Latest Post

PelliSandaD Releasing on October 15th

 ద‌స‌రా సందర్భంగా అక్టోబర్ 15న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న రాఘవేంద్రరావు ‘పెళ్లిసంద‌D’... 



ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన ఈయ‌న ‘పెళ్లిసంద‌D’ లో న‌టుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మూవీని ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబర్ 15న విడుద‌ల చేస్తున్నారు. 


ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ‘‘సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ప్లానింగ్ ప్ర‌కారం చేసుకుంటూ రావ‌డం వ‌ల్ల సినిమా అంద‌రికీ రీచ్ అయ్యింది . ఈ సినిమా నుంచి విడుద‌లైన రాఘవేంద్ర‌రావు ప్రోమో,  హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్, టీజర్, రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ద‌స‌రా సంద‌ర్భంగా ఈ అక్టోబర్ 15న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు. 


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.

aha announces a new web series 3 Roses with director Maruthi as showrunner an intriguing first poster launched

 aha announces a new web series 3 Roses with director Maruthi as showrunner; an intriguing first poster launched



100% Telugu platform aha, a household name for Telugu entertainment, is coming up with an exciting web series titled 3 Roses. Renowned director Maruthi Dasari, with hits like Bhale Bhale Magadivoy, Prathi Roju Pandage, Ee Rojullo and Mahanubhavudu to his credit, is the showrunner of what's the first female-trio web series in the Telugu digital space. Written by Ravi Namburi and directed by Maggi, 3 Roses is produced by SKN (he had also produced Vijay Deverakonda's hit film Taxiwaala) under Action Cut Movies LLP. An eye-catching first poster of the show, featuring three young women in a bar, was released on Friday.


The poster, with the tagline 'Blooming soon', leaves audiences curious about the leading faces of 3 Roses and teases them to play the guessing game. The production design and the colourful costumes of the characters instantly win your attention. The fact that the platform didn't choose to reveal the actors in this first glimpse has generated more anticipation among audiences around 3 Roses. 


While Allu Arjun had revealed that director Maruthi will be ideating a show for aha at the Aha grand reveal event held in 2020, it's impressive that the filmmaker has delivered on his promise within a year. Maruthi, who's directed several commercially successful, entertaining films like Ee Rojullo, Prema Katha Chitram, Prathi Roju Pandage, Bhale Bhale Magadivoy and Mahanubhavudu, is a name synonymous with his uncanny premises, rib-tickling humour, and it's certain that 3 Roses will be a fun ride with all the key ingredients that define him as a storyteller. Balreddy is the cinematographer of 3 Roses, while the editor is SB Uddhav. Uyyala Jampala fame MR Sunny is composing the music.


aha, over the recent months, has delivered one hit after the other in the web space with their three originals, Kudi Yedamaithe, Tharagathi Gadhi Daati and The Baker and the Beauty, impressing audiences and garnering critical acclaim. The three originals belonged to different genres, from sci-fi thriller to teenage drama and a slice-of-life rom-com, and the performances, execution received praise from all corners. The next few months are going to be nothing less than a feast for audiences on aha with several promising web shows slated for release.


aha is home to some of the biggest Telugu releases in 2021, including Krack, 11th Hour, Zombie Reddy, Chaavu Kaburu Challaga, Naandhi, In the Name of God, Needa, Kala, aha Bhojanambu, One, Super Deluxe, Chathur Mukham, Kudi Yedamaithe, Tharagathi Gadhi Daati, The Baker and the Beauty, Maha Ganesha, Parinayam, Orey Baammardhi and Ichata Vahanamulu Nilupa Radu.

Adhire Abhi "white paper "movie 1st look launch by Nagababu

 అదిరే అభి " వైట్ పేపర్ " సినిమా 1స్ట్ లుక్ విడుదల చేసిన మెగా బ్రదర్ నాగబాబు



జి.ఎస్.కె  ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వం గ్రందే శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం  " వైట్ పేపర్" (White Paper). ప్రభాస్ హీరో గా నటించిన ఈశ్వర్ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ, ఎన్నో చిత్రాల్లో నటుడుగా కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ టివి షో తో అదిరిపోయే కామెడీ పెర్ఫార్మెన్స్ తో అదిరే అభి గా ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు ఈ వైట్ పేపర్ చిత్రం తో హీరో గా పరిచయం కాబోతున్నాడు.


ఈ చిత్రాన్ని కేవలం 9 గంటల 51 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా  ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు. ఈ  వైట్ పేపర్ చిత్రం మొదటి  పోస్టర్ ని మెగా బ్రదర్  నాగబాబు గారు విడుదల చేశారు.



ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ "వైవిధ్య కథనాలు ఎంచుకోవడంలో మా అభి ముందు ఉంటాడు, జబర్దస్త్ లో తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులని మీపించాడు. ఇప్పుడు ఈ వైట్ పేపర్ సినిమా తో హీరో గా పరిచయం అవుతున్నాడు. ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా ఉంది. సినిమా ని కూడా కేవలం 9 గంటల 51 నిమిషాలు పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించారు. అభి అండ్ వాళ్ళ టీం పడిన కష్టానికి ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను, టీం అందరికి నా

శుభాకాంక్షలు" అని అన్నారు.


హీరో అభి మాట్లాడుతూ " మొన్న విడుదల చేసిన టైటిల్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మా సినిమా ఫస్ట్ లుక్ ని నా ఫేవరెట్ నటులు మెగా బ్రదర్  నాగబాబు గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.


డైరెక్టర్ శివ మాట్లాడుతూ "సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా లో అభి హీరో గా నటించారు. నాగబాబు గారి బ్లెస్సింగ్స్ మా టీం అందరికీ ఉండాలి, పోస్టర్ చూస్తుంటే మేము పడిన కష్టం మరిచిపోతున్నాం, ఇలా పెద్దలందరు మా సినిమా ని , మేము చేసిన ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది" అన్నారు.



ఈ కార్యక్రమంలో  రాజశేఖర్,  శ్యామ్ ప్రసాద్, రవి వంశీ లు పాల్గొన్నారు.


