by aha announced that anyone  who subscribes to aha’s annual subscription from now onwards until April 15th 2022 will get a chance to win the Bheemla Nayak’s bike from the film.


Regarding these promotions, the Bullet bike used by Pavan Kalyan in the film is currently doing a multi city tour across Andhra and Telangana. It has been in Khammam and Rajamundry where where Pavan Kalyan fans welcomed it with a bike rallies. It later reached Kothagudam and Vijayanagaram too.


On the evening of Wednesday the bike reached Vizag where fans welcomed it with a huge bike rally in the city. Fans of Pavan Kalyan welcomed it wearing t-shirts with ‘Power Star’ written over them. They were riding their bikes around the aha’s cantor van which carried the the Bheemla Bike.


Bheemla Nayak is currently streaming now on aha, since the midnight of March 24. The Pavan Kalyan, Rana Daggupati and Nitya Menen starrer mass entertainer Bheemla Nayak is produced by Sitara Entertainment. With Bheemla Nayak, aha has announced 4K and Dolby 5.1 support for their connoisseur subscribers.


Bheemla Nayak is a fight between ego and self esteem. The film revolves around  Bheemla Nayak ie., Pavan Kalyan who plays a a sub inspector and Danial Shekar played by Rana Dagguptati, an ex Hawaldar. Dany is caught red-handed by the police and excise department for carrying liquor in a prohibited zone. While Danny tries to escape the charges using his money and influence, Bheemla Nayak (Pawan Kalyan) the efficient police officer who is well known for his strong morals and values, registers a case and arrests. This incident snowballs into a battle of egos between Danny and Bheemla, as a result the  never-ending rivalry between them.


aha is also home to some of the biggest Telugu releases and web originals, including Unstoppable with NBK, Telugu Indian Idol, DJ Tillu, Senapathi, Bhamakalapam, Most Eligible Bachelor, Love Story, 11th Hour, Sarkaar, Zombie Reddy, Chaavu Kaburu Challaga, Naandhi, 3 Roses, In the Name of God, Kala, aha Bhojanambu, One, Super Deluxe, Chathur Mukham, Tharagathi Gadhi Daati, The Baker and the Beauty, Maha Ganesha, Sarkaar, Parinayam, Orey Baammardhi, Cold Case, Alludu Gaaru, and Ichata Vahanamulu Nilupa Radu.


Pakka commercial on July 1st

 2022, జులై 1న విడుదల కానున్న అల్లు అరవింద్- మారుతి కాంబినేష‌న్‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - UV క్రియేష‌న్స్ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’.. 



ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈ మధ్యే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జిక్రు రాసిన టైటిల్ సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.


నటీనటులు:


గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు


టెక్నికల్ టీం: 


స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్

బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్

నిర్మాత‌ - బ‌న్నీ వాస్

ద‌ర్శ‌కుడు - మారుతి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్

స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్

లైన్ ప్రొడ్యూసర్ - బాబు

ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్

సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్

Ugadi Cine Puraskaralu on April 2nd

 ఉగాది సినీ పురస్కారాలు



     ఏప్రిల్ 2వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు తెలుగు సంవత్సరాది ఉగాది నాడు... ప్రసాద్ ల్యాబ్ లో.. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల నుంచి.. సీనియర్ కళాకారులను, కార్మికులను ఎంపిక చేసి వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తామని నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జె.వి.మోహన్ గౌడ్ తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, కూనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూనిరెడ్డి శ్రీనివాస్ సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

     ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... 90 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అన్ని విభాగాలను గుర్తించి సత్కరించి ఉగాది పురస్కారం అందజేయనుండడం ఇదే ప్రథమం అని చెప్పారు. వివిధ విభాగాలకు చెందిన వారికి దాసరి నారాయణరావు, డి.రామా నాయుడు, దొరస్వామిరాజు  స్మారక అవార్డ్ లను అంద జేయనున్నామన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ విభాగాలతోపాటు ఉత్తమ సేవా విభాగం, ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వనున్నట్టు వారు తెలిపారు!!

