Latest Post

KRR Launched Induvadhana Teaser

 ద‌ర్శ‌కేంద్రుడు శ్రీ రాఘ‌వేంద్ర‌రావు గారు చేతులు మీదుగా విడుద‌లైన వ‌రుణ్ సందేశ్, ఫ‌ర్నాజ్ శెట్టి ఇందువ‌ద‌న టీజ‌ర్




శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్.  ఇందువదన ఫస్ట్ లుక్, వ‌రుణ్ సందేశ్, ఫ‌ర్నాజ్ శెట్టి క్యారెక్ట‌ర్స్ ఇంట్రో లుక్స్ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన ల‌భించింది, అలానే ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ యూ ట్యూబ్ లో మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా చార్ట్ బ‌స్ట‌ర్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు శ్రీ రాఘ‌వేంద్ర‌రావు గారు చేతులు మీదుగా విడుద‌లైన ఇందువ‌ద‌న టీజ‌ర్ ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుండ‌టం విశేషం. ఈ టీజ‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో ఘ‌నంగా జ‌రిగింది.  ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మ‌ర‌ళికృష్ణ సినిమాటోగ్రాఫి బాధ్య‌త‌లు తీసుకున్నారు.


 వరుణ్ సందేశ్ మాట్లాడుతూ .. ఈ మధ్య నేను సినిమా చేస్తే మా తాతయ్య  చూడలనుకున్నాడు. కానీ మా తాతయ్య లాస్ట్ ఇయర్ చనిపోయాడు..ఈ చిత్రం బాగా వచ్చింది


 దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. ఇందువ‌ద‌న చిత్రానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్తై ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన విడుద‌ల తేదీతో పాటు మ‌రిన్ని వివ‌రాలు ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు


 హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి, మాట్లాడుతూ.. ఈ చిత్రం లో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.


 నటీనటులు :

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), అ౦బఋషి,జెర్సీ మోహన్ తదితరులు...


 టెక్నికల్ టీం:

దర్శకుడు: MSR

బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్

నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి

కో. ప్రొడ్యూసర్: గిరిధర్

కథ, మాటలు: సతీష్ ఆకేటి

కెమెరా: బి ముర‌ళి కృష్ణ‌

సంగీతం: శివ కాకాని

కో డైరెక్టర్: ఉదయ్ రాజ్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ఆర్ట్: వై నాగు

లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన

లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Megastar Chiranjeevi, Megapower Star Ram Charan and Star Director Koratala Siva's Sensational Movie 'Acharya' completes shoot barring two songs

 Megastar Chiranjeevi, Megapower Star Ram Charan and Star Director Koratala Siva's Sensational Movie 'Acharya' completes shoot barring two songs



'Acharya', which has Megastar Chiranjeevi in the titular role and Megapower Star Ram Charan in a key role, is presented by Konidela Production Company and is produced by Niranjan Reddy on Matinee Entertainments. The massive film has successfully completed its talkie part on July 31st. Only two songs are pending to be shot. And the post-production works are going on at a fast pace. 



Talking about the progress, the makers said, "As planned, we completed the talkie part of 'Acharya' by July 31. Just two songs are pending to be filmed. From August 20, a song will be shot on Chiranjeevi garu and Ram Charan garu. Another song will also be filmed on Charan garu and Pooja Hegde in the upcoming schedule. With the picturization of the two songs, the entire shoot will be wrapped up. We are completing the post-production works, too, at a fast pace. Chiranjeevi garu's character will be very powerful in the movie. Mega Power Star Ram Charan is playing a character named Siddha. Koratala Siva, who blends message-oriented movies with commercial elements, is making the movie in his own style. Every single element that the fans of the Megastar expect is abundant in the movie. The teaser and the song Lahe Lahe are already huge hits. Ever since the movie was announced, expectations from Acharya have been unprecedented. And the film will live up to all the expectations."



Cast:



Megastar Chiranjeevi, Ram Charan, Kajal Aggarwal, Pooja Hegde, Sonu Sood and others. 



Crew:



Writer, director: Koratala Siva


Producer: Niranjan Reddy


Banners: Konidela Production Company, Matinee Entertainment 


Cinematography: S Tirru


Music: Mani Sharma


Production Designer: Suresh Selvarajan


Editor: Naveen Nooli


Executive Producer: V.Y. Praveen Kumar

Vivaha Bhojanambu trailer released



 "వివాహ భోజనంబు" సినిమా ట్రైలర్ విడుదల, 'సోని లివ్' లో త్వరలో మూవీ స్ట్రీమింగ్


కమెడియన్ సత్య హీరోగా నటించిన "వివాహ భోజనంబు" సినిమా ట్రైలర్ రిలీజైంది.
ఆద్యంతం నవ్విస్తూ సాగిన ఈ ట్రైలర్ 'సోని లివ్' ఓటీటీ 5 గంటలకు విడుదల
చేసింది. త్వరలో 'సోని లివ్' ఓటీటీ ద్వారా "వివాహ భోజనంబు" సినిమా
స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాను సందీప్ కిషన్ నిర్మిస్తూ ఓ ప్రత్యేక
పాత్రలో నటిస్తుండటం విశేషం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో "వివాహ భోజనంబు"
చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. నూతన తార అర్జావీ రాజ్
నాయికగా నటించింది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి
టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథను వినోదాత్మకంగా
చూపించనుందీ సినిమా.

"వివాహ భోజనంబు" మూవీ ట్రైలర్ చూస్తే...తక్కువ ఖర్చుతో పెళ్లి
చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి కొడుక్కి లాక్ డౌన్ పిడుగుపాటులా మీద
పడుతుంది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే 21 రోజుల పాటు
ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన కథానాయకుడు వాళ్లకు పెట్టే
ఖర్చులు తట్టుకోలేకపోతాడు. క్రికెట్ టీమ్ లా ఇంట్లో ఉండిపోయిన ఈ
బంధువులను వదిలించుకోలేక అతను పడే పాట్లు నవ్వించాయి. ట్రైలర్ లోనే ఇన్ని
నవ్వులు ఉంటే, సినిమాలో ఇక బోలెడన్ని నవ్వులు ఖాయమని తెలుస్తోంది.

తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా లాంఛ్ అవుతున్న 'సోని లివ్' ..తన తొలి
చిత్రంగా "వివాహ భోజనంబు" ను స్ట్రీమింగ్ చేయబోతోంది. స్ట్రీమింగ్ తేదీని
త్వరలో ప్రకటించనున్నారు. "వివాహ భోజనంబు" వంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్
టైనర్ మూవీని తన తొలి చిత్రంగా ఎంచుకోవడం 'సోని లివ్' తీసుకున్న బెస్ట్
డెసిషన్ గా భావించవచ్చు. థియేటర్ లలో అడుగు పెట్టేందుకు ఇంకా భయపడుతున్న
కుటుంబ ప్రేక్షకులకు 'సోని లివ్' ఫస్ట్ వరల్డ్ ప్రీమియర్ మూవీ "వివాహ
భోజనంబు"  కావాల్సినంత వినోదాన్ని పంచనుంది.

సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్ఆర్, వైవా హర్ష,
శివన్నారాయణ, మధు మణి, నిత్య శ్రీ, కిరీటి, దయ, కల్ప లత తదితరులు ఇతర
పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - అనివీ, సినిమాటోగ్రఫీ -
మణికందన్, ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ - బ్రహ్మ కడలి,
కొరియోగ్రఫీ - సతీష్, విజయ్, కథ - భాను భోగవరపు, మాటలు - నందు ఆర్ కె,
సాహిత్యం - కిట్టు, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సీతారాం,
శివ చెర్రి, నిర్మాతలు - కేఎస్ శినీష్, సందీప్ కిషన్, దర్శకత్వం - రామ్
అబ్బరాజు

Mad Pre Release Event Held Grandly

 ఉత్సాహంగా సాగిన "మ్యాడ్" సినిమా ప్రీ రిలీజ్ వేడుక



మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ  ప్రధాన పాత్రల్లో

నటించిన సినిమా "మ్యాడ్". మోదెల టాకీస్  బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్

రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు  మిత్రులు నిర్మాత‌లుగా  లక్ష్మణ్ మేనేని

ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 6న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు

సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా "మ్యాడ్" సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం

పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.


లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ...చాలా సపోర్టివ్ టీమ్.

డైరెక్టర్ గారికి ఏం కావాలో క్లారిటీ ఉంది. ఫస్ట్ నుంచి ఆయన చెప్పే

వాటిలో స్పష్టత ఉండేది. పాటలు ఎలా ఉండాలో చాలా వివరంగా చెప్పేవారు.

మోహిత్ రెహ్మానియానిక్ ఇచ్చిన ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి. నాకు ఒక్కో

పాట ఇస్తూ మొత్తంగా ఐదు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో హీరో

హీరోయిన్స్ లవ్ లీ పీపుల్. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇతర టెక్నికల్

టీమ్ అంతా సూపర్బ్ గా పనిచేశారు. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.

మ్యాడ్ చూస్తూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.


నటి ఇందు మాట్లాడుతూ... మా ఇంట్లో వాళ్లు, నా ఫ్రెండ్స్ నన్ను ఆర్ యూ

మ్యాడ్ అంటారు. ఈ పోస్టర్ నాకు పంపి డైరెక్టర్ గారు పిలిచినప్పుడు చాలా

క్రేజీగా ఉంది సార్ అని వెళ్లి కథ విన్నాను. చాలా మంచి స్టోరీ. మా

డైరెక్టర్ గారు ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవరు. "మ్యాడ్" మూవీ కోసం పనిచేయడం

ప్లెజంట్ గా అనిపించింది. హీరో హీరోయిన్స్ తో పనిచేయడం చాలా కంఫర్ట్ గా

అనిపించింది. మా సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమా

చూసి మమ్మల్ని విష్ చేయండి. అన్నారు.


సినిమాటోగ్రాఫర్ రఘు మందాటి మాట్లాడుతూ...నాకీ అవకాశం ఇచ్చిన దర్శకుడు

లక్ష్మణ్ గారికి థాంక్స్. చాలా సందడిగా, అల్లరిగా, హడావుడిగా మా సినిమా

షూటింగ్ సాగింది. ఈ సినిమాకు వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆడియెన్స్

బ్లెస్సింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాం. అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏలూరు శ్రీను మాట్లాడుతూ...సినిమా మీదున్న

ప్యాషన్ తో నేను సినిమా చేద్దామనుకుంటున్న టైమ్ లో లక్ష్మణ్ గారిని

కలవడం, అలా సినిమా స్టార్ట్ చేశాం. థియేటర్ లో విడుదల చేద్దామనే

ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ రిలీజ్ ఆపాం. న్యూ ఏజ్ కపుల్స్ స్టోరీ ఇది. వాళ్ల

మ్యారేజ్ లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేశారని చూపించాం. మా

ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.


సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియానిక్ మాట్లాడుతూ..."మ్యాడ్" చిత్రంలో

సూఫీ పాట కంపోజ్ చేశాం. ఇది హిందీలోనే రాయించి, అలాగే చిత్రంలో ఉంచాం.

కైలాష్ ఖేర్ గారు ఆ పాటను అద్భుతంగా పాడారు. ఈ సినిమా మ్యూజిక్ కోసం నేను

చెప్పిన రిక్వైర్ మెంట్స్ కు దర్శకుడు లక్ష్మణ్ గారు చాలా సపోర్ట్

చేశారు. సినిమా కోసం తప్పకుండా చేద్దామని ముందుకొచ్చారు. "మ్యాడ్" మీరు

వచ్చి చూసి మర్చిపోయే సినిమా కాదు. అలా గుర్తుండిపోతుంది. విక్రమసింహా

అనే సినిమా తర్వాత సింగర్ ఉన్నికృష్ణన్ మా సినిమాలో పాట పాడారు. ఈ

చిత్రంతో నాకు దక్కిన అదృష్టం అనుకుంటున్నాను. ప్లీజ్ కం అండ్ వాచ్  అవర్

మూవీ. అన్నారు.


ఈ సందర్భం గా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ... మా ఫ్రెండ్స్

సపోర్ట్ తో "మ్యాడ్" సినిమా చేశాను. ఈ సినిమా చేసి వెళ్లిపోదాం

అనుకున్నాను. కానీ మా కాస్ట్ అండ్ క్రూతో ఒక అనుబంధం ఏర్పడింది.

ఇక్కడికొచ్చాక తెలిసింది ఇంత ప్రాణం పెట్టి సినిమా చేస్తారా అని.

"మ్యాడ్" మూవీ ఒక ఫీస్ట్ లా ఉంటుంది. రెగ్యులర్ చిత్రంలా ఉండదు. సినిమా

చూసి బాగుంటే చాలా బాగుందని చెప్పండి. థాంక్స్ టు ఆల్. అన్నారు.


నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ....రిలీజ్ ముందు వరకే చిన్న సినిమా

పెద్ద సినిమా రిలీజ్ అయ్యాక ఇదే పెద్ద సినిమా కావొచ్చు. దర్శకుడు

లక్ష్మణ్ గారు యూత్ ఫుల్ సినిమా చేశారు. సినిమాను బాగా ప్రమోట్

చేస్తున్నారు. ఈ నెల 6న ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. "మ్యాడ్" మూవీ

ఆ ఆరు సినిమాల్లో ఒకట్రెండు స్థానాల్లో నిలవాలని కోరుకుంటున్నా. ఈ సినిమా

అన్ని సెంటర్స్ లో మంచి థియేటర్స్ దొరికాయి. "మ్యాడ్" మంచి విజయం

సాధించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.


హీరో మాధవ్ చిలుకూరి మాట్లాడుతూ.. మా సినిమాకు పెద్ద గెస్ట్ మీడియానే.

చిన్న సినిమాను బయటకు తీసుకెళ్లేది మీరే. మా చిన్న సినిమాకు ఇదే పెద్ద

ఈవెంట్. మీ సపోర్ట్ కావాలి. మేమంతా చాలా హోప్స్ పెట్టుకుని ఈ సినిమా

చేశాం. కరోనా వల్ల థియేటర్స్ క్లోజ్ అయినప్పుడు మేమంతా డిప్రెషన్ లోకి

వెళ్లాం. ఇవాళ మా "మ్యాడ్" మూవీ థియేటర్ లో రిలీజ్ అవుతుండటం చాలా

సంతోషంగా ఉంది. థియేటర్ లో మా చిత్రాన్ని చూడండి. అన్నారు.


హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ... సినిమా బాగుందంటే ఆ చిత్ర విజయాన్ని ఎవరూ

ఆపలేరు. ఆ విషయాన్ని నమ్మే మేము మీ ముందుకు వస్తున్నాం. సోషల్ మీడియాలో

మా మూవీని తిట్టడంతో స్టార్ట్ చేసి, ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మా

సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ లాంటి కంటెంట్ వాళ్లకు బాగా నచ్చింది.

"మ్యాడ్" సినిమా చూస్తేనే మీకు దర్శకుడు చిత్రంలో ఏం చెప్పబోతున్నాడో

అర్థమవుతుంది. కానీ సినిమా చూడకుండానే కామెంట్స్ పెట్టకండి. సినిమా చూశాక

మీకు అనిపించింది చెప్పండని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను శ్రీవల్లి అనే

సినిమా చేశాను. శ్రీవల్లి సినిమాకు నేను డబ్బులు పెట్టానని అంతా అపార్థం

చేసుకున్నారు. కానీ నేను డబ్బులు పెట్టలేదు. వాళ్లు అడగలేదు. ఆ తర్వాత

నాకు సినిమాలు లేవు. "మ్యాడ్" మూవీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను.

ఆడియెన్స్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.


శ్వేత వర్మ మాట్లాడుతూ... పీఆర్వో జీఎస్కే మీడియాకు థాంక్స్. సినిమాను

బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ కోసం చాలా ఆత్రుతగా

ఎదురుచూస్తున్నాను. "మ్యాడ్" అనేది ఒక అద్భుతమైన సినిమా. నేను ఆల్రెడీ

చూశాను. గుడ్ ఫీల్ ఇస్తుంది. నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్.

సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. లక్ష్మణ్ గారికి ఫస్ట్ మూవీ అయినా, ఆయనకు

సినిమా మేకింగ్ మీద చాలా స్పష్టత ఉంది. పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు

అనుబంధాలతో మన జీవితం ముడిపడి ఉంటుంది. ఇదొక పుస్తకం లాంటిది. కానీ ఇవాళ

చిన్న తప్పు జరిగితే జీవితమనే పుస్తకాన్నే చింపేస్తున్నారు. "మ్యాడ్"

ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే సోషల్ మీడియాలో షేర్ చేయండి.

అన్నారు.



నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ...మా సినిమాకు వేణుగోపాల్ రెడ్డి గారు

రియల్ ఫిల్లర్   అన్నారు. మా పదేళ్ల కల "మ్యాడ్" సినిమా. మా కాస్ట్ అండ్

క్రూ గురించి చెబితే మమ్మల్ని మేము పొగుడుకున్నట్లు అవుతుంది. ఈ సినిమా

సక్సెస్ అయితే చాలా మందికి హోప్ ఇవ్వగలం అనుకుంటున్నాం. అన్నారు.


స్పందన పల్లి మాట్లాడుతూ....ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ లో నటించాలని

ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. "మ్యాడ్" సినిమాలో నా డ్రీమ్ క్యారెక్టర్

ఇచ్చిన దర్శకుడు లక్ష్మణ్ గారికి థాంక్స్. రెండేళ్లు వేచి చూస్తున్నాం

సినిమా విడుదల కోసం. "మ్యాడ్" సూపర్ హిట్ ఫిల్మ్, ఇందులో ఏ డౌట్ లేదు.

అన్నారు.


"మ్యాడ్" చిత్రానికి ప్రొడ్యూస‌ర్స్‌ : టి. వేణుగోపాల్ రెడ్డి, బి.

కృష్ణా రెడ్డి & మిత్రులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్

ఏలూరు, కెమెరా : రఘు మందాటి, ఎడిట‌ర్‌ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం :

మోహిత్ రెహ్మానియాక్, లిరిక్స్‌ : ప్రియాంక, శ్రీరామ్ ,పి ఆర్ ఒ : జియస్

కె మీడియా.


Folk song composed by Music Sensation Taman S for Varudu Kaavalenu has been released

Folk song composed by Music Sensation Taman S for Varudu Kaavalenu has been released 



Sitara Entertainments has released a folk number from Varudu Kaavalenu starring Naga Shaurya and Ritu Varma


One more super hit track sung by Shreya Ghoshal


Prestigious production house Sitara Entertainments is producing Varudu Kaavalenu starring Naga Shaurya and Ritu Varma with debutant Director Lakshmi Sowjanya.The unit has given out a song today (04-08-21)and by looking at it we can say it is a mix of both literature and Music.Getting into the details, Anantha Sriram has penned the folk rich lyrics with the lines “Naageti Saalagaada naaketti paniro....” which is sung by Shreya Ghoshal and composed by the Music Sensation of South Taman S. Shekhar VJ has choreographed the song on lead pair and it shows Lyrics,Dance and Music has competed with each other.

Already first single “Kola Kalle” composed by Vishal Chandra Shekhar from the movie has won the hearts of music lovers.


Also the Glimpse and promotional content released so far has garnered interest and appreciation from the audience and created a good buzz in the social media.Currently Movie production is the final stages of making and Producers are pretty much confident that the Story, Characters,Emotions ,Music and Artistes performances will surely win the hearts of audiences.

Along with the lead cast Naga Shaurya and Ritu Varma, Nadia,Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Pammi Sai, RangasthalambMahesh, Kireeti Daamaraaju,Vaishnavi Chaitanya, Sidhique shah has played important roles.

On the technical front Ganesh Kumar Raavuri has written the dialogues, Vamsi Patchipulusu handled the Cinematography , Vishal Chandra Shekhar has composed the music, Naveen Nooli did the Editing and Art by Prakash.

Presented by: PDV Prasad

Producer: Suryadevara Naga Vamsi

Story-Screenplay-Direction:Lakshmi Sowjanya

Adivi Sesh's Goodachari Sequel Announcement Soon

 Adivi Sesh's Goodachari Sequel Announcement Soon



Young hero Adivi Sesh is making his entry in Bollywood with a patriotic Pan India project Major which has completed its major shooting part.


Soon after wrapping up this project, Adivi Sesh will be doing sequel for his biggest blockbuster Goodachari which completes three years today. Goodachari sequel announcement is coming soon, this month.


“Goodachari will be back. Announcement this month,” announced the makers.


"It’s #3YearsforGoodachari today :) My most loved film. It is especially The film children love the most. Since August has always been a lucky month for me, a huge update of the next mission later this month! #G2 Announcement coming soon!" reads Sesh's tweet.


The action spy film was directed by Sashi Kiran Tikka. 

Anil sunkara, TG Vishwa Prasad and Abhishek Agarwal will bankroll the second installment,Vivek kuchibotla is the Co producer.


Adivi Sesh who penned the story and screenplay for Goodachari is working on the script for the sequel too.


Plan B Releasing on August 20



 ఆగష్టు 20 న ప్లాన్ బి విడుదల  



శ్రీనివాస్ రెడ్డి హీరో గా సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ మరియు నవీనారెడ్డి ముఖ్య తారాగణం తో ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్  చిత్రం "ప్లాన్-బి". ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగష్టు 20 న విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా



చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ "ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో  సాగె కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠం గా ఉంటుంది.  మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి  సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి శర్మ గారు, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని ఆగష్టు 20 న విడుదల చేస్తున్నాము" అని తెలిపారు.


నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ "మా ప్లాన్ బి చిత్రం సెన్సార్ పూర్తీ అయ్యింది, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.  ఆగష్టు 20 న విడుదల చేస్తున్నాం." అని తెలిపారు.



సినిమా పేరు : ప్లాన్ బి


బ్యానర్ : ఎవిఆర్ మూవీ వండర్స్


నటి నటులు : శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, నవీనారెడ్డి, అభినవ్ సర్దార్, చిత్రం శీను, షాని, తదితరులు


కెమెరా మాన్ : వెంకట్ గంగాధరి


బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  : శక్తికాంత్ కార్తీక్ (ఫిదా ఫేమ్)


ఎడిటర్ : ఆవుల వెంకటేష్


యాక్షన్ : శంకర్ ఉయ్యాల


ఆర్ట్ : కృష్ణ చిత్తనుర్


ప్రొడక్షన్ డిజైనర్ : సతీష్ దాసరి


 డిటియస్ : రాధాకృష్ణ


డిఐ కలరిస్ట్ :  ప్రేమ్ (ప్రసాద్ ల్యాబ్స్)


సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్.కె


పిఆరోఓ : పాల్ పవన్


కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం :  కెవి రాజమహి


నిర్మాత : ఎవిఆర్.

Khushbu, Radhika Sarathkumar, Urvashi In Aadavaallu Meeku Johaarlu

 Khushbu, Radhika Sarathkumar, Urvashi In Aadavaallu Meeku Johaarlu



The title Aadavaallu Meeku Johaarlu got tremendous response from all the corners, particularly family audiences loved it completely. The title itself suggests the importance of female characters in the movie.


Young and happening hero Sharwanand plays the lead role, while Rashmika Mandanna is the female lead. Talented director Tirumala Kishore is helming the project, while Sudhakar Cherukuri is producing it on Sri Lakshmi Venkateswara Cinemas banner.


The makers have come up with an exciting announcement of evergreen actresses Khushbu, Radhika Sarathkumar and Urvashi being part of the project.


The three characters are very decisive for the film. Thus, the makers have roped in the highly talented actresses. It will be an eye-feast to see the three heroines in very special roles in the very special film from Tirumala Kishore.


The film’s shooting is progressing in Hyderabad and Khushbu, Radhika Sarathkumar and Urvashi have also joined the team.


Billed to be a wholesome family entertainer, Rockstar Devi Sri Prasad is rendering soundtracks, while popular cinematographer Sujith Sarang is handling cinematography, and Sreekar Prasad who won several national awards is the editor.


Cast: Sharwanand, Rashmika Mandanna, Khushbu, Radhika Sarathkumar, Urvashi, Vennela Kishore, Ravi Shankar, Sathya, Pradeep Rawath, Gopa Raju, Benarjee, Kalyani Natarajan, Rajasri Nair, Jhansi, Rajitha, Sathya Krishna, RCM Raju and others.


Technical Crew:

Director: Tirumala Kishore

Producer: Sudhakar Cherukuri

Banner: Sri Lakshmi Venkateswara Cinemas

Cinematography: Sujith Sarang

Editor: Sreekar Prasad

Art Director: AS Prakash

Choreographer: Dinesh

PRO: Vamsi-Shekar

Noble Gesture By Rockstar DSP On His Birthday

 Noble Gesture By Rockstar DSP On His Birthday



Rockstar Devi Sri Prasad has carved a niche for himself as a renowned music director. DSP has been consistently delivering Chartbusters and Blockbuster albums since more than two decades. He is not only known for his foot tapping numbers but also for his energy while performing on stage and while composing music. DSP has composed music for Top Heroes in South languages as well as in Bollywood too. Today he is celebrating his birthday and the entire industry poured in wishes on social media. A glimpse of his composition from his upcoming pan India film 'Pushpa' with Icon Star Allu Arjun and Director Sukumar is revealed by makers. This glimpse itself hints about the magic Devi is going to create with 'Pushpa'.


On the eve of his Birthday Devi Sri Prasad shared details about a home for abandoned children, Daddy's Home at Gannavaram. As a noble gesture DSP announces that he is sponsoring a couple of kids and will be donating all the groceries and daily needs for the entire month of August. He also shared the details in a post via his Twitter so that anyone who is willing to donate and lend a helping hand to the kids.

ICON Star Allu Arjun Pushpa The Rise Releasing for Christmas



క్రిస్మస్ కానుకగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' ద రైజ్ విడుదల..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను తిరగరాశాయి. తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని స్థాయిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-ద రైజ్ టీజర్ తో సరికొత్త చరిత్ర సృష్టించారు. పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్ 1 పుష్ప- ద రైజ్ విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. క్రిస్మస్ కానుకగా పుష్ప ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా పుష్ప-ద రైజ్ థియేటర్లలో విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. మిరోస్లా క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.


నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన


టెక్నికల్ టీం:


కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఎర్నేని వై రవిశంకర్

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు


Megastar Chiranjeevi Help For Darsaka Ratna Dasari CO-DIRECTOR Prabhakar Daughter Education

 ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి కోడైరెక్ట‌ర్ ప్ర‌భాకర్ కుమార్తెకి కాలేజ్ ఫీజ్ కట్టిన‌ మెగాస్టార్



క‌రోనా క్రైసిస్ లో సినీప‌రిశ్ర‌మ కార్మికులు స‌హా ఆప‌ద‌లో ఉన్న ఎంద‌రినో మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి మెగాస్టార్ ఆప‌త్కాల‌ సాయం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు కోడైరెక్ట‌ర్ (లంకేశ్వ‌రుడు చిత్రానికి కో డైరెక్ట‌ర్) గా ప‌ని చేసిన ప్ర‌భాక‌ర్ కి ఆప‌త్కాలంలో మెగాస్టార్ చిరంజీవి బృందం ఆర్థిక సాయం చేశారు. వారి పాప చ‌దువుకు అవ‌స‌ర‌మైన ఫీజుల సాయం చేసి ఆదుకున్నారు.


ఈ సంద‌ర్భంగా ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ-``నేను దాస‌రి వ‌ద్ద కోడైరెక్ట‌ర్ గా ప‌ని చేశాను. చిరంజీవి న‌టించిన లంకేశ్వ‌రుడికి కోడైరెక్ట‌ర్ గా చేశాను. కానీ ఇటీవ‌ల `హెల్ప్ లైన్` అనే సినిమా తీసాను. ద‌ర్శ‌క‌నిర్మాత‌గా చాలా న‌ష్ట‌పోయాను. ఆ సినిమాని ఎవ‌రూ రిలీజ్ చేయ‌క న‌ష్ట‌పోయాను. మా అబ్బాయికి సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్త‌యి రెండేళ్ల‌య్యింది. వాడి సర్టిఫికెట్లు డ‌బ్బు క‌ట్టి తేవాలి. పాప‌కు బీబీఏ ఫైన‌ల్ ఇయ‌ర్ కి వ‌చ్చింది. 2.5 ల‌క్ష‌ల ఫీజు క‌డితేనే ఎగ్జామ్ రాయ‌గ‌ల‌దు. ఎంత ప్ర‌య‌త్నించినా డ‌బ్బు ముట్ట‌లేదు. దీంతో సాయం కోసం ఎవ‌రిని అర్థించాలి? అనుకున్నాను. నా ఉద్యోగం మాటేమో కానీ .. చెల్లి చ‌దువు ప‌రీక్ష ఫీజు క‌ట్టాలి.. అని నా కుమారుడు అన్నాడు. నా ఇద్ద‌రు పిల్ల‌ల భ‌విష్య‌త్ ని కాపాడుకోలేను.. నా ఇల్లు శ్మ‌శాన‌వాతావ‌ర‌ణంలా మారిందని బాధ‌ప‌డ్డాను. కానీ ఏదోలా ప్ర‌య‌త్నించాను. తెలుగు చిత్ర‌సీమ‌లో చిరంజీవిగారు మాత్ర‌మే ఈ సాయం చేయ‌గ‌ల‌రు. ఆయ‌న‌ను అర్థించేందుకు క‌లిసాను. 30ఏళ్ల క్రితం లంకేశ్వ‌రుడికి ప‌ని చేసిన‌ప్పుడు ఎంత ప్రేమ‌గా చూసుకున్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమ‌ను క‌న‌బ‌రిచారు. వెంట‌నే స్పందించి ఫీజు ఏర్పాటు చేశారు. ఆ ఫీజును ఇన్ టైమ్ లో క‌ట్ట‌లేక‌పోవ‌డంతో హాల్ టికెట్ ఇవ్వ‌లేమ‌ని అన్నారు. కానీ చిరంజీవి గారు సాయం చేశార‌ని అన‌గానే అక్క‌డ స్టాఫ్ అంతా సాయం చేశారు. 

గ‌జేంద్ర మోక్షంలో మొస‌లికి చిక్కిన గ‌జేంద్రుని కాపాడేందుకు వ‌చ్చిన మ‌హా విష్ణువులా చిరంజీవి న‌న్ను ఆదుకున్నారు. చిరంజీవి గారు ఆదుకున్నారు అన‌గానే నా క‌ష్టం విని రామ్ చ‌ర‌ణ్ గారు వారి స్టాఫ్ కూడా అంతే సాయం చేశారు. నేను ఈరోజు ఇలా మాట్లాడానంటే దానికి చిరంజీవి గారు.. రామ్ చ‌ర‌ణ్ గారు ఆదుకోవ‌డం వ‌ల్ల‌నే అని అన్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రికో సాయం చేసిన మెగాస్టార్ ఇటీవ‌ల కొంద‌రు ఆర్టిస్టుల‌కు చెక్కుల రూపంలో ఆర్థిక‌ సాయ‌మందించారు. ఇప్పుడు క‌ష్ట‌కాలంలో పిల్ల‌ల ప‌రీక్ష‌ల‌కు ఫీజులు క‌ట్ట‌లేని కోడైరెక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ ని ఆదుకున్నారు. అందుకే ఆయ‌న‌ను ప‌రిశ్ర‌మ బాస్ అని గౌర‌వించింది. చిరంజీవి సాయానికి హ్యాట్సాఫ్‌.

1997 First Look Motion Poster Launched

 1997 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల



దా. మోహన్, నవీన్ చంద్ర, కోటి ప్రధాన పాత్రల్లో డా. మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైరాబాద్లోని దసపల్ల హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నారప్ప దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరై సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.


