Latest Post

Mp Bala shouri Son Marriage Held Grandly In Udaipur

 ఉదయపూర్ లో కన్నుల పండుగగా జరిగిన బందర్ ఎం పి బాలశౌరి కుమారుని వివాహం



మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు ఝామున ఘనంగా జరిగింది.. ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు రోజులు పాటు ఘనంగా జరిగిన వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్ తో పాటు వివాహ వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి.


ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వివాహానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో MD చలమల శెట్టి గోపి, AMR గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని నూతన  వధూవరులను ఆశీర్వదించారు.

Aha's Senapathi Premieres on December 31st

 డిసెంబ‌ర్ 31న ‘ఆహా’లో ప్ర‌సారం అవుతున్న ‘సేనాప‌తి’లో స‌రికొత్త రాజేంద్ర ప్ర‌సాద్‌ను చూస్తారు .. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో న‌ట‌కిరిటీ రాజేంప్ర‌సాద్‌




100 శాతం తెలుగు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్ ఆహా త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్‌ ఒరిజినల్‌ సినిమా ‘సేనాపతి’తో అలరించనుంది. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్‌ ఓటీటీలో డెబ్యూ చేస్తున్న సినిమా ఇది. క్రైమ్‌ డ్రామా జోనర్‌లో సాగుతుంది. 'ప్రేమ ఇష్క్ కాదల్‌' ఫేమ్‌ పవన్‌ సాదినేని దర్శకత్వం వహించారు. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందింది.  డిసెంబర్ 31న ఆహాలో సేనాపతి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో... 


అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘మా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండ‌స్ట్రీలో ఉన్నా కూడా, నిర్మాణ సంస్థ‌లు ఒక‌ట్రెండే ఉన్నాయి. ఇప్పుడు సుష్మిత కొణిదెల‌, విష్ణు వంటి వాళ్లు క‌లిసి గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ అనే ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేయ‌డం చాలా ఆనందాన్ని ఇస్తుంది. కొత్త సినిమాల‌ను చేయ‌డానికి వీళ్లు ముందుకు రావ‌డం గొప్ప విష‌యం. వారి జ‌ర్నీ గొప్ప‌గా ఉండాల‌ని అంటున్నాను. నాకూ, రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి మ‌ధ్య 45 ఏళ్ల అనుబంధం ఉంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మా ఇద్ద‌రికీ ప‌నిచేయాల‌నే త‌ప్పన చావ‌లేదు. ఇప్ప‌టికీ ఎందుకు ప‌ని చేస్తుంటారు? అని న‌న్ను చాలా మంది అడుగుతుంటారు. నేను ప‌ని చేయ‌క‌పోతే మూల‌ప‌డిపోతానేమోన‌ని నా భ‌యం. అందుకే నిద్ర లేవ‌గానే ఛాలెంజ్ ఉండాల‌ని కోరుకుంటాను. డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని తొలి సినిమా చూసి త‌న‌ను క‌లిసి మాట్లాడాను. అప్పుడు త‌ను సినిమా చేసిన బ‌డ్జెట్ గురించి తెలుసుకుని షాక‌య్యాను. త‌ను రొమాంటిక్ కామెడీ సినిమాలు బాగా చేస్తాడ‌నే పేరుంది. కానీ సేనాప‌తి వంటి డిఫ‌రెంట్ మూవీని కూడా చేయ‌గ‌ల‌డ‌ని నా న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టినందుకు త‌న‌ను నేను అభినందిస్తున్నాను. త‌ను గీతాఆర్ట్స్‌లో సినిమా కూడా చేయ‌బోతున్నాడు. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ వెరీ గుడ్‌. డిసెంబ‌ర్ 31న సేనాప‌తి ఆహాలో విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు. 


న‌ట‌కిరిటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘సినీ ఇండ‌స్ట్రీలో అల్లు రామ‌లింగ‌య్య‌గారితో మంచి అనుబంధం ఉంది. అల్లు రామ‌లింగ‌య్య‌గారు అర‌వింద్ కంటే న‌న్నే బాగా ఇష్ట‌ప‌డేవారు. ఇది ప‌చ్చి నిజం. ఇక నా 45 ఏళ్ల సినీ కెరీర్‌లో మంచి మిత్రుడు అంటే మెగాస్టార్ చిరంజీవిగారే. న‌వ ర‌సాల్లో యాక్ష‌న్‌, కామెడీ అనే ర‌సాల కార‌ణంగా నేను, చిరంజీవి నిలిచిపోయాం. నాకు, అర‌వింద్‌గారి వంటి వారికి ప‌ని లేక‌పోతే మేం బతికిఉన్న‌ట్లే కాదు. ప‌ని ఉంటేనే మేం బ‌తికి ఉన్న‌ట్లుగా భావిస్తాం. కెరీర్ ప్రారంభంలో స‌పోర్టింగ్ రోల్స్ చేసి త‌ర్వాత హీరో అయ్యాను. మ‌ళ్లీ సూప‌ర్ స‌పోర్టింగ్ రోల్స్ చేశాను. 45 ఏళ్ల ప్ర‌యాణం త‌ర్వాత కూడా నాకు ఇంకా ప‌ని దొరుకుతుందంటే కార‌ణం.. నేటి ద‌ర్శ‌కులు, టెక్నిషియ‌న్లే. ఇక రామేశ్వ‌ర‌రావు వంటి వ్య‌క్తి ఆహా వంటి ఓ తెలుగు యాప్‌ను క్రియేట్ చేయాలంటే అందుకు వ‌న్ అండ్ ఓన్లీ అల్లు అర‌వింద్‌గారి స‌పోర్ట్ ఎంతో ముఖ్యం. మ‌రెవ‌రూ ఆయ‌న‌లా చేయ‌లేరు. రాజేంద్ర ప్ర‌సాద్ ఇలా కూడా ఉంటాడా? అని సేనాప‌తి సినిమా చూస్తే అనిపిస్తుంది. నాకంటే యంగ‌ర్ జ‌న‌రేష‌న్ అయిన టీమ్‌తో ప‌నిచేశాను. వాళ్లు ఇన్‌స్పిరేష‌న్ ఇస్తూ వ‌ర్క్ చేయించుకున్నారు. సేనాప‌తితో స‌రికొత్త‌గా ఆహాలో అల‌రించ‌బోతున్నాం. హాయిగా ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయాల‌ని కోరుతున్నాను’’ అన్నారు. 


డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారితో నాకు మంచి అనుంధం ఉంది. ఇండ‌స్ట్రీలో నేను డైరెక్ట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న త‌న విలువైన స‌ల‌హాల‌ను ఇస్తూ వ‌స్తున్నారు. ఇక రాజేంద్ర ప్ర‌సాద్‌గారి గురించి ఏం చెప్పినా కొడుకు తండ్రి గురించి మాట్లాడిన‌ట్లే ఉంటుంది. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం గొప్ప అనుభూతిని ఇచ్చింది. సుశ్మిత‌గారు, విష్ణు ప్ర‌సాద్‌గారు క్రియేటివ్‌గా నాకెంతో స‌పోర్ట్‌ను అందిస్తూ వ‌చ్చారు. వారికి నా ధ‌న్య‌వాదాలు. శ్ర‌వ‌ణ్ అద్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. గౌత‌మ్ ఎడిటింగ్‌తో ప్రొడ‌క్ట్‌ని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాడు. అలాగే ఇత‌ర టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌’’ అన్నారు. 


నిర్మాత విష్ణు ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారికి థాంక్స్‌. ఆయన ఆహా ద్వారా మా సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళుతున్నారు. అలాగే రాజేంద‌ప్ర‌సాద్‌గారికి కూడా థాంక్స్‌. ఎందుకంటే ఆయ‌న లేక‌పోతే సేనాప‌తి లేరు. ఆహా టీమ్ ఎంతో స‌పోర్ట్ చేసింది. నా గోల్డ్ బాక్స్ టీమ్‌కు స్పెష‌ల్ థాంక్స్‌’’ అన్నారు. 


సుష్మిత కొణిదెల మాట్లాడుతూ ‘‘గోల్డ్ బాక్స్ నుంచి చేసిన ప్రతి ప్రాజెక్ట్‌కి కార‌ణం ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలే కార‌ణ‌మ‌ని భావిస్తాం. సేనాప‌తి చిత్రాన్ని కూడా మీ అంద‌రికీ ఆశీర్వాదంతో ముందుకు తీసుకొస్తున్నాం. చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఉంది. ఆహాతో మేం కొలాబ్రేట్ అవుతున్న తొలి ప్రాజెక్ట్ ఇది. రాజేంద‌ప్ర‌సాద్ అంకుల్‌తో ఈ సినిమా చేయ‌డం చాలా స్పెష‌ల్‌గా అనిపించింది. సెట్స్‌లో ఆయ‌న డేడికేష‌న్‌, డిసిప్లెయిన్ చూసి చాలా నేర్చుకున్నాం. ప‌వ‌న్ సాధినేని మంచి సినిమాతో ప్రేక్ష‌కుల‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాడ‌ని నాకు న‌మ్మ‌కం ఉంది. త‌క్కువ టైమ్‌లో ఇంత మంచి ప్రొడ‌క్ట్ చేయ‌డానికి స‌పోర్ట్ చేసిన గోల్డ్ బాక్స్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 



ఇంకా ఈ కార్యక్ర‌మంలో శ్రీవిష్ణు, త‌రుణ్ భాస్క‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Sithara Entertainments & Fortune Four Cinemas Production No 15 - Naveen Polishetty Birthday Poster

 


నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థలు సంయుక్త నిర్మాణం

నేడు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం విడుదల

*నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్'  సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా 'నవీన్ పోలిశెట్టి'. ఈరోజు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం విడుదల చేశారు చిత్ర బృందం. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటున్నారు. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన పేరు,మరిన్ని వివరాలను, విశేషాలను త్వరలోనే మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు. 

Nandamuri Balakrishna, Boyapati Sreenu, Dwaraka Creations Akhanda Successfully Completes 25 Days

 Nandamuri Balakrishna, Boyapati Sreenu, Dwaraka Creations Akhanda Successfully Completes 25 Days



The euphoria of Nandamuri Balakrishna and mass director Boyapati Sreenu’s mass action entertainer Akhanda is unstoppable. The mass madness is still continuing with the movie solid business at box office. Akhanda completes 25 days after release and it is registering massive collections in its fourth week as well.


Grand success celebrations of Akhanda were held last night with the core team including Balakrishna, Boyapati Sreenu and producer Miryala Ravinder Reddy of Dwaraka Creations attending it.


Balakrishna and boyapati Sreenu ,Miryala Ravinder Reddy presented the entire cast and technical crew of the movie with shields. The event was attended by distributors of all the regions in Telugu states.


Akhanda is already a biggest blockbuster of 2021 as it provided huge profits to producer as well as distributors in all the territories. It is indeed highest grossing movie for Balakrishna. The film has also crossed 1 million dollar mark in overseas. In fact, success of Akhanda gave a new hope to Tollywood.


Balakrishna came up with award-winning performance, wherein Boyapati Sreenu yet again proved that he is a master in dealing mass subjects. The actor, director duo completed hat-trick of blockbusters with the movie.


S Thaman’s background score is other biggest asset of the movie, other than C Ram Prasad’s cinematography and rich production values of Dwaraka Creations. Pragya Jaiswal played the leading lady in the movie.


Naveen Polishetty UV Creations First Look Launched

 నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసిన యు.వి.క్రియేషన్స్..



వరస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. ఈయన హీరోగా యువీ క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైందిప్పుడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రంలో డిసెంబర్ నెలాఖరు నుంచి జాయిన్ కానున్నారు నవీన్. ఈ క్రమంలోనే డిసెంబర్ 26న నవీన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసారు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ. ఇందులో మరో ప్రధాన పాత్రలో అనుష్క శెట్టి నటిస్తున్నారు. అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇప్పుడు నవీన్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఈయన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. త్వరలోనే షూటింగ్‌లోనూ అడుగు పెట్టనున్నారు నవీన్. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్‌కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. అలాగే నవీన్ పొలిశెట్టికి హీరోగా మూడో సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 

భాగమతి సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో తనదైన నటనతో అందరినీ మెప్పించారు అనుష్క శెట్టి. ఇప్పుడు మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేయబోతున్నారు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డిసెంబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌లో అడుగు పెట్టనున్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన అభిమానులకు ఇది నిజంగా బర్త్ డే సర్ ప్రైజ్. ఏ మాత్రం హడావిడి లేకుండా ఉన్నట్టుండి నవీన్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. భాగమతి సినిమా తెలుగుతో పాటు సౌతిండియన్ భాషల్లో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను కూడా మహేష్ బాబు అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు అనే విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు. మరోవైపు నవీన్ పొలిశెట్టికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ చెప్తున్నారు.

Thaman Re Recording For Prabhas RadheShyam

 ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాకు రీ రికార్డింగ్ అందించనున్న థమన్.. 



ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అభిమానులకు సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. రాధే శ్యామ్ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆర్ఆర్ అందించబోతున్నారు. ఈయనే సినిమాకు రీ రికార్డింగ్ అందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రేమను వెతుక్కుంటూ హీరో చేసే ప్రయాణమే ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆల్ ఇండియా రికార్డులను బద్ధలుకొడుతుంది. అత్యద్భుతమైన విజువల్స్ అందులో కనిపిస్తున్నాయి. ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. థమన్ ఆర్ఆర్ సినిమాకు అదనపు ఆకర్షణ. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.


నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, జగపతిబాబు, మురళి శర్మ, జయరాం, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు.. 


టెక్నికల్ టీమ్: 


కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్

నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్

సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌

డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్ 

సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి

ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్

పిఆర్ఓ : ఏలూరు శ్రీను

Dil Tho Paagal Hai Movie Launched

 'దిల్ తో పాగల్ హై' నూతన చిత్ర ప్రారంభోత్సవం



గీతా ఫిలిమ్స్ పతాకంపై ఎస్ ఎమ్ ఆర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సమర్పిస్తున్న చిత్రం 'దిల్ తో పాగల్ హై' ఎస్ సోమరాజు నిర్మాతగా, సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ నూతన  చిత్రం పూజా కార్యక్రమాలను ఆదివారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించుకుంది.. శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రవి తేజ్, మిస్ మహారాష్ట్ర గా గెలుపొందిన అనిత షిండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి క్లాప్ ప్రసన్నకుమార్ కొట్టగా,  కెమెరా స్విచ్ ఆన్ జైపాల్ రెడ్డి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  దర్శకుడు శ్రీరంగం సతీష్ మాట్లాడుతూ.. సబ్జెక్ట్ వినగానే సినిమా చేద్దామని నిర్మాత సోమరాజు గారు నిర్ణయించుకున్నారు.. ఎక్కడా కంప్రోమైజ్ కాకుండా సక్సెస్ చేద్దాం సపోర్ట్ ఇచ్చారు.. రొటీన్ కథకు బిన్నంగా ఈ స్టోరీ ఉంటుంది.. జనవరి 15 తరువాత షూటింగ్ ప్రారంభించి మే లో సినిమాను విడుదల చేయనున్నాం అని తెలిపారు. 


నిర్మాత సోమరాజు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి రీల్ ఇండస్ట్రీ కి పరిచయం చేసారు మా దర్శకుడు సురేష్ అందుకు ఆయనకు నా  ధన్యవాదాలు. 'దిల్ తో పాగల్ హై' స్టోరీ నచ్చి సినిమా చేయడం జరిగింది.  బడ్జెట్ ప్రాబ్లెమ్ కాదు సబ్జెక్ట్ ముఖ్యం అనుకొని సినిమా చేయడం జరుగు తోంది. ఈ సినిమా తరువాత ప్రతి 6 నెలలకు ఒకసారి సినిమాలను తీయాలని నిర్ణయుంచుకున్నాం అన్నారు. 


అతిథి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ పేర్లలోనే ఎస్ ఎస్ ఉంది.. సో అక్కడే వీరి సక్సెస్ కనపడుతోంది. దిల్ తో మొదలైన ఈ సినిమా దిల్ సినిమా, అలాగే టైటిల్ తో బ్లాక్ బస్టర్ అయిన సాంగ్ లా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని బావిస్తూ అందరికీ నా బెస్ట్ విషెస్ అన్నారు. 


హీరో రవి తేజ్ మాట్లాడుతూ.. మొదటి సారి కథ వింటున్నప్పుడే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. అప్పుడే చెప్పా.. దర్శకుడికి నిర్మాతకు నా వంద శాతం పాత్రకు నా వంతు  కృషి చేసి న్యాయం చేస్తా అని.. ప్రేమ ఖైదీ, ఉప్పెన  సినిమాల్లా అందరికీ నచ్చే సినిమా అవుతుందని చెప్పారు. 


హీరోయిన్ అనిత షిండే మాట్లాడుతూ... ఈ సినిమా తో 2022 సంవత్సరం నాదే అవుతుందని నమ్మబలికారు.. 


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  జైపాల్ రెడ్డి, రమణ రియల్టర్, మాస్టర్ చిక్కు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..


రవితేజ్, అనిత షిండే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి డీఒపి: కె.బి, ఆర్ట్: విజయ్ కృష్ణ, ఎడిటర్: శీను, డైలాగ్స్: కోడి ఎన్ పి, స్టోరీ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్: ఎస్ ఎస్ కె.( శ్రీరంగం సురేష్), 

నిర్మాత: సోమేశ్ రాజు

Vijay Shankar G Surya Teja, Relax movie makers Different Suspense Thriller ‘Focus’

 Vijay Shankar, G Surya Teja, Relax movie makers  Different Suspense Thriller ‘Focus’



Vijay Shankar is well noted for the Telugu audience with his different kinds of roles. Now He is coming up as the main lead with another different story. Skyra Creations presents Relax movie makers producing  the titled ‘Focus’. G Surya Teja is introduced as the director for this suspense screenplay-based film.


‘Focus’ is a Murder Mystery backdrop film with interesting twists and turns that will engage the audience. Famous actress Suhasini Maniratnam plays a crucial role and Ashu Reddy who is familiar to the Telugu people is playing the female lead role.


Vijay Shankar playing the Police Officer role and Suhasini Maniratnam appearing in the Judge role.


Bhanu Chander, Jeeva, Shayaji Shinde, Bharath Reddy, Surya Bhagavan in another important role.


Director Surya Teja Said: With the title of ‘Focus’, Film Industry, as well as Audience, kept the focus on our film. There have been a lot of movies in Murder Mystery backdrop but our film ‘Focus’ is different from all films. Our film will give a different experience to the audience who would like the Murder Mystery and Suspense Thriller films. More details will be revealed soon.


Cast: Vijay Shankar, Ashu Reddy, Suhasini Maniratnam, Bhanu Chander, Jeeva, Shayaji Shinde, Bharath Reddy, Surya Bhagavan Etc


Crew :

Director : G Surya Teja

Production: Relax Movie Makers

Presents: Skyra Creations

Editor: Satya G

DOP: J Prabhakar Reddy

Music : Vinod Yajamanya

PRO: Siddu

Kondaa is My Career Best Film-RGV

 నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు

                  - రామ్ గోపాల్ వర్మ 



కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. కంపెనీ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా వ‌రంగ‌ల్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరిగింది. దీనికి కొండా మురళి, సురేఖ దంపతులు హాజరయ్యారు. 


ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెట‌ప్‌లో వచ్చారు. అంతే కాదు... 'కొండా', 'బలుపెక్కిన ధనికుడా... కాల్ మొక్కుడు లేదిక' పాటలకు ఆయన పెర్ఫార్మన్స్ చేశారు. హీరో అదిత్ అరుణ్, ఇతర నటీనటులతో కలిసి స్టెప్పులు వేశారు.  


రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "సినిమా స్టార్ట్ చేసేముందు నేను కొండా మురళి పేరు వినలేదు. ఓ ఎన్నికల సమయంలో కొండా సురేఖ పేరు విన్నాను. ఆమె ఇంటర్వ్యూలు చూశా. నేను రాజకీయాలు ఫాలో అవ్వను. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. నేను ముంబైలో 'సత్య', 'కంపెనీ', ఇక్కడ 'రక్త చరిత్ర' తీసినప్పుడు గానీ తెలంగాణలో సాయుధ పోరాటం గురించి తెలియదు. ఒక వ్యక్తి చెప్పారు. అప్పుడు ఆయన గురించి రీసెర్చ్ చేశా. ప్రతి కథకు, సినిమాకు ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఉదాహరణకు... హిట్లర్ లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం, గాంధీజీ లేకపోతే భారత స్వాతంత్య్ర పోరాటానికి అర్థమే లేదు. గాంధీ ఒకవైపు, హిట్లర్ మరోవైపు ఉంటే కొండా మురళి మధ్యలో ఉన్నారు. త‌నను జైలులో చంపేస్తారా? అనేదాన్ని ఎదుర్కొని, చావుతో ఆడుకుని, నేడు ఇక్క‌డ కూర్చున్నారు. కొండా ముర‌ళి ఎక్స్‌పీరియ‌న్స్‌లు విని నేను విప‌తీరంగా ప్ర‌భావితం అయ్యాను. నాకు హిట్లర్, ముస్సోలిని, ప్రభాకరన్ నేపథ్యాలు తెలుసు. వీళ్లందరూ నమ్మిన సిద్ధాంతాలు, విలువల కోసం పోరాడతారు. అటువంటి అంశం నాకు కొండా మురళి జీవితంలో దొరికింది. అది పట్టుకుని, ఆ తాడును పట్టుకుని తీశా. ఈ రోజు నాకు సాయుధ పోరాటం, నక్సలైట్ల గురించి తెలుసు. కొండా మురళి, సురేఖ జీవితాలను ఎంపిక చేసుకోవడానికి కారణం... వాళ్ల నేపథ్యంలో ఈ కథ చెప్పడానికి అద్భుత అవకాశం దొరికింది. అందుకని, సినిమాకు 'కొండా' పేరు పెట్టాను. ప్రమాదాన్ని కొండా మురళి కోరి తెచ్చుకున్నారు. ప్రమాదం వస్తుందని భయపడలేదు. దాన్ని చూసి స్ఫూర్తి పొంది సినిమా తీశా. కొండా మురళి జీవించిన జీవితమే నా సినిమా కథ. కొండా మురళి శత్రువులు, కొంత మంది పోలీసులను కలిసి వాళ్లు చెప్పినది విన్న తర్వాత నాకు ఓ క్లారిటీ వచ్చింది. నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు. నేను అనుకున్నది 20 శాతం తీసినా నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది" అని అన్నారు.    


కొండా మురళి మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ గురించి ఏమనుకుంటారో, కొండా మురళి గురించి కూడా ప్రజలు అదే అనుకుంటారు... 'ఎవరి మాట వినరు' అని! నేను మాట వినను. కానీ, జనాలకు సేవ చేస్తా. మాట తప్పను, మడమ తిప్పను. పని మాత్రం చేసి పెడతా. ఈ రోజు వరకు ఇలా బతుకుతున్నామంటే ప్రజలే కారణం. బాల్ థాకరే, అమితాబ్ బచ్చన్ నుంచి మొదలు పెడితే... పెద్ద పెద్ద హీరోలతో వర్మ పని చేశారు. ఆ స్థాయిలో కొండా మురళిని తీసుకు రావాలని ఈ సినిమా చేశారు. ప్రజల కోసం నేను ఎంత తపన పడతానో... సినిమా కోసం వర్మ అంత తపన పడ్డారు. వర్మను మా కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని ప్రజల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆయన ఏ కల్మషం లేని వ్యక్తి. నా పాత్రలో అదిత్ అరుణ్ బాగా నటించారు. ఆయన్ను చూస్తే నన్ను చూసినట్టు ఉంది. నా మీద ఫైరింగ్ అయ్యే సీన్ చూస్తే... నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది చూడలేక పక్కకి వెళ్లాను. సినిమా మరో మూడు పార్ట్స్ తీయాలని కోరుతున్నాను" అని అన్నారు. 