Darja Teaser Out Now Launched by Producer SureshBabu

 ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఆవిష్కరించిన ‘దర్జా’ మూవీ టీజర్




‘ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.కాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు   విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్ర టీజర్ ను విడుదల చేయడం జరిగింది.   టీజర్  బాగుంది. ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని అనిపిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కామినేని  శ్రీనివాస్, ఏపీ ఆక్వా అసోసియేషన్ చైర్మెన్ భూమాల శ్రీరామ్ మూర్తి,  చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి ,కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటు  షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), హీరోయిన్, శిరీష.. సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్, సినిమాటోగ్రాఫర్ దర్శన్, స్ర్కిఫ్ట్‌ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, , రైటర్ భవాని ప్రసాద్, ఆర్టిస్ట్ సమీర్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా

కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ..  మా టీజర్ నురిలీజ్ చేసిన సురేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి థాంక్స్ తెలుపుకుంటున్నాను. అన్నారు


సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి...

కెమెరా: దర్శన్,

సంగీతం: రాప్ రాక్ షకీల్,

ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ,

కథ: నజీర్,

మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్,

ప్రొడక్షన్ డిజైనర్ : బందర్ బాబీ,

స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,

పీఆర్ఓ: బి. వీరబాబు,

కో & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి,

నిర్మాత: శివశంకర్ పైడిపాటి,

స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.

Vishwak Sen Announced New Films on the Occasion of his Birthday

 పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నూత‌న చిత్రాలు ప్ర‌క‌టించిన  విశ్వ‌క్ సేన్



తొలి చిత్రం `ఈ న‌గ‌రానికి ఏమైంది`లోనే త‌న మార్క్‌ను క్రియేట్ చేసిన న‌టుడు విశ్వ‌క్ సేన్.  ఆ త‌ర్వాత భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ఫ‌ల‌క్‌నామా దాస్ నుంచి దాస్ కా ధ‌మ్కీ వ‌ర‌కు భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. యంగ్ ఏజ్‌లోనే నిర్మాత‌గానూ, ద‌ర్శ‌కుడిగానూ మ‌ల్టీటాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వ‌క్ సేన్ పుట్టిన‌రోజు వేడుక మంగ‌ళవారం రాత్రి అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ఈ వేడుక‌కు విశ్వ‌క్ సేన్ తో చిత్రాలు తీస్తున్న ర‌చ‌యిత‌లు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్‌సేన్‌పై విడుద‌ల చేసిన స్పెష‌ల్ పాట ఆక‌ట్టుకుంది. ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్‌సేన్ రెండు కొత్త‌ చిత్రాల‌ను వెల్ల‌డించారు. ఇప్ప‌టికే `ముఖ చిత్రం`లో ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. యువి.క్రియేష‌న్స్‌లో `గామి` అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఓరి దేవుడా, దాస్ కా ధ‌మ్కీ, లేడీస్ నైట్ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఇవి కాకుండా ఫ‌ల‌క్ నామా దాస్ 2`, `స్టూడెంట్ జిందాబాద్‌` అనే రెండు నూత‌న చిత్రాల‌ను విశ్వ‌క్‌ ప్ర‌క‌టించారు.


విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ, గ‌త ఏడాదినుంచి నేను పుట్టిన‌రోజు చేసుకుంటున్నా. `ఈ న‌గ‌రానికి ఏమైంది`లో న‌టించిన‌ప్పుడు 22 ఏళ్ళే. ఇప్పుడు 27 ఏళ్ళు వ‌చ్చేశాయి. అప్పుడే కాలం ఇంత త్వ‌ర‌గా మారిపోయిందా అనిపిస్తుంది. నా డైలాగ్ ఒక‌టుంది. `ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు ఇక నుంచి మ‌రో ఎత్తు` అలా నా చిత్రాలుంటాయి. అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం చిత్రం అరిటాకుమీద భోజ‌నంలా వుంటుంది. అందులో నాన్‌వేజ్ కూడా వుంటుంది. టీజ‌ర్‌లో చూపించిన‌ట్లు బాటిల్ ప‌గ‌ల‌గానే క‌థ మ‌రో మ‌లుపు తిరుగుతుంది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ సినిమా. సూర్యాపేట కుర్రాడు గోదావ‌రి వెళితే అక్క‌డ జ‌రిగే క‌థ ఈ సినిమా. ద‌ర్శ‌కుడు విద్యాసాగ‌ర్ అద్భుతంగా తీశాడు. `ఓరి దేవుడా` సినిమా కూడా రెడీగా వుంది. అది కూడా చూస్తే మీరంతా ల‌వ్‌లో ప‌డ‌తారు. అందులో దేవుడి పాత్ర‌ను స్టార్ హీరో చేయ‌బోతున్నాడు. అది ఒక ఫీస్ట్‌లా వుంటుంది. ఇక దాస్ కా ధమ్కీ సినిమా చాలా గొప్ప‌గా వుండ‌బోతోంది. ఆ త‌ర్వాత స్టూటెండ్ లీడ‌ర్‌గా `స్టూడెంట్ జిందాబాద్‌` అనే సినిమా చేయ‌బోతున్నా. ఇక వ‌చ్చే ఏడాది మార్చి 29న ~ఫ‌ల‌క్ నామా దాస్ 2` చిత్రాన్ని ప్ర‌సాద్‌ల్యాబ్‌లోనే ప్రారంభం చేసుకుందాం. పాన్ ఇండియా కాదు కానీ హైద‌రాబాద్‌కూ ముంబైకు లింక్ వున్న క‌థ‌. నాన్న‌గారు మంచి నిర్మాత. చిన్న‌ప్ప‌టినుంచి నాకు మంచి స‌పోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా ద‌గ్గ‌ర అన్ని ర‌కాల వ‌న‌రులున్నాయి. అందుకే బాగా తీయ‌గ‌ల‌ను. ప్ర‌స‌న్న ధ‌మ్కీ క‌థ‌ను బాగా రాశాడు. ఆ క‌థ చెప్పిన‌ప్పుడు నాకు మైండ్ పోయిన‌ట్లు అనిపించిది. అందుకే `మైండ్ పోతుంది లోప‌ల‌` అనే టైటిల్ పెడ‌దామ‌నుకున్నా. కానీ ఫైన‌ల్‌గా దాస్ కా ధమ్కీ అనే  చ‌క్క‌టి టైటిల్ పెట్టాం అని అన్నారు.


నిర్మాత క‌రాటే రాజు మాట్లాడుతూ, మా అబ్బాయి విశ్వ‌క్ సేన్‌ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన అతిథుల‌కు, అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. మా అబ్బాయినుంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. మీడియాకు ప్ర‌త్యేక కృత‌జ్థ‌త‌లు తెలియ‌జేస్తున్నా. మా అబ్బాయికి ఎప్పుడూ మీడియా, అభిమానుల స‌పోర్ట్ వుంటుంది. అంద‌రికీ మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌ని అన్నారు.


ల‌క్కీ మీడియా అధినేత నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, విశ్వ‌క్‌సేన్ చాలా మందికి స్పూర్తి. ఐదేళ్ల‌నుంచి విశ్వ‌క్‌ను ప‌రిశీలిస్తున్నా. సినిమా అనే త‌ప‌న క‌నిపించింది. అది క్ర‌మంగా పెరుగుతుంది. బాధ్య‌త కూడా పెరిగింది. క‌ష్ట‌ప‌డే త‌త్త్వంతోనే నువ్వు పైకి ఎదిగావు.  నీతో`పాగ‌ల్‌` సినిమాతో జ‌ర్నీ చేయ‌డం మొద‌ల‌యింది. నాకు హిట్ సినిమా వ‌చ్చింది. విశ్వ‌క్ అభిమానులు గ‌ర్వంగా వుండేలా సినిమాలు వుంటాయ‌ని తెలిపారు.


ధ‌మ్కీ చిత్ర క‌థా రచ‌యిత  ప్ర‌స‌న్న మాట్లాడుతూ, దాస్ కా ద‌మ్కీ నాకు స్పెష‌ల్‌.. హీరోగా విశ్వ‌క్‌కు ఓ క‌థ చెప్పాను. అది విన్నాక నిర్మాత‌గా చేస్తాన‌న్నాడు. చిన్న వ‌య‌స్సులో అన్ని ప‌నులు చేస్తున్నాడంటే ఆశ్చ‌ర్యం క‌లిగింది. నేను మంచి క‌థ చెప్పాన‌నే న‌మ్మ‌కం కూడా ఏర్ప‌డింది. ఈ క‌థ చెప్పిన రాత్రి నాకు ఫోన్ చేసి `మైండ్ పోతోంది లోప‌ల‌` అని మెసేజ్ పెట్టారు. ర‌చ‌యిత‌గా ఆరోజే నేను హిట్ అనే న‌మ్మ‌కం క‌లిగింది. ఈ సినిమా చూస్తే థియేట‌ర్‌లో అంతా న‌వ్వుతూ వుంటార‌ని తెలిపారు.


