"Love all the haters - Puri Anthem" Launched By Akash Puri

 యంగ్ హీరో పూరీ ఆకాష్ చేతులు మీదుగా నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్ 'బొమ్మ‌ బ్లాక్ బ‌స్ట‌ర్' సినిమా నుంచి "Love all the haters - Puri Anthem" విడుదల..



విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి పేరుని సంపాదించిన నందు విజ‌య్‌కృష్ణ హీరోగా.. యాంక‌ర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెష‌ల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ర‌ష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఈ చిత్రాన్ని విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ ప‌రిచ‌యమ‌వుతున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో.. ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న వచ్చింది. ట్రేడ్‌ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక‌ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి వ‌చ్చిన పాటలు మంచి విజ‌యాన్ని సాధించాయి. తాజాగా యంగ్ హీరో, పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌య‌డు పూరీ ఆకాష్ ఈ చిత్రం నుంచి "Love all the haters - Puri Anthem" విడుదల చేశారు. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ మాటలతో ఈ పాట మొదలైంది. పుట్టుకతోనే నువ్వు గెలిచి వచ్చావ్.. ఇంకా నీకు ఓటమి ఏంటన్నా అంటూ అద్భుతమైన లిరిక్స్‌తో ఈ పాట సాగింది. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ తెలియజేయనున్నారు.



న‌టీన‌టులు


నందు విజ‌య్ కృష్ణ‌‌, ర‌ష్మీ గౌత‌మ్, కిరిటి, ర‌ఘు కుంచె త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం


రచన - దర్శకత్వం : రాజ్ విరాట్

నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ

మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి

పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే

ఎడిటర్ : బి. సుభాష్కర్

సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్

పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Post a Comment

Previous Post Next Post