కొండా సురేఖ మాట్లాడుతూ "సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ సింహం అయితే... రాజకీయాల్లో కొండా మురళి సింహం. మురళి గారి బయోపిక్ చేయాలని చాలా రోజులుగా మా కోరిక. గుణశేఖర్ గారిని కలిసినప్పుడు నేను, మా అమ్మాయి మా మనసులో మాట చెప్పాం. ఆయన ఒక్కటే మాట అన్నారు... 'మీ బయోపిక్ తీయాలంటే ఆర్జీవీ సారే తీయాలి. ఆయన షూటింగులో ఉండి తీయాలి. అప్పుడే క్లిక్ అవుతుంది' అన్నారు. అప్పుడు మాకు ఆర్జీవీ అన్నను కలిసే అవకాశం రాలేదు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో వాళ్లిద్దరూ కలిశారు. 'కొండా' తెరకెక్కింది. ఒక తపస్సులా ఆర్జీవీ ఈ సినిమా తీశారు. ఆయన పనులన్నీ వదిలేసి... రోజుల తరబడి వ‌రంగ‌ల్‌లో ఉండి సినిమా తీశారు. మా జీవితం రెండున్నర గంటల్లో చూపించే సినిమా కాదు. వర్మకు కథ మొత్తం తెలుసు. రెండున్నర గంటల్లో పది శాతం జీవితాన్ని తీసుకొచ్చినా సంతోషపడతానని వర్మ చెప్పారంటే... మా జీవితం ఎలా ఉండేదో అర్థం చేసుకోండి. పులి కడుపులో పులే పుడుతుంది. నా కూతురు పులి. ఏడేళ్ల నుంచి తను ఎన్నో కష్టాలు పడింది. మా కుటుంబాలు కూడా ఎన్నో బాధలు పడ్డాయి. భవిష్యత్తులో వాటిని వేరే రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వర్మ చెప్పారు. ఇప్పుడు ట్రైలర్ చూపించారు. అందులో లీనం అయ్యా. సినిమా ఎలా తీశారో చెప్పనవసరం లేదు. కొండా మురళి జీవితం చాలా మందికి తెలియదు. మేం ముళ్లబాట మీద నడిచి ఈ స్థాయికి వచ్చాం. మేం ఈ స్థాయికి ఎదగడానికి ప్రజలు కారణం. ఈ సినిమాతో ప్రజలకు తెలుస్తుంది. వర్మ మా సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు బాగా చేశారు" అని అన్నారు.   


అదిత్ అరుణ్ మాట్లాడుతూ "కొండా మురళి, సురేఖ గారి ఆతిథ్యానికి థాంక్స్. మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. వరంగల్ రెండు చేతులతో ఆహ్వానించి, హత్తుకుని, బాగా చూసుకుంది. మా నాన్నగారి ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ లో అంట. నేను సినిమా షూటింగ్ కోసం వచ్చాను. 'కొండా' విడుదల తర్వాత మళ్లీ వస్తాను. నేను రామ్ గోపాల్ వర్మగారితో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్షన్ బ్లాక్ బస్టర్ చేయాలనుకున్నాను. నేను స్క్రీన్ మీద ఏం సినిమా చూడాలని అనుకున్నానో... అటువంటి సినిమాలో ఉండటం నా అదృష్టం. ఈ సినిమా కోసం ఆర్జీవీ టీమ్ బాగా వర్క్ చేసింది. తెలంగాణాలో నాకే తెలియని కథ ఉందని, కలిసి సినిమా చేద్దామని ఆర్జీవీ అన్నారు. అన్నట్టుగా టెర్రిఫిక్ ఫిల్మ్ తీశారు" అని చెపారు. 'పదవి, పైసల్ కన్నా ఆత్మాభిమానం చాలా చాలా ముఖ్యం. దాని కోసం ఏమైనా చేస్తా' అనే సినిమాలో డైలాగ్ చెప్పారు.


సుష్మిత మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ గారు మా నాన్న సినిమా తీస్తున్నారంటే ఎమోషనల్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నాన్న నా హీరో. ఇప్పటికీ ఆయనే హీరో. వర్మను కలిసినప్పుడు మా జీవితంలో జరిగినవి రెండు మూడు కథలు చెప్పాను. ఆయన విన్నారు. రాము అని పిలవమని చెప్పారు. సినిమాలో నా క్యారెక్టర్ లేదు. ఎందుకు లేదనేది ఆయన చెప్పారు. రాము తీసిన సినిమాల్లో 'అంతం', 'శివ', 'గోవిందా గోవిందా', 'సర్కార్' నాకు చాలా ఇష్టం. 'అంతం' చాలాసార్లు చూశా" అని అన్నారు.   


'ఆటో' రామ్ ప్రసాద్ మాట్లాడుతూ "నాకు వరంగల్‌తో పెద్దగా పరిచయం లేదు. నాకు వరంగల్ అంటే వెయ్యి స్థంబాల గుడి. కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది... వరంగల్ అంటే కొండా మురళి అని. ఒక రియల్ హీరో స్టోరీని ఇంకో హీరో తీస్తున్నారంతే! ఆర్జీవీ సినిమాలో చేయడం అదృష్టంగా ఫీలవుతున్నా" అని అన్నారు.  


ఆర్‌కె మాస్ట‌ర్ మాట్లాడుతూ... "బాస్ (రామ్ గోపాల్ వ‌ర్మ‌)తో మూడు నాలుగు సినిమాలు చేసి ఉన్నాను. ఇందులో బాస్ పాడిన సాంగ్ కొరియోగ్ర‌ఫీ చేయ‌మ‌న్నారు. అదే పెద్ద టాస్క్‌. వెయ్యిమంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో గ‌న్నులు, క‌త్తుల‌తో సాంగ్ అంటే ఇంకా క‌ష్టం. మ‌నం ఎప్పుడూ డ్యాన్సే చేశాం. క‌త్త‌లు, క‌టారులతో సాంగ్ చేయ‌లేద‌ని చెప్పా. ఈ సినిమాలో క‌త్తులు లేని పాటే లేద‌ని చెప్పారు. న‌ర‌క‌డం, కొర‌క‌డం, చంప‌డం! సాంగ్ వింటేనే గూస్ బంప్స్ వ‌చ్చాయి. బాస్ స్ట‌యిల్‌లో చేశా" అని అన్నారు. 


అదిత్ అరుణ్‌, ఇర్రా మోర్‌, పృథ్వీరాజ్‌, తుల‌సి, ఎల్బీ శ్రీ‌రామ్‌, 'ఆటో' రామ్ ప్రసాద్, అభిలాష్ చౌద‌రి, శ్ర‌వ‌ణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: జ‌క్కుల వెంక‌టేశ్‌, ఎడిట‌ర్‌: మ‌నీష్ ఠాకూర్‌, ఛాయాగ్ర‌హ‌ణం: మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, సంగీతం: డి.ఎస్‌.ఆర్‌, కో-డైరెక్ట‌ర్: అగ‌స్త్య మంజు, నిర్మాణం: కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌, ద‌ర్శ‌క‌త్వం: రామ్ గోపాల్ వ‌ర్మ‌.


aha releases a new animation original Christmas Thatha

 aha releases a new animation original Christmas Thatha, commemorating Christmas, directed by Rajiv Chilaka



100% Telugu OTT platform aha, a household name for Telugu entertainment, released a new animation original, Christmas Thatha on December 24, commemorating Christmas. This is the second original under aha Kids, an initiative to reiterate the importance of 'our stories and our values' (mana kathalu, mana viluvalu) to the young generation. 