`ఓరి దేవుడా` చిత్ర‌ ద‌ర్శ‌కుడు అశ్వ‌థ్‌ మాట్లాడుతూ, అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం చిత్రం మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. ఇక మాస్‌ను ఆక‌ట్టుకునే చిత్రంగా ధ‌మ్కీ వుండ‌బోతోంద‌ని అన్నారు.


సంగీత ద‌ర్శ‌కుడు జీవీ మాట్లాడుతూ, విశ్వ‌క్ క‌థ‌ల ఎంపిక భిన్న‌మైన‌విగా తీసుకుంటారు. సినిమా ప‌ట్ల త‌ప‌న ఆయ‌న‌లో వుంది. సుభాష్ నారాయ‌ణ్ గీత‌ర‌చ‌యిత స‌హ‌కారంతో.. `ఆ గ‌య‌రే..మాస్ కా బాస్‌.. బ‌న్ గ‌యారే దిల్ కా బాస్‌..` అనే పాటకు మంచి ట్యూన్ ఇవ్వ‌గ‌లిగాను. విశ్వ‌క్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని అన్నారు.


Macherla Niyojakavargam First Attack (Teaser) Launched

 Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam First Attack (Teaser) Launched, Movie Releasing Grandly Worldwide On July 8th



Young and versatile hero Nithiin is playing the role of an IAS Officer named Siddharth Reddy who takes his first charge as collector of Guntur district in his next release Macherla Niyojakavargam. MS Raja Shekhar Reddy is directing this mass and action entertainer, while Sudhakar Reddy and Nikitha Reddy are bankrolling it on Sreshth Movies in association with Aditya Movies & Entertainments. Rajkumar Akella presents the movie.


It's Nithiin’s birthday today and on the occasion, the makers have launched First Attack (Teaser) of the movie. The teaser doesn’t show the plotline or other content of the movie, but it shows an intense action block on Nithiin and some goons. Actually, the goons who look like beasts with tiger paint on their bodies and face enter the carnival to eradicate Nithiin. But the macho man counterattacks them, like lion chasing deer. The action sequence choreographed by Venkat master is wonderfully designed, as it shows the mass and action side of Nithiin.


Nithiin is simply superb in the role and he looked massy with the getup of full moustache and trimmed beard. Going by the teaser, the film will have some high intense action sequences. Prasad Murella’s camera work is top notch, while Mahati Swara Sagar brings intense to the video with his terrific background score.


As we can see in the teaser, Macherla Niyojakavargam will arrive grandly worldwide in theatres on July 8th.


Krithi Shetty and Catherine Tresa are the heroines opposite Nithiin in the movie billed to be a pucca mass and commercial entertainer with political elements.


Mamidala Thirupathi has provided dialogues and Sahi Suresh is the art director. Kotagiri Venkateswara Rao is the editor.


Cast: Nithiin, Catherine Tresa, Krithi Shetty and others


Technical Crew:

Written & Directed by: MS Raja Shekhar Reddy

Producers: Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies, Aditya Movies & Entertainments

Presents Rajkumar Akella

Music: Mahati Swara Sagar

DOP: Prasad Murella

Editor: Kotagiri Venkateswara Rao

Line Producer: G Hari

Dialogues: Mamidala Thirupathi

Art Director: Sahi Suresh

Fights: Venkat

PRO: Vamsi-Shekar

King Nagarjuna The Ghost’s Lengthy Schedule In Dubai Completed

 King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost’s Lengthy Schedule In Dubai Completed



King Akkineni Nagarjuna is presently starring in a high-octane action entertainer The Ghost under the direction of creative director Praveen Sattaru. Sonal Chauhan is playing the leading lady opposite Nagarjuna in the film.


Meanwhile, the team has completed a crucial shooting schedule in Dubai. High intense stunt sequences, some important scenes and a romantic song was filmed in this schedule. Being made on lavish and grand scale, in terms of its visuals, locations, top-notch technicalities, and other grandeur, The Ghost is going to offer a holistic experience of movie watching to movie buffs. Particularly, the action sequence canned in the desert will be the major highlight among all the stunt sequences of the movie.


As we can see in these posters, both Nagarjuna and Sonal Chauhan will be seen as Interpol officers in the movie. The Ghost also features Gul Panag and Anikha Surendran in important roles.


