Ugadi Cine Puraskaralu on April 2nd

 ఉగాది సినీ పురస్కారాలు



     ఏప్రిల్ 2వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు తెలుగు సంవత్సరాది ఉగాది నాడు... ప్రసాద్ ల్యాబ్ లో.. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల నుంచి.. సీనియర్ కళాకారులను, కార్మికులను ఎంపిక చేసి వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తామని నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జె.వి.మోహన్ గౌడ్ తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, కూనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూనిరెడ్డి శ్రీనివాస్ సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

     ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... 90 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అన్ని విభాగాలను గుర్తించి సత్కరించి ఉగాది పురస్కారం అందజేయనుండడం ఇదే ప్రథమం అని చెప్పారు. వివిధ విభాగాలకు చెందిన వారికి దాసరి నారాయణరావు, డి.రామా నాయుడు, దొరస్వామిరాజు  స్మారక అవార్డ్ లను అంద జేయనున్నామన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ విభాగాలతోపాటు ఉత్తమ సేవా విభాగం, ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వనున్నట్టు వారు తెలిపారు!!

Post a Comment

Previous Post Next Post