అదిరే అభి ( అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయి కృష్ణ ,నేహా, నంద కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమా కి

నిర్మాత - గ్రంథి శివ కుమార్, డైరెక్టర్- శివ,కేమేరా- మురళి కృష్ణ,

ఎడిటింగ్- కె.సి.బి. హరి

సంగీతం - నవనిత్ చారి,

పి.ఆర్.ఓ- పవన్ పాల్.

Anti Virus Movie Audio Released

 యాంటీ వైరస్ సినిమా పాటల విడుదల



ఏం. కె క్రియేషన్స్ బ్యానర్ పైన  రాజ్ కుమార్ నిర్మిస్తూ, హీరో గా నటిస్తున్న సినిమా "యాంటీ వైరస్". ఈ చిత్రానికి సుభాష్ దర్శకుడు. ఈ చిత్రం యొక్క ఆడియో రిలీజ్ వేడుక ఇటీవలే జరిగింది. హీరోయిన్లు ప్రియమణి, పూర్ణ మరియు డాన్స్ మాస్టర్ గణేష్ లు ఈ చిత్రం యొక్క పాటలు  విడుదల చేసి వారి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ గణేష్ మాట్లాడుతూ "హీరో నిర్మాత  రాజ్ కుమార్ నాకు మంచి మిత్రుడు, తను చేసిన డ్యాన్స్, ఫైట్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. పాటలు చాలా బాగున్నాయి, సినిమా కూడా మంచి విజయవంతం అవ్వాలి" అని కోరుకున్నారు.



హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ "టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది, ప్రస్తుతం ఉన్న కోవిడ్ కి ఈ సినిమా యాంటీ డోస్ లాగా ఆడియన్స్ ని మెప్పించాలి. పాటలు మరియు ట్రైలర్ చూసాను, సినిమా కొత్తగా ఉంది. మంచి విజయం సాధించాలి" అని తెలిపారు.



హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ "సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది, సినిమా లోని కొన్ని షాట్స్ చూసాను చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి,టీం అందరికీ బెస్ట్ విషెస్.



హీరో & నిర్మాత రాజ్  కుమార్ మాట్లాడుతూ "నేను అడగగానే మా సినిమా పాటలు విడుదల చేసిన గణేష్ మాస్టర్ కి, పూర్ణ గారికి, ప్రియమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీం అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా ని నిర్మించాం, మా హీరోయిన్ లు అనూష, నందిత లు డెడికేషన్ తో వర్క్ చేశారు. పాటలు ,ఫైట్స్ , మెసేజ్ ఇలా అన్ని అంశాలు మా సినిమా లో ఉన్నాయి, కమర్షల్ సినిమా కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ని తీయడం జరిగింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.



ఈ సినిమా కి కెమెరా-  శ్రీనివాస్ సబ్బి, సంగీతం - మురళి లియోన్,

లిరిక్స్ - లక్ష్మిభాస్కర్ కనకాల,

డాన్స్ :-

గోరా మాస్టర్,

నరేందర్ మాస్టర్,

చార్లీ మాస్టర్,

పి.ఆర్.ఓ - పవన్ పాల్.

Yekkadiko Ee Adugu in Censor Works

 సెన్సార్ సన్నాహాల్లో

"ఎక్కడికో ఈ అడుగు'



     'ఎఫెక్ట్స్ రాజు'గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో... 'స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం "ఎక్కడికో ఈ అడుగు". పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ సన్నాహాల్లో ఉంది.

     గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్తి రాజ్, జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

     1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా.. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన "ఎక్కడికో ఈ అడుగు" అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం తమకుందని, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న తమ చిత్రాన్ని నవంబర్ ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు.

     నిర్మాత అట్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ..."చిత్ర నిర్మాణంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ "ఇనావర్స్ స్టూడియో"కు అప్పగించాం. మాకు ప్రామిస్ చేసిన బడ్జెట్ లో... మాకు ప్రామిస్ చేసిన దానికంటే మంచి క్వాలిటీతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా "ఇనావర్స్ స్టూడియో"వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం" అన్నారు.

    ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కో-డైరెక్టర్: నాగరాజు, ఆర్ట్: వెంకటేష్ ఆరె, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దిలీప్ బండారి, మాటలు: రమన్ లోక్ వర్మ, ఛాయాగ్రహణం: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాతినేని సుజన్ బాబు, నిర్మాత: అట్లూరి శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజు బొనగాని!!

Tollywood Producers Met Powerstar Pawankalyan



టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ గార్ని ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయి.

Aata Naadhe Veta Naadhe Releasing on October 2nd

 అక్టోబరు 2 న గ్రాండ్ గా విడుదలవుతున్న "ఆట నాదే.. వేట నాదే.."



 వీరాంజనేయులు &  రాజ్యలక్ష్మి సమర్పించు  భరత్, సంచిత శెట్టి,చాందిని తమిళ రసన్, ఖతీర్ ,

రాధా రవి ,యోగ్ జపి, ఆత్మ పాట్రిక్, గడ్డం కిషన్  నటీనటులుగా అరుణ్ కృష్ణస్వామి దర్శకత్వంలో కుబేర ప్రసాద్ నిర్మించిన చిత్రం "ఆట నాదే.. వేట నాదే" .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ  సందర్భంగా


 *చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ..* మనిషి జీవితమే ఒక ఆట ప్రేమ అనే ఆటలో గెలవాలంటే మనుసులను  గెలవాలి,  మనసులను గెలవాలంటే గెలుపోటములు ఉంటాయి . గెలుపు ఓటమి అనేది ప్రతి ఆట లో ఉంటాయి .ఒక ప్రేమికుడు తను  కోరుకున్న అమ్మాయిని గెలుచు కోవడం కోసం గుర్రపు పందేలు ఆడదానికి సిద్ధమయ్యి ఆఖరి రూపాయి వరకు తను ఎంత కష్టపడ్డాడు ఆ గుర్రపు పందేలు ఎంతోమంది హేమాహేమీలు ఉన్నా.. గుర్రపు పందేలలో తను నెగ్గి తన ప్రేమను గెలిపించు కున్నాడా..తను గెలిచాడా.. ఒడిపోయాడా.. తనకోసం అనుకోని  ఇంకొక తన ఫ్రెండ్ ను ఈ ఉచ్చు లోకి లాగితే అమాయకుడైన ఫ్రెండ్ తను కూడా ఈ పోటీకి సిద్ధమై తను  సహాయ పడ్డాడా.. తను గెలిచాడా.. తన ప్రేమను గెలిపించుకున్నాడా... గెలుపు ఓటమి అనేది మనిషికి ముఖ్యం అది ప్రేమ కావచ్చు జీవితంలో కావచ్చు  ఆటలో అవ్వచ్చు అయితే ఈ ఆట ఆడేటప్పుడు ప్రేమ  మనిషిని గెలిపించుకోవడం కోసం రేస్ ఆడవలసిన అవసరం లేదు అని చెప్పవచ్చు.అలాగే మనిషి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం  దేనికైనా  తెగిస్తాడు  అనేది సినిమా ఇతి వృత్తం. తనని తాను గేలుసుకోవడం కోసం తనను తన మనసు చేసిన చేసిన అమ్మాయిని  గెలుచుకోవడం కోసం ఇద్దరు కుర్రాళ్లు ఈ ఆటలో పోటీపడి ఎలా నెగ్గారు. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నారు తన జీవితంలో ఎలా గెలిచారు   అనేదే మా "ఆట నాదే.. వేట నాదే".. అంటే ఆట కోసం వేట మొదలెట్టాలి ఆ  వేట సక్సెస్ అయితే మన ఆట ఆడి గెలిచినట్లే..అందుకే  ఈ చిత్రానికి  ఆట నాదే.. వేట నాదే.. టైటిల్ పెట్టడం జరిగింది.సినిమా చాలా బాగా వచ్చింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 2 న విడుదల చేస్తున్నాము. ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.


 *నటీనటులు* 

భరత్, సంచిత శెట్టి,చాందిని తమిళ రసన్, ఖతీర్ ,రాధా రవి , యోగ్ జపి, ఆత్మ పాట్రిక్, గడ్డం కిషన్ తదితరులు 



 *సాంకేతిక నిపుణులు* 

సమర్పణ :-వీరాంజనేయులు & రాజ్యలక్ష్మి 

నిర్మాత :- కుబేర ప్రసాద్ 

రచన దర్శకత్వం :-అరుణ్ కృష్ణస్వామి 

సహ నిర్మాతలు :- అక్కినేని శ్రీనివాసరావు, అట్లూరి సురేష్ బాబు 

సంగీతం :- ఏ మోసెస్ 

ఛాయాగ్రహణం :; యువ 

కూర్పు :- గోపికృష్ణ 

వి.ఎఫ్.ఎక్స్  :-చందు ఆది - అండ్ టీం 

ఆర్ట్ డైరెక్టర్ :- సుబ్బు.ఏ 

నృత్యం :-  విజయ సతీష్ 

పాటలు, మాటలు :-భారతీబాబు 

నేపథ్య సంగీతం :- సుదర్శన్ కుమార్ 

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Most Eligible Bachelor Trailer Launched Grandly

 అంగ‌రంగ వైభవంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు.  అక్టోబర్ 15న  ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర  నిర్మాత లు  ఈ సందర్భంగా.. 


 చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ .. గీతా ఆర్ట్స్ లోగాని,జి.ఏ 2 లో గాని సినిమాలు హిట్స్ అయ్యాయి అంటే అవి మా వల్ల కాదు అవి మీ వల్లే..అందుకే ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఇండియాకు మన తెలుగు ప్రేక్షకులు  ఒక లెషన్ నేర్పించారు. సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు వస్తారనే నమ్మకాన్ని హిందీ వారికి మన తెలుగు వారు కలిగించారు..కరోనా వలన సినిమా విడుదల చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వాన్ని విన్నవించు కుంటున్నాము ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని వాటిని సాల్వ్ చేయవలసిందిగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కోరుతున్నాము. అలాగే హీరో హీరోయిన్లు ఇందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు .మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అని అన్నారు. 


 నిర్మాత బన్నీ వాసు, వాసు వర్మ లు మాట్లాడుతూ.. ఈ కథ  మాకు నచ్చడంతో సినిమా షూట్ కి వెళ్ళడం జరిగింది.  ఒక  రిలేషన్షిప్ నుంచి డిఫరెంట్ యాంగిల్స్ ని దర్శకుడు చూపించాడు .మేము చాలా కథలు వింటూ ఉంటాం కానీ కొన్ని కథలు లైఫ్  మీద ఇంపాక్ట్ చూపిస్తుంటాయి అలాంటిదే ఈ కథ. నా బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ 100 శాతం చేంజ్   అయ్యిందని చెప్పలేను కానీ ఈ సినిమాలో ఉండే ఆరు క్వశ్చన్ లు నా లైఫ్ లో అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి . ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి వ్యక్తి తన భార్య  చేయి పట్టుకుని వెళ్తాడని ఖచ్చితంగా చెప్పగలను.అందుకే మాకు ఈ సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది. నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.



 చిత్ర దర్శకుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ మాట్లాడుతూ. .నేను ఎక్కువగా లవ్ స్టోరీస్ రాయను .లైఫ్ గురించి ఎక్కువగా రాస్తాను.లైఫ్ స్టొరీ లో లవ్ స్టొరీ వస్తుంది.  మనిషి లైఫ్ ను ఎలా లీడ్ చెయ్యాలి అనే కొశ్చన్ కు ఒక దారి దొరికితే దాన్ని ఫాలో అయ్యాను.ఇదంతా రాయడం నాకు చాలా స్త్రగుల్ అనిపించింది.. అయినా  వాసు వర్మ  నాకు సపోర్ట్ గా నిలిచాడు. ఫ్రెస్ కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. అఖిల్ ను ఈ సినిమాలో ఫ్రెస్ గా చూస్తారు. అఖిల్,పూజ కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే బన్నీ వాసు, అరవింద్ గార్ల సపోర్ట్ తో ఇక్కడిదాక వచ్చింది . అందరికీ  ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. 


 చిత్ర హీరో అఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఐ ఓపెనర్ గా ఉంటుంది ఈ సినిమా ను ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మాకు ఇలాంటి ఇన్సిడెంట్  జరిగిందని గుర్తు చేసుకుంటారు.  సినిమా లో చాలా బాగుంటుంది . దర్శకుడు భాస్కర్ చాలా చక్కగా తీశాడు.నిర్మాతలు ఒక బ్రిడ్జి లా ఉండి మాకు సపోర్ట్ గా నిలిచారు ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు 


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం పెద్ద విజయం సాదించాలని అన్నారు. 


న‌టీ న‌టులు :


అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు.. 


సాంకేతిక నిపుణులు: 


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Jai Sena Karnataka Distribution by DS Rao V Samudra

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

"జనసేన"ను కర్ణాటకలో

విస్తరిస్తున్న డి.ఎస్.రావ్-వి.సముద్ర



    జనసేనాధినేతగా అప్రతిహతంగా సాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వి.సముద్ర తెలుగులో రూపొందించిన "జైసేన" చిత్రాన్ని కన్నడలో అనువదిస్తున్నారు ప్రముఖ నటుడు-నిర్మాత డి.ఎస్.రావు. 

    శ్రీకాంత్, సునీల్, తారక్ రత్న, శ్రీరామ్, సత్యం రాజేష్, ప్రవీణ్, హరీష్ గౌతమ్, అభినవ్ మణికంఠ, విశ్వకార్తికేయ, నీతూ గౌడ్, ఆరాధ్య, మనోచిత్ర, అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, డి.ఎస్.రావ్, పృథ్వి ముఖ్యపాత్రలు పోషించిన "జై సేన" చిత్రం మెగా-పవర్ ఫ్యాన్స్ తోపాటు  అందరినీ అమితంగా ఆకట్టుకుంది. 

      ఈ చిత్రాన్ని గణపతి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రావ్ కన్నడ ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన "జై సేన" కన్నడలోనూ మంచి విజయం కైవసం చేసుకోవడం ఖాయమని దర్శకుడు వి.సముద్ర పేర్కొన్నారు.

      ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వాసు, కూర్పు: నందమూరి హరి, నిర్మాత: డి.ఎస్.రావ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వి.సముద్ర!!

Maanaadu Trailer To Be Revealed By Nani

 125 కోట్ల భారీ బడ్జెట్ 

బహు భాషా చిత్రం "మానాడు" 

ట్రైలర్ రిలీజ్ చేస్తున్న 

నేచురల్ స్టార్ నాని!!



     తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా... క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం "మానాడు" ట్రైలర్ నేచురల్ స్టార్ నాని అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.

     సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. తమ చిత్రం 'మానాడు' తెలుగు ట్రైలర్.. నేచురల్ స్టార్ నాని విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు!!

Tremendous Response for Most Eligible Bachelor Trailer

 ఎమోషనల్ జర్నీగా అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్‌.. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన..



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రతీ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, కెరీర్, పెళ్లి చుట్టూ అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. 2.04 నిమిషాల ట్రైలర్ అంతా చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మధ్యలో పెళ్లి, పార్ట్‌నర్ గురించి వచ్చే మాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తున్నారు చిత్ర యూనిట్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Hero Srikanth Interview About Idhe Maa Kadha

 ఇదే మా కథ’ లాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి -  శ్రీకాంత్



సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గురు పవన్‌ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు.


గురు వచ్చి ఓ సబ్జెక్ట్  చెప్పాడు. అది తన డ్రీమ్ అని చెప్పాడు. రియల్ ఇన్సిడెంట్‌లు కూడా ఉంటాయి. ఓ నలుగురు బైక్ ట్రావెల్లర్స్ కలవడం, వారి కష్టాలను ఒకరినొకరు ఎలా పంచుకున్నారు.. ఎలా పరిష్కరించుకున్నారు అనేదే కథ. ఇక్కడి నుంచి లడఖ్ వరకు బైక్ రైడింగ్ అని చెప్పడంతోనే షాక్ అయ్యాను. ఇది యూత్‌ను టచ్ చేసే కథ అని చాలా రోజుల తరువాత మళ్లీ వచ్చిందని ఓకే చెప్పాను. ఇందులో మహేంద్ర పాత్రలో కనిపించబోతోన్నాను. 24 ఏళ్ల క్రితం మిస్ అయిన అమ్మాయిని కలుసుకునేందుకు లఢఖ్ వెళ్తాడు. బైక్‌లోనే ఎందుకు వెళ్తాడు అనే దానికి కూడా ఓ కథ ఉంటుంది. భూమిక ఇందులో ఓ గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తుంది. వాళ్ల నాన్న కలలను నిజం చేసేందుకు ఓ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి లడఖ్‌లో జరిగే ఈవెంట్‌లో పొందు పరిచేందుకు వస్తుంది. ప్రతీ యంగ్ స్టర్‌కి ఓ కల ఉంటుంది. కానీ తల్లిదండ్రులు మాత్రం అది వద్దు ఇది వద్దు అని అంటుంటారు. కానీ అవేం ఇష్టముండవు. బైక్ రేసింగ్‌లంటే ఇష్టపడే క్యారెక్టర్. ఇంకో క్యారెక్టర్ థాన్యా హోప్ అనే అమ్మాయి మాతో ఎలా కలిసి ఎందుకు కలిసింది అనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.


కులు మనాలి నుంచి లడఖ్ వరకు బైక్ మీద షూటింగ్ చేశాం. అంతకు ముందు కొంత మేం చేశాం.. కొంత టీం మాత్రమే వెళ్లి షూటింగ్ చేసింది.  యువతలో ఆలోచనలు రేకెత్తించేలా చిత్రం ఉంటుంది. కలను సాకారం చేసుకునేందుకు చాలా కష్టపడాలి. సంకల్పం లేకపోతే లక్ష్యాన్ని మనం చేరుకోలేమనే థీమ్‌తో నడుస్తుంది. అయితే షూటింగ్ చేసేటప్పుడు మాత్రం మేం ఎక్కువగా భద్రత గురించే ఆలోచించాం. నాకు, సుమంత్‌కు బైక్ రైడింగ్ వచ్చు. కానీ భూమిక,  థాన్యా హోప్‌లను పెట్టుకుని చేయడం చాలా కష్టమయ్యింది. అందుకోసమే మేం రియల్ బైక్ రైడర్స్‌ను కూడా తీసుకున్నాం. వాళ్ల సూచనలతోనే ముందుకు వెళ్లాం. అలా ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. ఇలాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. ఏదో పేరుకే బైక్ రైడింగ్ మీద సినిమా తీశామని కాదు. ఇంత మంది అక్కడికి తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ ఏం అనుకున్నారో అది తెరకెక్కించేలా నిర్మాత సహకరించారు.


నాకు బైక్ రైడింగ్‌లంటే చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీదే తిరిగేవాడిని. మద్రాస్ నుంచి హైద్రాబాద్‌కు కూడా బైక్ మీదే వచ్చేవాడిని. ఇక బాధ్యతలు పెరుగుతున్న సమయంలో భద్రత దృష్ట్యా బైక్‌లను పక్కన పెట్టేశాను. కానీ మళ్లీ ఇలా బైక్ రైడింగ్ చేయడం ఆనందంగా అనిపించింది. నా సీన్ లేకపోయినా కూడా బైక్ ఎక్కి తిరిగేవాడిని. చేతులు వదిలేసి మరీ నడిపేవాడిని. అలా రోడ్డు మీద డిఫరెంట్ లొకేషన్స్‌ను చూసుకుంటూ వెళ్లడం ఎంతో ఆనందంగా అనిపించింది.


మామూలుగా బైకర్స్ అంతా కూడా ఢిల్లీలో కలుస్తుంటారు. అక్కడి నుంచి ట్రూప్‌గా వెళ్తారు. ఆ జర్నీని వాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ గ్రూపుల్లో కలిసిన వాళ్లంతా కూడా జీవితాంతం ఫ్రెండ్స్ అవుతుంటారు. వారి జీవిత కష్టాలను కూడా ఇందులో చూపించాం.


కులుమనాలి చేసిన షూటింగ్ చాలా కష్టంగా అనిపించింది. చలిలో అంత దూరం బైక్ నడపడం, హెల్మెట్స్ పెట్టుకోవాలి.. మొహాలు కూడా కనపడాలి.. అలాంటి ప్లేస్‌లో షూట్ చేయడం చాలా కష్టం. రేసర్స్ సాయంతో అలా 15 కిలో మీటర్ల దూరం వెళ్లి షూటింగ్ చేసేశాం.


నలుగురు క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే కథ ఇది. గురుకు ఉన్న ప్యాషన్, డ్రీమ్ ఇది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలవుతోంది.  నేను చూశాను. మాకు సంతృప్తిగా అనిపించింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ కూడా బాగున్నాయి. దర్శకుడు కొత్తవాడు. ఆయనకు కొన్ని భావాలున్నాయి. అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా చూసుకున్నాడు. పృథ్వీ క్యారెక్టర్‌తో  కామెడీని కూడా జోడించాడు.


జీవితం అంటే ఏంటి? మనం కన్న కలలను సాకారం చేసుకునేందుకు, అనుకున్న లక్ష్యాలను ఎలా  చేరుకోవాలి? వాటి కోసం ఎంతలా కష్టపడాలి అనేది ఈ చిత్రంలోని సందేశం.


మేం ఇద్దరం ఇంత వరకు కలిసి పని చేయలేదు. భూమిక గారు ఎంతో చక్కగా నటించారు. ఎప్పుడూ చీరలో కనిపించే భూమిక ఇలా రైడర్ లుక్కులో కనిపించడం కొత్తగా ఉంటుంది. అసలు ఈ  పాత్ర చేస్తారా? లేదా? అని అందరం అనుకున్నాం. కానీ ఆమె కథ విన్న వెంటనే ఓకే చెప్పేశారు. ఫ్లాష్ బ్యాక్‌లో నాకు ఓ జంట ఉంటుంది. ఆమెను కలిసేందుకే అక్కడికి వెళ్తాను. ఆమె బైకును చూసే నన్ను ఇష్టపడుతుంటుంది. నన్ను గుర్తు పట్టకపోయినా ఆ బైకును అయినా కూడా గుర్తుపడుతుందని వెళ్తాడు.


రోషన్‌ను ఇప్పుడే దింపే  ఆలోచన లేదు. ఇంకో ఏడాది ఆగుదామని అనుకున్నాం. లాస్ ఏంజిల్స్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాకు  ప్రభుదేవా దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఎక్స్‌పీరియన్స్ కోసం అవన్నీ చేశాడు. నేను కేవలం సాయం మాత్రమే చేశాను.


ఓ సారి రాఘవేంద్ర రావు గారు  ఫోన్ చేసి రోషన్ గురించి అడిగారు. ఇంకా చిన్నపిల్లవాడే  కదా? అని అన్నారు. అది పదేళ్ల క్రితమండి.. ఇప్పుడు కాదు అని అన్నాను.  ఓసారి నా దగ్గరికి తీసుకురావా? అని అడిగారు. అలా మేం ఇద్దరం వెళ్లాం. పెళ్లి సందడి ఫ్లేవర్‌తో అదే టైటిల్ పెట్టి సినిమా తీసేందుకు  స్క్రిప్ట్ వరకు కూడా రెడీ అయింది. రోషన్ కోసం అనే కాదు కానీ కథను రెడీ చేసుకున్నారు. కానీ మధ్యలో ఎవరో చెప్పినట్టున్నారు. శ్రీకాంత్ కొడుకు అయితే బాగుంటుందని అన్నట్టున్నారు. అలా రోషన్‌ను చూసి.. కరెక్ట్‌గా సరిపోయాడు.. ఈ ఏజ్‌ ఉండాలనే అనుకున్నాని అని రాఘవేంద్రరావు గారు అన్నారు. అలా సినిమా ఆఫర్ వచ్చింది.


రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఎంతో మంది హీరోలు లాంచ్ అయ్యారు. ఆ అవకాశం రావడం రోషన్ అదృష్టం. ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. అలాంటి వారి దర్శకత్వంలో రోషన్ చేయడం ఆనందంగా ఉంది.


పోలికలు అయితే అందరూ పెడతారు. అది తెలిసిన విషయమే. ఎవరు బాగా చేశారు? ఎవరు బాగున్నారు? అని తేడాలు చూస్తారు. కానీ నాకంటే  రోషన్ బాగుంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మనం కష్టపడితేనే గుర్తింపు వస్తుంది. మొదటి సినిమానే కదా? నేను ఎక్కువగా గర్వంగా చెప్పుకోకూడదు. పొగడకూడదు.


ఇప్పుడు వస్తున్న జానర్లకంటే కొత్తగా ఉంటుంది. పెళ్లిలో ఉండే గోల, ఆ సందడి, కామెడీ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఇలా అన్నీ బాగుంటాయి. మహిళా ప్రేక్షకులందరూ కూడా వచ్చి చూసే  చిత్రమవుతుంది. ఎఫ్ 2 సినిమా ఎంత ఫ్రెష్‌లా అనిపించిందో.. పెళ్లి సందD కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. సాంగ్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా రోషన్ కనిపించబోతోన్నారు.


అక్టోబర్ 2న మా సినిమా విడుదల కాబోతోంది. నిర్మాతలు చాలా కష్టపడ్డారు. గురుకు ఇది చాలెజింగ్ మూవీ. డిఫరెంట్ మూవీ ఇది. ఈ చిత్రం హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో  చూడాలి.


అఖండ సినిమాలో కొత్తగా కనిపిస్తాను. ఫ్రెష్‌గా కనిపిస్తాను. దాని కోసం ముంబై నుంచి డిజైనర్లను తీసుకొచ్చారు. రగ్డ్ గెటప్‌లో ఉంటాను. మహిళా ప్రేక్షకులు మళ్లీ నన్ను తిడతారేమో అని అనుకునేవాడిని. బయటకు  మాత్రం చూపించడం లేదు. ఎప్పుడైనా లుక్ రివీల్ చేస్తారా? లేదా నేరుగా సినిమాలోనే చూపిస్తారా? అన్నది తెలియదు.


శ్రీరామరాజ్యం సినిమాలో లక్ష్మణుడిగా బాలకృష్ణ పక్కన  చేశాను. మళ్లి ఇంత క్రూరమైన పాత్రలో కనిపిస్తే బాగుంటుందా? అని అన్నాను. ఇలాంటి పాత్రలే చేయాలి. దీని తరువాత చాలా క్యారెక్టర్స్ వస్తాయి. కానీ ఏది పడితే అది  చేయకు అని బాలకృష్ణ సలహా ఇచ్చారు. అది మన మంచికే. బాలకృష్ణ గారు కథలు వింటే అందరికీ సజెస్ట్ చేస్తుంటారు.


సాయి ధరమ్ తేజ్ చాలా మంచివాడు. మేమంతా కలిసి క్రికెట్  ఆడేవాళ్లం. బైక్ ప్రమాదాలు అనేవి సాధారణంగా జరుగుతుంటాయి. సాయి ధరమ్ తేజ్‌ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు కూడా మాట్లాడాను. ఇంకా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఆయన చిత్రం రిపబ్లిక్ పెద్ద హిట్ కావాలి. మంచి బూస్టప్ ఇవ్వాలి.

Missing Releasing on October 22nd

 అక్టోబర్ 22న థియేటర్లలో “మిస్సింగ్” రిలీజ్




హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 


*అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్సింగ్” చిత్రం  అక్టోబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది*. ఈ సందర్భంగా


*నిర్మాతలు భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు మాట్లాడుతూ*... “మిస్సింగ్” ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఫస్ట్,సెకండ్ వేవ్ లను తట్టుకుని లాక్ డౌన్ లో పట్టుదలగా సినిమాను కంప్లీట్ చేశాం. అక్టోబర్ 22న మా "మిస్సింగ్" చిత్రాన్ని థియేటర్ ల ద్వారా మీ ముందుకు తీసుకు రాబోతున్నాం. మంచి హిట్ కొడతాం అనే నమ్మకంతో ఉన్నాం. అన్నారు.


*దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ*...మమ్మల్ని ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్న అన్నయ్య బన్నీ వాసు కు థాంక్స్. ఈ కొవిడ్ వల్ల 2020 మిస్ అయ్యింది. 2021 కూడా మిస్ కాకుండా ఉండాలని ఈ నెల 22 న విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. ఒక థ్రిల్లర్ జానర్ మూవీ చేయాలనే కోరికతో ఈ స్టోరీ అనుకున్నాం. సినిమాటోగ్రాఫర్ జన లేకుంటే మిస్సింగ్ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు. మిస్సింగ్ లో బెస్ట్ మ్యూజిక్ వింటారు. థియేటర్ లో సినిమా ఉండాలనేది మా కోరిక.అలాగే ఇటీవల విడుదలైన ట్రైలర్ మరియు ప్రమోషనల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మిస్సింగ్ మూవీ నా టీమ్ ఎఫర్ట్ అందరం ఈ నెల 22 వ తేదీ కొరకు అందరం ఎదురు చూస్తున్నాం  అన్నారు.


సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్ దత్, విష్ణు విహారి, అశోక్ వర్థన్, వినోద్ నువ్వుల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం - వశిష్ఠ శర్మ, కిట్టు విస్సాప్రగడ, శ్రీని జోస్యుల, మేకప్ - వెంకటేష్ బాల, కాస్ట్యూమ్స్ -  టీఎస్ రావు, ప్రొడక్షన్ డిజైనర్ - దీక్ష రెడ్డి, కాస్ట్యూమ్స్ డిజైనర్ : శ్రుతి కిరణ్, ఆర్ట్ - దార రమేష్ బాబు, పైట్స్ - పి. సతీష్, డాన్స్ - బంగర్రాజు, జీతు, స్టిల్స్ - గుంటూరు రవి, ప్రొడక్షన్ కంట్రోలర్ - బి సి చౌదరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సాయి కె కిరణ్, ఎడిటర్- సత్య జి, సంగీతం - అజయ్ అరసాడ, సినిమాటోగ్రఫీ - జనా. డి, పీఆర్వో - జీఎస్ కె మీడియా, నిర్మాతలు - భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా, కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం - శ్రీని జోస్యుల.

Actress Nabha Natesh As Legendary Comedian Charile Chaplin

 Actress Nabha Natesh As Legendary Comedian Charile Chaplin



Nabha Natesh is master of setting temperature soaring with her red-hot

glamour show. The actress often shares eye-pleasing pics of herself in

sizzling outfits and provides glamour treat to her followers.


Now, the actress has tried her hand at cosplay as she sported the

famous ‘Charlie Chaplin’ look in this dress-up photoshoot.

Thanks to the tuxedo and the make-up, Nabha looks strikingly similar

to the master entertainer Charlie Chaplin. These photoshoot pics going

viral now on internet.


Nabha had already proved herself as a capable performer with films

like Ismart Shankar, Nannu Dochukunduvate and Solo Brathuke So Better.

She is waiting for that one catalyst film that catapults her to the

big league.

Uttej Wife Condolence Meet

 ప్రముఖ నటుడు ఉత్తేజ్ శ్రీమతి పద్మ సంస్మరణ సభ !!



ఉత్తేజ్.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలీనివారంటూ ఎవరూ ఉండరు.. నటుడు, రచయిత, స్నేహశీలి, చిత్ర పరిశ్రమలోని ప్రతీ ఒక్కరోతోనూ సత్ సంబంధాలు కలిగినటువంటి మంచి మనిషి ఉత్తేజ్. రీసెంట్ గా ఆయన సతీమణి శ్రీమతి పద్మ అనారోగ్య కారణంగా అకాల మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ విషయం ఇండస్ట్రీలో అందర్నీ కలచివేసింది.. మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన బసవతారకం కాన్సర్ హాస్పటల్ కు వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.. అంతే కాకుండా మేమంతా నీకు అండగా ఉంటాం..  అని మనో ధైర్యాన్ని, కలిగించారు.. కాగా సెప్టెంబర్ 29న హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్ సిసి క్లబ్ లో ఉత్తేజ్ సతీమణి శ్రీమతి పద్మ సంస్మరణ సభ జరిగింది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి,మురళి మోహన్,ఏమ్.ఎల్.ఏ.మాగంటి గోపీనాథ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, డా. రాజశేఖర్, మెగాబ్రదర్  నాగబాబు లతో పాటు ఎంతోమంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సీనియర్ నటి నటులు  హాజరయ్యి శ్రీమతి పద్మ కు  ఘన  నివాళి అర్పించారు..


ఈ సంతాప సభ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ " భార్యా  వియోగం అన్నది చాలా  దుర్భరం. అన్ని విధాల జీవితంలో సెటిల్ అవుతున్న  సమయంలో పద్మ చనిపోవడం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. ఈ వార్త విని నేను చలించిపోయాను.  హిట్లర్ సినిమా నుండి ఉత్తేజ్ తో  నాకు మంచి అనుబంధం ఏర్పడింది.  ఈ ఆపద సమయంలో ఉత్తేజ్ కు మేము అందరం అండదండగా ఉంటాం. ఈ విషాదం నుండి ఉత్తేజ్  త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను "  అన్నారు .

ఇంకా  ఈ సంతాప సభలో హీరోలు డా. రాజశేఖర్ ,శ్రీకాంత్, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి ,  గీత రచయిత ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ , దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి , నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యాంకర్ ఝాన్సీ,  ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ , నటి హేమ తదితరులు తమ సంతాపాన్ని తెలియజేస్తూ  ఉత్తేజ్ కు ఆత్మస్థైర్యాన్ని పద్మకు ఆత్మ శాంతిని  చేకూర్చాలని ఆకాంక్షించారు. ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Maha Samudram Hey Thikamaka Modhale Song’s Lyrical Video Out

 Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainments’ Maha Samudram Hey Thikamaka Modhale Song’s Lyrical Video Out



Versatile actors Sharwanand and Siddharth starrer intense love and action drama Maha Samudram is one of the most awaited movies. Directed by Ajay Bhupathi, the makers are increasing expectations on the movie with intriguing promotional content. Theatrical trailer of the movie was released recently to overwhelming response.


Music being scored by Chaitan Bharadwaj is one of the major attractions. His work for the trailer was appreciated by everyone and the previously released songs too got tremendous response. Today, they have launched lyrical video of third single Hey Thikamaka Modhale.


Interesting aspect is the song Hey Thikamaka Modhale narrates two beautiful love stories. Sharwanand-Anu Emmanuel and Siddharth-Aditi Rao Hydari are shown as love birds in the song. The chemistry of the lead pair is equally charming as the track.


Haricharan and Nutana Mohan have sung the number soulfully. Kittu Vissapragada wrote chaste Telugu lyrics and his choice of words is notable. On the whole, Hey Thikamaka Modhale is another chartbuster number from Maha Samudram.


Sunkara Ramabrahmam is producing the movie on Anil Sunkara’s AK Entertainments banner and Raj Thota is the cinematographer.


Maha Samudram will release worldwide on October 14th as Dussehra special.