Narayan Das K Narang, Puskur Ram Mohan Rao, and Sharrath Marar are producing the film on Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners.


Coming to other technical crew, Mukesh G cranks the camera, while Brahma Kadali is the art director and Robin Subbu and Nabha Master are the stunt directors.


Cast: Nagarjuna, Sonal Chauhan, Gul Panag, Anikha Surendran


Technical Crew:

Director: Praveen Sattaru

Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Banners: Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment

Cinematography: Mukesh G.

Action: Dinesh Subbarayan, Kaecha

Art Director: Brahma Kadali

PRO: Vamsi-Shekar, BA Raju


Vaisshnav Tej Ranga Ranga Vaibhavamga Releasing on July 1st

 వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘రంగ రంగ వైభవంగా’ .. జూలై 1న గ్రాండ్ రిలీజ్‌




‘ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో గిరీశాయ ద‌ర్శ‌కుడిగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జూలై 1 ఈ చిత్రాన్ని భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. 



తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్‌లో ల‌వ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ‘రంగ రంగ వైభ‌వంగా’ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుద‌లైన ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు మేజ‌ర్ హైలైట్‌గా నిలుస్తుంది. శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

aha announces Stand Up Rahul premieres 8th April 2022

 aha announces World Digital Premiere of Stand Up Rahul, a coming of age Telugu rom-com; premieres 8th April 2022



Today aha announced the World Digital Premiere of Stand Up Rahul, a 2022 Telugu-language coming of age romantic comedy film directed by debutant Santo. The film is produced jointly by Nandkumar Abbineni and Bharath Maguluri. The film stars Raj Tarun and Varsha Bollamma. The music is composed by Sweekar Agasthi. The film will be premiering on aha from April 8th 2022. 


The film is a feel-good romantic comedy about a reluctant start-up employee who doesn't stand up for anything in life, finally finding true love and learning to stand up for his parents, for his love and for his passion for stand-up comedy. The film also stars Indraja, Vennala Kishore, Murali Sharma in supporting roles. 


The streaming platform's recent releases were Bheemla Nayak, DJTillu, Telugu Indian Idol, Sebastian, Qubool Hai?, Arjuna Phalguna, Hey Jude, The American Dream, Lakshya, Senapathi, 3 Roses, Manchi Rojuloachaie, Romantic, Most Eligible Bachelor, Bhamakalapam, Anubhavinchu Raja, Sarkaar, Chef Mantra, Alludu Garu, and Christmas Thatha, to name a few. aha's talk show, Unstoppable, hosted by Nandamuri Balakrishna, has been rated the no. 1 talk show on IMDB.


Ramcharan -Upasana seem to be roaring in their respective careers

Ramcharan & Upasana seem to be roaring in their respective careers.



Upasana Kamineni Konidela, Vice Chairperson Apollo Hospitals Foundation receives the reputed NATHealth CSR Award 2022 for their Total Health initiative which focuses on deeper engagement with rural communities for better health outcomes.


This recognition is inspired by Upasana’s grandfather (Founder Chairman Apollo Hospitals Enterprise Ltd.) – Dr Prathap C Reddy’s vision of womb to tomb care and rural development through a health lens.

Aadhi Sai Kumar's Black Movie Releasing on 22nd April

 ఆది సాయి కుమార్ నటించిన బ్లాక్ చిత్రం ఏప్రిల్ 22న విడుదల



మహంకాళి మూవీస్ పతాకంపై అది సాయి కుమార్ హీరో గా జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం "బ్లాక్". ఈ చిత్రం లో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. తన కెరీర్ లో బ్లాక్ చిత్రం ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. ఇటీవల విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. 


ఈ సందర్భంగా దర్శకుడు జి బి కృష్ణ మాట్లాడుతూ "బ్లాక్ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఆది గారి నటన, కథ, కథనం ఈ చిత్రానికి హై లైట్ గా నిలుస్తాయి. మా నిర్మాత మహంకాళి దివాకర్ గారు రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో ట్రైలర్ ను విడుదల చేసి ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. 


నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ "మా బ్లాక్ చిత్రం ఏప్రిల్ 22న విడుదల అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. మంచి కథ, కథనం తో చిత్రాన్ని నిర్మించాము. మా దర్శకుడు జి బి కృష్ణ మంచి చిత్రాన్ని అందించాడు. సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఉంది" అని తెలిపారు. 



ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో  నటిస్తున్నారు.


ఈ చిత్రానికి


 సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల

సంగీతం : సురేష్ బొబ్బిలి

ఎడిటింగ్ : అమర్ రెడ్డి

ఫైట్స్ : రామకృష్ణ

ఆర్ట్ : కె వి రమణ

పి ఆర్ ఓ : పాల్ పవన్ 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్

నిర్మాత : మహంకాళి దివాకర్

రచన - దర్శకత్వం : జి బి  కృష్ణ

Sudheer Babu Bhavya Creations Movie in Regular Shooting

 రెగ్యులర్ షూటింగ్‌లో సుధీర్ బాబు - భవ్య క్రియేషన్స్ యాక్షన్ థ్రిల్లర్



సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. మహేష్‌ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ రోజు హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.


ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "సుధీర్ బాబు హీరోగా 'శమంతకమణి' తర్వాత మా సంస్థలో చేస్తున్న చిత్రమిది. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 23 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇందులో సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్ చేస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్, గోపరాజు రమణ, 'జెమినీ' సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులు నటిస్తున్నారు. తొలి షెడ్యూల్‌లో హీరో, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేశాం" అని చెప్పారు. 


సుధీర్ బాబు హీరోగా... ఇతర పాత్రల్లో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్, గోపరాజు రమణ, 'జెమినీ' సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరుల్ విన్సెంట్‌, కళ: వివేక్, కూర్పు: ప్రవీణ్ పూడి, దర్శకత్వం: మహేష్, నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్, నిర్మాత: వి. ఆనంద ప్రసాద్.

Love Reddy Title Poster Launched by Nandamuri Balakrishna

లవ్ రెడ్డి టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన నందమూరి బాలకృష్ణ !!!



ఎమ్జీఆర్ ఫిలిమ్స్, గీతన్స్ ప్రొడక్షన్స్, శహరి స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. హేమలత రెడ్డి, 

మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... యంగ్ టీమ్ అందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషన్ తెలిపారు. 



కర్ణాటక లోని బాగేపల్లి ప్రాంతంలో మరియు బెంగళూరు లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. త్వరలో ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతున్నారు. 



హీరో: అంజన్ రామచంద్ర

హీరోయిన్: శ్రావణి రెడ్డి


కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్మరన్ రెడ్డి

నిర్మాతలు:హేమలత రెడ్డి, 

మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప

సంగీతం: ప్రిన్స్ హేన్రి 

ఎడిటింగ్: చోటా కె ప్రసాద్

సహా నిర్మాతలు: నవీన్ రెడ్డి, సుమలత రెడ్డి, సుస్మిత రెడ్డి, హరీష్.ఏ


Vishwak Sen’s Interesting Avatar In "Mukhachitram"

 Vishwak Sen’s Interesting Avatar In "Mukhachitram"



Touted to be an intense action drama, Mukhachitram, featuring Vikas Vasistha, Priya Vadlamani, and Chaitanya Rao garnered attention with its good teaser. 

The teaser implied that the film is an actioner with a love drama backdrop and it had the right intensity. 


The makers have made a big announcement now by stating that young Telugu actor, Vishwak Sen is playing an important role in the film.  The related announcement poster shows Vishwak in a lawyer avatar and he looks dapper in the same. 


Vishwak apparently plays a pivotal role in the film.  Vishwak’s addition adds to the hype on the film. His dynamic presence might add to the excitement on the film. It will also boost the box office prospects of the film. 


It has to be seen how Vishwak’s character has been blended into the film, which is directed by Gangadhar. The story is provided by Sandeep, who previously rolled out Color Photo.

Icon Star Allu Arjun to Grace Ghani Pre Release Event

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఎప్రిల్ 2న వైజాగ్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గని' ప్రీ రిలీజ్ వేడుక..



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. టీజర్, ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో.. అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఎప్రిల్ 8న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లో ఎప్రిల్ 2న జరగనుంది. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.


నటీనటులు:

వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: కిరణ్ కొర్రపాటి

నిర్మాతలు: సిద్దు ముద్ద, అల్లు బాబీ

బ్యానర్స్: అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్

సమర్పకుడు: అల్లు అరవింద్

సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

సంగీతం: థమన్

పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను