Latest Post

RadheShyam to stick to festive release date of 14th Jan, 2022

 RadheShyam to stick to festive release date of 14th Jan, 2022



Ever since the announcement of the title 'RadheShyam', there has been a lot of rage and excitement about the film, starring Prabhas and Pooja Hegde. The film is a love story and the actor will be seen in a romantic role after a decade and that is reason enough for his fans to watch the romantic-drama.


The makers of RadheShyam have decided to stick to the prior set festive release date for the film. The Prabhas-Pooja starrer film was slated to release on 14th January 2022, which is a big weekend down south, Pongal celebrations will be underway making it a very auspicious day for this film to release.


The anticipation of the film has been on the rise with the back to back unveiling of different posters. The audiences are loving Prabhas' glimpses in the lover boy avatar and the picturesque backdrop of romantic city Italy only add to the excitement. The film posters have encompassed a very vintage, old-school and dreamy vibe and the chemistry of Prabhas and Pooja Hegde is being most sought after in the film. 


Radheshyam is a beautiful love story all the fans are longing to witness. A multi-lingual film starring the Pan-India star Prabhas and gorgeous Pooja Hegde in lead roles, helmed by Radha Krishna Kumar, presented by Dr.U.V.Krishnam Raju garu and Gopikrishna Movies. It is produced by UV Creations.


The film is being produced by Vamsi,Pramod and Praseedha

Mass Maharaja Raviteja Launched PelliSandaD Lyrical Song

 మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా ‘పెళ్లి సంద‌D’ చిత్రం నుంచి ‘మధురానగరిలో యమునా తటిలో.. ’ అనే లిరికల్ సాంగ్ విడుదల 



ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన ఈయ‌న ‘పెళ్లిసంద‌D’ లో అతిథి పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఈ చిత్రం నుంచి ‘మధురానగరిలో యమునా తటిలో...’  అనే లిరికల్ పాట‌ను మాస్ మహారాజా ర‌వితేజ విడుద‌ల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. 


‘మధురా నగరిలో, మయునా తటిలో..

మురళీ స్వరములే ముసిరిన ఎదలో..

కురిసెనంట మురిపాల వాన‌

ల‌య‌లై హోయ‌లై జ‌ల జ‌ల జ‌తులై.. గ‌ల గ‌ల గ‌తులై’’


అంటూ సాగే ఈ పాట‌లో ల‌వ్ సాంగ్‌.. రెండు వేరియేష‌న్స్‌లో సాగే ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శ్రీనిధి, నయ‌నా నాయ‌ర్‌, కాల భైర‌వ పాడారు. 



ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చాయి. అలాగే టీజ‌ర్‌, రీసెంట్‌గా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  ఇప్పుడు మధురానగరిలో అనే లిరికల్ సాంగ్ కూడా విడుదలైంది. 


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.


Sumanth Ashwin Interview About Idhe Maa Kadha

 ఇదే మా కథ స్టోరీ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను - సుమంత్ అశ్విన్.



సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇదే మా కథ. గురు పవన్ దర్శకత్వంలో శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.  టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ...


''డైరెక్టర్ ఓ ఫోటో సెషన్ చేద్దాం అన్నారు. సరే అండి అని చేశాం. హైదరాబాద్ నుంచి లడక్ కి ఓ జర్నీ ఉంటుంది. ఏదో రఫ్ గా చేసి ఆ ఫొటోస్ పంపించా. ఇది ఫైనల్ కాదనుకున్నా. డైరెక్టర్ చూసి నాకు ఇదే కావాలన్నారు. మొత్తం సినిమాలో అదే మెయిన్ టైన్ చేసాం.


ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. శ్రీకాంత్ గారికి లడక్ లో ఓ స్టోరీ ఉంటుంది. ఆయనకు డబ్బు అన్నీ ఉన్నాయి. ఆయన కావాలంటే ప్రైవేట్ జెట్ ఫ్లయిట్ లో వెళ్లొచ్చు. కానీ ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆయనకు బైక్ రైడ్ అంటే ఇష్టం. ఫీల్ కోసం బైక్ లో స్టార్ట్ అవుతారు. అలాగే భూమిక గారికి ఓ గోల్ ఉంటుంది. భూమిక గారి ఫాదర్ గోల్ ఫుల్ ఫిల్ చేయడానికి భూమిక గారు స్టార్ట్ అవుతారు. ఆలాగే అమ్మాయికి ఒక గోల్. అలాగే అజయ్ క్యారెక్టర్ ఓవర్ కాన్ఫిడెంట్ ఫెలో. ఇతనికి లడక్ లో స్నో మీద ఓ రేస్ ఉంటుంది. ఆ రేస్ గెలిస్తే ఆసియా లెవెల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా వీళ్లంతా బయల్దేరి ఎక్కడ కలుసుకున్నారు? కలుసుకున్నారా లేదా.. ఆ జర్నీ అంతా ఏమైంది? గోల్స్ రీచ్ అయ్యారా లేదా? అనేది కథ.


ఒక్కొక్కరూ సపరేట్ గా స్టార్ట్ అవుతారు. నాలుగు కథలకు లింక్ అనేది.. మధ్యలో మంచి ఫ్రెండ్ షిప్, బ్యాండ్ క్రియేట్ అయి ముందుకెళ్తారు. ఎవరి గోల్ వారు ఫుల్ ఫిల్ చేసుకోవాలని హెల్ప్ చేసుకుంటారు. కథ చెప్పింది కరోనా ముందు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో అనుకున్నాం. అప్పుడే వ్యూహాన్ లో స్టార్ట్ అయ్యాం. సెకండ్ షెడ్యూల్ టైంలో కరోనా వల్ల లాక్ అయ్యాం.


తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్ చూపించడం వల్ల అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. కథలో రోల్స్ ఇన్వాల్మెంట్ ఉండాలి. ఇందులో అవన్నీ ఉన్నాయి. కథ చెప్పగానే ఎగ్జైట్ అయ్యాను. అందరికీ ఫ్లష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏవీ లేవు కానీ శ్రీకాంత్ గారికి ఉంది. లాస్ట్ లో 20 మినిట్స్ స్నో మీద రైడ్, రేస్ ఆసక్తికరంగా ఉంటుంది. బైక్ నన్ను మాదాపూర్ నడపమంటే నడిపేస్తా. కానీ స్నో మీద చాలా రిస్క్. అందుకే స్నో మీద చాలా ప్రాక్టీస్ చేసి షూటింగ్ చేశాం. లక్కీగా ఎవ్వరికీ ఏమీ యాక్సిడెంట్ లాంటివి జరగలేదు.


భూమిక గారు కూడా చాలా డేర్ చేశారు. డూప్స్ పెట్టి చేయొచ్చు. కానీ రియలిస్టిక్ గా ఉండేందుకు ఆమెనే చేశారు. ఒక్కడు తర్వాత ఆవిడతో డైరెక్ట్ కాంటాక్ట్ ఇదే. నా చిన్న తనంలో ఫిలిం చాంబర్ లో భూమికను చూసి భలే ఉంది హీరోయిన్ అనుకున్నా. ఆవిడతో ఒక్కడు సెట్ లో మంచి రిలేషన్ ఏర్పడింది. ఆవిడతో నేరుగా యాక్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇది ఎక్సలెంట్ ఫీలింగ్.


ఈ సినిమాలో ఒక్క సీన్ లో భూమిక గారు నా బైక్ ఎక్కుతారు. ఆ సీన్ షూట్ చేసినప్పుడు గానీ, మళ్ళీ చూసినప్పుడు గానీ గూస్ బంప్స్ వచ్చాయి. అక్క అనే రిలేషన్ ఉంటుంది. నాకు తాన్యా హాప్ కి లవ్ ట్రాక్ నాచురల్ గా ఉంటుంది. డైరెక్టర్ గురు మంచి రైటర్. ఈ సినిమా స్టార్ట్ కాక ముందే మాకు ఈజీ కావాలని ఆయనే స్వయంగా తిరిగి టెస్ట్ చేశారు, చాలా రీసెర్చ్ చేశారు. అది డైరెక్టర్ కి డెఫినెట్ గా ఉండాలి. ఆయనకు ఏ బైక్ ఎంత సీసీ ఉంటుంది. గేర్ల పట్ల చాలా అవగాహన ఉంది. గురు మైండ్ లో పక్కా కమర్షిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని నాచురల్ గా మలిచి సినిమా రూపొందించారు.


అంతకుముందు ఆ తర్వాత, లవర్స్ లాంటి సినిమాలు చేశా. ప్రతి ప్రాజెక్టు నుంచి ఓ అనుభవం వచ్చింది. నా సినీ జర్నీలో చాలా నేర్చుకున్నా. నేను చాలా హ్యాపీ. కారులో కంటే బైక్ లో వెళితే ఆ కిక్కే వేరు. మైనస్ డిగ్రీస్ లో చాలా సన్నివేశాలు షూట్ చేశాం. బైక్ అనేది రియల్లీ ఫన్. అందుకే చాలా మంది రైడర్స్ వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. నా తదుపరి సినిమా 7 డేస్ 6 నైట్స్ షూటింగ్ కూడా పూర్తయింది.  


మా నాన్నగారికి ఒకే టైపు లో సినిమాలు తీయడం ఇష్టం ఉండదు. అందుకే డిఫరెంట్ ఒరింటెడ్ సినిమాలు తీస్తారు. లో బడ్జెట్, హై బడ్జెట్, గ్రాఫిక్ ఇలా అన్ని కోణాలు టచ్ చేస్తున్నారు. నిర్మాత అనేది చాలా టఫ్ జాబ్. ప్రొడ్యూసర్ కి ఏదన్నా తేడా వస్తే కష్టం. అందుకే అంతా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు అర్థమైంది ఆ కష్టం ఏంటనేది. అయితే ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆ థ్రిల్ ఏంటనేది తెలుస్తుంది. ఇదే మా కథలో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, లొకేషన్స్ అనేవి హైలైట్స్.

Nenu Leni Naa Premakatha

 అక్టోబర్ 8న రిలీజ్ అవుతున్న ‘నేను లేని నా ప్రేమకథ’



త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ కందుకూరి, ఎ.భాస్కరరావు సంయుక్తంగా నిర్మించిన ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రం UFO Moviez INDIA LIMITED ద్వారా అక్టోబర్ 8న విడుదలకు సిద్ధమైంది.


ఈ సంగీత ప్రేమకథా చిత్రానికి సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించగా.. నవీన్ చంద్ర మరియు గాయత్రి సురేష్ మరియు నూతన పరిచయం క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్ తారాగణంగా కీలక పాత్రలో సీనియర్ నటుడు రాజా రవీంద్రలతో ఈ చిత్రం నిర్మించబడింది.


ఇటీవల జెమినీ రికార్డ్స్(మ్యూజిక్) ద్వారా విడుదలైన ఈ చిత్ర సంగీతం శ్రోతలను, సినిమా అభిమానులను ఎంతగానో అలరించింది.


వినూత్న కథాంశంలో, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రం నిర్మించబడిందని, అలాగే  మా ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న UFO Moviez వారికి ప్రత్యేక కృతజ్ఞతలను చిత్ర నిర్మాత కళ్యాణ్ కందుకూరి మరియు చిత్ర దర్శకుడు సురేష్ ఉత్తరాది తెలియజేశారు.


ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని, అక్టోబర్ 8న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రాన్ని UFO Moviez INDIA LIMITED ద్వారా థియేటర్స్‌లో విడుదల చేయడం జరుగుతుంది.


ఈ చిత్రానికి చాయాగ్రహణం SKa భూపతి, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, మాటలు సాబిర్ షా, లిరిక్స్ రాంబాబు గోసాల, సంగీతం జువెన్ సింగ్ అన్ని విభాగాలు ప్రధాన భూమికను పోషించాయి

Natyam Second Song Launched by Victory Venkatesh

 `నాట్యం` సెకండ్ సాంగ్ లాంచ్ చేసిన విక్టరీ వెంకటేష్.



`నాట్యం`అంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `నాట్యం`. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఆవిష్క‌రించిన ఈ సినిమాలో తొలి సాంగ్ `నమః శివాయ‌`కు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న ల‌భించింది. తాజాగా నాట్యం సెకండ్ సాంగ్ పోనీ పోనీ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.


ఈ సంద‌ర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ''రేవంత్ దర్శకత్వంలో డాన్సర్ సంధ్య నటించిన నాట్యం సినిమా నుంచి ఈ పోనీ పోనీ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. విలక్షణ కథకు ఎమోషన్స్ కలగలిపి  రూపొందించారు. చాలా చక్కగా డాన్స్ చేశారు. చూస్తుంటే స్వర్ణ కమలం మళ్ళీ గుర్తొస్తోంది. అందమైన లొకేషన్స్‌లో ఎంతో అందంగా చిత్రీకరించారు. డాన్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రాక చాలా రోజులైంది. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్'' అన్నారు.


సంధ్యారాజు మాట్లాడుతూ.. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మా మూవీలో చాలా ముఖ్యమైన ఎమోషనల్ సాంగ్. స్వర్ణ కమలం మూవీ చూసి చూసి ఆ టేప్ అరిగిపోయి ఉంటుంది. ఈ సినిమాలో భాగమవడం ఓ ఆశిర్వాదంలా ఫీల్ అవుతున్నా. ఈ సినిమాలో భానుప్రియ గారు నా తల్లి పాత్రలో నటించారు. అలాగే ముఖ్యమైన సాంగ్ వెంకటేష్ లాంచ్ చేశారు. ఇవి నా జీవితంలో ఎప్పటికీ మరవలేని క్షణాలు'' అన్నారు.


డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ.. ''ఈ మూవీ చేయడానికి స్వర్ణ కమలం నన్ను ఇన్స్పైర్ చేసింది. టాలీవుడ్‌లో మీరు (వెంకటేష్) ఓ గ్రేట్ యాక్టర్. ఎమోషన్, కామెడీ, ఫైట్స్ ఇలా ఏ క్యారెక్టర్ లో అయినా మీరు లీనమైపోతారు. మా కాలేజీలో ఒక్కొక్కరూ ఒక్కో హీరోకు ఫ్యాన్. కానీ మీ సినిమా విడుదలైందంటే మేమంతా కలిసి వెళ్లే సినిమా అదే అవుతుంది'' అన్నారు.  


ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.  


న‌టీన‌టులు: సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవ‌న త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:


స్క్రిప్ట్‌, కెమెరా, ఎడిటింగ్‌, ద‌ర్శ‌కత్వం: రేవంత్ కోరుకొండ‌

నిర్మాణ సంస్థ‌: నిశ్రింక‌ళ ఫిల్మ్‌

సంగీతం: శ్రవణ్ భ‌రద్వాజ్‌

పాటలు: క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌

ఆర్ట్‌: మ‌హేశ్ ఉప్పుటూరి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సంధ్యా రాజు

వి.ఎఫ్‌.ఎక్స్‌: థండ‌ర్ స్టూడియోస్‌

క‌ల‌రిస్ట్‌: ఎం.రాజురెడ్డి

ఎస్ఎఫ్ఎక్స్‌: సింక్ సినిమాస్‌

సౌండ్ మిక్సింగ్‌: కృష్ణంరాజు

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: వాల్మీకి శ్రీనివాస్‌

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్

Director Devakatta Interview About Republic

 



‘రిప‌బ్లిక్‌’ మూవీని డైరెక్ట‌ర్‌గా నా విజ‌న్‌తో తెర‌కెక్కించ‌డానికి హీరో సాయితేజ్ ఓ సైనికుడిలా స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డాడు :  డైరెక్ట‌ర్ దేవాక‌ట్టా



సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిప‌బ్లిక్‌’ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా ఇంట‌ర్వ్యూ విశేషాలు...



- ‘రిపబ్లిక్‌’ సినిమాకు ఇన్‌స్పిరేష‌న్ నా అజ్ఞానం. మ‌న‌కు ఉహ తెలిసినప్ప‌టి నుంచి ఈ రాజ‌కీయాలేంటి?  రాజ‌కీయ నాయ‌కులేంటి? అని అనుకుంటూ ఉంటాం. క్యాప్ట‌లిజం, క‌మ్యూనిజం, సోష‌లిజం అంటూ మ‌నం ఇజ‌మ్‌ల గురించి మాట్లాడుతుంటాం. డెమోక్ర‌సీ, డిక్టేట‌ర్ షిప్ అంటాం. ఇలా చాలా  వాటి గురించి మాట్లాడుతుంటాం. అయితే వీటి గురించి మ‌న‌కు ఎంత లోతుగా తెలుసు? అనే ప్ర‌శ్న వేసుకుంటే మ‌న‌కు తెలియ‌దు. నా వ‌ర‌కు వ‌స్తే.. నాకు తెలియ‌దు. మ‌నం ప్ర‌కృతిలో ఓ భాగం, మ‌నం ఎక్క‌డున్నామో దాని గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేక‌పోతే ఉండ‌లేం. అలాగే స‌మాజం కూడా మ‌న జీవితాన్ని ప్ర‌భావితం చేస్తుంది. అలాంట‌ప్పుడు మ‌నం ఎలాంటి వ్య‌వ‌స్థ‌లో ఉన్నామో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. చ‌దువుకున్న వ్య‌క్తిగా అలాంటి స‌మాజం గురించి తెలియ‌న‌ప్పుడు ఓ సామాన్యుడికి ఏం అర్థ‌మ‌వుతుంద‌నే సిగ్గుతో దానిపై స్ట‌డీ చేసుకుని ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నాం. ఇప్పుడు మ‌నం ప్ర‌భుత్వ‌మో, ప్ర‌జాస్వామ్య‌మో ఉంద‌నే భ్ర‌మ‌లో బ్ర‌తుకుతున్నాం. కానీ అదెలా ఉంటుందో తెలియ‌దు. అంటే మ‌నం ప్ర‌జాస్వామ్యంలో బ‌త‌క‌డం లేదు. ఏ పార్టీకి, మ‌నిషికి అయినా అప‌రిమిత‌మైన శ‌క్తి ఇచ్చిన‌ప్పుడు క‌చ్చితంగా క‌రెప్ట్ అవుతాడు. అది మాన‌వ నైజం. ప‌వ‌ర్ అనేది ఓ క్ర‌మ‌బ‌ద్దంగా ఉండాలి. బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న‌ప్పుడే బావుంటుంది. ట్రంప్‌లాంటి వ్య‌క్తి ఏ దేశంలో అయినా డిక్టేట‌ర్ అయ్యుండేవాడు. కానీ ఆయ‌న నియ‌మించిన జడ్జీలే ఆయ‌న్ని డిక్టేట‌ర్ కానీయ‌కుండా అడ్డుకున్నారు. 


- న్యాయ‌వ్య‌వ‌స్థ‌, బ్యూరోక్ర‌సీ, లెజిస్లేటివ్ అనేవి ఇండిపెండెంట్‌గా ఉండాలి. అయితే ఒక‌రికొక‌రు అన్వ‌యం ఉండాలి. ఇవి మూడుగుర్రాలుగా ఉండి ప్ర‌యాణించేట‌ప్పుడు ఏదైనా ఓ గుర్రం గాడి త‌ప్పుతున్న‌ట్లు అనిపిస్తే మిగిలిన గుర్రాలు ప‌ట్టుకోవాలి. అలా ఉన్న‌ప్పుడు ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ స‌రిగా ఉంటుంది. కామ‌న్ మేన్‌గా విలువ త‌ప్ప‌డాన్ని మ‌నం ఆనందిస్తే, మ‌నం ప‌వ‌ర్ ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రూ విలువ త‌ప్పుతారు. ఈరోజు మ‌న పార్టీ గెలిచి విలువ త‌ప్ప మ‌రో పార్టీని ఇబ్బంది పెట్టిన‌ప్పుడు, రేపు ఆ పార్టీ వాళ్లు ప‌వ‌ర్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు మ‌నల్ని ఇబ్బంది పెడ‌తాడు. వేరే దారిలేదు. ఈ విషయాల‌పై సామాన్యుల‌కు అవ‌గాహ‌న లేదు. ఇదేదో ఓ పార్టీని ఉద్దేశించోమ‌నిషిని ఉద్దేశించో వ‌చ్చిన ఆలోచ‌న‌లు కావు. ఈ ఐడియాను ఓ రోజు జిమ్‌లో సాయితేజ్‌కు చెప్పాను. 


- సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కులకు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అన్వ‌య‌క‌ర్త‌గా ఉండే ఓ బ్యూరోక్రట్ నిజాయ‌తీగా ఉన్న‌ప్పుడు, త‌ను వ్య‌వ‌స్థ‌ను ఎలా చూస్తున్నాడు. త‌న ఆలోచ‌న‌ల వ‌ల్ల త‌న ప్ర‌యాణం ఎలా సాగింది. అనే పాయింట్‌తో ఈ క‌థ‌ను త‌యారు చేశాను. సాయితేజ్ ఓ కామ‌న్ మ్యాన్‌గా ఈ క‌థ‌కు రిలేట్ అయ్యాడు. ఈ డిస్ట్ర‌బెన్స్ నుంచి వ‌చ్చిన ఐడియాలో నిజం ఉంది. ఈ క‌థ‌ను నేనే చేయాలి. అనుకున్నాడు. ఈ ఆలోచ‌న‌ను క‌థ‌గా రాయ‌క ముందే నాతోనే ఈ సినిమా చేయాల‌ని తేజ్ ప్రామిస్ తీసుకున్నాడు. 


- సెన్సార్ స‌భ్యుల‌కు సినిమా చాలా బాగా న‌చ్చింది. సింగిల్ క‌ట్ లేకుండా సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. చాలా నిష్ప‌క్షంగా, ఎలా బేదాభావాలు లేకుండా నిజాయ‌తీగా తెర‌కెక్కించార‌ని అప్రిషియేట్ చేశారు. 


- ఇందులో ప్ర‌జ‌ల‌కు ఏదీ మంచిది అనేది చెప్ప‌లేదు. ఓ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ అనుకున్న‌ప్పుడు అది ఎలా అవ్య‌స్థంగా ఉంద‌ని ఎత్తి చూపిస్తూనే, అదొక వ్య‌వ‌స్థ‌గా మారాల‌ని సొల్యూష‌న్‌గా నిర్వ‌చ‌నం చెప్పే ప్ర‌య‌త్నం చేశాం. ఇప్పుడు స‌మాజంలోని వ్య‌వ‌స్థ‌లు, మ‌న ఆలోచ‌న‌లు, దాని వ‌ల్ల ప్ర‌భావిత‌మయ్యే అంశాల‌ను ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశాను. 


- వ్య‌క్తిగ‌తంగా దూషించిన‌ప్పుడు ఇత‌రులు బాద‌ప‌డ‌తారు. దాని నుంచి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అదే మ‌న‌సాక్షితో మాట్లాడిన‌ప్పుడు ఏమీ కాదు. నొప్పించే విధంలో కాకుండా చెప్పాలి. బ్యూరోక్రాట్స్ మీద‌, న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్నాయ‌నే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశాను. పొలిటిక‌ల్ ప‌వ‌ర్ ఉన్న‌ప్పుడు ఏమైనా చేయ‌వ‌చ్చు అనే ఓ భావ‌న అంద‌రిలో ఉంది. దాన్ని అంద‌రం ఎంజాయ్ చేస్తున్నాం కూడా. కానీ అది త‌ప్పు. మ‌నం ఎలా ఆలోచిస్తున్నామో అదే వ్య‌వ‌స్థ అవుతుంది. 


- వెన్నెల, ప్ర‌స్థానం సినిమాలు చేసేట‌ప్ప‌డు నాకు రిసోర్స‌స్ త‌క్కువ‌గా ఉన్నాయి. కానీ.. లిబ‌ర్టీ ఉండేది. కానీ ఓ స్థాయి త‌ర్వాత మ‌న చుట్టు ప‌క్క‌ల ఉన్న‌వాళ్ల లెక్క‌లు వ‌చ్చేస్తాయి. ప్ర‌స్థానం బ్లాక్‌బ‌స్ట‌ర్ కాక‌పోవ‌డానికి కామెడీ ట్రాక్ లేక‌పోవ‌డ‌మో, మ‌రోటో అని న‌న్ను క‌న్విన్స్ చేసి.. నేను ఆ ట్రాప్‌లో ప‌డ్డ త‌ర్వాత నేనెదైతే చెత్త పెట్టానో దాన్ని ప్ర‌జ‌లు తిప్పి కొట్టారు. కానీ రిప‌బ్లిక్ విష‌యంలో ఇలాంటివేమీ లేకుండా నేను ఓన్ చేసుకుని చేసిన సినిమా. నా విజ‌న్‌లోనే న‌న్ను సినిమా తీసేలా సాయితేజ్ సినిమా చేయ‌డానికి ఎంక‌రేజ్ చేశాడు. సైనికుడిలా నాకు అండ‌గా నిల‌బ‌డ్డాడు. 


- డైలాగ్ అనేది నా దృష్టిలో మాట‌ల గార‌డీ కాదు. ప్ర‌తి మాట ఓ ఆలోచ‌న‌. ఆలోచ‌న‌ను, త‌త్వాని ప‌దునుగా ఎలివేట్ చేయాలి. ఆలోచ‌న ఎంత బ‌లంగా ఉంటే డైలాగ్ అంత ప‌దునుగా ఉంటుంది. ఈ సినిమా క‌థ‌ను చూసిన నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ రీమేక్ రైట్స్‌ను కూడా కొనేశారు. 


-  ఫ్ర‌స్టేష‌న్‌లో, బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకూడదు. అలా తీసుకున్న నిర్ణ‌య‌మే డైన‌మైట్ సినిమా. అదే స‌మ‌యంలో నేను యు.ఎస్‌లో ఫ్యామిలీని వ‌దిలేసి వ‌చ్చాను. అర్థికంగా ఎలాంటి సపోర్ట్ లేదు. ఇలాంటి కార‌ణాల‌తో క‌న్విన్స్ అయిన ఒప్పుకున్న సినిమా. ఆ సినిమాను నేను 9 రోజులు మాత్ర‌మే షూట్ చేశాను. త‌ర్వాత వాళ్ల‌కు కావాల్సి వ‌చ్చిన‌ట్లు వాళ్లే షూట్ చేసుకున్నారు. దాని త‌ర్వాత నేను ద‌ర్శ‌కుడిగా ఇత‌రుల న‌మ్మ‌కాన్ని సంపాదించుకోవ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టింది. రిప‌బ్లిక్  ఆ న‌మ్మ‌కాన్ని పెంచుతుంద‌ని భావిస్తున్నాను. ఇకపై ఎక్కువ గ్యాప్ లేకుండా సినిమాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. 


- త‌మిళంలో కాక్కాముట్టై అనే సినిమాను చూసిన‌ప్పుడు అందులో ఐశ్వ‌ర్యా రాజేశ్ న‌ట‌న బాగా ఆక‌ట్టుకుంది. ఆమెతో ఎప్పుడైనా ప‌నిచేయాల‌ని అనుకున్నాను. ఈ సినిమాకు కుదిరింది. అయితే నేను రొటీన్‌కు భిన్నంగా న‌టీన‌టుల‌ను ఇత‌ర పాత్ర‌ల్లో న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. అలా ఐశ్వ‌ర్యా రాజేశ్‌ను ఇందులో ఎన్నారై అమ్మాయిగా చూపించాను. త‌ను అద్భుతంగా న‌టించింది. ర‌మ్య‌కృష్ణగారు క్యారెక్ట‌ర్‌లో ముందుగా భార‌తీరాజానో, మ‌హేంద్ర‌న్ వంటి డైరెక్ట‌ర్స్‌ను పెట్టుకోవాల‌ని క్యారెక్ట‌ర్ రాసుకున్నాను. అయితే న‌టీన‌టుల ఎంపిక గురించి మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో తేజ్ ర‌మ్య‌కృష్ణ‌గారిని ఆ పాత్ర‌కు తీసుకుంటే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌ను చెప్పాడు. క్యాస్టింగ్‌లో కొత్త‌ద‌నం కోసం ఆ పాత్ర‌ను మ‌హిళ‌గా మార్చాం. ఆ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌గారిని లేదా విజ‌య‌శాంతిగారినో తీసుకోవాల‌ని అనుకున్నాం. అయితే అప్ప‌టికే విజ‌య‌శాంతిగారు పాలిటిక్స్‌లో ఉన్నారు. ఆమె రాజ‌కీయ జీవితం ఎక్క‌డ ప్ర‌భావిత‌మ‌వుతుందోన‌ని భావించి, ర‌మ్య‌కృష్ణ‌గారిని అప్రోచ్ అయ్యాం. ఆమె అప్ప‌టికే న‌ర‌సింహ‌, బాహుబ‌లి సినిమాల్లో త‌న పాత్ర‌ల‌ను ర‌మ్య‌గారు మ‌రొక‌రు చేయ‌లేర‌నే గొప్ప‌గా చేసున్నారు. దాంతో ఈ పాత్ర‌కు ఆమె న్యాయం చేస్తుంద‌ని భావించాం. 


- మ‌నం ఒప్పుకున్నా, ఒప్పుకోక‌పోయినా మ‌న‌సులో ఉన్న‌ది దాచుకోకుండా మాట్లాడుతారు. సాయితేజ్‌కు యాక్సిడెంట్ అయిన త‌ర్వాత మేం ఆలోచిస్తున్న‌ప్పుడు చిరంజీవిగారు ట్రైల‌ర్ లాంచ్ చేస్తాన‌ని మాట ఇచ్చారు. క‌ళ్యాణ్‌గారు నేను ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు వ‌స్తాన‌ని అన్నారు. ప‌వ‌న్‌గారు వేదిక‌పై ఏం మాట్లాడార‌నేది ఆయ‌న వ్య‌క్తిగ‌త కోణం కావ‌చ్చు. కానీ మా రిప‌బ్లిక్ సినిమా అనేది ఈ రాజకీయ కోణాలకు సంబంధం లేని న్యూట్ర‌ల్ పాయింట్‌తో తెర‌కెక్కింది. 


- నేను ఎవ‌రినీ వేదిక‌పై విమ‌ర్శించ‌లేదు. ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ‌ల్ల పార‌దర్శ‌క‌త ఉంటుంది. కానీ త‌ర్వాత స్టెప్స్ ఏంట‌ని నేను అడిగానంతే. 


- సాయితేజ్‌ను యాక్సిడెంట్ త‌ర్వాత క‌లిశాను. అక్టోబ‌ర్ 1న సినిమాను విడుద‌ల చేద్దామ‌ని త‌న‌తో మాట్లాడుకున్న త‌ర్వాతే ఫైన‌ల్‌గా ఓకే చేశాం. త‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చూశాడు. త‌ను హండ్రెడ్ ప‌ర్సెంట్ ఓకే అనుకునే వ‌ర‌కు ఐసోలేష‌న్‌లో ఉంటే మంచిద‌ని భావించాం. త‌ను త్వ‌ర‌గా కోలుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు. కాస్త కాస్త ఆహారం కూడా తీసుకుంటున్నాడు. త‌ను రిక‌వ‌ర్ కావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. 


- చంద్ర‌బాబునాయుడుగారు, వై.ఎస్‌గారి జీవితాల‌ను బేస్ చేసుకుని వారీ కాలేజీ జీవితాల నుంచి వై.ఎస్‌.ఆర్ మ‌ర‌ణం వ‌ర‌కు ఉండే సినిమా. ఈ సినిమాను గాడ్‌ఫాద‌ర్ రేంజ్‌లో మూడు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్నాను. వెబ్ సిరీస్‌గానూ కూడా తెర‌కెక్కించ‌వ‌చ్చు. ఇంద్ర‌ప్ర‌స్థం అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను అనుకున్నాం. విష్ణువ‌ర్ధ‌న్‌గారితో ఎన్టీఆర్‌గారి బ‌యోపిక్ గురించి, ఈ క‌థ గురించి చ‌ర్చించాను. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌న సినిమా అనేలా బ‌య‌ట‌కు వెళ్లింది. కానీ ఇంద్ర‌ప్ర‌స్థం అనే సినిమా గురించి  ఇండ‌స్ట్రీలో అంద‌రికీ తెలుసు. ఎలా రూపొందుతుందో అంద‌రూ ఎదురుచూస్తున్నారు. పెద్ద క్యాస్టింగ్ అవ‌స‌రం. స‌మ‌యం ప‌డుతుంది. ఇలాంటి స‌మ‌యంలో విష్ణువ‌ర్ధ‌న్‌గారు వారి జీవితాల‌పై సినిమాను తీస్తాన‌ని చెప్పిన‌ప్పుడు నాకేం అభ్యంత‌రం అనిపించ‌లేదు. అయితే స్టోరి ప‌రంగా నా క‌థ‌లో ఎలిమెంట్స్‌ను తీసుకుంటే లీగ‌ల్‌గా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని అన్నాను. 


- బాహుబ‌లి ది బిగినింగ్ ముఖ్యోద్దేశం ఇండియాకు చెందిన గ్రేమ్ ఆఫ్ థ్రోన్స్ కావాల‌నేదే. అలాంటి గొప్ప ఆశ‌యాన్ని ఒక‌రిద్ద‌రూ ద‌ర్శ‌కుల‌తో ఒక‌ట్రెండు సంవత్స‌రాల్లో చేసేది కాదు. దానికి స‌మయాన్ని వెచ్చించ‌డం చాలా అవ‌స‌రం. ఉదాహ‌ర‌ణ‌కు గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను ప‌దేళ్లు క‌థ‌గా రాస్తే ప‌ది ప‌దిహేనేళ్లు స్క్రీన్‌ప్లే రాశారు. తీశారు. ఆపేశారు. మ‌ళ్లీ తీశారు. అలా ఎంతో క్లారిటీగా చేశారు. ఆ లెవ‌ల్ టీమ్ టెక్నీషియ‌న్స్‌, టైమ్‌, ఇన్వెస్ట్ చేస్తేనే ఔట్‌పుట్ వ‌స్తుంద‌ని భావించి .. మా జీవితాన్నంతా అక్క‌డే వెచ్చించ‌లేమ‌ని అర్థం చేసుకుని రాసిందంతా అక్క‌డే పెట్టేసి ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాం. ఓ సీజ‌న్‌ను రాసుకుని తీసే ప్రాజెక్ట్ అది కాదు. కాస్త షూట్ చేసినా కూడా ప‌క్క‌కు వ‌చ్చేశాం.


Parvatipuram Lyrical Video From Kinnerasani Out Now

 Parvatipuram Lyrical Video From Kinnerasani Out Now



The makers of Kinnerasani, an intense drama starring Kalyaan Dhev in the lead role have unveiled a new song from the album.


The song has been titled ‘Parvatipuram’ and it has an intense vibe to it. The lyrics are deep and impactful and so is the turn composed by Mahati Swara Sagar.


The song depicts the mystical story involving the protagonist, played by Kalyaan, and the mystical story spun around the other central characters in the film.


The film has Ravindra Vijay, Ann Sheetal, Mahathi Bikshu, and others in the lead roles. It is directed by Ramana Teja and produced by Ram Talluri under SRT Entertainments banner. 

Director Puri Jagannadh Birthday Celebrations

 

లైగ‌ర్ సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన‌ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌


మోస్ట్ హ్యపెనింగ్ హీరో  విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న క్రేజీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `లైగర్`. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్యాన్ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ  సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ రోజు(సెప్టెంబ‌రు 28) డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా లైగ‌ర్ సెట్లో పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో చిత్ర యూనిట్ స‌మక్షంలో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేశారు పూరి జ‌గ‌న్నాధ్‌. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి.  

లైగ‌ర్ చిత్రం ద్వారా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైసన్ మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయమ‌వున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇండియా వైడ్ గా ట్విట్ట‌ర్ లో ట్రెండ్ అయ్యింది.  బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందుతోంది.

నటీనటులు : విజయ్ దేవరకొండ, మైక్‌టైస‌న్, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక బృందం
దర్శకుడు:  పూరి జగన్నాథ్
నిర్మాతలు:  పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్:  పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్: డైరెక్టర్ కెచ్చా



Love story Success Meet Held Grandly

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో  "లవ్ స్టోరి" ఒక క్లాసిక్ గా నిలిచిపోతుంది - నాగార్జున




నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ నుంచి సూపర్బ్ రిపోర్ట్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది లవ్ స్టోరి టీమ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు కింగ్ నాగార్జున, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు కేఎస్ రామారావు, డి సురేష్ బాబు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 



*నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ*...లవ్ స్టోరి సినిమా సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. థియేటర్ లలో సినిమా మ్యాజిక్ మళ్లీ లవ్ స్టోరితో తిరిగొచ్చేసింది. శేఖర్ కమ్ములకు ఇది ఎంత ఇంపార్టెంట్ మూవీనో నాకు తెలుసు. వెల్ డన్ శేఖర్ కమ్ముల. నారాయణదాస్ నారంగ్, సునీల్, రామ్మోహన్ కంగ్రాట్స్, కీప్ ఇట్ అప్. నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించారు. సంగీతం సూపర్బ్ గా వచ్చింది. థియేటర్ లలో సినిమా మ్యాజిక్ ఇంకా ఉంది ఉంటుంది అని ప్రూవ్ చేసిన లవ్ స్టోరి టీమ్ అందరికీ థాంక్స్. అన్నారు.


*నిర్మాత నారాయణ దాస్ నారంగ్ మాట్లాడుతూ*...అందరికీ నమస్తే. నా ఫ్రెండ్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా లవ్ స్టోరిని నిర్మించి, విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా అద్భుతంగా ప్రదర్శితం అవుతోంది. చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ ఇప్పుడు లవ్ స్టోరితో ఓపెన్ అయ్యిందని అనుకుంటున్నాను. లవ్ స్టోరి సక్సెస్ కావడం టాలీవుడ్ కు శుభ పరిణామం. ఇప్పుడు చాలా సినిమా మా సినిమా సక్సెస్ చూసి రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. ఎంటైర్ టీమ్ కు, నాగార్జున గారికి థాంక్స్. అన్నారు.


*గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ*...కొండల్లో, గుట్టల్లో ఉండే జానపద గీతాన్ని వెండితెరపైకి తెచ్చింది సినిమా. జానపద పాటతో ఒక హిట్ పాట చేద్దామని శేఖర్ గారు చెప్పారు. అలా సారంగ దరియా పాట ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. లవ్ స్టోరి టీమ్ అందరికీ నా కంగ్రాట్స్. అన్నారు.


*దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ*...లవ్ స్టోరి సినిమా సాధించిన విజయం నాకు చాలా రిలీవ్ ఇచ్చింది. జనరల్ గా నా సినిమాల సక్సెస్ గురించి టెన్షన్ పడను. కానీ లవ్ స్టోరి విజయం సాధించాలని గట్టిగా కోరుకున్నా. రెండు సెన్సిటివ్ ఇష్యూస్ గురించి సినిమాలో చెప్పాం. దాన్ని కథలో చక్కగా రాయాలని అనుకున్నాం. మరో ఛాలెంజింగ్ విషయం పాండమిక్ టైమ్ లో థియేటర్ లకు జనం వస్తారా రారా అని భయపడ్డాం. ఆ భయాలన్నీ జయించి ఇవాళ విజయం సాధించాం. దేవుడు దీవించాడు. పైన మా నాన్నగారు ఆశీర్వదించారు అని నమ్ముతున్నాను.  ఇవాళ నిజంగా చాలా హ్యాపీ. లవ్ స్టోరి చాలా స్ట్రెస్ ఫుల్ జర్నీ. 3 ఏళ్లుగా సినిమాకు పనిచేస్తున్నాం. రెండు పాండమిక్ లు చూశాం. మా యూనిట్ కు థాంక్స్ తప్ప మరో మాట రావడం లేదు. నారాయణదాస్ గారు, ఆయన మా వెనక గట్టిగా నిలబడ్డారు. సినిమా మాత్రం థియేటర్లలో రిలీజ్ అవ్వాలని నారాయణ దాస్ నారంగ్ గారు నిర్ణయంతో పట్టుబడ్డి రిలీజ్ చేశారు. చైతూ, సాయి పల్లవి, ఇతర కాస్ట్ అండ్ క్రూ కు థాంక్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి థాంక్స్. చిరంజీవి గారు దగ్గర్నుంచి చాలా మంది స్టార్స్, దర్శకులు మాకు అండగా నిలబడ్డారు. నాగార్జున గారికి థాంక్స్. తన కొడుకు సినిమా అని కాదు ఆయన ఫిల్మ్ లవర్ కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇతర అతిథులకు కృతజ్ఞతలు. మాకు సపోర్ట్ చేసిన పిప్రీ ప్రజలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు, థియేటర్స్ ఓనర్స్ కు థాంక్స్. నా ఫ్యామిలీకి థాంక్స్. అన్నారు.


*హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ*... మా సక్సెస్ మీట్ కు వచ్చిన పెద్ద వాళ్లందరికీ థాంక్స్. నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తారు. ఆయన గురించి అప్పుడు చెప్పాలని అనుకున్నాను. మా తాతయ్య అన్నమయ్య సినిమా ఒక వంద సార్లు చూసి ఉంటారు. ఆయనతో పాటు మేమూ చూశాం. ఆ సినిమా చూసినప్పటి నుంచి మీరంటే ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి. అన్నమయ్య సినిమా చూసి తాతయ్య ఏడుస్తుంటే, ఆయన నటిస్తున్నారు తాతయ్య ఏడవకు అన్నాను. కానీ తాతయ్య అన్నారు ఇప్పుడు నటిస్తుండొచ్చు , గానీ గత జన్మలో నాగార్జున యోగి అయి ఉంటారు అన్నారు. అప్పటి నుంచి మీ సినిమాలు టీవీలో వస్తే ఛానెల్ మారుస్తాను. ఎందుకంటే తాతయ్య దృష్టిలో మీరు ఎప్పుడూ అన్నమయ్యే. ఇవాళ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థాంక్స్. దర్శకుడు శేఖర్ గారు చెప్పినట్లు నైతికంగా మనమంతా కరెక్ట్ గా ఉండాలని టీమ్ మొత్తం పాటించాం. అమ్మాయి తరుపున నిలబడి శేఖర్ గారు ఫైట్ చేశారు ఈ సినిమా ద్వారా. సినిమా మేకింగ్ లోనూ ఆయన మా కోసమే మాట్లాడేవారు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి అంశంలో లవ్ స్టోరి మ్యాజిక్ చేసింది. ప్రొడ్యూసర్స్ కు థాంక్స్. థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. లవ్ స్టోరి తో మళ్లీ సినిమాను ఆస్వాదిస్తున్నాం. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో జరిగినట్లు నాకు అయింది అని చెప్పేందుకు అమ్మాయిలకి ఒక ధైర్యాన్ని లవ్ స్టోరి ఇచ్చింది. అన్నారు.


*హీరో నాగ చైతన్య మాట్లాడుతూ*...అందరికీ నమస్కారం. చాలా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ లవ్ స్టోరి మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తుంది. పాండమిక్ వల్ల లవ్ స్టోరి సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఫ్రైడే మూవీస్ థియేటర్ లలో ఎలా ఉన్నాయి, వాటి రిజల్ట్ ఏంటి అనేది ఎప్పుడూ గమనిస్తుంటాను. పాండమిక్ వల్ల అది మిస్ అయ్యాను. కానీ ఈ నెల 24న ఆ మ్యాజిక్ డే నాకు వచ్చింది. రిలీజ్ చేస్తే థియేటర్ కు జనాలు వస్తారా లేదా అని భయపడ్డాం. కానీ మీరు వచ్చి చూస్తున్నారు. చాలా థాంక్స్. తెలుగు సినిమా ఆడియెన్స్ చిత్రాలను ఆదరించినట్లు దేశంలో ఇంకెక్కడా ఆదరించలేదు. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి కంటెంట్, ఆయనకున్న గుడ్ విల్ ఎంత ఉందో ఇవాళ లవ్ స్టోరి సక్సెస్ చూపిస్తోంది. మన జర్నీ ఆగొద్దు, ఇకపైనా మంచి సినిమాలు చేద్దాం. సినిమా రిలీజ్ అయ్యే ముందు లవ్ స్టోరి హిట్ కావాలని స్టార్స్, డైరెక్టర్స్ కోరుకున్నారు. మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీల్ క్రియేట్ చేశారు. వాళ్లందరికీ థాంక్స్. మా నిర్మాతలు కంటెంట్ నమ్మారు. థియేటర్ లో రిలీజ్ అవ్వాలని హోల్డ్ చేశారు. లవ్ స్టోరి చిత్రంతో శేఖర్ గారు చాలా మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశారు. ఈ మ్యాజికల్ సక్సెస్ సందర్భంగా లవ్ స్టోరి టీమ్ అందరికీ కంగ్రాట్స్. మా అభిమానులందరికీ థాంక్స్. కొత్త సినిమా అయినా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. కొత్త తరహా సినిమా చేస్తే మీ ఆదరణ ఉంటుందని నిరూపించారు. లవ్ స్టోరిని థియేటర్ లో ఎంజాయ్ చేయండి. అన్నారు.


*హీరో నాగార్జున మాట్లాడుతూ*... తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా ముందు ఉన్న మిత్రులు, పెద్దలు నారాయణదాస్ నారంగ్ గారికి నమస్కారం. నాకు లవ్ స్టోరి సక్సెస్ మీట్ కన్నా ఇది హ్యూమానిటీ సక్సెస్ మీట్ లా అనిపిస్తోంది. మార్చి 2020 నుంచి పోరాడుతూనే ఉన్నా వైరస్ తో , ఏడాదిన్నర గడిచిపోయింది. ఒక వేవ్ లో బయటపడ్డాం అనుకున్నాం కానీ రెండో వేవ్ వచ్చి అణిచివేసింది. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. 208 రోజుల తర్వాత తెలంగాణలో కోవిడ్ డెత్స్ లేవని తెలిసి సంతోషించాను. ఏపీతో పాటు దేశంలోనూ కరోనా తగ్గుతోంది. కాబట్టి మనం దాన్ని ముందు సెలబ్రేట్ చేసుకోవాలి. కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా తో బాగా పోరాడారు. కరోనాతో పోరాడి, కరెక్ట్ డెసిషన్స్ సరైన సమయంలో తీసుకుని ప్రజల్ని కాపాడారు. తెలంగాణ మీద కాస్త కనికరం చూపించింది, ఏపీలో ఉధృతి ఎక్కువగా ఉండేది. కానీ ఇవాళ ఆ వైరస్ నుంచి బయటపడ్డాం. ప్రజల్ని కాపాడటమే ప్రభుత్వాల పని. చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ తెరవలేదు. తెలంగాణలో థియేటర్స్ తెరిచారు. ఏపీలో వైరస్ దృష్ట్యా పూర్తిగా తెరవలేదు. ఆరోగ్య కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రుల దాకా థాంక్స్ చెబుతున్నా. లవ్ స్టోరి సక్సెస్ గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు మొత్తం దేశ సినిమా పరిశ్రమకే ఉత్సాహాన్ని ఇస్తోంది. లవ్ స్టోరి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ 7 కోట్ల రూపాయలు. ఒక మంచి సినిమా ఇస్తే థియేటర్లకు వస్తామని తెలుగు్ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. కొవిడ్ ఒక్కటే కాదు తుఫాన్, సైక్లోన్ వచ్చినప్పుడు కూడా మన వాళ్లు సినిమాలను ఆదరించారు. లవ్ స్టోరి ఒక నాంది. దసరా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు ధైర్యం వచ్చింది. ప్రతి ఫిల్మ్ మేకర్ లవ్ స్టోరి విజయం వల్ల సంబరాలు చేసుకున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి మనం సంస్కారం నేర్చుకోవాలి. ఆయన పేరు పేరునా టీమ్ అందరినీ పిలిచారు. మేము మర్చిపోతాం. నీ మానవత్వం సూపర్బ్. శేఖర్ కమ్ముల చాలా సెన్సిటివ్ డైరెక్టర్. ఆయన థీమ్స్ అన్నింటిలో సెన్సిటివిటీ ఉంటుంది. కానీ అది సరిపోదు. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బ్యాలెన్స్ చేసి తీయాలి. శేకర్ కమ్ముల అది నేర్చుకున్నాడు. లవ్ స్టోరి ఊరికే హిట్ అవలేదు. అన్ని ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కించారు. వన్ గర్ల్ ముందుకొచ్చి తన సమస్యను చెప్పగలిగితే చాలు లవ్ స్టోరి కి సార్థకత వచ్చినట్లే. సినిమాలో ప్రతి సన్నివేశం బ్యూటిఫుల్ గా ఉంది. ఏదో ఏవేవో వద్దు ఒక టెర్రస్ చాలు మంచి సినిమా చేసేందుకు అని నిరూపించారు శేఖర్ కమ్ముల. క్యారెక్టర్స్ తో ఎమోషన్ కనెక్ట్ చేస్తే చాలు సినిమా విజయం సాధిస్తుందని శేఖర్ కమ్ముల ప్రూవ్ చేశారు. నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ చదవడం కూడా ఇష్టం ఉండదు. కానీ అలాంటి అంశాలను శేఖర్ కమ్ముల చూపించిన విధానం సూపర్బ్. నేను సినిమా చూసి రెండు మూడు రోజులు అదే ఎమోషన్ లో ఉండిపోయాను. నారాయణ దాస్ నారంగ్ గారికి నాన్నగారు ఏఎన్నార్ తో చాలా అనుబంధం ఉండేది. మీరు నాతో సినిమా తీయకుండా చైతూతో సినిమా నిర్మించి సూపర్ హిట్ చేశారు. మిమ్మల్ని చూస్తుంటే నాన్నను చూసినట్లే ఉంటుంది. సునీల్ నా ఫ్రెండ్ చాలా టెన్షన్ పడ్డారు సినిమా రిలీజ్ డేట్ విషయంలో. కానీ మీరు కరెక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను మిమ్మల్నందరినీ కంగ్రాట్స్ చేస్తున్నాను. పవన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ గారి శిష్యుడు అని విన్నాను. అందుకే వందలాది మిలియన్ వ్యూస్ వచ్చాయి. వెల్ డన్ పవన్. సుద్దాల సాహిత్యం, మంగ్లీ పాటలు పాడిన తీరు బ్యూటిఫుల్ గా ఉంది. సినిమాకు పనిచేసిన చాలా మంది గురించి మాట్లాడాలి. సాయి పల్లవి..మీ తాతగారికి అన్నమయ్య సినిమానే చూపిస్తూ ఉండు. సాయి పల్లవి వండర్ ఫుల్ యాక్ట్రెస్. ఆమె డాన్స్ చేస్తుంటే సమ్ స్పిరిట్ కనిపిస్తుంటుంది. ఆమె చుట్టూ వంద సాయి పల్లవిలు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. ఆమె కాళ్లు గాలిలో తేలినట్లు ఉంటాయి. నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా ఆ మ్యాజిక్ కనిపిస్తుంటుంది. నీకు అది గొప్ప గిఫ్ట్. పేరు పేరునా నటీనటులు, టీమ్ మెంబర్స్ అందరికీ గాడ్ బ్లెస్ యూ. లవ్ స్టోరి ఒక క్లాసిక్ ఫిల్మ్. ఇలాంటివి అప్పుడప్పుడూ వస్తుంటాయి. కొడుకు గురించి ఏం చెప్పుకుంటాను. చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసింది. యాక్టర్ అండ్ స్టార్ ఇవి రెండు డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్ గా తయారు చేశావ్ శేఖర్ కమ్ముల. అతన్ని న్యూ జర్నీలో తీసుకెళ్లావ్. నాన్నా...నువ్వు చాలా ఫెంటాస్టిక్ గా నటించావు. నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్ సినిమాలో. ప్రేమనగర్ రిలీజ్ అయి 50 ఏళ్లవుతోంది. సేమ్ డేట్ కు లవ్ స్టోరి రిలీజ్ అయ్యింది. ప్రేమనగర్ టైమ్ లోనూ తుఫాన్ సైక్లోన్ అన్నీ ఉన్నా, నాన్నగారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. తుఫాన్, కొవిడ్, సైక్లోన్ తో పోరాడి లవ్ స్టోరి గొప్ప విజయాన్ని సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపుతో చూశాయి. తెలుగు  ప్రేక్షకులు సినిమాను ప్రేమిస్తారు. ఇకపైనా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనం మాస్క్ లు తీసేసి హాయిగా కలిసి ఉండాలని, ఆ రోజు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Anand Deverakonda's "Pushpaka Vimanam" To Release In Theatres On 12th November

 Anand Deverakonda's "Pushpaka Vimanam" To Release In Theatres On 12th November 



Anand Deverakonda's Pushpaka Vimanam is all set for theatrical release. The makers have announced that the film will be releasing in theatres on the 12th of this month. This is Anand's third film after Dorasani, and Middle Class Melodies.


The film is directed by debutante Damodara and Tollywood heartthrob Vijay Deverakonda is presenting it under 'King Of The Hill' banner. Tanga Productions are co-producing the film. Govardhan Rao Deverakonda, Pradeep Errabilli, and Vijay Dashi are producing the film. 


The director Damodara says Pushpaka Vimanam is a concept-based film. "Anand plays a government school teacher in the film. It is a family drama that deals with subtle nuances. The film s releasing on the 12th of November," he concludes.



 *Cast* : 

Anand Deverakonda 

Geeth Saini , Saanve Megghana

Sunil, Naresh, Harsha Vardhan , Giridhar, Kireeti, Badhram, viva Harsha, Abhijeeth, Ajay, Sudarshan, Saranya, Meena Vasu, shaking Seshu


Writer & Director: Damodara.

Presenter : Vijay Deverakonda.

Producers: Govardhan Rao Deverakonda, Vijay Dashi, Pradeep Errabilli

DOP: Hestin Jose Joseph

Music: Ram Miriyala, Sidharth Sadasivuni, Amit Dasani.

BGM: R H Vikram


Editor: Raviteja Girijala 


Art director: Neil Sebastian


Costume designer: Bharath Gandhi


Choreographers: Raghu master, Aata Sandeep


Publicity designers: Anil bhanu


Digital media : Walls and Trends


PRO :GSK Media

Vishwanath Film Factory Kalthi Movie Launched

 విశ్వనాధ్ ఫిలిం  ఫ్యాక్టరీ  బ్యానర్ పై "కల్తీ" మూవీ ప్రారంభం 



 *విశ్వనాధ్ ఫిలిం  ఫ్యాక్టరీ  బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా నిర్మిస్తున్న నూతన చిత్రం " కల్తీ " ఇటీవల హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయం లో పూజ కార్యక్రమాలతో చిత్రం షూటింగ్  ప్రారంభ మయ్యింది . ఈ సందర్భంగా** 


 *దర్శకుడు శ్రీకృష్ణ పద్దం మాట్లాడుతూ..* .ధ్రువ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం .విజువల్ వండర్ గా అన్ని కమర్షియల్  ఎలిమెంట్స్  ఈ చిత్రంలో ఉంటాయి అన్నాడు  


 *హీరో ధ్రువ మాట్లాడుతూ* .. మాస్  క్యారెక్టర్  లో నటిస్తున్నాను , నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు ధన్యవాదాలు అన్నాడు .  


 *నిర్మాత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ..* ఇది   మా బ్యానర్ లో వస్తోన్న  2  వ చిత్రం . అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది . అక్టోబర్ మొదటి  వారం లో  ఈ సినిమా ప్రారంభించి హైదరాబాద్ , వైజాగ్ , ముంబై , చెన్నై లో చిత్రీకరిస్తాం అన్నారు . ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు .  


 *సాంకేతిక నిపుణులు* 

సినిమాటోగ్రఫీ : ఆర్. కె . నాయుడు , 

ఎడిటర్ : కొండవీటి రవికుమార్ , 

సంగీతం : వెంకట్ ఐనాల , 

పి.ఆర్.ఓ : మధు వి.ఆర్

దర్శకత్వ పర్యవేక్షణ : సూర్య ఆలంకొండ , 

కో- డైరెక్టర్ : కే . పి , 

అసోసియేట్  డైరెక్టర్స్  : కృష్ణ , జయంత్ , విష్ణు , 

నిర్మాత : విశ్వనాధ్ తన్నీరు ,  

దర్శకత్వం : శ్రీకృష్ణ పద్దం

Rashmika First Look Release of Pushpa The Release will be Revealed Tomarrow

 సెప్టెంబర్ 29 ఉదయం 9.45 నిమిషాలకు‘పుష్ప: ది రైజ్’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల.. 



అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. సెప్టెంబర్ 29 ఉదయం 9.45 నిమిషాలకు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా విడుదలైంది. క్రిస్మస్ సందర్భంగా పుష్ప: ది రైజ్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. 


నటీనటలు: 

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ 

కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా 

సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్ 

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 

ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే 

సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి 

ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్

లిరిసిస్ట్: చంద్రబోస్ 

క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్

మేకప్: నాని భారతి 

CEO: చెర్రీ

కో డైరెక్టర్: విష్ణు 

లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం 

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా

PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు

"Love all the haters - Puri Anthem" Launched By Akash Puri

 యంగ్ హీరో పూరీ ఆకాష్ చేతులు మీదుగా నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్ 'బొమ్మ‌ బ్లాక్ బ‌స్ట‌ర్' సినిమా నుంచి "Love all the haters - Puri Anthem" విడుదల..



విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి పేరుని సంపాదించిన నందు విజ‌య్‌కృష్ణ హీరోగా.. యాంక‌ర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెష‌ల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ర‌ష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఈ చిత్రాన్ని విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ ప‌రిచ‌యమ‌వుతున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో.. ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న వచ్చింది. ట్రేడ్‌ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక‌ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి వ‌చ్చిన పాటలు మంచి విజ‌యాన్ని సాధించాయి. తాజాగా యంగ్ హీరో, పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌య‌డు పూరీ ఆకాష్ ఈ చిత్రం నుంచి "Love all the haters - Puri Anthem" విడుదల చేశారు. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ మాటలతో ఈ పాట మొదలైంది. పుట్టుకతోనే నువ్వు గెలిచి వచ్చావ్.. ఇంకా నీకు ఓటమి ఏంటన్నా అంటూ అద్భుతమైన లిరిక్స్‌తో ఈ పాట సాగింది. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ తెలియజేయనున్నారు.



న‌టీన‌టులు


నందు విజ‌య్ కృష్ణ‌‌, ర‌ష్మీ గౌత‌మ్, కిరిటి, ర‌ఘు కుంచె త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం


రచన - దర్శకత్వం : రాజ్ విరాట్

నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ

మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి

పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే

ఎడిటర్ : బి. సుభాష్కర్

సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్

పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Tanishq Reddy Presents Production No1 Movie Launched

 తనిష్క్ రెడ్డి సమర్పిస్తోన్న ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ‘ప్రొడక్షన్ నెం.1’ చిత్రం ప్రారంభం



తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగా మాధవ్ మూర్తి దర్శకత్వంలో రిచా భట్నాగర్, విజయ లక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వెంకట్ యాదవ్(ప్రవీణ్ యాదవ్) తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్ పై క్లాప్ కొట్టగా, జ్యోత్స్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో హీరో తనిష్క్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చిత్ర నిర్మాతలు బ్యాక్ ఎండ్‌లో ఉండడం వలన నేను తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను ఎగ్జిక్యూట్ చేయవలసి వచ్చింది. నన్ను హీరోని చేసిన వెంకట్ గారికి, మరియు నిర్మాతలకు ధన్యవాదాలు. మా చిత్ర దర్శకుడు మాధవ్ మూర్తి ‘జెర్సీ, మళ్ళీ రావా’ వంటి సినిమాలకు వర్క్ చేసి ఈ సినిమాతో డైరెక్టర్ అవుతున్నాడు. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అని అన్నారు.


చిత్ర దర్శకుడు మాధవ్ మూర్తి మాట్లాడుతూ.. ‘‘నేను ఇంతకు ముందు ‘జెర్సీ, మళ్ళీ రావా’ వంటి సినిమాలకు అసోసియేట్‌గా వర్క్ చేశాను. ఈ చిత్రంలో నాకు దర్శకత్వం వహించే  అవకాశం కల్పించారు చిత్ర నిర్మాతలు రిచా భట్నాగర్, విజయ లక్ష్మీగారు. వారికి నా ధన్యవాదాలు. నాకు, హీరోకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. మేము ఎప్పటి నుండో సినిమా తీయాలనుకుంటున్నాము. ఈరోజుకి ఆ కల సాకారమైంది. చిత్ర కథ విషయానికి వస్తే యధార్థ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ ఇది. ఎమోషన్, యాక్షన్ వంటి స్ట్రాంగ్ కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ని అక్టోబర్ చివరి వారం మొదలు పెట్టనున్నాం. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నాము..’’ అన్నారు.


సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నేను రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఆ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంది.. అందుకే ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాను. కథకు తగ్గట్టుగా పాటలు చాలా బాగుంటాయి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాకు సంగీతం అందించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు.


చిత్ర హీరోయిన్ అంకిత సాహు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు.


తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి

సమర్పణ: తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్

బ్యానర్: ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ ముమ్మలనేని

సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల

సంగీతం: ఆర్.ఆర్. ధ్రువన్

పి.ఆర్.ఓ: బి. వీరబాబు

నిర్మాతలు: రిచా భట్నాగర్, విజయ లక్ష్మీ

కథ, కథనం, దర్శకత్వం: మాధవ్ మూర్తి


Aadi SaiKumar Athidhi Devobhava Song Released

 ఆది సాయి కుమార్ ‘అతిధి దేవో భవ’ నుండి సిద్ శ్రీ‌రామ్ పాడిన‌ ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ పాట విడుద‌ల‌



ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘అతిధి దేవో భవ’.  శ్రీనివాస క్రియేషన్స్ ప‌తాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మొద‌టిపాట‌గా  ఓ ప్రేమ గీతాన్ని  విడుద‌ల‌చేశారు. ఆ పాట సంగీత ప్రియుల్ని అల‌రిస్తోంది.


బాగుంటుంది నువ్వు నవ్వితే అంటూ సాగే ఈ గీతానికి  భాస్కర భట్ల సాహిత్యం అందించ‌గా లేటెస్ట్‌ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్, నూతన మోహన కలిసి ఈ పాటను ఆలపించారు. శేఖర్ చంద్ర మంచి బాణీలు సమకూర్చారు. యూత్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంటున్న ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.


ఈ పాటతో సినిమా మీద అంచనాలు మ‌రింత‌ పెరిగాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించబోతోన్నారు. ఈ సినిమాకు అమరనాథ్ బొమ్మిరెడ్డి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.


నటీనటులు: ఆది సాయి కుమార్, నువేక్ష


సాంకేతిక  బృందం:

ద‌ర్శ‌క‌త్వం: పొలిమేర నాగేశ్వర్

నిర్మాతలు : రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల

బ్యానర్ : శ్రీనివాస సినీ క్రియేషన్స్

సంగీతం: శేఖర్ చంద్ర

కెమెరామెన్: అమరనాథ్ బొమ్మిరెడ్డి

ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్

పీఆర్ఓ : వంశీ - శేఖర్

Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments’ Konda Polam Trailer Out

 



After making blockbuster debut with Uppena, Mega sensation Vaisshnav Tej is coming up with yet another interesting project Konda Polam being helmed by creative director Krish Jagarlamudi with stunning diva Rakul Preet Singh playing the leading lady.


First look posters of Vaishnav Tej and Rakul Preet Singh made positive impact, while musical promotions began on impressive note with first single Obulamma scored by MM Keeravani becoming a chartbuster in short time.


The makers intensified the promotions by releasing theatrical trailer of the movie today. The trailer discloses the plotline letting us what to expect from this spectacular action and adventurous film. The trailer looks promising and assures an engaging ride in theatres.


Coming to the core point divulged by the trailer, Vaisshnav Tej who fails to clear interviews for his job multiple times in Hyderabad, faces humiliation from the interviewers for his background of coming from a shepherd family and parents being uneducated. However, he proudly says, he’s trained in Nallamala Forest and didn’t go to any institution.


With regard to his grandfather’s command, Vaisshnav Tej whose character name is Kataru Ravindra Yadav decides to go to Konda Polam along with his father, as there is no sufficient water for sheep in the village. He takes up the responsibility of saving sheep from wild animals. He has a girlfriend named Obulamma played by Rakul Preet Singh and she is very bubbly.


In his journey, Ravindra faces many hurdles, biggest being taking on the evil-natured men in the jungle who are more dangerous than the wild animals and are the real threat. How, he accomplishes the task is going to be the crux of the story.


The basic storyline sounds very interesting. Krish shows his creativity in dealing this intriguing subject. Gnana Shekar VS has captured the scenic beauty of landscapes in commendable way, while background score has MM Keeravani’s stamp all over, as they uplift the visuals.


It’s a tailor-made character for Vaisshnav Tej, while Rakul Preet Singh makes her presence felt. Their pairing looks fresh on screen.


Adapted from the novel written by Sannapureddy Venkata Rami Reddy, Konda Polam is produced by Saibabu Jagarlamudi, Rajeev Reddy under First Frame Entertainments and is presented by Bibo Srinivas.


An Epic Tale Of ‘Becoming’ is the tagline of Konda Polam which will release on October 8th.


Cast: Panja Vaisshnav Tej, Rakul Preet Singh


Technical Crew:


Director: Krish Jagarlamudi

Producers: Saibabu Jagarlamudi and Rajeev Reddy

Banner: First Frame Entertainments

Music Director: MM Keeravani

Cinematography: Gnana Shekar VS

Story: Sannapureddi Venkata Rami Reddy

Editor: Shravan Katikaneni

Art: Raj Kumar Gibson

Costumes: Aishwarya Rajeev

Fights: Venkat

PRO: Vamsi-Shekar


Legend Mike Tyson On Board For Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Crazy Pan India Project LIGER (Saala Crossbreed)

 Legend Mike Tyson On Board For Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Crazy Pan India Project LIGER (Saala Crossbreed)



Dashing director Puri Jagannadh is leaving no stone unturned to make his and happening hero Vijay Deverakonda’s first Pan India project LIGER (Saala Crossbreed) one of the most momentous project for the entire team, action movie lovers and normal audience as well.


Here comes the earth-shattering update from the team LIGER. They are proud to announce that, FOR THE FIRST TIME ON INDIAN SCREENS, THE MAN WHO CREATED HISTORY, UNBEATABLE ICON, ONE AND ONLY LEGEND THE GREAT MIKE TYSON IS ON BOARD FOR THE PRESTIGIOUS AND CRAZY PAN INDIA PROJECT LIGER (Saala Crossbreed).


Yes, you read it right. The Legend Mike Tyson, who is known for his intimidating ferocious demeanour and impeccable striking prowess, is part of LIGER. The film that tells the story of a Mixed Martial Arts Expert will feature ‘Iron Mike’ in a significant and mighty role. The crazy project now turns craziest and even becomes Pan World one indeed.


“We promised you Madness! We are just getting started :) For the first time on Indian Screens. Joining our mass spectacle - #LIGER . The Baddest Man on the Planet. The God of Boxing, The Legend, the Beast, the Greatest of all Time! IRON MIKE TYSON #NamasteTYSON ,” posted Vijay Deverakonda welcoming Mike Tyson to the Indian cinema.


LIGER will also feature numerous foreign fighters. So, hold all your excitement for a few more days, as LIGER is gearing up for its theatrical release.


Currently, the film’s shooting is happening in Goa where some high-octane action sequences are being canned. “BLOOD SWEAT VIOLENCE,” the makers define the ongoing schedule.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions.


Given it is one of the craziest Pan India projects and moreover The Great Mike Tyson on board, Puri connects and Dharma Productions are making the film on a grand scale.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha


Naga Shaurya's 'LAKSHYA' To Release On November 12

 Naga Shaurya's 'LAKSHYA' To Release On November 12



Promising young hero Naga Shaurya’s landmark 20th film ‘LAKSHYA’ is currently in post-production stages. Santhossh Jagarlapudi is directing the film where Ketika Sharma is paired opposite Naga Shaurya.


Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sree Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners.


The makers yesterday unveiled a poster asking netizens to speculate release date of the film. The poster showed four different dates. The makers came up with a new poster today and it confirms, Lakshya will be releasing worldwide on November 12th.


Goes shirtless and sports ponytail, Naga Shaurya appears like a hungry Jaguar flaunting his abs in the release date poster. Underwent unbelievable physical transformation to play the role of an archer, Naga Shaurya will be seen in a never seen before avatar. He sports two different getups in the sports drama based on ancient sport archery.


Director Santhossh Jagarlapudi came up with first of its kind story and Naga Shaurya underwent training to understand the nuances of the sport. Jagapathi Babu will be seen in a crucial role.


Cast: Naga Shaurya, Ketika Sharma, Jagapathi Babu, Sachin Khedekar etc.


Technical Crew:

Story, Screenplay, Direction: Dheerendra Santhossh Jagarlapudi

Producers: Narang Das K Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Cinematographer: Raam Reddy

Music Director: Kaala Bhairava

Editor: Junaid

PRO: Vamsi-Shekar, BA Raju

Varun Doctor Releasing on October 9th

 అక్టోబర్ 9న శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్':

ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్



అనగనగా ఓ డాక్టర్... అతని పేరు వరుణ్! అతనికి ఓ కుటుంబం ఉంది. అయితే, అది సొంత కుటుంబం కాదు. అందరూ కలిసి కుటుంబంలా నటిస్తూ, కిడ్నాప్ లకు చేస్తుంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ (అమ్మాయిల అక్రమ రవాణా)కు, డాక్టర్ చేయించే కిడ్నాప్ లకు సంబంధం ఏమిటి? వైద్యం చేయాల్సిన డాక్టర్ గన్ చేతపట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాలోకి ఎందుకు వచ్చాడు? దాన్ని ఎలా అరికట్టాడు? అనేది తెలియాలంటే విజయదశమి కానుకగా విడుదలవుతున్న 'వరుణ్ డాక్టర్' చిత్రాన్ని థియేటర్లలో చూడాల్సిందే.