అనంతరం శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ...సురేష్ కొండేటి నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయమని అడిగితే సినిమా గురించి తెలుసుకున్నాను. చాలా మంది నటీనటులు కనిపిస్తున్నారు. టైటిల్ చాలా బాగుంది. 1997 తో నాకు ఏదో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో కోటిగారు మంచి పాత్ర చేశానని చెప్పారు. ఫస్ట్ లుక్ బాగుంది. ఈ సినిమాతో దర్శకుడు, నిర్మాత, నటన ఇలా ఇన్ని పనులు చేయడం నిజంగా చాలా కష్టం, అయినా కూడా మోహన్ గారు మొదటిసారి ఇవన్నీ చేశారంటే నిజంగా గ్రేట్ సర్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి మీరు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ....ఈ సినిమా చేయడానికి కారణం మోహన్ గారు ఒకరోజు నాకు ఈ కథ చెప్పారు. కథ వినగానే చేయాలని అనిపించింది. ఇది హీరోనా, చిన్న పాత్ర అన్నది కాకుండా ఓ మంచి పాత్ర చేసానన్న తృప్తి కలిగింది. మోహన్ గారు మొదటిసారి అయినా కూడా చాలా బాగా తీశారు, ముఖ్యంగా నటుడిగా కూడా అద్భుతంగా నటించారు. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తే ఆయననుండి  మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి అన్నారు.


సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ...మోహన్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాలో ఆయన నాకు కొడుకుగా నటించాడు. అప్పటినుండి తనతో అదే అనుబంధం కొనసాగుతుంది. మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో మీరు నటించాలని అడిగాడు. నేను పోలీస్ కావాలని మా నాన్నగారికి కోరిక ఉండేది, అది ఎలాగూ జరగలేదు కాబట్టి ఇలా పోలీస్ పాత్రల ద్వారా అయినా ఆ కోరిక తీరింది. నేను పోలీస్ గా దేవినేని సినిమాలో చేశాను. అప్పటినుండి చాలామంది పోలీస్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. ఒకరోజు చిరంజీవి గారు నువ్వు నటుడిగా పనికి వస్తావు ప్రొసీడ్ అవ్వమని చెప్పడంతో నేనుకూడా యాక్టింగ్ పై ఫోకస్ పెట్టాను. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అన్నారు.


హీరో మోహన్ మాట్లాడుతూ ...ముందుగా కోటిగారికి థాంక్స్ చెప్పాలి. నా ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ అందించారు. ఆయన లేనిదే నేను ఏ పని చేయలేదు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలాగే నవీన్ చంద్రకు థాంక్స్ చెప్పాలి. కథ వినగానే వెంటనే చేస్తానని చెప్పారు. ఆయన చిన్న పాత్రయినా చాలా చక్కగా చేశాడు. అలాగే బెనర్జీ గారు, శ్రీకాంత్, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఓ బర్నింగ్ ఇష్యుని  తీసుకుని ఈ సినిమా చేశా. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.


నటీనటులు.

డా. మోహన్, నవీన్ చంద్ర , కోటి, బెనర్జీ, శ్రీకాంత్ అయ్యంగార్, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు...


బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్.

ఎడిటింగ్ : నందమూరి హరి

సంగీతం : కోటి

కెమెరా : చిట్టి బాబు

నిర్మాత: మీనాక్షి రమావత్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.

పీఆర్ ఓ: సురేష్ కొండేటి.

Rana Daggubati Launched vijaya Raghavan Trailer

 వెర్స‌టైల్ హీరో రానాద‌గ్గుబాటి విడుద‌ల చేసిన విజ‌య్‌ ఆంటోని `విజ‌య రాఘ‌వ‌న్‌` ట్రైల‌ర్ 



`న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌` వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. `మెట్రో` వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం 'విజయ రాఘవన్‌'.  ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  కోడియిల్ ఒరువ‌న్‌` పేరుతో త‌మిళంలో.. `విజ‌య రాఘ‌వ‌న్‌`పేరుతో తెలుగులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే


``నేరాలు చేసే వాళ్ల‌ని వ‌దిలేసి స్కూలుకెళ్లి చ‌దువుకునే చిన్న చిన్న పిల్ల‌ల్ని ప‌ట్టుకుని అరెస్ట్ చేస్తారేంట్రా ప‌నికిమాలిన సుంట‌ల్లారా! అంటూ ఓ వ్య‌క్తి పోలీసుల‌ను తిట్ట‌డంతో ట్రైల‌ర్ మొద‌లవుతుంది. 

`బ‌య‌టూరోడివా` అని హీరోని ఓ సైడ్ విల‌న్ ప్ర‌శ్నిస్తే.. `అర‌కు ప‌క్క‌న‌` అంటూ హీరో విజ‌య్ ఆంటోని స‌మాధానం చెప్ప‌డం.. `ఏదైనా తేడా వ‌చ్చిందా పేగులు తీసి మెళ్లో వేసుకుంటా` మ‌రో సైడ్ విల‌న్ వార్నింగ్ ఇవ్వ‌డం 

హీరో త‌న‌ని తాను ట్యూష‌న్ మాస్ట‌ర్ అని ప‌రిచ‌యం చేసుకోవ‌డం.. ఐఏఎస్‌కి ప్రిపేర్ అయ్యే హీరో బ‌స్తీలో చ‌దువుకోవాల‌నుకునే కుర్రాళ్ల కోసం స్పెష‌ల్ క్లాసులు చెప్ప‌డం.. 

పాడ‌వ‌కుండా ఉండాల‌ని ఆధార్ కార్డుని లామినేష‌న్ చేస్తారు కానీ.. చెద‌లు ప‌ట్టిన మా జీవితాల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు అంటూ ఓ బ‌స్తీ మ‌హిళ హీరో ద‌గ్గ‌ర బాధ‌ప‌డటం


ఏదో ఒక ప‌క్క నిల్చువాలి త‌మ్ముడు.. సెంట‌ర్‌లో నిల్చున్నావంటే రెండు ప‌క్క‌ల నుంచి న‌లిగిపోతావ్‌` అంటూ కె.జి.య‌ఫ్ విల‌న్ రామ‌చంద్ర‌రాజు హీరోని బెదిరించ‌డం`

జీత‌మే లేని ఓ కార్పొరేట‌ర్ సీటుని ఓ పార్టీ కోటి ఇచ్చికొనుక్కుంటుంది.. ల‌క్ష జీత‌ముమ‌న్న ఎమ్మెల్యే సీటుకి ప‌దిహేను కోట్లు, ఎంపీకి ఇర‌వై ఐదు కోట్లు.. మొత్తం ఇలా ఎన్ని వేల కోట్లు.. వీళ్లంద‌రూ గెలిచొచ్చి ఏం పీకుతున్నారో అంద‌రికీ తెలిసిందే క‌దా..అని అసెంబ్లీలో హీరో ఎమోష‌న‌ల్ డైలాగ్ చెప్ప‌డం...మ‌ధ్య‌లో హీరోయిన్ ఆత్మిక‌తో హీరో ల‌వ్‌ట్రాక్ సీన్స్‌, విల‌న్స్‌తో హీరో చేసే యాక్ష‌న్ సీన్స్


 ఓ బ‌స్తీ.. అందులో రౌడీయిజం చేసే రౌడీలు.. వారిని ఎదుర్కోడానికి వ‌చ్చిన హీరో.. దానికి సంబంధించిన రాజ‌కీయాలు.. వీటి కాంబినేష‌న్‌లో క‌ట్ చేసిన ట్రైల‌ర్ ఆస‌క్తిని రెట్టింపు చేస్తోంది.


ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన‌ రానా ద‌గ్గుబాటికి హీరో విజ‌య్ ఆంటోని ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. 


‘‘ఇది వ‌రకే విడుద‌లైన‌ ఈ సినిమా పాటలకు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్ల‌లు ప‌క్క దారులు ప‌ట్ట‌కుండా ... చ‌దువు గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించి, వారి ఉన్న‌తికి పాటు ప‌డే యువ‌కుడి క‌థే విజ‌య్ రాఘ‌వ‌న్‌. ప్ర‌స్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తెర‌కెక్కించాం. డిఫరెంట్ పాత్ర. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా ఉంటుంది. డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను అద్భుతంగా అన్ని ఎలిమెంట్స్‌ను క‌వ‌ర్ చేస్తూ తెర‌కెక్కించారు.ఎప్పుడో విడుద‌ల కావాల్సిన సినిమా కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సినిమాను విడుద‌ల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 


న‌టీన‌టులు:

విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు 


సాంకేతిక వ‌ర్గం:

రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌

నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌

 సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌

సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌

మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్న

ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌


Nagarjuna, Praveen Sattaru’s Film Second Schedule Commences From August 4 In Hyderabad

 Nagarjuna, Praveen Sattaru’s Film Second Schedule Commences From August 4 In Hyderabad



King Nagarjuna and Director Praveen Sattaru’s high octane action thriller being produced by Narayan Das K Narang, Puskur Ram Mohan Rao, and Sharrath Marar under the Sree Venkateshwara LLP and Northstar Entertainment Banners had completed its first schedule in Goa and a major second schedule will commence from August 4th in Hyderabad.


Key sequences of the film are being planned in various cities in India and abroad. Nagarjuna will be seen in an entertaining and action-packed role. Kajal Aggarawal is the heroine of the  the film. The casting includes Gul Panag and Anikha Surendran.


While Mukesh G is the Cinematographer, Bramha Kadali comes in as the Art Director and Robin Subbu and Nabha Master step in as the Action Directors.


Cast: Nagarjuna, Kajal Aggarwal, Gul Panag, Anikha Surendran


Technical Crew:

Director: Praveen Sattaru

Producers: NarayanDas Narang, Puskur RamMohan Rao, Sharrath Marar

Banners: Sree Venkateshwara LLP and Northstar Entertainment

Cinematography: Mukhesh G.

Action: Robin Subbu and Nabha Master

Art Director: Brahma Kadali

PRO: Vamsi-Shekar, BA Raju


Rakshasudu 2 Will Be A Pan-India Film With 100 Crore Budget: Producer Koneru Satyanarayana

 Rakshasudu 2 Will Be A Pan-India Film With 100 Crore Budget: Producer Koneru Satyanarayana



Producer Koneru Satyanarayana has delivered a blockbuster with his last film, Rakshasudu starring Bellamkonda Sreenivas. The film was directed by Ramesh Varma. The producer is currently making Khiladi with Mass Maharaja Ravi Teja which is again directed by Ramesh Varma. Meanwhile, he recently announced Rakshasudu 2 with Ramesh Varma. The name of the hero of the project is yet to be revealed.


On the occasion of Rakshasudu completing two years, Koneru Satyanarayana divulged some very interesting details of the second part. "Rakshasudu 2 story is more exciting than the first part. It will have more commercial elements than the first part and will be more thrilling," he said.


"Rakshasudu 2 will be on par with Hollywood films. It will be made on Pan-India level and will have a big star playing the lead role. We have earmarked a budget of 100 Crore and it will be entirely shot in London. We will announce the name of the hero at the right time," he added.


Koneru Satyanarayana was supposed to remake Rakshasudu in Bollywood but COVID-19 played a spoilsport. "Akshay Kumar has approached us to give the rights to Pooja Films and we readily gave away the rights as we felt he would be perfect for the role. Since we could not do the film, we gave the rights to Pooja Films. Ramesh Varma will be making his Bollywood debut with the movie," he told.


About Khiladi, he told, "It will be another blockbuster from our banner. Some big heroes from Bollywood are already after us for the movie rights. We will have to take a decision soon".


Koneru Satyanarayana also hinted a big project with his son, Havish. "You are going to see the best movies from Havish in the coming days. I strongly believe that he’s going to be a big star one day," he confidently said.


aha announces its new original, Taragathi Gadhi Daati, the official remake of TVF's hit show FLAMES

 aha announces its new original, Taragathi Gadhi Daati, the official remake of TVF's hit show FLAMES



100% Telugu OTT platform aha, that has redefined the conventions of entertainment in the Telugu digital space housing the biggest blockbusters and pathbreaking web shows, proudly announces its latest web series titled Taragathi Gadhi Daati. The series, presented by Center Fresh, that captures the innocence of teenage romance is the official Telugu remake of the hit TVF original FLAMES. Directed by Mallik Ram, the man behind the popular web series Pelli Gola, the show stars Harshith Reddy, Payal Radhakrishna and Nikhil Devadula in key roles. The first poster of the show brims with innocence and charm in an idyllic setting, with two happy-go-lucky youngsters chatting away as if there's no tomorrow.


Taragathi Gadhi Daati, set amidst the heart of Rajahmundry, has been adapted in Telugu with utmost authenticity. The show that captures the spirit of everyday life in and around the Godavari region in Andhra Pradesh, revolves around Krishna a.k.a Kittu, a young intermediate student, whose parents Shankar and Gauri run a coaching centre. Despite his solid credentials as a student and being a Mathematics-enthusiast, Krishna isn't exactly motivated to study, only until an encounter with a new student in the coaching centre, Jasmine, turns his world topsy turvy. 


The five-episode long show takes viewers through the tender romance unfolding between Krishna and Jasmine and throws light on the sweet little nothings, the chaos of teenage years. The male lead Harshith Reddy has already proved his worth as a performer with the rural comedy Mail earlier this year. His co-star Payal Radhakrishna has established herself as an actress across multiple Kannada, Tamil web shows, namely Bhinna and Singapenne. Nikhil Devadula, a well-known child artiste, part of hit films like Uyyala Jampala and Baahubali, is now geared up to wow audiences as a mature actor with Taragathi Gadhi Daati.


Taragathi Gadhi Daati is the second remake of a TVF original on aha after Commitmental, the regional adaptation of Permanent Roommates. Commitmental had starred Udbhav Raghunandan and Punarnavi Bhupalam in the lead roles. aha is on a high after its mind-bending sci-fi crime thriller Kudi Yedamaithe won the hearts of critics and audiences recently. Directed by Pawan Kumar, Kudi Yedamaithe surprised audiences with riveting twists and turns and featured fantastic performances by its lead cast comprising Amala Paul, Rahul Vijay and Ravi Prakash. Some of aha's popular releases in 2021 include Krack, Naandhi, 11th Hour, Zombie Reddy, Chaavu Kaburu Challaga and In the Name of God.

Ram Karthik Telisinavallu First Look Launched

 హీరో రామ్ కార్తీక్‌ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన "తెలిసిన వాళ్ళు" చిత్ర బృందం



 "తెలిసినవాళ్ళు" టైటిల్ వినగానే తెలుగు ప్రేక్షకులకు ఇట్టే కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు  యుట్యూబ్ లో ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మిత మవుతున్న ఈ చిత్రాన్ని సిరెంజ్ సినిమా నిర్మిస్తుంది.. కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ నటీ,నటులుగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  'తెలిసినవాళ్లు'. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా చిత్రంలోని హీరో రామ్ కార్తీక్‌ లుక్ ను విడుదల చేశారు.


 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...  ఈ చిత్రం నుండి ఇంతకు క్రితం విడుదల చేసిన హెబ్బా పటేల్  ఫస్ట్ లుక్ కి ఎంతటి ఆదరణ లభించిందో.. అలాగే హీరో రామ్ కార్తీక్ లుక్ కూడా మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కోవిద్ కారణంగా షూటింగ్ డిలే అయ్యింది మరల ఇప్పుడు హీరో లుక్ కి మంచి స్పందన రావటం తో ఇప్పటి నుంచి విన్నూతనమైన రీతిలో ప్రమోషన్స్ చేయబోతున్నాం. హీరో,హీరోయిన్స్ రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ లు ఇద్దరూ చాలా బాగా నటించారు. సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తో పాటు మిగిలిన సీనియర్ నటులందరూ కూడా చాలా చక్కగా నటించారు. మా సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ వారు ఫిలిం స్కూల్  లో గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసుకొని మా సినిమాకు సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే కాకుండా అత్యున్నత ప్రమాణాలతో నిర్మిత మవుతున్న మా చిత్రం ఒక సాంగ్ మినహా దాదాపుగా 90 శాతం షూటింగ్  పూర్తి చేసుకుంది. మిగిలిన పది శాతం  చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమైంది అని అన్నారు.


 నటీనటులు

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్,  సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు


 సాంకేతిక నిపుణులు

మూవీ: "తెలిసినవాళ్ళు"

సమర్పణ: కేఎస్వీ ఫిలిమ్స్

నిర్మాత: సిరెంజ్ సినిమా

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి

ఛాయాగ్రహణం: అజయ్ వి నాగ్

కూర్పు: ధర్మేంద్ర కాకరాల

సంగీతం: దీపక్ వేణుగోపాలన్

సాహిత్యం: డాక్టర్ జివాగో

కళ: ఉపేందర్ రెడ్డి

కోరియోగ్రఫీ: జావేద్ మాస్టర్, శైలజ మాస్టర్

ఫైట్స్: సీ హెచ్ రామకృష్ణ

లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ

కో డైరెక్టర్ : కటిగళ్ళ సుబ్బారావ్

పీఆర్వో : మధు వీ.ఆర్

We Made '22' Movie Lavishly With Uncompromising Quality - Hero Rupesh Kumar

 We Made '22' Movie Lavishly With Uncompromising Quality - Hero Rupesh Kumar



Rupesh Kumar Choudhary is making his debut as a Hero with Different Action Thriller '22'. ShivaKumar B. is Directing this film along with providing Story, Screenplay and Dialogues. SMT Susheela Devi is Producing this film under Maa Aai Productions banner. Saloni Mishra is the heroine. Hero Rupesh is celebrating his birthday on August 2nd. On this occasion...


Hero Rupesh Kumar Choudhary said, " I came from business family. I am very fond of acting since my childhood. My love for acting brought me to industry. I got excited while Shiva narrating the script. This is an action thriller. '22' number plays a major point in this film.  I played the role of a powerful police officer 'Rudra' in this film. I have completely transformed myself for the character. 'Khaidi No 150' 'Baahubali' 'Saaho' fame Jashua Master has composed terrific action sequences for our film. Though this is the first film for Shiva as a Director, He made '22' with full clarity as he has very good experience in Direction department. We made this film in an uncompromising manner in making and quality.  Saloni Mishra is playing as the heroine. She did a very important role as a CBI officer. Bollywood Actor Vikramjeet Virk did a negative role. We wanted to release our film in theatres only.  Now the situation is getting better and theatres are open. Recently released films are also doing good. We are planning to release our film for Dussehra or Diwali. I listened to some scripts during lockdown and I am currently working on them."


Pushpa First Single Announcement

 ఆగస్టు 13న విడుద‌ల కానున్న‌ ఐదు భాషల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తొలి సింగిల్ సాంగ్ దాక్కో దాక్కో మేక



ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.


నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన


టెక్నికల్ టీం:


కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఎర్నేని వై రవిశంకర్

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు


K Raghavendra Rao to Release Induvadhana Teaser on August 4th



 ఆగస్ట్ 4న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ‘ఇందువదన’ టీజర్ విడుదల.. 


శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా పోస్టర్ చాలా కళాత్మకంగా ఉంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్. విడుదలైన క్షణం నుంచే ఈ లుక్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా టీజర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 4 ఉదయం 10 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆయన చేతుల మీదుగా టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది. వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.


నటీనటులు: 

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: ఎమ్మెస్సార్

బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్

నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి

కో ప్రొడ్యూసర్: గిరిధర్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటి 

సంగీతం: శివ కాకాని

కో డైరెక్టర్: ఉదయ్ రాజ్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ఆర్ట్: వై నాగు

లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన

లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాలా, వర్మ

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్