Home » » Icon Star Allu Arjun to Grace Ghani Pre Release Event

Icon Star Allu Arjun to Grace Ghani Pre Release Event

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఎప్రిల్ 2న వైజాగ్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గని' ప్రీ రిలీజ్ వేడుక..



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. టీజర్, ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో.. అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఎప్రిల్ 8న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లో ఎప్రిల్ 2న జరగనుంది. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.


నటీనటులు:

వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: కిరణ్ కొర్రపాటి

నిర్మాతలు: సిద్దు ముద్ద, అల్లు బాబీ

బ్యానర్స్: అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్

సమర్పకుడు: అల్లు అరవింద్

సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

సంగీతం: థమన్

పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను


Share this article :