'రెమో', 'సీమ రాజా', 'శక్తి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఆయన హీరోగా నటించిన చిత్రం 'వరుణ్ డాక్టర్'. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ 'బీస్ట్' దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్. స్టూడియోస్ అధినేత కోటపాడి జె. రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె. ప్రొడక్షన్స్ సంస్థలతో సంయుక్తంగా నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న 'డాక్టర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు.‌ దానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. 1.5 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.


ఈ సందర్భంగా నిర్మాత కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ "శివ కార్తికేయన్ గారికి తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. ట్రైలర్ కు లభిస్తున్న స్పందన అందుకు ఉదాహరణ.‌ 'శక్తి' తర్వాత మరోసారి ఆయనతో చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ లో ఆయన స్టైలిష్ లుక్, నటన అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాలో కథానాయకుడి పాత్ర చిత్రణ సైతం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అద్భుతమైన కథ, కమర్షియల్ హంగులతో ఎక్స్ట్రాడినరీ సినిమా తీశారు. ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుంది. 'వాన'లో హీరోగా నటించిన వినయ్, 'డాక్టర్'లో ప్రతినాయకుడిగా నటించారు. అలాగే, 'గ్యాంగ్ లీడర్'తో తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్... శివ కార్తికేయన్ సరసన నటించారు. సంచలనం అనిరుధ్ అందించిన పాటలకు తమిళంలో అద్భుత స్పందన లభించింది. త్వరలో తెలుగు పాటలను విడుదల చేస్తాం. విజయదశమికి ప్రేక్షకులందరూ కుటుంబంతో కలిసి చూసే చక్కటి చిత్రమిది" అని అన్నారు.


దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ "ఇదొక మాస్ ఎంటర్టైనర్. ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి చక్కటి స్పందన లభించడం సంతోషంగా ఉంది. సినిమా సైతం ప్రేక్షకులు అందరినీ తప్పకుండా అలరిస్తుందని చెప్పగలను" అని అన్నారు.


శివ కార్తికేయన్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో వినయ్ రాయ్ విలన్. యోగి‌ బాబు, మిళింద్ సోమన్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: రాజేష్ ఏ మూర్తి, పాటలు: రాజశ్రీ సుధాకర్, శ్రీనివాస మూర్తి, కూర్పు: ఆర్. నిర్మల్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, సంగీతం: అనిరుధ్, నిర్మాత: కోటపాడి జె. రాజేష్, రచన దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్.

Tremendous Response for Neetho Teaser

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటున్న ‘నీతో’ టీజర్..


అభిరామ్ వర్మ, సాత్విక రాజ్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ నీతో. ఏవిఆర్ స్వామి, ఎమ్ఆర్ కీర్తన, స్నేహాల్ జంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలు శర్మ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. లవ్ లైఫ్ డ్రామాగా నీతో టీజర్ ఆకట్టుకుంటుంది. యూత్ ఫుల్ అంశాలతో ఈ టీజర్ కట్ చేసారు దర్శక నిర్మాతలు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయింది. టీజర్‌లో మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న నీతో సినిమాకు మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సుందర్ రామ్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల అవుతుంది.

నీతో మూవీ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్.

-ప్రొడ్యూసర్ ఏ వి ఆర్ స్వామి గారు మాట్లాడుతూ ఇక్కడకి వచ్చిన పెద్దలు అందరికి, మీడియా మిత్రులకి నా నమస్కారములు, నేను రాహు అనే మూవీ తో నా ప్రయాణం స్టార్ట్ చేశాను, బాలు గారి తో ఒక సినిమా చేశాను, ఇప్పుడు నీతో చేస్తున్నాను, ఈ సినిమా తప్పకుండా మీ ఆదరణ పొందుతుంది అని మాట్లాడారు.

-హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ కి  రావటానికి కారణం టీజర్ నాకు చాలా చాలా నచ్చింది, సినిమా ఆటోగ్రాఫేర్ సుందర్ అమేజింగ్ వర్క్, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అమేజింగ్, బాలు ఈ నగరానికి ఏమైంది కి వర్క్ చేసాడు, పవిత్రలోకేష్ గారు దియా లో తన నటనకి నా కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి, రవివర్మ వెన్నల చూసినప్పుడు చాలా ఎక్సయిట్  అయ్యాను, డైరెక్టర్ చెపుతున్నాడు మాది చిన్న సినిమా అని అంటున్నాడు సినిమా రిలీజ్ అయ్యాక చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతాయి,  మొదట్లో అభిరామ్ నేను కలిసి అవకాశాలు కోసం ట్రావెల్ చేసాం, మా గ్రూప్ లోనే ఉంటేవాడు, అల్ ది  బెస్ట్ అభిరామ్,ప్రొడ్యూసర్స్ థాంక్స్ యు సార్,నన్ను ఈ ఈవెంట్ కి పిలిచినందుకు అని చెప్పి ఈ సినిమా మంచి విజయం సాదించాలి అని కోరుకున్నాడు.

-పవిత్ర లోకేష్ మాట్లాడుతూ  అందరికి నమస్కారం, ఇక్కడ అందరు యంగ్ స్టార్స్ వున్నారు, వీళ్ళు అందరిని  కలవటం చాలా ఆనందం గా వుంది, ప్రొడ్యూసర్స్ సినిమా తీయటం అనేది ఒక వ్యాపారం లాంటిది,చాలా సీరియస్ గా సినిమాలు నిర్మించాలి, బాలు శర్మ గురించి చెప్పాలి అంటె  చాలా మంచివాడు, ఫస్ట్ డైరెక్టర్ అంటె ఏమో అనుకున్నాను కాని సెట్  లో తన వర్క్ చూసిన తరువాత అంత క్లియర్ అయ్యింది, విశ్వక్ ని కలవటం చాలా హ్యాపీ గా వుంది, అభిరామ్ చాలా  పెద్ద హీరో అవుతాడు, ఇప్పుడు  మంచి సినిమాలు చేసుకుంటూ పొతే స్మాల్ బడ్జెట్ అనేది నో  మేటర్ మేటర్, థాంక్ యు పప్రొడ్యూసర్స్ అలాగే అల్ ది బెస్ట్ చెప్పారు.

-స్నేహాల్ గారు మాట్లాడుతూ నీతో ఒక మెట్రో సెక్షన్ లవ్ స్టోరీ, మెట్యూర్డ్  లవ్ స్టోరీ, దీనిలో అన్ని ఎమోషషన్స్ ఉంటాయి, ఇది నాకు, మా వైఫ్ కీర్తన కి ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది రొటీన్ గా వుండే సినిమా కాదు మీ అందరికి సినిమా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను.

-సినిమాటోగ్రఫేర్ సుందర్ మాట్లాడుతూ ఇది నాకు మొదటి సినిమా, మాది ప్రొపెర్ అంత తమిళనాడు,నాకు ఈ సినిమా లో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

-డైరెక్టర్ బాలు గారు  మాట్లాడుతూ అందరి కి నమస్కారం, విశ్వక్ సేన్  చాలా థాంక్స్ పిలవగానే వచ్చినందుకు, ఈ రోజుల్లో అవకాశాలు రావటం లేదు అనుకుంటాం కాని అవకాశాలు వెతుకుతూ ప్రయత్నం చేయాలి, అభిరామ్ గారు ద్వారా ఏవి ఏస్  స్వామి గారిని  కలిఫించటం జరిగింది, మా ప్రొడ్యూసర్స్  కధ వినటం జరిగింది, అభిరామ్ గారు, సాత్విక్ గారికి  నాకు థాంక్స్, వివేక్ సాగర్ సంగీతం, కాని, పవిత్ర లోకేష్ గారు కాని, TNR గారు  ఆయన మన మధ్య లేరు ఆయనతో కలిసి గడిపిన టైం చాలా విలువైనది, మా సినిమా ఆటోగ్రాఫేర్  సుందర్ అందరికి థాంక్స్ చెప్పుకుంటున్నాను అని చెప్పారు.

-అభివర్మ గారు మాట్లాడుతూ ప్రొడ్యూసర్ గారు మూడు సినిమాలు తీశారు కోవిద్ టైం లో మీకు పెద్ద  సక్సెస్  రావాలి, విశ్వక్ సేన్ ని ఫలక్ నామ దాస్ లో చూసి చాలా ఇంప్రెస్స్ అయ్యాను, అభి నువ్వు కూడా   విశ్వక్ లాగా ట్రాన్స్ఫార్మర్ అవుతుంది రావాలి, నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, సినిమా మంచి విజయం సాధిస్తుంది అని చెప్పారు.

-సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ, టీజర్ వెరీ ఫ్రెష్ గా వుంది, నాలుగు సంవత్సరాలనుండి బాలు తెలుసు,ఈ స్టోరీ నేను చాలా బాగా నమ్ముతున్నాను అని చెప్పి, ఈ సినిమా టీమ్ అందరికి అల్ ది బెస్ట్ చెప్పింది.

-సంజిత్ మాట్లాడుతూ, విశ్వక్ థాంక్స్  మమ్మల్ని విష్ చేయటానికి వచ్చినందుకు,బాలు,అభిరామ్, నాలుగు సంవత్సరాలు నుంచి ఫ్రెండ్స్, బాలు నీతో గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను, రియల్లీ ఫన్ వర్కింగ్ పర్సన్, స్నేహాల్ గారు ఒక్కరోజు కూడా సెట్ కి రాకుండా ఉండటం నేను చూడలేదు అంత హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్ అలాగే ఇక్కడకి వచ్చిన అందరకి థాంక్స్.
ప్రొడ్యూసర్స్ :ఏ వి ఆర్ స్వామి M.SC ( AG ),ఎం. ఆర్. కీర్తన, స్నేహాల్ జంగాల
మ్యూజిక్ :వివేక్ సాగర్
డైరెక్టర్ :బాలు శర్మ
ఎడిటింగ్ :మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ :సుందరం  కృష్ణన్
కాస్ట్యూమ్ డిజైనర్ :సంజన శ్రీనివాస్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :స్మరన్
పి ఆర్ వో :ఏలూరు శ్రీను.మేఘ శ్యామ్