Latest Post

Salman Khan Participated in Antim Promotions at Hyderabad

 ‘అంతిమ్’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్: స‌ల్మాన్ ఖాన్‌



బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తూ స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మించిన చిత్రం ‘అంతిమ్‌’. మ‌హేశ్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌వంబ‌ర్ 26న సినిమా విడద‌లై సూప‌ర్ హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. బుధ‌వారం ఈ సినిమా థాంక్స్ మీట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌ల్మాన్ ఖాన్‌, ఆయుష్ శ‌ర్మ‌, డైరెక్ట‌ర్ మ‌హేశ్ మంజ్రేక‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...


బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘- సాధార‌ణంగా నేను సినిమా రిలీజ్‌కు ముందే ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు వెళ్లి ప్ర‌మోష‌న్స్ చేయ‌డం, ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం వంటివి చేస్తుంటాను. అయితే ఇప్పుడు టైగ‌ర్ సినిమా షూటింగ్ కార‌ణంగా ఈసారి నాకు టైమ్ కుద‌ర‌లేదు. సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తే త‌ప్ప‌కుండా టైమ్ తీసుకుని రావాల‌నుకున్నాను. అందుక‌నే ఇప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చాను. ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్ప‌డానికి వ‌చ్చాను. ఆయుష్‌ను ప్రేక్ష‌కులు చ‌క్క‌గా రిసీవ్ చేసుకున్నారు. నేను సాధారణంగా స్క్రిప్ట్ ప్రధానంగా చూస్తాను. సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాలంటే స్క్రిప్ట్ బాగా ఉండాలి. నాకు స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోతే సినిమా చేయ‌ను. అంతిమ్ కాన్సెప్ట్ నాకు బాగా న‌చ్చింది. ఆయుష్ ఇందులో కీల‌క‌మైన పాత్ర చేశాడు. పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక‌పై ఇంకా క‌ష్ట‌ప‌డాలి. డిఫ‌రెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి. థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కుడు రావాలంటే మనం బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌మోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయుష్‌లో చాలా ఆస‌క్తి ఉంది. అలాంటి ఆస‌క్తి ఉన్న‌ప్పుడు కొత్త విష‌యాలు నేర్చుకోవాల‌ని అనుకుంటారు. త‌నిప్పుడు అదే చేస్తున్నాడు. నేను ద‌బాంగ్ సినిమాను తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేశాం. కానీ అంతిమ్ సినిమాకు అంత స‌మ‌యం లేదు. క‌రోనా కార‌ణంగా..గ్యాప్ తీసుకుని హిందీలోనే సినిమాను పూర్తి చేయాల్సి వ‌చ్చింది. అందుక‌నే ఈసారి డ‌బ్బింగ్‌పై ఫోక‌స్ పెట్ట‌లేదు. అయితే నా త‌దుప‌రి చిత్రాన్ని హిందీ, తెలుగులో విడుద‌ల చేస్తాను. ద‌బాంగ్‌లో నేను చేసిన చుల్‌బుల్ పాండేకు అంతిమ్‌లో చేసిన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌కు పూర్తి భిన్నంగా డిజైన్ చేశారు. 


ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న స‌మ‌యంలో కొంద‌రు అభిమానులు థియేట‌ర్స్‌లో ట‌పాసులు కాల్చారు. ఆ విష‌యం నా దృష్టికి రావ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా వారిని వ‌ద్ద‌ని వారించాను. అది వ‌ర్క్ అయ్యింది. ఇప్పుడు పాలాభిషేకం కోసం ఉప‌యోగించే పాల‌ను అభిమానులు పేద‌ల‌కు పంచి పెడుతున్నార‌ని తెలిసింది. చాలా మంచి విష‌య‌మది. నేను క్లాస్‌, మాస్‌, మ‌ల్టీప్లెక్ సినిమా చేయాల‌ని ఆలోచించ‌లేదు. మంచి సినిమా చేయాల‌ని అనుకున్నాను. అంతిమ్ క‌థ విన‌గానే చాలా బాగా న‌చ్చింది. దాంతో వెంట‌నే సినిమాను స్టార్ట్ చేశాను. నాకు చిరంజీవిగారు, రామ్‌చ‌ర‌ణ్ మంచి స్నేహితులు, వెంక‌టేశ్ కూడా బాగా తెలుసు. ఇప్పుడు చిరంజీవిగారితో సినిమా చేస్తున్నాను. వెంకటేశ్‌తోనూ సినిమా చేయ‌బోతున్నాను. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను. ఓటీటీ డిఫ‌రెంట్ కంటెంట్‌తో వ‌స్తున్నాయి. అవ‌కాశం వ‌స్తే.. క‌చ్చితంగా ఓటీటీకి కంటెంట్‌ను అందిస్తాను. ఇక ద‌బాంగ్ 4 చేయాల్సి ఉంది. సాజిద్ సినిమా లైన్‌లో ఉంది’’ అన్నారు. 


ఆయుష్ శర్మ మాట్లాడుతూ ‘‘స‌ల్మాన్‌ఖాన్‌గారి సినిమా అంటే ఆ రీచ్ మ‌రోలా ఉంటుంది. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం నా డ్రీమ్ పూర్త‌యిన‌ట్లు ఉంది. సినిమా చేస్తున్న స‌మ‌యంలో కాస్త నెర్వ‌స్‌గా ఫీలయ్యాను. కానీ స‌ల్మాన్‌కి యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌కు ఎలాంటి స‌పోర్ట్ చేయాలో బాగా తెలుసు. త‌ను అలాంటి స‌పోర్ట్‌ను అందించాడు. నా భార్య అర్పిత‌కు సినిమా చాలా బాగా న‌చ్చింది. ముఖ్యంగా నా పెర్ఫామెన్స్  బావుంద‌ని త‌ను చెప్పింది. నేను ప‌ర్టికుల‌ర్‌గా ఇలాంటి సినిమాల‌నే చేయాల‌ని అనుకోవ‌డం లేదు. వైవిధ్యంగా ఉన్న సినిమాల‌ను చేస్తే త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. వైవిధ్య‌మైన పాత్ర‌లు కూడా చేయాల‌నుకుంటున్నాను. ఉదాహ‌ర‌ణ‌కు ఈ సినిమా కోసం 16 కిలోలు బ‌రువు పెరిగాను. మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టింది’’ అన్నారు.  


మ‌హేశ్ మంజ్రేక‌ర్ మాట్లాడుతూ ‘‘సల్మాన్‌ఖాన్‌గారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే క‌థ‌ను త‌యారు చేశాం. ఇప్పుడు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మీకు అర్థ‌మ‌వుతుంది’’ అన్నారు.


Nandamuri Balakrishna’s Akhanda Grand USA Premieres Today

 Nandamuri Balakrishna’s Akhanda Grand USA Premieres Today



Natasimha Nandamuri Balakrishna and mass director Boyapati Srinu’s much awaited high intense action entertainer Akhanda is all set for a grand release worldwide on December 2nd with premiere shows in USA and few other centers on December 1st. Radha Krishna Entertainments will be releasing the movie in overseas.


Akhanda will be releasing in 500 + locations in overseas with USA premieres in all centers on December 1st. This is the biggest release for Telugu film, post covid and it’s also biggest release for Balakrishna.


Drives for all the locations have already been dispatched and KDMs are issued now to start Premieres on time.


There are roaring pre-sales all over. As of now, the pre-sales crossed $200k mark as of yesterday which is massive. Going by the trend, Akhanda will be one of the biggest openers for a Telugu film in 2021. Apparently, aggressive promotions and positive buzz is favoring the movie to make strong business.


Pragya Jaiswal played the leading lady, while Srikanth and Jagapathi Babu will be seen in very powerful roles.


Akhanda marks hat-trick film in Balakrishna and Boyapati’s combination. Miryala Ravinder Reddy is producing Akhanda on a grand scale on Dwaraka Creations.


S Thaman has scored music and all the songs got tremendous response. The theatrical trailer of the movie too got thumping response.


Go grab your tickets for this Big ticket film after 8 months


Click Here for USA Schedules…


Any queries pls do contact

Venkat-+91 9100500128

Radhakrishnaentertainments@gmail.com




Victory Venkatesh Launched Naga Shaurya Lakshya Trailer

విక్ట‌రి వెంక‌టేష్ విడుద‌ల చేసిన నాగ‌శౌర్య `లక్ష్య` ట్రైల‌ర్‌



స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్య చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది.  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విక్ట‌రి వెంక‌టేష్ విడుద‌ల‌చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో...


డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ‘ఆర్చరీ మీద మొదటి సినిమా. క్రికెట్ అంటే ఓ మతం. ఓ దేవుడు అని అంతా అనుకుంటారు. ఎన్నో ప్రాచీన విద్యలు మరుగున పడుతున్నాయి. బుద్దిజం మన వద్దే పుట్టింది. కానీ వేరే దేశాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉందనేది కూడా తెలియడం లేదు. మనం దేవుళ్లుగా కొలిచేవారి చేతిలో, వీరులుగా చెప్పుకునే వారి చేతిలో విల్లును చూస్తాం. ఇది అంత గొప్పది. అన్నింటిని ఆటలు అంటాం. కానీ ఆర్చరీని మాత్రం విలు విద్య అని అంటాం. నేను కథను రాసుకున్నప్పుడు.. నన్ను నమ్మి నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ అవకాశం ఇచ్చారు. నేను రాసుకున్నది నలభై శాతం అయితే.. వంద శాతాన్ని చేసింది నాగ శౌర్య. ఆయన లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నిర్మాణ పరంగా నిర్మాతలు సహకరిస్తే.. కథను, పార్థు అనే  పాత్రను నాగ శౌర్య నెక్స్ట్ లెవెల్‌కు నాగ శౌర్య తీసుకెళ్లారు. విలుకాడికి సిక్స్ ప్యాక్ అవసరమా? అని అంతా అన్నారు. కానీ విల్లు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో అలా బాడీ కూడా ఉండాలి. మూడు రోజులు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కనీసం ఆయన ఉమ్ము కూడా మింగలేదు. 8 ప్యాక్ కోసం మూడు రోజులు అలానే ఉండిపోయారు. రితిక అనే పాత్రలో కేతిక శర్మ కనిపిస్తారు. పార్దుకు వెన్నుదన్నుగా ఉండే పాత్రలో అద్భుతంగా నటించారు. నువ్ తప్పు చేసి గెలిచావ్.. వాడు నిన్ను తప్పించి గెలవాలని అనుకున్నాడు అనే సీన్‌లో అద్భుతంగా  నటించారు. జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ ఇలా అందరూ బాగా నటించారు. సినిమాను ఇంత బాగా వచ్చేలా చేసిన కాళ భైరవకు థ్యాంక్స్. చిత్రానికి పని చేసిన అందరికీ థ్యాంక్స్. ఇది రెండున్నరేళ్ల కష్టం. ఇక్కడి వరకు తీసుకొచ్చిన నాగ శౌర్యకు థ్యాంక్స్’ అని అన్నారు..


కేతిక శర్మ మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సంతోష్ గారికి థ్యాంక్స్. కొన్ని సీన్లు చూశాను. నాగ శౌర్య అద్భుతంగా నటించారు. నాలుగు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. సంతోష్ గారు తన మనసులోంచి ఈ కథను అందంగా రాశారు. జగపతి బాబు గారితో  స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉంది’ అని అన్నారు.


కాళ భైరవ మాట్లాడుతూ..  ‘ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. టీజర్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ట్రైలర్‌కు అలాంటి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. గత రెండేళ్లుగా ఈ సినిమా మీద పని చేస్తున్నాం. నా కెరీర్‌లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంత తక్కువ సమయంలోనే స్పోర్ట్స్ బేస్డ్ సినిమా రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ ఇంత త్వరగా ఆ అవకాశం వచ్చింది’ అని అన్నారు.


నిర్మాత రామ్ మోహన్ మాట్లాడుతూ.. ‘స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ఒకప్పుడు కబడ్డి, రగ్బీ వచ్చాయి. చాలా రోజుల తరువాత ఇలా మళ్లీ క్రీడా నేపథ్యంలో సినిమా వస్తుండటంతో అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ సినిమా కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డారు. ఎనిమిది పలకల దేహంలో కనిపించడం మామూలు విషయం కాదు. మేం ముందే రావాలని అనుకున్నాం. కానీ మాకు మంచి తేదీ దొరికింది. డిసెంబర్ 10న రాబోతోంది. ముందు  ఈ సినిమాను మ్యూజిక్ చేయకముందు చూశాను. మ్యూజిక్ చేసిన తరువాత చూశాక అద్భుతంగా అనిపించింది. ఈ చిత్రం కచ్చితంగా టార్గెట్‌ను రీచ్ అవుతుంది’ అని అన్నారు.


నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం రెండున్నరేళ్లుగా కష్టపడ్డాం. మొదటగా సంతోష్ వచ్చి మూడు గంటలు కథ వినిపించారు. అప్పటికి ఇంటర్వెల్ అయింది. ఇక మిగతా కథ రేపు వింటాను అని అన్నాను. ఆయన ప్రతీ ఒక్క పాయింట్‌ను ఎంతో క్లియర్‌గా వివరించారు. బాణం ఎలా పట్టుకోవాలి.. ఎలా వదలాలి అని చెప్పారు. అప్పుడే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. సెండాఫ్ విని ఓకే చేసేద్దామని అనుకున్నాను. మా నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేద్దాం సర్ అంటూ చిన్నపిల్లాడిలా అడిగేవాడిని. ఏమైనా కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించండి. కాళ భైరవ నా స్నేహితుడు. ఐదారేళ్ల నుంచి పని చేయాలని అనుకున్నాం. ఇప్పుడు ఇలా కుదిరింది. ఆర్ఆర్ మాత్రం అదరగొట్టేశాడు. కేతిక శర్మ రొమాంటిక్ సినిమాలో నటించింది. ఆ అమ్మాయిని చూస్తే ఎవ్వరికైనా సరే రొమాన్స్ చేయాలనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఇంత అభిమానాన్ని చాలా తక్కువ మంది సంపాదించుకుంటారు. దాన్ని కాపాడుకో కేతిక. సినిమాటోగ్రఫర్ రామ్ రెడ్డి గారు చాలా బాగా చూపించారు. మాటల రచయిత మణి గారు చాలా బాగా రాశారు. ఈ చిత్రంలో జగపతి బాబు గారు, సచిన్ ఖేద్కర్ గారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. నేను మోయలేని సమయంలో ఆ ఇద్దరూ వచ్చి నిలబెడతారు. ముగ్గురి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. కథను చెప్పి స్పూర్తినింపిన డైరెక్టర్ సంతోష్ గారు ఒకరు. జగపతి బాబు గారిని డామినేట్ చేయాలనే కోరిక ఉండటం, సచిన్ ఖేద్కర్ వంటి వారి వంటి నటులు నా ముందు ఉండటంతో నాలోని నటుడిని బయటకు తీసుకురావాలనే కోరిక పుట్టింది. స్పోర్ట్స్ సినిమా అంటే చివరకు హీరో గెలవాలి. ప్రేమ కథలు అంటే అమ్మాయి అబ్బాయి చివరకు కలవాలి. ప్రతీ సినిమాలోనూ  అలానే ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అలానే ఉంటుంది. కానీ చివరకు హీరో ఎలా గెలిచాడన్నది ఆసక్తి కరంగా ఉంటుంది. ఒకేసారి సినిమా సినిమాకు లుక్ మార్చడం చాలా కష్టంగా అనిపించింది. కోహ్లీ గారికి కూడా సిక్స్  ప్యాక్ ఉంటుంది. క్రికెట్‌కు సిక్స్ ప్యాక్ అవసరం లేదు. మన మైండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందని చెప్పడానికి ఫిట్ నెస్ ఉపయోగపడుతుంది. ఈ కథ నన్ను 8 ప్యాక్స్ కోరింది. నేను చేశాను. ఒక వేళ కారెక్టర్ డిమాండ్ చేస్తే పది పలకల దేహాన్ని కూడా చేస్తాను’ అని అన్నారు.

Minnal Murali will premiere worldwide on December 24, 2021 on Netflix

 NETFLIX SURPRISES FANS WITH A BONUS TRAILER OF MINNAL MURALI, THE UPCOMING  SUPERHERO FILM

Minnal Murali, starring Tovino Thomas and directed by Basil Joseph, will premiere worldwide on December 24, 2021 only on Netflix



Netflix surprised fans with a bonus trailer of Minnal Murali today that peeks into the superhero universe and leaves you intrigued at all the possibilities. Minnal Murali, the upcoming superhero film on Netflix has been breaking records and stealing hearts across the country.  Lightning power, an epic origin story and the tale of good vs. evil, the trailer that was released today promises to evoke a range of emotions and captivate audiences, making it the perfect Christmas holiday movie. The film will premiere in Malayalam with dubs in Tamil, Telugu, Kannada, Hindi and English.


Tovino Thomas will star in the upcoming superhero film as the superhuman 'Minnal Murali', alongside Guru Somasundaram, Harisree Ashokan, and Aju Varghese in pivotal roles. Produced by Weekend Blockbusters (Sophia Paul) and directed by Basil Joseph, the super hero film will premiere worldwide on December 24, 2021, exclusively on Netflix.


Talking about the trailer, Filmmaker Basil Joseph said, “I am delighted and overjoyed with the response to the trailer. In order to keep our fans guessing, we decided on sharing a sneak peek of what is to come, through this bonus trailer. Our endeavor is to give the audience a good movie and to entertain them through the film. With the bonus trailer we hope the audience are intrigued and are as excited about watching the film as we are to show it to them”


Producer Sophia Paul of Weekend Blockbusters added ,“Our goal was to make Minnal Murali a well-rounded film and a family entertainer with something for everyone. Along with the story, it is the amazing cast who have all delivered surreal performances and the crew whose efforts will make people want to watch the film again and again. The bonus trailer will surely leave the audience super excited for what is to come.”


 Minnal Murali will take you on a triumphant journey of good versus evil on December 24, 2021

 

Producers

Weekend Blockbusters (Sophia Paul)


Director

Basil Joseph

 

Actors

Tovino Thomas

Guru Somasundaram

Harisree Ashokan

Aju Varghese

 

Writer, Screenplay, Dialogue

Arun A.R, Justin Matthews

 

Lyrics

Manu Manjith

Music

Shaan Rahman, Sushin Shyam


About Netflix:

Netflix is the world's leading streaming entertainment service with 214 million paid memberships in over 190 countries enjoying TV series, documentaries and feature films across a wide variety of genres and languages. Members can watch as much as they want, anytime, anywhere, on any Internet-connected screen. Members can play, pause and resume watching, all without commercials or commitments.


About Weekend Blockbusters: Weekend Blockbusters debuted in 2014 by co-producing Bangalore Days, the first Malayalam movie that had a successful theatrical run in major metros outside Kerala, was one of the highest grossers in Malayalam cinema and is still revered as a cult movie across south India. The second production was the festival favourite and award winning Kaadu Pookkunna Neram which was directed by Dr Biju in 2016. The next film was the commercially successful Mohanlal starrer domestic drama Munthirivallikal Thalirkkumbol, directed by Jibu Jacob in 2017, followed by a comedy road movie Padayottam, starring Biju Menon in 2018. Minnal Murali is Weekend Blockbusters most ambitious project to date, to be released in major languages in India in 2021 and will be followed by Bismi Special, starring Nivin Pauly.

Mugdha Grand Opening in Vizag Jagadamba Center On December 5Th

 ముగ్ద స్టోర్ డిసెంబరు 5న గొప్ప ప్రారంభం  జగదాంబ సెంటర్, వైజాగ్ లో...



టెంపుల్‌ థీమ్‌ స్టోర్‌  ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకం  ఇప్పుడు మన వైజాగ్ జగదాంబ సెంటర్ మరియు సంపత్ వినాయక రోడ్ లో


ప్రతి అందానికి ప్రతి బంధానికి ముగ్ధ....   ముగ్ధ సరికొత్త కంచి పట్టు ప్రపంచానికి స్వాగతం



టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను  వైజాగ్  నగర వాసులకు  డిసెంబరు 5న  దగ్గర కానున్నారు.  ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్‌ స్టూడియో ని ఏర్పాటు చేసి ఫ్యాషన్‌ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి... ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడ మరియు వైజాగ్ వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను  అందుబాటులోకి తెస్తున్నారు.

 

ఈ సందర్భంగా శశి వంగపల్లి మాట్లాడుతూ ‘‘  వైజాగ్  నా అభిమాన నగరాల్లో ఒకటి. మాకు ఇక్కడ చాలా మంది సన్నిహుతులు ముఖ్యంగా ఏళ్లతరబడి క్లయింట్స్‌ ఉన్నారు. ఇక్కడ జరిగిన ఎన్నో అద్భుతమైన వివాహ వేడుకల్లో మేం భాగం పంచుకున్నాం. అంతేకాదు ఇక్కడ నుంచీ హైదరాబాద్‌లోని మా స్టోర్స్‌కు   ఎందరో క్లయింట్స్‌ వస్తుంటారు. ఈ అందమైన నగరంలో భాగం కావడమనేది మా కల.  ఈ నగరంలో  ముగ్ధ స్టోర్‌ ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆ కల ఇప్పటికి సాకారమైంది’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.


           టెంపుల్‌ థీమ్‌ స్టోర్‌ అనేది శశివంగపల్లి ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకం. అన్ని విషయాల్లోనూ దేశంలోనే అత్యంత వినూత్నమైన స్టోర్‌ ఇది. కస్టమర్లకు ఆహ్లాదకరమైన షాపింగ్‌ అనుభూతిని అందించే ఈ స్టోర్‌ ఇప్పుడు  వైజాగ్   నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది.  ఈ డిసెంబరు 5న  , 2021న ప్రారంభించనున్నారు. ‘‘మా దగ్గర ప్రత్యేకమైన, ఉత్తమమైన కలెక్షన్స్‌ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కి అందుబాటు ధరలలొనే   అందిస్తాం. ఎల్లప్పుడూ మేం నాణ్యతపైనే దృష్టి సారిస్తాం. డిజైన్లు, దుస్తుల నాణ్యత రెండింటి పరంగానూ మా కస్టమర్లకు ఉత్తమమైనవే అందివ్వాలని ఆశిస్తాం’’అని స్టోర్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ స్టోర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్యాషన్‌ ప్రియులు అందరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు.

Music Legend Ilayaraja Condolences to Sirivennela Sitarama Sastry

 సాహితీ హిమాలయం సీతారాముడు. 

- ఇళయరాజా



వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతో

అందమైన, అర్థవంతమైన,

సమర్థవంతమైన పాటలని

మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు..

ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న  సరస్వతీ పుత్రుడు...

మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి... రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా

ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు...రేపు రాబోయే 

" రంగమార్తాండ " కూడా..

సీతారాముడు  రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో.....!!

సీతారాముడు

పాటతో ప్రయాణం చేస్తాడు

పాటతో అంతర్యుద్ధం చేస్తాడు..

పాటలో అంతర్మథనం చెందుతాడు...

పాటని ప్రేమిస్తాడు..

పాటతో రమిస్తాడు..

పాటని శాసిస్తాడు..

పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు....

మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే

సీతారాముడి పాటలు ఎప్పటికీ  గుర్తుంటాయి..

తన సాహిత్యం 

నాతో ఆనంద తాండవం చేయించాయి

నాతో శివ తాండవం చేయించాయి..

"వేటూరి"  

నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే...

"సీతారాముడు"  

నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు..

ధన్యోస్మి మిత్రమా..!!

ఇంత త్వరగా  సెలవంటూ

శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది..

"  పాటకోసమే బ్రతికావు,

బ్రతికినంత కాలం పాటలే రాసావు....

ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్న...


...........🙏ఇళయరాజా

Daksha Title Logo Launched

 దక్ష - టైటిల్ లోగో ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి, శరత్ బాబు





శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా, వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం " దక్ష".

ఈ సినిమా ద్వారా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ లోగో ను సీనియర్ నటులు తనికెళ్ళ భరణి మరియు శరత్ బాబు గారు విడుదల చేశారు.


ఈ సందర్భంగా సీనియర్ నటులు తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ "దక్ష అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడు అని అర్థం"  అతనే మా  తల్లాడ సాయి కృష్ణ , తను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు. గతంలో తాను డైరెక్ట్ చేసిన ఒక వ్యవసాయ షార్ట్ ఫిలిం కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. ఈ దక్ష చిత్రం లో మన శరత్ బాబు గారి తనయుడు ఆయుష్ హీరో గా పరిచయం అవుతున్నాడు. శరత్ బాబు గారు నాకు మంచి మిత్రుడు, ఎన్నో చిత్రాల్లో కలిసి పని చేసాం. ఆయుష్ కి ఈ చిత్రం మంచి విజయం అందించాలని, ఈ సినిమా లో పని చేసిన నటులకు టెక్నిషన్స్ అందరికీ మంచి అవకాశాలు రావాలి" అని కోరుకున్నారు.


శరత్ బాబు గారు మాట్లాడుతూ "ఆయుష్ నా తమ్ముడి కొడుకు, నా కొడుకు కూడా. ఆయుష్ కి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. ఈ చిత్రం టైటిల్ లోగో కార్యక్రమానికి తనికెళ్ళ భరణి గారు గెస్ట్ గా రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి, నిర్మాతలకు మంచి డబ్బు సంపాదించి పెట్టి, దర్శకుడికి మంచి విజయం కావాలి" అని కోరుకున్నారు.


నటులు తల్లాడ వెంకన్న మాట్లాడుతూ "దక్ష చిత్రం టైటిల్ లోగో విడుదల చేసిన తనికెళ్ళ భరణి గారికి శరత్ బాబు గారికి నా శుభాకాంక్షలు. తల్లాడ సాయి కృష్ణ మా తమ్ముడి  కొడుకు, తనకు మంచి బంగారు భవిష్యత్తు ఉండాలి అని, ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్న వివేకానంద విక్రాంత్ కి ఈ చిత్రం మంచి విజయం , పెరు తీసుకొని రావాలి అని, ఈ చిత్రం లో నటించిన నటి నటులకి, టెక్నిషన్స్ అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టాలి" అని కోరుకున్నారు.


దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ "దర్శకుడిగా దక్ష నా మొదటి చిత్రం నిర్మాత తల్లాడ సాయి కృష్ణ చాలా సపోర్ట్ చేసాడు. సినిమా చాలా బాగా వచ్చింది, మంచి విజయం సాధిస్తుంది" అని కోరుకున్నారు.


హీరో ఆయుష్ మాట్లాడుతూ "నేను హీరో గా అవ్వాలి అన్నది నా డ్రీమ్. ముంబై లో యాక్టింగ్ కోర్స్ చేశాను. ఇప్పుడు దక్ష చిత్రం తో హీరో గా పరిచయం అవుతున్నాను. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడి పని చేసాం. హైదరాబాద్, అరకు, ఖమ్మం లాంటి ఎన్నో లొకేషన్స్ లో షూటింగ్ చేసాము. ఇది ఒక థ్రిల్లర్ సినిమా 2022, జనవరి లేక ఫిబ్రవరి లో విడుదల అవుతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి.


హీరోయిన్స్ అను మరియు నక్షత్ర ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకున్నారు.


నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ "దక్ష చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం. మా చిన్న చిత్రానికి మీడియా సపోర్ట్ కావాలి. మంచి కథ తో మీ ముందుకు వస్తున్నాం. మీ సపోర్ట్ కావాలి" అని కోరుకున్నారు.


సినిమా : " దక్ష "

బ్యానర్ :- శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్

నిర్మాత :- తల్లాడ శ్రీనివాస్

కో-ప్రొడ్యూసర్ :- తల్లాడ సాయి కృష్ణ

డైరెక్టర్ :- వివేకానంద విక్రాంత్

హీరో , హీరోయిన్ లు :- ఆయుష్ , అను , నక్షత్ర , శోభన్ బాబు ,రవి రెడ్డి ,రియా ,అఖిల్ , పవన్   తదితరులు ...

కథ - మాటలు :- శివ కాకు ,

కెమెరా :- శివ రాతోడు , ఆర్.ఎస్ . శ్రీకాంత్,

సంగీతం :- రామ్ తవ్వ ,

పబ్లిసిటీ డిజెన్స్ :- రాహుల్ , శ్యామ్ వీరవెల్లి , రాజేష్  బచ్చు ,

పిఆర్ఓ :-  పాల్ పవన్

RGV’s LADKI : Enter the Dragon Girl is first Hindi trailer on Burj Khalifa

 RGV’s LADKI : Enter the Dragon Girl is first Hindi trailer on Burj Khalifa



For the first time in the History of Hindi Cinema and the 11-year-old existence of the iconic Burj Khalifa, the Hindi film trailer of Ram Gopal Varma’s ambitious film LADKI : Enter The Girl Dragon was showcased on the Burj Khalifa in Dubai Yesterday. The man, Ram Gopal Varma himself graced this colourful event along with his cast and crew and made the night vivid.

Director Ram Gopal Varma tweeted "This is the most thrilling moment of my entire career to see the trailer of my most ambitious film Ladki trailer on the tallest screen in the world. I am in tears". The film Ladki in Hindi, Ammayi in Telugu and Dragon girl in China will release on 10th December on large scale. 

Artsee Media, Big People and Parijatha Movie Creations banners have produced it.



The film starring Pooja Bhalekar is already in the news after being Ram Gopal Varma’s tribute to Bruce Lee and is also being released in China with Chinese subtitles. The film will release in around 30000 theatres in China alone making it the largest release ever.

Sehari Ready for Release

 విడుద‌ల‌కు సిద్ద‌మైన హర్ష్‌ కనుమిల్లి,  జ్ఞానసాగర్  ద్వార‌క‌, వర్గో పిక్చర్స్ `సెహ‌రి`.



హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన  టీజ‌ర్ 60 లక్షల వీక్షణలు పొందగా,  “సెహరి టైటిల్ సాంగ్”, “ఇది చాలా బాగుందిలే” యూట్యూబ్ నందు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “ఇది చాలా బాగుందిలే” అనే పాట 80 లక్షల వీక్షణలు పొంది శరవేగంగా కోటి వీక్షణలకు దూసుకుపోతూ అతి త్వ‌ర‌లో విడుద‌ల‌కాబోతున్న ఈ చిత్రం  పట్ల ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. ఈ సంద‌ర్భంగా


నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ - `సెహ‌రి టీజర్ మరియు పాటల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ముఖ్యంగా హీరో హర్ష్ కనుమిల్లి నటన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అంతే కాకుండా ఎక్కడ కూడా మొదటి సారిగా నటించినట్టుగా కాక ఎంతో అనుభవంతో నటిస్తున్నట్టుగా చాలా అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించబడిన “సెహరి” సినిమా కుటుంబ సమేతంగా వెళ్ళి హాయిగా నవ్వుకుని ఆనందించదగ్గ సినిమా అవుతుంది” అని చిత్ర విజయం పట్ల నిర్మాత ఆద్వయ జిష్ణు రెడ్డి దీమా వ్యక్తం చేశారు.


దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ - ``ఈ చిత్రంలోని కధ మరియు పాత్రలు అన్నీ యువత మరియు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాం” అన్నారు.


నటీనటులు: హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి, అభినవ్‌ గోమఠం, ప్రణీత్‌ రెడ్డి, కోటి, బాలకృష్ణ


సాంకేతిక విభాగం

దర్శకుడు: జ్ఞానసాగర్‌ ద్వారక

ప్రొడ్యూసర్స్‌: అద్వయ జిష్ణు రెడ్డి

డీఓపీ: అరవింద్‌ విశ్వనాథ్‌

మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రశాంత్‌ ఆర్ విహారి

ఎడిటర్‌: రవితేజ గిరిజాల

ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్

Pakka commercial Team Birthday Wishes to Raashi Khanna

 దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలా ఉన్న రాశీ ఖన్నా‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ బర్త్ డే టీజర్..



ప్ర‌తి రోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ వ‌రుకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రాశీ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ టీజర్ మేకింగ్ చాలా రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇందులో హీరోయిన్ రాశీ ఖన్నా ఆకాశం నుంచి నేలపైకి వస్తున్న దేవకన్యలా కనిపిస్తున్నారు. ఈమె క్యారెక్టర్‌ను ప్రతిరోజూ పండగే మాదిరే ఇందులోనూ మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ పాత్రను కూడా చాలా చక్కగా డిజైన్ చేసారు మారుతి. టీజర్‌లోనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వస్తుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌.  మార్చ్ 18న సినిమా విడుదల కనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.


నటీనటులు:

గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు


టెక్నికల్ టీం:

స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్

బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్

నిర్మాత‌ - బ‌న్నీ వాస్

ద‌ర్శ‌కుడు - మారుతి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్

స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్

లైన్ ప్రొడ్యూసర్ - బాబు

ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్

సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Game On Motion Poster Launched




 శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "గేమ్ ఆన్" సినిమా రవి కస్తూరి సమర్పణలో డిసెంబర్ మూడవ వారంలో షూటింగ్ మొదలవుతుంది.సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడైన కుమార్ బాబు నిర్మాతగా తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.హీరోగా రథం ఫేం గీతానంద్ తన తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకొని అందరి ప్రశంశలు పొందిన గీతానంద్ హీరోగా నటిస్తున్నారు.దర్శకుడు దయానంద్ తన మొదటి సినిమా "బాయ్స్" తో అందరి టెక్నీషియన్స్ మన్ననలు పొంది యూత్ ని ఆకట్టుకునేలా త్వరలో రిలీజ్ కు సిద్ధమై ఉంది.ఈ ఇద్దరి కలయికతో నిర్మిస్తున్న "గేమ్ ఆన్" సినిమా సరికొత్త కథతో ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథాంశంతో మంచి టెక్నీషియన్ తో నిర్మిస్తున్న చిత్రం. సినిమా స్టార్ట్ చేయకుండానే సినిమా కథ తెలిసి హిందీ రైట్స్ అడగడం ఆశ్చర్యకరంగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా చిన్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇందులో ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఎమోషన్,లవ్ సెంటిమెంట్స్, ట్విస్టులు ఇలా అన్ని రకాలుగా అందరిని ఆకట్టుకునే అంశాలు అన్నీ ఉన్నాయి. నాకున్న అనుభవంతో చెప్తున్నా టాప్ టెన్ మూవీస్ లో ఈ సినిమా ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ సినిమాతో గీతానంద్ మంచి హీరోగా నిలబడటమే కాకుండా దర్శకుడిగా దయానంద్ మంచి మార్కులు కొట్టేస్తాడు.మంచి  టెక్నీషియన్స్ దొరకడమే కాకుండా ఈ సినిమాకు ఆర్టిస్టులు అందరూ సెట్ అవుతున్నారు.చాలా మంచి ఇంపార్టెంట్ మధుబాల మదర్ క్యారెక్టర్ చేస్తుంది. కన్నడ కిషోర్, మధుసూదన్  చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఈ సినిమా 2022లో ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత కుమార్ బాబు తెలియజేశారు.


 

 సాంకేతిక నిపుణులు

సమర్పణ : రవి కస్తూరి

బ్యానర్ :శ్రీ లక్ష్మీ వెంటకేశ్వర క్రియేషన్స్ &  గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్‌  

నిర్మాత : కుమార్ బాబు

రచన,దర్శకత్వం : దయానంద్.

లైన్ ప్రొడ్యూసర్ : నికిలేష్ వర్మ

విజువల్స్ : కుశేందర్ రమేష్ 

ప్రొడక్షన్ డిజైన్ : దిలీప్ జాన్ 

సంగీతం : అశ్విన్- అరుణ్

పి.ఆర్.ఓ :మధు.వి.ఆర్ & వంశీ శేఖర్

Hero Satya Dev Interview About SkyLab

 ‘స్కై లాబ్‌’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది :  హీరో స‌త్య‌దేవ్‌



వెర్సటైల్ యాక్టర్స్ స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించి చిత్రం ‘స్కైలాబ్‌’. నిత్యామీన‌న్ స‌హ నిర్మాత‌.  1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. డిసెంబర్ 4న మూవీ విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో స‌త్య‌దేవ్ ఇంట‌ర్వ్యూ విశేషాలు...



- సాధార‌ణంగా నేను కాలేజీ డేస్ నుంచి చాలా స‌ర‌దాగా ఉంటాను. కానీ నా ఫేస్ చూడ‌టానికి కామెడీకి భిన్నంగా ఉండ‌టంతో ప్రారంభంలో ఇన్‌టెన్స్ రోల్స్ చేస్తూ వ‌చ్చాను. అలాంటి రోల్స్ చేస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు కానీ, స్నేహితులు కానీ.. ఏంట్రా నువ్వు ఇన్‌టెన్స్ రోల్స్ చేస్తున్నావు అనుకునేవాళ్లు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన క్యారెక్ట‌ర్ కూడా రాలేదని కూడా ఆగాను. ఇక స్కై లాబ్ విష‌యానికి వ‌స్తే  అందులో నా క్యారెక్ట‌ర్ ఫ‌న్నీగా ఉంటుంది. స్కై లాబ్ ప‌డిపోతున్న‌ప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఓ డాక్ట‌ర్ డిమాండ్ సప్ల‌య్ అని మాట్లాడుతుంటాడు. డాక్ట‌ర్ ఆనంద్‌కు మంచి ఆర్క్ ఉంటుంది. స్కై లాబ్ ప‌డిపోతున్నప్పుడు దాన్ని ఉప‌యోగించుకుని డ‌బ్బులు సంపాదించాల‌నుకునే ఆనంద్ అనే డాక్ట‌ర్ చివ‌ర‌కు ఎలా మారిపోతాడ‌నేది.. క్యారెక్ట‌ర్‌లో మంచి ఆర్క్ ఉంటుంది. సిట్యువేష‌న‌ల్ కామెడీ. గ్రామ‌స్థుల‌తో కామెడి. ఆనంద్ బండ లింగ‌ప‌ల్లిలో ఓ క్లినిక్ పెట్టాల‌నుకుంటాడు. ఆ గ్రామ‌స్థులు అందుకు ఒప్పుకుంటారా? ఏం చెప్పి ఒప్పించారు? అనే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. గౌరి, డాక్ట‌ర్ ఆనంద్‌, సుబేదార్ రామారావు స‌హా అన్నీ పాత్ర‌ల‌ను చ‌క్క‌గా రాశారు. వీళ్లు వాళ్లు అని కాదు.. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. 


- స్కై లాబ్ ప‌డిపోతుంద‌ని, ఓ ప‌ర్టికుల‌ర్ గ్రామం నాశ‌న‌మైపోతుంద‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో.. అప్ప‌ట్లో అంద‌రూ భ‌య‌ప‌డ్డారు. ప‌ర్టికుల‌ర్ ప్రాంతంలోని వారు చ‌నిపోతామ‌ని భావించారు. కోళ్లు, మేక‌లు కోసుకుని తినేశారు. ఇంకేం ఉండ‌దు అని భావించారు. నేను విన్న దాని ప్ర‌కారం కొంద‌రైతే బంగారు నాణెల‌ను మింగేశార‌ని, కొంద‌రు ఆస్థుల‌ను అమ్ముకుని వెళ్లిపోయార‌ని ఇలా చాలా చాలా జ‌రిగాయి. 


- గౌరి, ఆనంద్‌, సుబేదార్ రామారావు అనే మూడు ప్ర‌ధాన పాత్ర‌లు వీటితో పాటు స్కై లాబ్‌... బండ లింగ‌ప‌ల్లిలోని ప్ర‌జ‌లు చుట్టూ క‌థ తిరుగుతుంది. అంద‌రి మ‌ధ్య కామెడీగా సాగే సినిమా. 


- స్కై లాబ్‌కు ఆదిత్య జ‌వ్వాది సినిమాటోగ్రాఫ‌ర్‌. డీ శాట్ ప్యాట్ర‌న్‌లో కాకుండా .. ద‌ర్శ‌కుడు విశ్వ‌క్ అండ్ టీమ్ దాన్నొక సెల‌బ్రేష‌న్స్‌లా చూపించాల‌ని అనుకున్నారు. దాంతో సినిమా అంతా క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించారు. క‌రీంన‌గ‌ర్ బండ‌లింగ‌ప‌ల్లి గ్రామంలో జ‌రిగే క‌థ‌. కాబ‌ట్టి యాస విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. నాకు తెలంగాణ యాస కొంత‌వ‌చ్చు. కొంత నేర్చుకున్నాను. 


- సింక్ సౌండ్‌లో సినిమా చేయ‌డం వ‌ల్ల డ‌బ్బింగ్ చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే సింక్ సౌండ్‌లో సినిమా చేయ‌డ‌మ‌నేది అంత సుల‌భ‌మైన విష‌య‌మైతే కాదు. డైలాగ్ నేర్చుకుని సీన్‌లో న‌టించ‌గ‌లిగితే అథెంటిక్‌గా ఉంటుంది. పెర్పామెన్స్ కూడా ఎన్‌హ‌న్స్ అవుతుంది. 


- నాకు, నిత్యామీన‌న్‌కు ఆన్ స్క్రీన్ ఒక సీన్ కూడా ఉండ‌దు. నిత్యా మీన‌న్‌గారు సూప‌ర్బ్ పెర్ఫామ‌ర్‌. అన్ని పాత్ర‌ల‌కు ఓ క‌నెక్టింగ్ పాయింట్ ఉంటుంది. 


- వివేక్ ఆత్రేయ నాకు ఫోన్ చేసి విశ్వ‌క్ గురించి చెప్పి క‌థ విన‌మ‌న్నాడు. త‌ను రాగానే సూట్‌కేసుతో వ‌చ్చాడు. అడ్వాన్స్ ఇస్తాడేమో అనుకున్నాను. కానీ అందులో సినిమాకు కావాల్సిన డేటా ఉంది. దాని స‌హాయంతో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్లాడు. త‌ను అంత క్లారిటీతో ఉన్నాడు. నెరేష‌న్‌ న‌చ్చ‌డంతో ముందుకెళ్లాం. కోవిడ్ టైమ్‌లో షూటింగ్స్ ఆగిపోయాయి. గ్యాప్‌లో మ‌రో చిన్న సినిమా చేద్దామ‌ని అన్నా కూడా త‌ను ఒప్పుకోలేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. 


- లుక్ విష‌యంలోనూ విశ్వ‌క్ కేర్ తీసుకున్నాడు. అంతకుముందున్న సినిమాల్లో ఉన్న గ‌డ్డం మీసాలు తీసేసి న‌టించాను. 


- న‌టుడిగా ఛాలెంజ్‌ను తీసుకోక‌పోతే సెట్స్‌కు రాలేనేమో అని నేను భావిస్తాను. అందుక‌నే స్కై లాబ్ సినిమా చేశాను. గుర్తుందా శీతాకాలం సినిమా చూస్తే అందులో మూడు వేరియేష్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తాను. ల‌వ్‌స్టోరి. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయ‌ని జోన‌ర్ కాబ‌ట్టి చేశాను. అలా రొటీన్‌గా చేస్తే ఆడియెన్స్ తిడతారు..


- గాడ్‌ఫాద‌ర్‌లో న‌టిస్తున్నాను. కానీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే బావుంటుంది.

Nayeem Dairies Releasing on December 10th

 డిసెంబర్‌ 10న వస్తున్న ‘నయీం డైరీస్‌’



గ్యాంగ్‌ స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న ‘నయీం డైరీస్‌’ చిత్రం డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వశిష్ఠ సింహ లీడ్‌ రోల్‌ చేశారు. సీఏ వరదరాజు నిర్మాత. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ చక్కని స్పందన వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత సీఏ వరదరాజు మాట్లాడుతూ... నయీం కథ వినగానే యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో బాగుంటుందని చేశాం.  వశిష్ట సింహ నటన హైలెట్ గా ఉంటుంది.

మేము అనుకున్న దానికంటే బాగా యాక్ట్‌ చేశారు.  డిసెంబర్‌ 10న సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. 


దర్శకుడు దాము మాట్లాడుతూ ‘‘రాజకీయ, పోలీస్‌ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయి అన్నది ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం.  నయీం ఎన్‌కౌంటర్‌ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యాయనం చేశాను. తను అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు నేనూ విప్లవకారుడుగా ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నాను. ఒక విప్లవకారుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో చూశాను. అవన్నీ డ్రమటిక్‌గా సినిమాలో చూపించాను. నయీం పాత్ర పోషించిన వశిష్ఠ సింహ నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు చక్కని స్పందన వస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా వర్గాల నుండే కాకుండా సమాజం లో  విభిన్న వర్గాల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది."  అని అన్నారు. 


యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్‌, శశి కుమార్‌, జబర్దస్త్‌ ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – సురేష్‌ భార్గవ్‌, సంగీతం– అరుణ్‌ ప్రభాకర్‌, ఎడిటర్‌ – కిషోర్‌ మద్దాలి, పీఆర్వో – జి యస్ కె మీడియా, నిర్మాత సీఏ వరదరాజు, రచన దర్శకత్వం దాము బాలాజీ.

83 Trailer Launched Movie Releasing on December 24th

 భార‌త క్రికెట్ ప్రేమికుడు మ‌ర‌చిపోలేని అద్వితీయ ప్ర‌యాణం ‘83’ ట్రైలర్ విడుదల.. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 ప్రపంచ వ్యాప్తంగా  సినిమా విడుదల



భార‌త‌దేశంలో క్రికెట్‌ను ప్రేమించిన‌, ప్రేమించే, ప్రేమించ‌బోయే ప్ర‌తివారు తెలుసుకోవాల్సిన మ‌ర‌పురాని, మ‌ర‌చిపోలేని అద్భుత‌మైన ప్ర‌యాణం 1983. ఈ ఏడాదిలో భార‌త క్రికెట్ గ‌మ‌నాన్ని దిశా నిర్దేశం చేసింది. భార‌త క్రికెట్ టీమ్ విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించింది. అలాంటి అద్భుత‌మైన ప్ర‌యాణం గురించి నేటి త‌రంలో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. అంతెందుకు ఇప్పుడున్నంత సాంకేతిక లేక‌పోవ‌డంతో వార్తాప‌త్రిక‌లు, దూర‌ద‌ర్శ‌న్ వంటి ఛానెల్స్ ద్వారా మాత్ర‌మే క‌పిల్ డేర్ డెవిల్స్ ప్రయాణం గురించి తెలిసింది. అయితే అది గ్రౌండ్‌లో మాత్ర‌మే. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని ఓ ప్ర‌యాణాన్ని సుసాధ్యం చేయాలంటే ఎలాంటి భావోద్వేగాల‌కు క్రికెట్ టీమ్‌లోని స‌భ్యులు లోనై ఉంటారో ఊహించ‌వ‌చ్చు. అలాంటి ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీయే ‘83’.  ఈ భారీ చిత్రం క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబర్ 24న విడుద‌ల‌వుతుంది. 


డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్ కొన్ని కోట్ల మంది భార‌తీయుల  క‌ల‌ను వెండితెర‌పై సాక్షాత్క‌రింప చేయ‌డానికి అడుగులు వేసిన‌ప్పుడు ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ‘83’ సినిమా పోస్ట‌ర్స్‌, ప్ర‌మోషన్స్‌.. క‌పిల్ దేవ్ నుంచి మేనేజ‌ర్ మాన్ సింగ్ వ‌ర‌కు ప్ర‌తి ఆట‌గాడిగా న‌టించిన యాక్టర్స్ గురించి క్ర‌మంగా తెలుస్తూ రావ‌డంతో సినిమాపై అంచన‌లు పెరిగాయి. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. అయితే మంగ‌ళ‌వారం విడుద‌లైన ‘83’ ట్రైల‌ర్ ఈ అంచ‌నాల‌ను ఆకాశాన్నంటేలా చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్వీర్ సింగ్ అల‌నాటి క‌పిల్‌దేవ్ పాత్ర‌ను పోషించగా.. నాటి క‌పిల్ స‌తీమ‌ణి పాత్ర‌ను ర‌ణ్వీర్ నిజ జీవితంలో స‌తీమ‌ణి అయిన దీపికా ప‌దుకొనె క్యారీ చేసింది. ట్రైల‌ర్ విషయానికి వ‌స్తే.. 1983లో ఎంతో కీల‌కంగా భావించిన సెమీఫైన‌ల్ పోరుతో మొద‌లైంది. నిజానికి 1983 సెమీఫైన‌ల్స్‌లో భార‌త టీమ్ జింబాబ్వేను ఎదుర్కొన్న‌ప్పుడు మ్యాచ్ ప్రసారం కాలేదు. ఆ మ్యాచ్‌ను ఎవ‌రూ చూడ‌లేక‌పోయారు. అలాంటి మ్యాచ్‌ను మ‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. 9 పరుగుల‌కు నాలుగు వికెట్లు కోల్పోయిన భార‌త టీమ్‌ను ఆనాటి కెప్టెన్ దిగ్విజ‌యంగా 176 ప‌రుగుల‌తో గెలుపు బాట ఎలా ప‌ట్టించాడో.. దాన్ని ‘83’ సినిమాలో చూపించనున్నారు.ఆ మ్యాచ్‌లోని కొన్ని ఎలిమెంట్స్‌తో ట్రైల‌ర్ స్టార్ట్ అయ్యింది. 


ఇక ఫైన‌ల్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ వెస్టిండీస్‌ను ఎదుర్కొనే క్ర‌మంలో భార‌త ఆట‌గాళ్లు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు. వాటిని మాన‌సికంగా ఎలా అధిగ‌మించి ప్ర‌పంచ క‌ప్పును ముద్దాడారు అనే విష‌యాల‌ను ఈ ట్రైల‌ర్‌లో ఆవిష్క‌రించారు. నేప‌థ్య సంగీతం, విజువ‌ల్స్ అన్నీ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా అని చెప్పేయ‌డ‌మే కాదు.. ప్ర‌తి క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయే చిత్ర‌మ‌వుతుంద‌ని చెప్ప‌క‌నే చెప్పేస్తుంది. 


అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. క‌పిల్ దేవ్‌గా ర‌ణ్వీర్ సింగ్‌, క‌పిల్ స‌తీమ‌ణి రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె, సునీల్ గ‌వాస్క‌ర్‌గా తాహిర్ రాజ్ బాసిన్‌, కృష్ణ‌మాచార్య శ్రీకాంత్‌గా జీవా, మ‌ద‌న్ లాల్‌గా హార్డీ సందు, మ‌హీంద్ర‌నాథ్ అమ‌ర్‌నాథ్‌గా స‌కీబ్ స‌లీమ్‌, బ‌ల్వీంద‌ర్ సంధుగా అమ్మి విర్క్‌, వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మాణిగా సాహిల్ క‌త్తార్‌, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌గా అదినాథ్ కొతారె, ర‌విశాస్త్రిగా కార్వా.. మేనేజ‌ర్ మాన్‌సింగ్‌గా పంక‌జ్ త్రిపాఠి త‌దిత‌రులు న‌టించారు. ఇండియ‌న్ క్రికెట్‌లో మ‌ర‌చిపోలేని అమేజింగ్ జ‌ర్నీతో రూపొందిన ‘83’ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 24న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

Clap Entertainment Production No. 3 in association with Mythri Movie Makers Launched in a Grand manner

 Ritesh Rana, Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Kishore starrer Clap Entertainment Production No. 3 in association with Mythri Movie Makers Launched in a Grand manner



Ritesh Rana, who made the Super hit Movie ‘Mathu Vadalara’ will be joining forces once again with Clap Entertainment which will produce the movie in association with Mythri Movie Makers. The director readied a surreal comedy story in a fictional world and is touted to be a comedy thriller.


Billed to be an outright entertainer and commercial film, the film will have Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Kishore and Gundu Sudarshan in the lead roles and is tentatively titled Production No. 3. The film has been launched in a grand manner with a puja ceremony today at the Westin Hotel, Hyderabad.


The clap was given by SS Rajamoulli Garu while Koratala Siva Garu directed the first shot. Gunnam Gangaraju Garu switched on the camera and Rajamouli Garu, Koratala Siva Garu along with Mythri producers Naveen Garu, Ravi Garu, Cherry Garu handed the script to the director.


Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu will be producing the film and Naveen Yerneni and Ravi Shankar Yalamanchili of Mythri Movie Makers will be presenting the film.


Kala Bhairava renders soundtracks, while Suresh Sarangam handles the cinematography. Ritesh Rana provides dialogues, while Srinivas is the Art Director and the fights will be choreographed by Shankar master. Alekhya is the Line Producer for the film and Baba Sai is the Executive Producer while Bal Subramaniam KVV is the Chief Executive Producer.


Cast: Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Kishore, Gundu Sudarshan


Technical Crew:

Dialogues, Story, Screenplay & Direction: Ritesh Rana

Producers: Chiranjeevi (Cherry), Hemalatha Pedamallu

Presenters: Naveen Yereneni, Ravi Shankar Yalamanchili

Banner: Clap Entertainment in association with Mythri Movie Makers

Music Director: Kaala Bhairava

DOP: Suresh Sarangam

Production Designer: Narni Srinivas

Dialogues: Ritesh Rana

Fights: Shankar Uyyala

Line Producer: Alekhya Pedamallu

Executive Producer: Baba Sai

Chief Executive Producer: Bala Subramanyam KVV

Production Controller: Patsa Suman Naga Shekar

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Madhu Maduri

Vijay Deverakonda’s Liger Schedule With Legend Mike Tyson In USA

 It’s A Wrap For Vijay Deverakonda’s Liger Schedule With Legend Mike Tyson In USA



Young and promising hero Vijay Deverakonda and dashing director Puri Jagannadh’s maiden Pan India project LIGER (Saala Crossbreed) that also marks Legend Mike Tyson’s debut in Indian cinema has wrapped up USA schedule. Mike Tyson’s portions have been completed with this schedule.


The shooting went smoothly with Mike Tyson lending full co-operation for the team. They had an amazing time working with the Legend. The USA schedule indeed is the best shoot schedule so far for the entire team. The wrap-up party was hosted in one of the biggest restaurants, ‘Catch’. The makers shared wrap-up party pictures of Mike Tyson posing alongside the team. Mike Tyson’s wife Kiki can also be seen in the pictures.


Mike Tyson has played a crucial and mighty role in the film and it will be an eye feast to see the happening star alongside the Legend Mike Tyson.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film.


Given it is one of the craziest Pan India projects and moreover The Great Mike Tyson on board, Puri connects and Dharma Productions are making the film on a grand scale.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


Liger is in last leg of shooting and the makers are planning to release the movie in first half of 2022.


Cast: Vijay Deverakonda, Ananya Panday, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha

Actor Shani Salmon Interview

 "రామ్ అసుర్'లో నా పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది



★ శివ‌న్న పాత్ర నా ఎదుగుద‌ల‌ను మ‌రింత పెంచింది

★ రాజ‌మౌళి గారి ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నా*

★ తెలుగు ప్రేక్ష‌కుల అండ‌దండ‌లే శ్రీరామ‌ర‌క్ష‌

- ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు షానీ సాల్‌మాన్(షానీ)


బ్లాక్‌స్టార్‌గా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు సుప‌రిచితుడైన షానీ న‌టించిన రామ్ అసుర్ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన నేప‌ధ్యంలో ఆయ‌న త‌న అంత‌రంగాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... "బ్లాక్ స్టార్‌గా గుర్తింపు పొందిన తాను తెలుగు ప్రేక్ష‌కుల అభిమానానికి శిర‌సు వంచి పాదాభివంద‌నం చేస్తున్నా అని తెలిపారు. రామ్ అసుర్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డం త‌న జీవితంలో కీల‌క మ‌లుపని, విజ‌యోత్స‌వ స‌భ‌ల‌కు ఎక్క‌డికెళ్లినా శివ‌న్నా.... అంటూ ప్రేక్ష‌కులు ఆప్యాయంగా పిల‌వ‌డం ఎంతో సంతోషాన్ని క‌ల్గిస్తుంద‌ని పేర్కొంటూ... శివ‌న్న పాత్ర‌తో త‌న గుర్తింపు మ‌రింత పెరిగింద‌ని తెలిపారు. 


షానీ త‌న ప్ర‌స్థానాన్ని వివ‌రిస్తూ... 'బేసిక‌ల్‌గా స్పోర్ట్స్‌మెన్ కావ‌డంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఓ హోల్డింగ్ చూశాన‌ని, ఆ ప్ర‌క‌ట‌న‌లో అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు కావాల‌ని, అర్హులైన వారు సంప్ర‌దించాల‌ని ఉంది. స్వ‌త‌హాగా తాను నేష‌న‌ల్ ఛాంపియ‌న్ అయినందున ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు తెలిపారు. 2003లో ఇంట‌ర్వ్యూకి వెళ్లిన‌ప్పుడు ప్రఖ్యాత ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గారి సినిమా ఆడిష‌న్స్ ప్ర‌క‌ట‌న అని తెలుసుకున్నాను. ఇంట‌ర్వ్యూకి వెళ్లిన‌ప్పుడు రాజ‌మౌళి గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ త‌న‌ను భుజం త‌ట్టి ప్రోత్స‌హించార‌ని చెప్పారు. త‌న‌ లుక్ వెరైటీగా ఉండ‌డంతో అవ‌కాశం క‌ల్పించారు. అదే త‌న జీవితాన్ని కీల‌క మ‌లుపు తిప్పింద‌ని తెలిపారు. ఆ సినిమా ఘన విజయం కావడంతో సై షాని గా పిలవడం మొదలుపెట్టారు. ఆ సినిమా నాకు మరిన్ని సినిమాలు తెచ్చిపెట్టింది. 


జెడ్చర్లకు చెందిన తాను   ఉస్మానియా యూనివ‌ర్శిటీ లో డిగ్రీ, పీజీ నిజాం కాలేజ్‌లో విద్యాభాస్యం పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. త‌న కెరీర్లో ఇప్ప‌టిదాకా 70కిపైగా సినిమాల్లో న‌టించ‌డం జ‌రిగింద‌న్నారు. రాజ‌మౌళి గారి 'సై' చిత్రం ఘ‌న విజ‌యం సాధించి త‌న‌ను ఈ స్థాయికి తీసుకొచ్చింద‌ని గుర్తుచేసుకున్నారు. ఘ‌ర్ష‌ణ‌, దేవదాస్‌, హ్యాపీ, రెడీ, ఒక్క మ‌గాడు, శ‌శిరేఖా ప‌రిణ‌యం లాంటి చిత్రాల్లో విభిన్న పాత్ర‌లు పోషించ‌గా, అలా.. ఎలా.. చిత్రంలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తో కలిసి హీరోకు సమానమైన పాత్ర పోషించి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో30 సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయ‌న్నారు. 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు' సినిమాలో కూడా హీరో పాత్ర పోషించాను. అలా.. ఎలా.., దేశంలో దొంగ‌లు ప‌డ్డారు, రాక్ష‌సి చిత్రాల‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు చెప్పారు. 

                       

డిసెంబ‌రులో తాను నటించిన కిన్నెర‌సాని, అమ‌ర‌న్, గ్రే, పంచతంత్ర క‌థ‌లు... చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. తాను న‌ల్ల‌గా ఉండ‌డం కూడా త‌న‌కు ఒక ఎసెట్‌ అని న‌వ్వుతూ... చెబుతూ "బ్లాక్‌స్టార్" అనేది స్నేహితులు ముద్దుగా పిలుచుకుంటార‌ని చెప్పారు. తాను మంచి స్టార్‌గా ఎద‌గాల‌ని, చిత్ర రంగంలో పేద, వృద్ధ క‌ళాకారుల‌ను ఆదుకోవాల‌న్న‌ది ల‌క్ష్యంగా మందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో కొత్త‌గా వ‌చ్చే న‌టీన‌టుల‌ను ప్ర‌తిఒక్క‌రూ ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, కాలేజ్ మిత్రుడు విజ‌యానంద్ తో క‌లిసి గ‌డ‌చిన ఐదేళ్లుగా ఓవ‌ర్‌-7 ప్రొడ‌క్ష‌న్ ద్వారా నూత‌న క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు యాడ్ ఫిలిమ్స్ అండ్ క్యాస్టింగ్‌, ఫిలిం ప్రొడ‌క్ష‌న్‌, సెల‌బ్రిటీ మేనేజ్‌మెంట్‌, ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఓవ‌ర్‌-7 ప్రొడ‌క్ష‌న్ ద్వారా సామాజిక బాధ్య‌త‌గా అంధులు, వృద్ధులు, అనాధలకు అన్నదానం, వైద్య సాయం, దుస్తులు అందించ‌డం వంటి సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. రీసెర్చ్ మీడియా గ్రూపులో క్రియేటీవ్ హెడ్‌గా అనేక కార్పొరేట్ ఈవెంట్‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. తెలుగు చిత్రాల‌కు ఎంతోమంది న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌డం జ‌రిగింది. వారంతా ఇప్పుడు స్టార్స్‌గా రాణించ‌డం సంతోషాన్ని క‌లిగిస్తుంది. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ ఈ చిత్రాల్లో న‌టించ‌డం జ‌రిగింద‌ని, బాలీవుడ్‌లో  వెల్‌కం టూ స‌జ్జ‌న్‌పూర్ చిత్రంలో మంచి పాత్ర పోషించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ మధ్యే కొన్ని కథలు విన్నానని... ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతానని... నాకు ఈ గుర్తింపు రావడానికి కారణమైన దర్శకులకు, నిర్మాతలకు, నా తోటి నటీనటులకు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న' అని అన్నారు.

Heroine Poorna Interview About Akhanda

 అఖండ లో బాలా సర్‌ను చూస్తే దేవుడిని చూసినట్టు అనిపించేది  -  హీరోయిన్ పూర్ణ



నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం పూర్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


2008లో సీమ టపాకాయ్ విడుదలైంది. ఇన్నేళ్ల తరువాత ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో ఆఫర్ రావడం ఆనందంగా ఉంది. అవును మూవీ తరువాత చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ పాత్రను వేరే ఆర్టిస్ట్ చేయాలి. కానీ అదృష్టం కొద్దీ నాకు వచ్చింది. బోయపాటి గారు కాల్ చేయడంతో సంతోషించాను. ఇందులో నేను పద్మావతి అనే పాత్రలో కనిపిస్తాను. చాలా ఇంపార్టెంట్ రోల్. శ్రీకాంత్ గారి బాలా సర్‌కు మధ్యలో ఈ పాత్ర ఉంటుంది.


బోయపాటి గారి సినిమాలో స్త్రీ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. హీరోయిన్ కారెక్టర్ కాకుండా మిగతా పాత్రలు కూడా ఎంతో స్ట్రాంగ్ ఉంటాయి. పాత్రలో డామినేషన్ ఉంటుందని బోయపాటి గారు ముందే చెప్పారు. బాలా సర్ ముందు నిలబడి అలాంటి డైలాగ్స్ చెప్పాలా? అని భయపడ్డాను. కానీ బాలా సర్ ఎంతో సహకరించారు. సెట్‌లో ఎంతో కంఫర్ట్‌గా ఉంటారు. ఆయన ఎనర్జీ మామూలుగా ఉండదు. ఒక్కో ఫైట్ దాదాపు 17 రోజులు ఉండేది. మేం చివర్లో జాయిన్ అయ్యేవాళ్లం. సెట్‌లో అందరూ అలిసిపోయి కనిపిస్తారు. కానీ బాలా సర్ మాత్రం..  సింహం సింహమే. ఎంతో ఎనర్జీగా ఉంటారు. నేను ఫోన్‌లో ఆయన వాల్ పేపర్ పెట్టుకుంటాను. ఆ ఎనర్జీ నాక్కూడా రావాలని అనుకుంటాను.


ఇందులో నాకు మూడు సీన్లు ఉంటాయి. కచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు. పూర్ణను గుర్తిస్తారు. మంచి పాత్రను పోషించారు అని ఆడియెన్స్ అంటారు. నా పాత్ర చాలా ముఖ్యమైంది.


మెచ్యూర్డ్, డామినేషన్, హెల్త్ మినిష్టర్ లాంటి కారెక్టర్. హీరోయిన్ ఐఏఎస్ పాత్రలో కనిపిస్తారు.. ఆమెను ట్రైన్ చేస్తాను. చైల్డిష్‌లా ఉంటే కుదరదు.


నాకు ఈ చిత్రంలో బాలా సర్ పోషించిన రెండు పాత్రలతో సీన్లు ఉంటాయి. అఘోర పాత్రలో బాలా సర్‌ను చూస్తే నాకు దేవుడిని చూసినట్టు అనిపించేది.


నా లక్కీ నంబర్ 5. 2021లో మొత్తం కూడితే 5 వస్తుంది. నాకు ఈ ఏడాదిలొ మంచి పాత్రలు వస్తున్నాయి. లాక్డౌన్ తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్‌గా చేయాలని కాదు.. నాకు నాలుగైదు సీన్లు ఉన్నా కూడా ఇంపాక్ట్ చూపించాలి. దృశ్యం 2లో అందరూ బాగా నటించావని అన్నారు. అలా నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని అనుకుంటాను. సుహాసిని, రేవతి వంటి వారిని చూసి ఎలాంటి పాత్రలైనా చేయాలని అనుకున్నాను.


కేరళ నుంచి ఇక్కడకు వచ్చి ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నానంటే అదే నాకు చాలా గొప్ప విషయం. నేను ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చాను. అప్పుడు ఎవ్వరూ తెలీదు. కానీ ఇంత వరకు ప్రయాణించాను. దానికి ముఖ్య కారణం మా అమ్మ. దర్శకుడు మిస్కిన్ సర్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరూ నన్ను ప్రోత్సహించారు.


నాకు డ్యాన్స్ బాగా వచ్చు. కానీ డ్యాన్స్ చేసే పాత్ర మాత్రం ఇంత వరకు రాలేదు. డబ్బే కావాలంటే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయొచ్చు. కానీ కెరీర్ బాగుండాలి.. సుధీర్ఘంగా సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి. కానీ ప్రతీ ఒక్కరూ తప్పులు చేస్తారు. అలా నేను కూడా చేశాను.


పాత్ర నాకు నచ్చితే ఒప్పుకుంటాను. పాత్ర డిమాండ్ చేస్తే, నాకు నచ్చిన క్యాస్టూమ్ అయితే వేసుకుంటాను. ఇవన్నీ ముందే ఆలోచించి పాత్రకు ఓకే చెబుతాను. ఎందుకంటే సెట్‌కు వెళ్లాక అది వేసుకోలేను.. ఇది వేసుకోలేను అంటే అందరికీ ప్రాబ్లం అవుతుంది.


చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు చూడను. నా పాత్ర నచ్చితే ఓకే చెబుతాను. అయితే ఓ నటిగా అన్ని రకాలుగా చూసుకుంటాను.


టీవీలో కనిపిస్తే మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయో?రాదో అనే అనుమానం ఉండేది. కానీ నేను చాలా లక్కీ. సినిమా అవకాశాలు వస్తున్నాయి. నాకు ఢీ షో ఎప్పుడూ ప్లస్ అవుతూనే వచ్చింది. కొన్ని కొన్ని తప్పులు మాట్లాడినా కూడా తెలుగు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాను.


మనం పబ్లిక్ ప్రాపర్టీ. ప్రజల వల్లే మనం సెలెబ్రిటీలు అవుతాం. వారు పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు చేస్తారు. నేను అన్నీ ఒకేలా తీసుకుంటాను. నేను సోషల్ మీడియాలో అన్ని కామెంట్లను చదువుతాను. నెగెటివ్ కామెంట్లను చూసి ఎంతో మార్చుకున్నాను.


ఈ సినిమాతో నా కెరీర్ టర్న్ అవుతుందని ప్రారంభ దశలో అనుకున్నాను. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయం ఏమీ లేదు. అఖండ తరువాత మంచి పాత్రలు వస్తాయని అనుకుంటాను.


నవంబర్‌లో నా చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. 3 రోజెస్, దృశ్యం 2 రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అఖండ విడుదల కాబోతోంది. తమిళ, కన్నడ చిత్రాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి


Kiran Abbavaram’s “Sammathame” First Song Lyrical Out

 Kiran Abbavaram’s “Sammathame” First Song Lyrical Out


Young and energetic hero Kiran Abbavaram has been attempting distinctive subjects. After scoring commercial hits with his first two films, Kiran Abbavaram is now coming up with a musical romantic entertainer “Sammathame” which is set in urban backdrop.

Title and first look poster and then first glimpse of the movie raised expectations. Now, they have begun musical promotions. Lyrical video of first single Krishna & Satyabhama is out now.

Like how beautiful Krishna and Satyabhama’s love story was, the romantic track of Kiran and Chandini too looks adorable in this song. Sekhar Chandra has come up with an enjoyable number that has groovy beats. Krishna Kanth’s lyrics are a blend of Telugu and English words. Yazin Nazir and Sireesha Bhagavatula make this song sound much more charming with their pleasant singing.

Kiran Abbavaram and Chandini Chowdary are super cool in their respective roles. Director Gopinath Reddy came up with a different love story and like the first glimpse the first song too has full of positive vibes.

Produced by K Praveena under UG Productions banner, “Sammathame” is presently in post-production phase. Cinematography is by Sateesh Reddy. The makers are planning to release the movie soon.

Cast: Kiran Abbavaram, Chandini Chowdary and others.

Technical Crew:
Story, Screenplay, Direction: Gopinath Reddy
Producer: Kankanala Praveena
Banner: UG Productions
Music Director: Sekhar Chandra
DOP: Sateesh Reddy Masam
Editor: Vilpav Nyshadam
Art Director: Sudheer Macharla
PRO: Vamsi-Shekar

Kiran Abbavaram - Ramesh Kaduri - Clap Entertainment Production No. 4 in association with Mythri Movie Makers Launched in a Grand manner

 Kiran Abbavaram - Ramesh Kaduri - Clap Entertainment Production No. 4 in association with Mythri Movie Makers Launched in a Grand manner



Ramesh Kaduri, who worked as an Associate director under KS Ravindra (Bobby) and Gopichand Malineni will be debuting with this movie. Kiran Abbavaram the promising upcoming star hero in the making, fresh from the superhit success of SR Kalyana Mandapam will be playing the male lead and will be joining forces with Clap Entertainment which will produce the movie in association with Mythri Movie Makers.


Touted to be a pakka mass entertainer and a commercial film, the film will be tentatively titled Production No. 4. The film has been launched in a grand manner with a pooja ceremony today in Hyderabad.


Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu will be producing the film and Naveen Yerneni and Ravi Shankar Yalamanchili of Mythri Movie Makers will be presenting the film.


Venkat C Dileep will handle the cinematography. Ramesh Kaduri provides dialogues, while JV is the Art Director. Alekhya is the Line Producer, Baba Sai is the Executive Producer and Bal Subramaniam KVV is the Chief Executive Producer for the film.


The clap was given by Sri Koratala Shiva Garu as Sri Gopichand Malineni directed the first shot. The camera was switched on by Sri KS Ravindra (Bobby) Garu while Sri Koratala Shiva Garu & Sri Gopichand Malineni & Sri KS Ravindra (Bobby) Garu & Mythri producers Naveen garu, Ravi garu, Cherry garu handed over the script.



Cast: Kiran Abbavaram


Technical Crew:

Story, Screenplay & Direction: Ramesh Kaduri

Producers: Chiranjeevi (Cherry), Hemalatha Pedamallu

Presenters: Naveen Yereneni, Ravi Shankar Yalamanchili

Banner: Clap Entertainment in association with Mythri Movie Makers

DOP: Venkat C Dileep

Production Designer: JV

Dialogues: Ramesh Kaduri, Surya

Line Producer: Alekhya Pedamallu

Executive Producer: Baba Sai Kumar 

Chief Executive Producer: Bala Subramanyam KVV

Production Controller: Suresh Kandula

Marketing: First Show

PRO: Madhu Maduri