Gemini Kiran to Launch Recce Poster

 ప్రముఖ నిర్మాత 

జెమిని కిరణ్

ఆవిష్కరించనున్న

సూపర్ క్రైమ్ థ్రిల్లర్ 

"రెక్కీ" ఫస్ట్ లుక్!!



     "స్నోబాల్ పిక్చర్స్" పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ". "కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు" అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా... క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 27, సోమవారం ఉదయం ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ ఆవిష్కరించనున్నారు.

    క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాoశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న "రెక్కీ" ఫస్ట్ లుక్ ఆవిష్కరించేందుకు ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రం ఫస్ట్ కాపి అతి త్వరలో సిద్ధం కానుంది.

      నాగరాజు ఉండ్రమట్ట, భాషా, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున, సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి, నిర్మాత: కమలకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్!!

Post a Comment

Previous Post Next Post