Christmas Thatha is directed by Rajiv Chilaka of Green Gold Animation Pvt. Ltd. The story is set in Golkonda Resort, Hyderabad, where several kids along with their parents, pets and teacher come for a vacation a few days before Christmas. Apart from Mighty Raju and his parents, there's Vighnesh and their pets, Mooshik and Moby. Bujji, Chinna, Goli Soda, their teacher Chandramukhi, a cop Lovely Singh, his fiance Titli, a petty thief Anthony, James, Swami, Sandhya, Christopher, Santa are among others who make it to the resort.



What are the children upto? How do their gifts get stolen? Who's their Secret Santa? You're in for a surprise. The animation original brings to the fore the light-hearted dimension of the Christmas season with several lively characters entertaining audiences with their quirks and mischief. After all, what's a festival without fun and frolic? 



aha has been an integral part of the festival seasons throughout the year, be it Maha Ganesha during Ganesh Chaturthi or Christmas Thatha during Christmas. The platform left no stone unturned in taking Maha Ganesha to crowds, reaching out to 40 Ganesh pandals in Hyderabad and over 1 million audiences offline.



That's not all about aha Kids. aha is going the extra mile to reach out to its younger audiences by building a vast content library. Over 30 new magical stories have found their way to the platform.



aha is also home to some of the biggest Telugu releases in 2021, including Love Story, Unstoppable with NBK, 3 Roses, One, Manchi Rojuloachaie, Romantic, Most Eligible Bachelor, Anubhavinchu Raja, Sarkaar, Chef Mantra, The Baker and The Beauty, Krack, Alludu Garu, 11th Hour, Naandhi, Super Deluxe, Tharagathi Gadhi Daati, Maha Ganesha, Parinayam, and Ichata Vahanamulu Nilupa Radu.




Backdoor Movie Review


Cast: Poorna, Teja Tripurana etc. 

Technicians: Music - Pranav, Editing - Chhota K. Prasad, Camera -

Srikanth Naroj, Co-Producer - Oota Sreenu, Producer - B. Srinivas Reddy, Writer, Director - Karri Balaji 

Check out the Review of Back Door Movie Starring Poorna Produced by B Srinivas Reddy directed by Karri Balaji 

 Story 

Anjali (Poorna) is a happy going Housewife her husband is a businessman they have two children and happy going life one day In marriage function Anjali meets  Arun (Teja Tripurana) and they both become friends slowly Arun starts loving her and they have been regular touch on phone 

 Arun falls in love with Anjali's beauty one day Anjali calls Arun home when the children   and her husband not in home 


What happened after that? Did  Anjali crossed the line, or maintained her dignity as a housewife forms  the rest of the story.



Plus points 


Poorna  Performances 

Dialogues 

Production values

Message oriented story

 Technical Values 

 

Performances 

In this segment we must appreciate Poorna for accepting this film and her performance is simply good she has given her best and justified her role as a housewife her performance is perfect  .Teja Tripurana has given his best he has done decent job and the rest of the cast has done as per the requirements 

Technical Aspects 

In this segment we must appreciate producers for their production values even though its a small film quality wise its good  they have  not compromised any where  .Director Karri Balaji  has taken message oriented story and showcased it very well .  Dialogues  are good  . Music is good background score has taken the movie to Next level .Cinematographer Srikanth Narose has beautifully picturized  the film Visual are good 

Verdict 

On whole Back Door is a decent film with good message 


Rating 3/5



RadheShyam Technicians Pressmeet

 ప్రభాస్ తో "రాధే శ్యామ్" లాంటి పాన్ ఇండియా సినిమా చేయడం  అదృష్టం..  



 *రెబ‌ల్ స్టార్ డా. యు.వి. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గ్లోబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌ రిస్తున్నారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి  సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ల‌వ్లీ విజువ‌ల్ వండ‌ర్ ని ఏక‌కాలంలో ఐదు భాష‌ల తో పాటు చైనీస్, జపనీస్ భాషల్లోనూ భారీ రేంజ్ లో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా రాధే శ్యామ్ టెక్నిసిషన్స్ డి.ఓ.పి. మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ ,చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ లు ప్రతి8 మీడియాతో ముచ్చటించారు.* 

 


 *ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధా కృష్ణ  కుమార్ మాట్లాడుతూ* .. మా నిర్మాత కృష్ణం రాజు గారు మాకు బాగా సపోర్ట్ గా నిలిచారు. ట్రైలర్ చూసిన వారంతా ట్రైలర్ లో వి.యఫ్.ఎక్స్ బాగుంది అంటున్నారు.ఇదంతా కమల్ కన్నన్ కె దక్కుతుంది. నాకు ఇన్స్పిరేషన్  చంద్ర శేఖర్ యేలేటి,ప్రభాస్ గార్లే. ప్రభాస్ గారిని నేను ఎంతో ఇష్టపడతాను. 1970 లలో సాగే పీరియాడిక్ మూవీ, నిర్మాతలు మాకు ఏం కావాలన్న అది అందించారు. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమా చేయడం దర్శకుడు గా గర్వంగా ఫీల్ అవుతున్నాను.చంటి గారు మాకు బ్యాక్ బోన్ గా నిలిచారు.5 బాషల్లో తీయడం అంటే గొప్ప విషయం. సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నారు



 *డి.ఓ.పి. మనోజ్ పరమహంస మాట్లాడుతూ* .. చిత్ర నిర్మాతలకు ఈ స్టోరీ బాగా నచ్చిడంతో.ఈ స్క్రిప్ట్ కు ఏం కావాలో చెప్పమంటూ.. ప్రతిసీన్లో ఒక షాట్ అద్భుతంగా రావాలని నా మీద భారం పెట్టారు. ఒక్కక్క షాటే కాదు, సినిమా మొత్తం అద్భుతంగా వచ్చింది.ఈ సినిమాను అనేక దేశాల్లో చిత్రీకరించడం వలన ప్రేక్షకులకు వండర్ఫుల్ విజువల్ ఫీస్ట్ అవుతుంది. ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టూడియో ఫార్మాట్ లో గోపి క్రిష్ణ మూవీస్,  యు.వి క్రియేషన్స్ తీయడం జరిగింది. రాధా గారు మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్.ఈ మూవీ అందరికీ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తోంది..  ఇటలీ లో చేసిన షూట్ కు ఇటలీ ఆర్ట్ డైరెక్టర్ తోనే వర్క్ చేశాము. ప్రతి ఫ్రెమ్ కరెక్ట్ ఉండేలా ఆర్ట్ డైరెక్టర్స్ చాలా కష్టపడ్డారు. హాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పాల్  మాతో 3 ఇయర్స్ జర్నీ చేయడం చాలా సంతోషం.ఈ సినిమాలోని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.రాధే శ్యామ్ టీం లో నేను భాగం అయినందుకు గర్వాంగా ఉంది.అలాగే నాకీ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 


 *ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ మాట్లాడుతూ* ..రాధే శ్యామ్ బ్యూటిఫుల్ లవ్ స్టొరీ, ప్రపంచంలో ఆర్ట్స్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే కంట్రీ ఇటలీ.1970 లో జరిగే లవ్ స్టొరీ కి మీరు ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేయాలి అన్నారు.డి.ఓ.పి. మనోజ్ పరమహంస,మ్యూజిక్ డైరెక్టర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్, దర్శకుడు రాధాకృష్ణ,వీరందరికీ మించి యు.వి క్రియేషన్స్ కు అందరికీ ఇది బిగ్ టాస్క్, ఈ ప్రాజెక్టు అనుకున్నప్పుడు మొదట ఒకలా స్టార్ట్ చేశాము,లాస్ట్ కు ఇది నెవరెండింగ్ అయిపోయింది. ఎవ్వరు కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చేశాము ఆన్నారు


 *మ్యూజిక్ డైరెక్టర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ మాట్లాడుతూ* ..ఇంత

 అద్భుతమైన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా  అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది  టఫ్ జాబ్  అయినా సరే నేను రీచ్ అయ్యానని అనుకుంటున్నాను అన్నారు.. 


 *నటీనటులు* :

ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు,సత్యరాజ్,జగపతిబాబు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్,జయరాం, ప్రియదర్శి తదితరులు.. 


 *టెక్నికల్ టీమ్:* 

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్

నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్

సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌

డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్

సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి

ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్

పిఆర్ఓ : ఏలూరు శ్రీను

MegaPrince Varun Tej Ghani Releasing on March18th 2022

 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’.. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 18, 2022న గ్రాండ్ రిలీజ్



మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `గ‌ని`. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను మార్చి 18, 2022న విడుదల చేస్తున్నారు. 


నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ  ‘‘వరుణ్ తేజ్ గని అనే సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్, సినిమా ప్రోమో, సాంగ్‌లకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించాం. ఇలాంటి ఓ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బిగ్ స్క్రీన్స్‌పైనే ఎంజాయ్ చేస్తే ఆ కిక్ మరో రేంజ్‌లో ఉంటుంది. అందుకని మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. మార్చి 18, 2022న గని చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం’’ అన్నారు. 


బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 


నటీనటులు:

వ‌రుణ్ తేజ్‌, స‌యీ మంజ్రేక‌ర్‌, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  కిర‌ణ్ కొర్ర‌పాటి 

నిర్మాత‌లు:  సిద్ధు ముద్ద‌, అల్లు  బాబీ

సినిమాటోగ్ర‌ఫీ:  జార్జ్ సి.విలియ‌మ్స్‌

మ్యూజిక్‌:  త‌మ‌న్‌.ఎస్‌

ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

Gemini Kiran to Launch Recce Poster

 ప్రముఖ నిర్మాత 

జెమిని కిరణ్

ఆవిష్కరించనున్న

సూపర్ క్రైమ్ థ్రిల్లర్ 

"రెక్కీ" ఫస్ట్ లుక్!!



     "స్నోబాల్ పిక్చర్స్" పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ". "కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు" అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా... క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 27, సోమవారం ఉదయం ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ ఆవిష్కరించనున్నారు.

    క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాoశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న "రెక్కీ" ఫస్ట్ లుక్ ఆవిష్కరించేందుకు ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రం ఫస్ట్ కాపి అతి త్వరలో సిద్ధం కానుంది.

      నాగరాజు ఉండ్రమట్ట, భాషా, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున, సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి, నిర్మాత: కమలకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్!!

Vijay Deverakonda Happy With Telangana Government Movie Tickets Policy

 సినిమా టికెట్ ధరల పెంపుపై కథానాయకుడు విజయ్ దేవరకొండ హర్షం



తెలంగాణలో సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ అన్నారు. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒకటని పేర్కొన్న విజయ్... పరిశ్రమ అభివృద్ధి కోసం సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్ కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని విజయ్ కొనియాడారు. ఇందుకు నిదర్శనమే తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరింపు అని గుర్తుచేస్తూ టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.

Shakalaka Shankar Dharmasthali Releasing on January 21st

 జనవరి 21న విడుదల కానున్న ష‌క‌ల‌క శంక‌ర్ 'ధ‌ర్మ‌స్థ‌లి' చిత్రం..



కామెడియ‌న్‌గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఒక భాద్య‌తాయుత‌మైన మంచి పాత్ర‌లో హీరోగా క‌నిపిస్తున్న చిత్రం ధ‌ర్మ‌స్థ‌లి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల తెలిసిన ర‌మ‌ణ మోగిలి ద‌ర్శ‌కుడు. పావ‌ని హీరోయిన్ గా శంక‌ర్ కి జోడిగా న‌టిస్తుంది. వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందిస్తున్నారు. ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ వెన‌క క‌థ స‌మాజంలో జ‌రిగే విషం లాంటి ఒక విష‌యాన్ని అంద‌రికి అర్ధ‌మ‌య్యేలా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఎంట‌ర్‌టైన్ చేస్తూనే సోషల్ మెసేజ్ ఇస్తున్నాడు దర్శకుడు. అందుకే ఈ ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ కి ఖ‌రారు చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ధర్మస్థలి.


ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి మాట్లాడుతూ.. 'ష‌క‌ల‌క శంక‌ర్ తో ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి చిత్రాన్ని ఇలాంటి కాన్సెప్ట్ ని ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ చూసిన వారికి ఆయ‌న‌లో వున్న ఇంటెన్సిటి ఈ చిత్రం ద్వారా అర్ద‌మ‌వుతుంది. ప్ర‌తిరోజు మ‌న జీవితాల‌తో ముడి ప‌డిన ఓ విష‌యాన్ని అలాగే మ‌న జీవితాల‌తో ఆడుకుంటున్న అంశాన్ని ఆయ‌న పాత్ర ద్వారా తెలియ‌జేస్తున్నాం. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటిని తెర‌పైకి తీసువ‌స్తున్నాం. శంక‌ర్ కి జోడి గాద పావ‌ని న‌టిస్తున్నారు. ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే అంశాలు ఈ చిత్రం లో వున్నాయి. ఇంత మంచి చిత్రానికి ద‌ర్శ‌స్థలి అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కి వ‌చ్చిన రెస్పాన్స్ రావ‌టం విశేషం. మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాము..' అని తెలిపారు.


న‌టీన‌టులు:


శంక‌ర్‌, పావ‌ని, మ‌ని భ‌ట్టాచార్య‌, స‌న్ని సింగ్‌, షియాజి షిండే, ధ‌న‌రాజ్‌, భూపాల్‌, భర‌త్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్తార్‌, ఉన్ని కృష్ణ‌, ఘ‌ని, విజ‌య్ భాస్క‌ర్‌, మాధ‌వి, హ‌సిని, ర‌మ్య‌,స్వాతి త‌దిత‌రులు..


సాంకేతిక నిపుణులు:


స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌కుడు.. ర‌మ‌ణ మోగిలి

బ్యానర్: రొచిశ్రీ మూవీస్

నిర్మాత‌.. Mr రావు

మ్యూజిక్‌.. వినోద్ యాజ‌మాన్య‌

స్టోరి, స్క్రీన్‌ప్లే, మాట‌లు- రాజేంద్ర భ‌రధ్వాజ్‌

కెమెరా.. జి ఎల్ బాబు

ఎడిట‌ర్.. వి.నాగిరెడ్డి

విఎఫ్ఎక్స్‌.. అనంత్ ఇయ్యిని

ఫైట్స్‌.. మ‌ల్లేష్‌

డాన్స్‌..చంద్ర కిర‌ణ్‌

ఆర్ట్‌.. సాంబ‌

లిరిక్స్‌.. గోసాల రాంబాబు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌.. అకుతోట సంజు

PRO.. ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్‌

Ultimate Response for RadheShyam Trailer

 64 మిలియన్ వ్యూస్‌తో ఆల్ ఇండియా రికార్డు సృష్టించిన ‘రాధే శ్యామ్’ ట్రైలర్..



ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఒక్క రోజులోనే ఈ చిత్ర ట్రైలర్ 64 మిలియన్ వ్యూస్ అందుకుని ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. డిసెంబర్ 23న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులే అతిథులుగా రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల చేసారు. లవ్ స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్, డ్రామా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ట్రైలర్‌లో ఉన్నాయి. 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుంది. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.


నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..


టెక్నికల్ టీమ్:


కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్

నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్

సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌

డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్

సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి

ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్

పిఆర్ఓ : ఏలూరు శ్రీను

Heroine Krithi Shetty Interview About Shyam Singha Roy

శ్యామ్ సింగ రాయ్ తో నా నటనలోని ఇంకో కోణాన్ని చూపించే అవకాశం వచ్చింది - హీరోయిన్ క‌ృతి శెట్టి



న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన  ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగావిడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు హీరోయిన్ కృతి శెట్టి మీడియాతో ముచ్చటించారు.


ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలను చూశాను. ట్రెడిషన్, కల్చర్ గురించి తెలియాలి. విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించాను.


నాకు వచ్చే పాత్రలపై నేనే రీసెర్చ్ చేసుకుంటాను. ఆ కారెక్టర్ ఎలా ఉంటుంది.. ఆమె అలవాట్లు ఏంటి? ఆమె ఎలాంటి పాటలు వింటుంది అని నేనే సపరేట్‌గా రాసుకుంటాను. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కీర్తి పాత్రకు తల్లి ఉండదు. తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. అప్పుడు కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని దర్శకుడికి చెప్పాను.


నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం అదే చాలెంజింగ్‌గా అనిపించింది. ఆ సీన్స్ తీసేయోచ్చా? అని దర్శకుడిని కోరాను. అది కీర్తి, నువ్ కృతి. తేడా ఉండాలి కదా? అని దర్శకుడు అన్నారు. ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. మొదటి రోజు ఫోటో షూట్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోయాయి.


నాకు పెయింటింగ్ అంతగా రాదు. అంత పర్ఫెక్ట్‌గా పెయింట్ వేయలేను. మైండ్ ఫ్రీ అయ్యేందుకు పెయింటింగ్‌లాంటివి ఏదో ఒకటి చేయాలి.


నాని గారితో నటించడం అంటే మొదట్లో నాకు భయం వేసింది. కానీ ఆయన సెట్‌లొ ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన వరకు మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరి పర్ఫామెన్స్ చూస్తారు. బాగుందని అంటారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత కంఫర్ట్‌గా నటించగలిగాను.


బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ అని అనుకుంటారు. ఏం చేసినా కూడా వృత్తి పరంగానే మేం చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంత కష్టపడతారో అన్ని సీన్లకు అలానే కష్టపడతారు. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాను. ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఎక్కువగా సినిమాలు చూడలేదు.


కథలో ఆ సీన్స్ అవసరం అనిపిస్తేనే చేస్తాను. లేదంటే నేను చేయను. శ్యామ్ సింగ రాయ్‌లో వాటితో కథ ముడి పడి ఉంది.


నా ఫ్యామిలీ అంతా ఒక్కో చోట ఉంటారు. సినిమా టికెట్లను నాకు చూపించారు. సినిమాకు వెళ్తున్నామని చెప్పారు. మా నాన్న సినిమాను చూసి నన్ను మెచ్చుకున్నారు. బాగా చేశావ్ అని అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా సెట్‌లోకి రారు. నా లుక్ గురించి తెలీదు. కొత్తగా, ఫ్రెష్‌గా ఉందని అన్నారు.


ఉప్పెన సినిమాలో నటించే స్కోప్ ఎక్కువగా ఉంది. కానీ ఇందులో నాలోని ఇంకో కోణాన్ని చూపించే చాన్స్ వచ్చింది. ఉప్పెన తరువాత నాకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. కానీ మళ్లీ మళ్లీ అలాంటి పాత్రనే ప్రేక్షకులకు ఎందుకు చూపించాలి. కావాలంటే వారు నెట్ ఫ్లిక్స్‌లో ఉప్పెన చూస్తారు. కొత్తగా ఉంటుందనే ఈ పాత్రను ఎంచుకున్నాను. భిన్న పాత్రలను చేయాలని నాకు ఉంటుంది.


స్టోరీ కంటే నా పాత్ర ఇంపార్టెన్స్ గురించి ఆలోచిస్తాను. ఇంటర్వెల్ వరకు ఉంటుందా? తరువాత ఉండదా? అని ఆలోచించను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉందా? లేదా? అని అనుకుంటాను. రకరకాల పాత్రలను చేస్తే ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కామెడీ పాత్రలను చేస్తే ఆ టైమింగ్ తెలుస్తుంది. అందుకే విభిన్న పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నాను.


ఆడియెన్స్ కోసమే నేను రకరకాల పాత్రలను చేయాలని అనుకుంటున్నాను. వారు నాకు చాలా ప్రేమను ఇచ్చారు. ఆడియెన్స్‌కు నచ్చుతుందా? లేదా? అనే కోణంలోంచే ఆలోచిస్తుంటాను.


నా పాత్రకు డబ్బింగ్ చెబుదామని అనుకున్నాను. కానీ కారెక్టర్ లుక్‌కి, నా వాయిస్‌కి మ్యాచ్ అవ్వలేదు. ఆ పాత్రకు బేస్ వాయిస్ కావాలని అన్నారు. కానీ నా వాయిస్ అలా ఉండదు. అందుకే డబ్బింగ్ చెప్పలేదు.


సాయి పల్లవి పాత్ర నాకు చాలా నచ్చింది. నేను కూడా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఆమె స్క్రీన్ మీద చాలా బాగా చేశారనిపించింది. నేను సెట్‌లో సాయి పల్లవిని కలవలేదు. ఓ సారి సెట్‌కు వెళ్లాను గానీ ఆ రోజు సాయి పల్లవి షూటింగ్ లేదు.


నానిని అందరూ నాచురల్ స్టార్ అంటారు. ఆయన ఏ పాత్రను చేసినా ఆ పాత్రలోకి వెళ్లిపోతారు. ఆ కారెక్టర్‌ను అంత న్యాచురల్‌గా చేస్తారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని రెండు పాత్రల్లోనూ వేరియేషన్ ఉంటుంది. నాకు వాసు అంటేనే ఇష్టం. మిడిల్ క్లాస్ అబ్బాయి, నిన్ను కోరి సినిమాల్లోని నాని అంటే ఇష్టం.


నాకు యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉంది. అలాంటి ఆఫర్లు వస్తే యాక్షన్స్ సీక్వెన్స్‌ల్లో శిక్షణ తీసుకుంటాను. నేను ఇంత వరకు డ్యాన్స్‌లే చేశాను. అలాంటి యాక్షన్ సినిమాల్లో చేస్తే చాలెంజింగ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. ఓటీటీ ఆఫర్లు వస్తే కచ్చితంగా చేస్తాను.


ఉప్పెన విడుదల కాక ముందే ఆఫర్లు వచ్చాయి. నా మీద నమ్మకం పెట్టుకుని ఆఫర్లు ఇస్తున్నారని ఆనందంగా అనిపించింది. నెరేషన్ ఇచ్చేటప్పుడు ఆడియెన్స్ కోణంలోనే వింటాను. నేను మా అమ్మ కలిసే కథను వింటాం. ఓకే చేస్తాం. నాకు ఆ పాత్ర సెట్ అవుతుందని అనిపిస్తేనే ఓకే చెబుతాను.


బంగార్రాజు షూటింగ్ నిన్ననే పూర్తయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఫిబ్రవరిలో వస్తుందేమో. మాచర్ల నియోజకవర్గం ఏప్రిలో‌లో వస్తుంది. రామ్‌తో సినిమా ఇంకా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ నుంచి ఇంకా ఆఫర్లు రాలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. నాకు ఇక్కడే ఇంత ప్రేమ దొరుకుతోంది. ఇక్కడే ఉండాలనిపిస్తోంది.


సుకుమార్ గారితో పని చేయడం ఆనందంగా ఉంటుంది. ఆయన్ను చాలా సార్లు కలిశాను. ఆయనతో పని చేస్తే మంచి ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది.

Director Teja Marni Interview About Arjuna Phalguna

టైటిల్ పెట్టాకే కథ స్పాన్ పెరిగింది.. ‘అర్జున ఫల్గుణ’ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ తేజ మర్నీ



కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. శ్రీ విష్ణు హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్‌గా ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు తేజ మర్ని మీడియాతో ముచ్చటించారు.


జోహార్ కంటే ముందుగానే ఈ కథ ఉంది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది పూర్తిగా సిద్దం కాలేదు. జోహార్ తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో కథ చేయాలని ఉండేది. అలా ఈ కథను విష్ణు గారికి వినిపించాను.


ముందుగా ఈ సినిమాకు ఈస్ట్ గోదావరిలో దొరికి కూల్ డ్రింక్ ఆర్జోజ్‌ను టైటిల్‌గా పెట్టాలని అనుకున్నాం. కానీ వాళ్లు పర్మిషన్ ఇవ్వలేదు. టైటిల్ లేకపోతే కథ అంతా మార్చాల్సి వస్తుందని విష్ణు, నేను మాట్లాడుకుంటూ ఉన్నాం. అలా ఓ సారి అర్జున ఫల్గుణ గురించి మాట్లాడుతూ.. అలా అంటే ధైర్యం వస్తుందట అని అనుకున్నాం. వెంటనే శ్రీ విష్ణు గారు ఆ టైటిల్‌ బాగుందని అన్నారు.


సినిమాలో హీరో కారెక్టర్ పేరు కూడా అర్జున్. అర్జున ఫల్గుణ అనే టైటిల్ పెట్టాకే సినిమా స్పాన్ మారిపోయింది. ఊర్లో ఉన్నంత సేపు అర్జునుడు. ఊరి దాటాక ఫల్గుణుడిగా ఎలా మారాడన్నదే కథ.


సినిమాకు టైటిల్ చాలా ముఖ్యం. కథకు తగ్గట్టుగా టైటిల్ ఉండాలి. అర్జున ఫల్గుణ అని టైటిల్ పెట్టాకే కథలో మార్పులు చేశాను. యాక్షన్ పెంచాను. స్పాన్ పెంచాను. మార్పుల పట్ల నిర్మాతలు సంతోషంగానే ఉన్నారు.


సిటీలో ఎంత సంపాదించినా మిగిలేది కొంతే. అదే ఊర్లో ఉండి సంపాదించుకుంటే బెటర్ కదా? అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి ఊరి కుర్రాళ్ల కథే అర్జున ఫల్గుణ.


ముందు ఈ కథకు హీరో సెట్ అయ్యారు. ఆ తరువాత ప్రొడక్షన్ కంపెనీ ఫైనల్ అయింది. మ్యాట్నీ వారికి కథ చెప్పడంతో వెంటనే ఒకే చెప్పేశారు. నెల రోజుల్లోనే షూట్‌కి వెళ్లాం. ప్యాషనేట్ నిర్మాతలు అవ్వడం వల్ల షూటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. సెకండ్ వేవ్ వల్ల కాస్త ఇబ్బంది ఏర్పడింది. ఫండుగ సమయంలో ముప్పై రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ చేసేశాం. సెకండ్ షెడ్యూల్ 21 రోజుల్లో చేసేశాం. మొత్తం 55 రోజుల్లో షూట్ పూర్తయింది.



ప్రతీ రోజూ ఉదయం ఆరు గంటలకు షాట్ పెట్టేవాళ్లం. సన్ సెట్ ఎప్పుడూ కూడా వదల్లేదు. ప్రతీ ఒక్కరూ ఎంతో కో ఆపరేట్ చేశారు. గోదావరిలోని అందాలను కొత్త కోణంలో చూపించబోతోన్నారు. వంశీ గారు, కృష్ణవంశీ గారి ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుంది. అక్కడి వాతావరణం, జీవన విధానం నాకు చాలా ఇష్టం.


అర్జున ఫల్గుణ సినిమాలోని మెయిన్ పాయింట్, టర్నింగ్ సీన్స్, కథలు నిజంగానే జరిగాయి. నా ఫ్రెండ్స్, వాళ్ల ఫ్రెండ్స్ ఇలా అందరి జీవితాల్లో జరిగిన వాటిని ఈ కథలో పెట్టాను.


ఈ కథను శ్రీ విష్ణు గారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగానే రాసుకున్నాను. వేరే హీరోను అస్సలు అనుకోలేదు. గోదావరి యాస ఉండాలని పెట్టుకున్నాను. సింధూరంలో రవితేజ గారిని చూసిన ఫీలింగ్ వస్తుంది. యాక్షన్ పరంగా కొత్త విష్ణును ఇందులో చూడొచ్చు.


సినిమాలోని ఐదు పాత్రలు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్. రియలిస్టిక్‌గా ట్రీట్ చేశాం. నేను కూడా ఎన్టీఆర్ అభిమానినే.


ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక క్లైమాక్స్‌లో అయితే అందరూ ఎమోషనల్ అవుతారు. ఇందులో ఐదు పాటలుంటాయి. అన్నీ కూడా కథలో భాగంగానే వస్తాయి.


తన సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనే కల ప్రతీ దర్శకుడికి ఉంటుంది. నా మొదటి సినిమాతో అది నెరవేరలేదు. అప్పుడు సినిమాను నేనే నిర్మించుకోవడం వల్ల ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. కానీ ఇప్పుడు మంచి నిర్మాతలున్నారు. దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ఎన్ని థియేటర్లు దొరుకుతాయో అని అనుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమా అయినా కూడా వారమే. సినిమా బాగుంటే.. ఇంకో వారం ఆడుతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఇంకే సినిమాలు కూడా కనబడవు. ఇందులో ఎన్టీఆర్ మీద, ఆర్ఆర్ఆర్ మీద కొన్ని డైలాగ్స్ ఉంటాయి. కాబట్టి ముందే రిలీజ్ అవ్వాలి. మామూలుగా అయితే ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేశాం. ఈ డిసెంబర్ 31న సంక్రాంతిని తీసుకొద్దామని అనుకుంటున్నాం. మా సినిమాను చూశాక ఊరికెళ్లాలనిపిస్తుంది.


ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2, షైన్ స్క్రీన్ బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాను. ఇకపై నేను కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. కానీ ఏ సినిమా చేసినా కూడా ఎమోషన్ మాత్రం ఉండాల్సిందే.


విష్ణు గర్ల్ ఫ్రెండ్‌గా అమృతా అయ్యర్ కనిపిస్తారు. ఫ్రెండ్‌కు కష్టం వస్తే అమ్మాయి అయినా కూడా సాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తుంది. ఆమె ఈ పాత్రను ఎంతో అద్బుతంగా చేశారు. ఈ ఐదు పాత్రలే కాకుండా నరేష్ గారు, శివాజీ రాజా గారి, సుబ్బరాజు గారి కారెక్టర్‌లు హైలెట్ అవుతాయి. కామెడీ కోసం సపరేట్ ట్రాక్ రాసుకోలేదు. కథలో భాగంగానే హాస్యాన్ని పుట్టించాం.



Vishal VFF’s Saamanyudu Teaser Out

 



Actor Vishal teamed up with a debutant director Thu Pa Saravanan for an action drama titled Samanyudu that comes up with the tagline ‘Not A Common Man’. Vishal himself is producing the film on his Vishal Film Factory (VFL) banner. The makers today unleashed teaser of the movie.


Going by the teaser, Samanyudu is about a common man who takes on influential people in the society. “Ikkada Rendu Rakaala Manushule Unnaru… Okaru Jeevithaanni Adi Nadipinche Daarilo Jeevinchaalanukune Samanyulu… Inkokaru Aa Samanyulni Dabbu, Peru, Padavi, Adhikaram Kosam Antham Cheyalanukune Rakshasulu… Aa Rakshasula Thala Raathani Marchi Raayalsina Paristhithi Oka Roju O Samanyudiki Vasthundi…”


The teaser gives an impression that Samanyudu will be high on action and it has elements for others as well. It’s a tailer made role for Vishal and Dimple Hayathi looks gorgeous. Kavin Raj’s cinematography and Yuvan Shankar Raja’s background compliment each other.


Yogi Babu, Baburaj Jacob, PA Tulasi and Raveena Ravi played crucial roles in Samanyudu which will be hitting the screens for Republic Day on January 26th.


Cast: Vishal, Dimple Hayathi, Yogi Babu, Baburaj Jacob, P.A.Tulasi, Raveena Ravi


Technical Crew:

Director – Thu Pa Saravanan

Producer - Vishal

Music - Yuvan Shankar Raja

Dop - Kavin Raj

Editor - N.B.Srikanth

Art - SS Murthi

Costume Designer - Vasuki Bhaskar

Pro - Vamsi Shekar

Publicity Design – VikramDesigns