Cast: Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel, Jagapathi Babu, Rao Ramesh, KGF Ramchandra Raju and others


Technical Crew:

Writer, Director: Ajay Bhupathi

Producer: Sunkara Ramabrahmam

Co-Producer: Ajay Sunkara

Banner: AK Entertainments

Ex-Producer: Kishore Garikipati

Music Director: Chaitan Bharadwaj

Cinematography: Raj Thota

Production Designer: Kolla Avinash

Editor: Praveen KL

Action: Venkat

PRO: Vamsi Shekar

Gangubai Kathiawadi Releasing on January 6th 2022

 జ‌న‌వ‌రి 6న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ‌వుతున్న  ఆలియా భట్  `గంగూబాయి క‌తియ‌వాడి`..‌



బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "గంగూబాయి కతియావాడి". బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన "మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై" అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్‌ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్‌గ‌డ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ‌బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్‌ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే పాత్రకు సంబంధించిన పోస్టర్‌, టీజ‌ర్ విడుద‌లై విశేష స్పంద‌న రాబ‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 6, 2022న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

Bollywood Star Hero Ajay Devgn Starrer 'Maidaan' To Release on 3rd June, 2022 in Hindi, Telugu, Tamil and Malayalam Languages

 Bollywood Star Hero Ajay Devgn Starrer 'Maidaan' To Release on 3rd June, 2022 in Hindi, Telugu, Tamil and Malayalam Languages



Football (Soccer) is the much loved sport followed by most games lovers.

Inspired from an incredible true story about an inspiring coach who introduced Indian Football to the world..  Maidaan pays tribute to the golden era of Indian football starring Star Hero Ajay Devgn. Directed by Amit Ravindernath Sharma of Blockbuster Badhai Ho fame, Maidaan has been with football backdrop with true events from 1952-62, Golden Era of Indian Football. Posters and First looks released so far have created terrific buzz. The team has made a couple of release announcements of 'Maidaan' in last year. Now Producer Boney Kapoor announced that the film is all set to release on 3rd June, 2022 in Hindi, Telugu, Tamil and Malayalam languages.


Producer Boney Kapoor said, " We all are fighting with Corona for the last two years. Everyone saved their lives and protected their loved ones by taking all precautions and staying at home. Theatres were closed.  'Maidaan' will make every Indian proud. It will be a never seen before inspiring experience. 'Maidaan' is such kind of film which must be experienced only in theatres. So, we didn't released even after announcing release dates couple of times. We are releasing the film with perfect planning on June 3rd, 2022."


Director Ravindranath Sharma who has earlier made Successful Film like 'Badhaai Ho' said, " Audience loved many sports based films. Many movies have been made with a backdrop of Kabaddi, Cricket, Boxing Wrestling, Running Race but no movie has been ever made about Football on Indian screen. 'Maidaan' will gives you an experience of watching a live football game sitting in the stadium. It will take you to an emotional roller coaster ride. That's why we have waited to release the film in Theatres only."


Along with Ajay Devgn, 'Maidaan' stars National award-winning actress Priyamani, Gajraj Rao who created magic with Badhai Ho and the well known Bengali actor Rudranil Ghosh, Nitansh Goyal and others


Maidaan Presented by Zee Studios, Bayview Projects in association with FreshLime Films is produced by Zee Studios, Boney Kapoor, Akash Chawla, and Arunava Joy Sengupta. The screenplay and dialogues are written by Saiwyn Quadras and Ritesh Shah respectively.


Konda Polam’s Second Single Shwaasalo Lyrical Out

Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments’ Konda Polam’s Second Single Shwaasalo Lyrical Out



Mega sensation Panja Vaisshnav Tej’s second film Konda Polam directed by creative director Krish is getting ready for its theatrical release on October 8th. Promotions are in full swing for the film, that will feature Rakul Preet Singh playing the female lead, as the release date is not far away.


First look of the lead actors, followed by Obulamma song and most recently theatrical trailer have hiked prospects on the film. Today, the makers have come up with lyrical video of second single Shwaasalo.


It’s a MM Keeravani mark soulful romantic and mellifluous number. The ace composer has also penned lyrics for the film and his usage of words make this sound extra pleasant. The song indeed uplifts the beautiful romantic chemistry of Vaisshnav Tej and Rakul Preet Singh. Yamini Ghantasala and PVNS Rohit sung the song expressively. This is going to be another chartbuster song from the film.


Adapted from the novel written by Sannapureddy Venkata Rami Reddy, Konda Polam is produced by Saibabu Jagarlamudi, Rajeev Reddy under First Frame Entertainments and is presented by Bibo Srinivas. Gnana Shekar VS is the cinematographer.


Cast: Panja Vaisshnav Tej, Rakul Preet Singh


Technical Crew:


Director: Krish Jagarlamudi

Producers: Saibabu Jagarlamudi and Rajeev Reddy

Banner: First Frame Entertainments

Music Director: MM Keeravani

Cinematography: Gnana Shekar VS

Story: Sannapureddi Venkata Rami Reddy

Editor: Shravan Katikaneni

Art: Raj Kumar Gibson

Costumes: Aishwarya Rajeev

Fights: Venkat

PRO: Vamsi-Shekar 

Tremendous Response for Rashmika Pushpa The Rise Look

 ‘పుష్ప: ది రైజ్’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన.. 



అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీవల్లి పాత్రలో ఇందులో నటిస్తున్నారు రష్మిక. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు రష్మిక మందన్న. చెవుల కమ్మలు పెట్టుకుంటూ ఉన్న ఆమె లుక్ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా విడుదలైంది. క్రిస్మస్ సందర్భంగా పుష్ప: ది రైజ్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. 


నటీనటలు: 

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ 

కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా 

సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్ 

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 

ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే 

సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి 

ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్

లిరిసిస్ట్: చంద్రబోస్ 

క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్

మేకప్: నాని భారతి 

CEO: చెర్రీ

కో డైరెక్టర్: విష్ణు 

లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం 

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా

PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు