Latest Post

Producer Madhura Sreedhar Reddy appointed as Telugu Content head in Sony Liv

Madhura Sridhar reddy Appointed as SONYLIV OTT Telugu content Head


SonyLIV has appointed Sreedhar Reddy Komalla as head – Telugu content,
digital business. In his new role, Reddy will primarily focus on
leading the expansion plans of the Telugu vertical of SonyLIV for
users across markets. He has worked for multinational IT companies
like TCS, Infosys, Wipro and Tech Mahindra for 11 years and left IT
career to pursue his filmmaking dreams.

Reddy’s appointment deepens the roots of SonyLIV in the southern
market. At SonyLIV, Reddy will be responsible for bolstering the
Telugu content library. With long-standing experience across verticals
of the Telugu industry, he will oversee the development plans of the
platform in the region.

Reddy is known for his contribution to Telugu cinema. He started his
film career by establishing a music label Madhura Audio and shaped it
as one of the top music labels in Telugu Cinema. He is also an active
member of various Telugu Filmmakers Groups such as the Telugu Film
Directors Association, Telugu Producers Council, Active Telugu Film
Producers Guild amongst others.

Ashish Golwalkar, head- content, SonyLIV and SET, said, “We are
delighted to have Madhura Sreedhar Reddy at SonyLIV to head the Telugu
portfolio. Reddy brings with him a diversified experience that will
help us chart out growth for Telugu content and offer captivating
stories of India to our audience across genres.”

Sridhar Reddy said, “I am excited and looking forward to my new
innings at SonyLIV. My role here is to extend SonyLIV’s footprint in
the Telugu market and churn out homegrown content which caters to
users across geographies.”

PelliSandaD Glimpse Released on the occasion of Heroine Sreeleela Birthday

 



హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేసిన ‘పెళ్లి సంద‌D’ యూనిట్


కమర్షియల్.. భక్తి రస చిత్రాలతో క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీస్ సహా అన్నివర్గాల ప్రేక్షకులను అల‌రించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్ర‌త్యేక‌మైన ప్ర‌స్తావ‌న అక్క‌ర్లేదు. అగ్ర క‌థానాయ‌కులంద‌రితో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించారు. క‌థానాయ‌కుల‌నే కాదు.. ఎంద‌రో హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన గోల్డెన్ హ్యాండ్ ఆయ‌న‌ది. హీరోయిన్స్‌ను ఎంతో అందంగా మ‌రే ద‌ర్శ‌కుడు చూపించ‌నంత గ్లామ‌ర‌స్‌గా చూపించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. అలాంటి శ‌తాధిక ద‌ర్శ‌కుడు త‌న గోల్డెన్ హ్యాండ్‌తో మ‌రో అందాల భామ‌ను ‘పెళ్లి సంద‌D’ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఆ అందం పేరే.. శ్రీలీల‌.


ఈ బ్యూటీ డాల్ పుట్టిన‌రోజు సోమ‌వారం(జూన్ 14). ఈ సంద‌ర్భంగా ‘పెళ్లి సంద‌D’ యూనిట్ సినిమా నుంచి శ్రీలీల గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది. రాఘ‌వేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. ఆయ‌న శిష్యురాలు, చిత్ర‌ ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి శ్రీలీల అంతే గ్లామ‌ర‌స్‌గా తెర‌కెక్కించిన‌ట్లు గ్లింప్స్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. శ్రీలీల బెంగుళూరులో స్థిర‌ప‌డ్డ తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. మెడిసిన్ చ‌దువుతుంది. అయితే న‌ట‌న‌పై ఆస‌క్తితో సినీ రంగంలో అవ‌కాశాల కోసం చూస్తున్న త‌రుణంలో రాఘ‌వేంద్రరావు సూచ‌న మేర‌కు గౌరి రోణంకి శ్రీలీల హీరోయిన్‌గా ఎంపిక చేశారు. హాకీ, స్విమ్మింగ్ వంటి స్పోర్ట్స్‌తో పాటు క్లాసిక‌ల్ డాన్స్‌.. బాలే డాన్స్‌లోనూ శ్రీలీలకు మంచి ప్రావీణ్యం ఉంది. ఎంద‌రో హీరోయిన్స్‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డం, తెలుగు వారి హృద‌యాల్లో వారికి సుస్థిర‌మైన స్థానాన్ని క‌లిగించిన ద‌ర్శ‌కేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న ‘పెళ్లి సంద‌D’ చిత్రంలో న‌టించ‌డం హీరోయిన్‌గా త‌న‌కెంతో ప్ల‌స్ అని హీరోయిన్ శ్రీలీల తెలియ‌జేసింది. 


ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న చిత్రం `పెళ్లిసంద‌D`. గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘‘మా గురువుగారు రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌ర‌వాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో సూప‌ర్ హిట్ సినిమా రూపొందింద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎన్నో మ్యూజిక‌ల్ సెన్సేష‌న్స్ రూపొందాయి. అదే స్టైల్లో ఈ సినిమాలోని పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఏడు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే షూటింగ్‌ను పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం’’ అని డైరెక్ట‌ర్ గౌరి రోణంకి తెలిపారు. 


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.

Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Final Shooting Schedule Begins

 Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Final Shooting Schedule Begins



Hero Nithiin’s milestone 30th film Maestro directed by Merlapaka Gandhi is in last leg of shooting.


Final shooting schedule of Maestro has commenced today in Hyderabad and it is the first star hero movie to resume shoot, post second wave of the pandemic.


Currently, the team is canning scenes involving Nithiin and Tamannaah Bhatia. These are going to be most crucial sequences of the film. With this schedule, the entire shooting part will be wrapped up.


Nabha Natesh has paired opposite Nithiin in the crime comedy.


The film’s first look poster and teaser were released on Nithiin’s birthday and the response was massive.


Mahati Swara Sagar who gave chartbuster album for Bheeshma is working for the second time with Nithiin.


N Sudhakar Reddy and Nikitha Reddy are producing the film under Shreshth Movies Banner, while Rajkumar Akella is presenting it. The film has cinematography by J Yuvraj.


Cast: Nithin, Nabha Natesh, Tamannaah, Naresh, Jishhusen Gupta, Sreemukhi, Ananya, Harshavardhan, Rachha Ravi, Mangli, Srinivas Reddy


Technical Crew:


Dialogues, Direction: Merlapaka Gandhi

Producers: N Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies

Presents: Rajkumar Akella

Music Director: Mahati Swara Sagar

DOP: J Yuvraj

Editor: SR Shekhar

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Vijay Deverakonda is the first south actor to feature on Popular photographer Dabbo Ratnani's Calendar




 సౌత్ నుండి మొదటి హీరో... బాలీవుడ్ ఫొటొగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్

లో మెరిసిన విజయ్ దేవరకొండ.


యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా

చెప్పక్కర్లేదు.యూత్ లో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు

మరో క్రేజీ  న్యూస్ లో నిలిచాడు. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్

డబూ రత్నాని క్యాలెండర్ లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్ ల సరసన

విజయ్ ఆ క్యాలెండర్ లో కనిపించాడు.సౌత్ ఇండియా నుండి ఈ క్యాలెండర్ లో

చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. చేసిన 9

సినిమాలకే ఇలాంటి నేషనల్ క్రేజ్ సంపాదించడం గమనార్హం. దీనికి సంబంధించిన

స్టన్నింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు డబూ రత్నాని. రగ్గ్ డ్ అండ్

స్టైలిష్ లుక్ లో విజయ్ సెక్సీగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ను లాంచ్

చేసిన సందర్భంగా విజయ్ తో ఇన్ స్టా గ్రామ్ లైవ్ ముచ్చటించాడు డబూ.


 విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .‘‘.ఈ ఫొటో షూట్ చాలా తొందరగా,చాలా

క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ

క్యాలెండర్ లో కనిపించారు.నేను షారుఖ్ ఖాన్ సర్ ను మీ క్యాలెండర్ లో

చూసా. తను చాలా మంచి వ్యక్తి. అప్పటినుండి నాకు మీ క్యాలెండర్ లో

కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని.ఫైనల్ గా నా కోరిక తీరింది.

 డబూ రత్నాని మాట్లాడుతూ : థాంక్యూ విజయ్ దేవరకొండ నా క్యాలెండర్ లో

డెబ్యూ చేసినందుకు.మీరు చాలా కూల్ పర్సన్.ఈ ఫొటో షూట్ చేసినపుడు చాలా

ఎంజాయ్ చేసాను.నా క్యాలెండర్ లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను

షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే.థాంక్యూ.’’ అన్నారు.

SR Kalyanamandapam Worldwide Rights Bagged by Shankar Pictures

 


కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్ SR క‌ళ్యాణమండంపం EST 1975 వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ద‌క్కించుకున్న శంక‌ర్ పిక్చ‌ర్స్

రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ - రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించ‌డ‌మే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. ఇటీవ‌లే SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రాన్ని మాత్రం థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాత‌లు ప్ర‌మోద్ - రాజులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందించ‌డం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. ఇప్ప‌టి ప‌రిస్థితులు సాధ‌ర‌ణ స్థాయికి వ‌చ్చి, థియేట‌ర్లు ఎప్పుడూ తెరుచుకుంటే అప్పుడు ఈ సినిమా విడుద‌లకి సిద్ధం.

తారాగ‌ణం - కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం

బ్యానర్ - ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు - ప్ర‌మోద్, రాజు
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కిర‌ణ్ అబ్బ‌వరం
ద‌ర్శ‌కుడు - శ్రీధ‌ర్ గాదే
సంగీతం - చేత‌న్ భ‌ర‌ద్వాజ్
కెమెరా - విశ్వాస్ డేనియ‌ల్
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - భ‌ర‌త్
లిరిక్స్ - భాస్క‌రభ‌ట్ల, క్రిష్ణ కాంత్
పీఆర్ఓ - ఏలూరుశ్రీను, మేఘ‌శ్యామ్
ఆర్ట్ - సుధీర్
డిఐ - సురేశ్ ర‌వి
ఫైట‌ర్ - శంక‌ర్


Manam Saitham Kadambari Kiran Help to Female Cine Workers

 


మహిళా సినీ వర్కర్స్ కు "మనం సైతం" కాదంబరి కిరణ్ సాయం


కరోనా కష్టకాలంలో షూటింగ్ లు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళా సినీ వర్కర్స్ అక్కా చెల్లెల్లకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు "మనం సైతం" కాదంబరి కిరణ్. తన సేవా సంస్థ "మనం సైతం" ద్వారా వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. "తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్‌ మహిళా వర్కర్స్ యూనియన్" కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళ వర్కర్స్ కాదంబరి కిరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.


*ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ*....మా మహిళా వర్కర్స్ సిస్టర్స్ కు మనం సైతం ద్వారా చేతనైన సాయం అందించడం సంతోషంగా ఉంది. గతేడాది లాగే ఈ సారి కూడా కరోనా లాక్ డౌన్ వల్ల మహిళా వర్కర్స్ ఇబ్బందులు పడుతున్నారు. "తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్‌ మహిళా వర్కర్స్ యూనియన్" సభ్యులకు మనం సైతం నుంచి ఇవాళ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాం. 'సర్వీస్ ఈజ్ గాడ్ - టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్' అనే నిదానంతో ముందుకెళ్తున్నాను. 7సం.లుగా వేలకొద్దీ కార్యక్రమాలు మనం సైతం ద్వారా నిర్వహించాం. వాటిలో నాటి కేరళ వరదలు , తిత్లి తూఫాన్, హైదరాబాద్ ముంపు బాధితులు ..ఇలా అవసరార్థుల కోసం నా పరుగు సాగుతూనే ఉంది. మధ్యలో వచ్చిన కోవిద్ టెక్ష్ట్స్ కోవిద్ పేషెంట్స్ కొరకు భోజనాలతో పాటు మాస్క్ లు సానటైజెర్, మందులు, పేస్ షీల్డ్స్, ఆక్సిమేటర్స్, ఆక్సిజెన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, అంబులెన్సులు, ఆస్పత్రి లో బెడ్లు, ఇతర సౌకర్యాలు, ఆసుపత్రి బిల్లుల తగ్గింపునకు సిఫారసులు..ఒకటేమిటి అందినంత సాయం వరకు అన్నీ అందించాము. నాకీ సాయం చేసే బలం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పేదవారికి చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా మనం సైతం సిద్ధం అన్నారు.


*మహిళా వర్కర్స్ మాట్లాడుతూ*...సినిమా వాళ్ల కష్టాలు సినిమా వాళ్లకే తెలుస్తాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము సాయం అడిగిన వాళ్లు చేయని సందర్భాలు ఉన్నాయి. కానీ మేము అడక్కుండానే వచ్చి మాకు సహాయం చేస్తున్నారు "మనం సైతం" కాదంబరి కిరణ్ గారు. ఇవాళ మా యూనియన్ సభ్యులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. మాలో మానసిక స్థైర్యాన్ని నింపారు. గతేడాది కూడా కరోనా టైమ్ లో ఇలాగే మా యూనిట్ మహిళలందరికీ నిత్యావసర వస్తువులు ఇచ్చారు. "మనం సైతం" ద్వారా ఆయన వేల మందికి సేవ చేస్తున్నారు. మాలో అనారోగ్యంతో బాధపడిన ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఆయన మేలు మేము ఎప్పటికీ మర్చిపోము. అన్నారు.


ఈ కార్యక్రమంలో లలిత, సీసీ శ్రీను, రమేష్ రాజా, క్రేన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Raj Dasireddy Up Coming Hollywood Movie Mercedes

 


Press note -


హాలీవుడ్‌లో రాజ్ దాసిరెడ్డి అప్‌కమింగ్ మూవీ మెర్సిడెస్, 


మూలం ప్రకారం, భారతీయ నటుడు రాజ్ దాసిరెడ్డి తెలుగు సినిమాలో పనిచేశారు, ఇప్పుడు చాలా ప్రశంసలు పొందిన హాలీవుడ్ దర్శకుడు మరియు నిర్మాత మైఖేల్ బే తో కలిసి పని చేయబోతున్నారు, ప్రస్తుతం మైఖేల్ బే, తన ప్రొడక్షన్ హౌస్ సినిమాలు, ambulance, the forever purge , a quite place part 2 . 


ప్రపంచంలో మొట్టమొదటి మోటారు కారును పరిచయం చేసిన ఇంజనీర్ మరియు మెర్సిడెస్ కార్ బ్రాండ్ యొక్క పరిణామం చుట్టూ కథ తిరుగుతుంది. చలన చిత్రం యొక్క అధికారిక స్పాన్సర్డ్ భాగస్వామి Daimler AG అని పేర్కొన్నారు.


ఈ చిత్రంలో రాజ్ దాసిరెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తు, మెర్సిడెస్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 27 భాషలలో విడుదల కానుంది. మూలం ప్రకారం 30 నుండి 50 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. మెర్సిడెస్ మూవీ 2022 లో విడుదల కానుంది


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాండమిక్ కారణంగా, పెర్టిక్యులర్ తేదీని ఇంకా కేటాయించలేదు.


#rajdasireddy

DSJ Releasing on 12th June

 



ఈ నెల 12న  ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం) చిత్రం లోని మొదటి పాట విడుదల


 మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అన్న కథాంశంమే ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ  లేడీ ఓరియెంటెడ్ గా ప్రముఖ పాత్రలో నటిస్తుంది. నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి  నిర్మిస్తున్న చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్  పూర్తి చేసుకుంది. అలాగే ఈ నెల 12న  ఈ చిత్రం లోని మొదటి పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేసుకుంటున్న సందర్భంగా 


 చిత్ర నిర్మాత నట్టి క్రాంతి మాట్లాడుతూ… లేడీ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో చాలా వచ్చాయి అవన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప సాధిస్తుందనే నమ్మకం ఉంది.ఈ సినిమాలో నట్టి కరుణ అద్భుతమైన పాత్ర పోషించింది. మొదటి నుండి కూడా ఆ అమ్మాయి చాలా బాగా నటించింది.  నట్టి కరుణ ఆర్టిస్టుగానే కాకుండా  గతంలో తను చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది డైనమిక్ నిర్మాతగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ చిత్రంలోని నటీనటులందరూ చాలబాగా నటించారు.ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నట్టి కరుణ నటన సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది. సెకెండ్ లీడ్ లో  సుపూర్ణ మాలకర్ నటించారు.  కరోనా టైం లో కూడా ఏంతో ధైర్యంగా కశ్మీర్ లోని అందమైన లోకేషన్స్ లలో చిత్రీకరణ జరుపుకుని షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాము. అందరూ బాగా సహకరించడం వలన సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాము. త్వరల్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకోనున్న 'DSJ‘ (దెయ్యంతో సహజీవనం) చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికి తప్పక నచ్చుతుందని అన్నారు..


 చిత్ర దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ… బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు చేసిన మోసాల గురించి తెలుసుకుని ఆ నలుగురు అబ్బాయిలపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం నడుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.  నేను దర్శకత్వం వహించే ఈ  ‘DSJ‘(దెయ్యంతో సహ జీవనం) చిత్రానికి నిర్మాతగా నా కుమారుడు నట్టి క్రాంతి, కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు వేరే సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్  చూసుకుంటూ డేట్స్ అడ్జస్ట్ కాకున్నా ఈ సినిమా షూట్ లో ఎక్కువగా  సింగిల్ టేక్ లలో నటించినందుకు గర్వంతో పాటు  చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తన నటనను ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూశాను. కరోనాటైంలో కూడా నటీనటులందరు భయపడకుండా మాకు సహరించడం వలన మేము ఈ సినిమా పూర్తి చేయగలిగాము. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుందనే నమ్మకం  ఉందని అన్నారు. 


 నటీనటులు:

నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్,రాజీవ్ ,

హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు.


 సాంకేతిక నిపుణులు:

బ్యానర్ : నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ 

సమర్పణ : నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల

డైరెక్టర్: నట్టి కుమార్

నిర్మాత: నట్టి క్రాంతి

కెమెరామెన్: కోటేశ్వర రావు

సంగీతం: రవి శంకర్

ఎడిటింగ్: గౌతంరాజు

ఆర్ట్: కెవి.రమణ

ఫైట్స్: కె.అంజిబాబు

పి ఆర్.ఒ: మధు.విఆర్

Gopichand Pakka Commercial First Look Launched

 



మ్యాచో హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా స్టార్ డైరెక్ట‌ర్ మారుతి, జీఏ2 పిక్చ‌ర్స్ - UV క్రియేష‌న్స్ కాంబినేష‌న్ లో ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ పోస్టర్ విడుదల..


ప్ర‌తి రోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ వ‌రుకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌ణ‌ల‌ను సైతం ద‌ర్శ‌కుడు మారుతి త‌న‌దైన శైలిలో విడుద‌ల చేస్తూ వచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. జూలై మొదటి వారంలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుడు విడుదలైన పోస్టర్లలో కూడా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వస్తుంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియ జేయనుంది.


తారాగణం


గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్


టెక్నికల్ టీం: 


స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్

బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్

నిర్మాత‌ - బ‌న్నీ వాస్

ద‌ర్శ‌కుడు - మారుతి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్

స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్

ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్

సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Kalaammatalli Chedodu to 600 Film Workers

 



"కళామతల్లి చేదోడు" కార్యక్రమం ద్వారా 600 మంది సినీ వర్కర్స్ కు చేయూత నందించిన ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు,చదవాలవాడ శ్రీనివాస్ రావు, యలమంచిలి రవిచంద్


 ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు గారు, చదవాలవాడ శ్రీనివాస్ గారు,యలమంచిలి రవి చంద్ గార్లు ఆధ్వర్యంలో "కళామతల్లి చేదోడు" కార్యక్రమం ఈ రోజు ఉదయం 9 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో  జరిగింది.ఈ కార్యక్రమంలో  మహిళా వర్కర్స్ కి, డ్రైవర్స్ కి, జూనియర్ ఆర్టిస్టులు కి, ప్రొడక్షన్ వర్కర్స్ కి సుమారు ఆరువందల మందికి  ఫుడ్ గ్రోసెరిస్ ఇవ్వటం జరిగింది. దాదాపు నెలకు సరిపడా నిత్య అవసరమ సామాగ్రి అయిన రైస్ బ్యాగ్, కంది పప్పు, రెండు ఆయిల్ పాకెట్స్, కంది పప్పు, గోధుమ పిండి, మినప గుండ్లు, పంచదార, ఎండుమిర్చి, గోధుమ రవ్వ, టీ పౌడర్, పసుపు, పెసర పప్పు, ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, చింత పండు, రిన్ సోప్ లు, విమ్ బార్ లు, కోల్గేట్ పేస్ట్, జిరా, ఆవాలు, అన్ని రెండు కిలో లు తదితర సామాగ్రిని  జి మార్ట్ సూపర్ మార్కెట్ ద్వారా ప్యాక్ చేసి ఇవ్వటం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో  బెక్కం వేణుగోపాల్ గారు,అజయ్ కుమార్ , వల్లభనేని అనిల్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం" కళామతల్లి చేదోడు " ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట కాలంలో భాగస్వామ్యం కావాలి అనేది మా ఉద్దేశం, దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా


 యలమంచిలి రవి చంద్ గారు మాట్లాడుతూ.. ప్రస్తుత కష్ట కాలంలో  ప్రతి పేద సినిమా కార్మికుడు, కార్మికురాలు ఎన్నో  ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని  వారందరినీ ఆదుకోవాలని "కళామతల్లి చేదోడు" కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు వేల మంది సినీ వర్కర్స్ వున్నారు. ఇప్పుడు వారందరికీ  ఓకే సారి గ్రాసరీస్ పంపిణీ చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తించి కోవిడ్ కారణాల దృష్టా ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 600 మందికి పేద కార్మికులకు మొదటి విడతగా ఫుడ్ గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వారందరికీ కూడా దశల వారిగా ఫుడ్ గ్రాసరీస్ అందజేయడం జరుగుతుంది. చాలా మంది పెద్దలు సినీ  పేద కార్మికులకు సర్వీస్ చేయాలని వారికి మీరు సహయం చెయ్యమని  మాకు డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.అయితే వారి నుండి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారు చేసే సహాయాన్ని మేము సెలెక్ట్ చేసుకొన్న సూపర్ మార్కెట్ కు పే చెయ్యమని సూచించడం జరిగింది. అ సూపర్ మార్కెట్  ద్వారా 2500 రూపాయల విలువ కలిగిన నెలకు సరిపడా ఫుడ్ గ్రాసరీస్ ను అందజేశాము. అలాగే కరోనా ఉన్నంత వరకు ప్రతి పేద సినీ కార్మికుడికీ మేము సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాం . సినీ వర్కర్స్ కు సహాయం చేసే విషయంలో నేను దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఒక్క మాట కూడా అడగకుండా ఒకే చెయ్యి ఏమి కావాలి అన్న నా సపోర్ట్ ఉంటుంది అని ముందుకు వచ్చినందుకు నా ధన్యవాదములు, అలాగే చదల వాడ శ్రీనివాసరావు గారు నేను అడగగానే ముందుకు వచ్చారు వారికీ నా ధన్య వాదములు తెలియచేస్తున్నాను,


 అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ .. కరోనా కష్ట కాలం లో యలమంచిలి రవిచంద్ పనులు లేక ఇబ్బంది పడుతున్న వల్ల అందరకి తనవంతు సాయం గా ఇలాంటి కార్యక్రమం చేపడుతు న్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.


 బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ... యలమంచిలి రవి చంద్ గారు ఈ కష్ట కాలం లో పేదలకి ఇలాంటి సాయం చేస్తున్నందుకు నా అభినందనలు తెలుఫుతున్నాను.


 వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ.. ఈ కరోనా కష్ట కాలం లో మొట్ట మొదటి గా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేసి పేదలకు సాయం చేసినందుకు యలమంచిలి రవి చంద్ గారికి దిల్ రాజు గారికి, చదల వాడ శ్రీని వసరావు రావు గారికి నా ధన్య వాదములు తెలుపుతున్నాను.


First look of young hero Adith Aruns Katha Kanchiki Manam Intiki out now

 First look of young hero Adith Aruns Katha Kanchiki Manam Intiki out now



The motion poster of birthday boy Adith Arun’s upcoming film, Katha Kanchiki Manam Intiki was unveiled a short while back. The poster raises curiosity with interesting visuals. It has a spooky vibe to it as we see a few Aghoras in the background. The poster look intriguing and grabs the attention of the viewers right at first glance. 

Adith is seen in an unconventional yet attention-grabbing look. He resembles an urbane Aghora as he carries a demonic laugh on his face. He is seen in Aghora-esque look with blood splattered all over his forehead. He sports an intense look on his face. The film is directed by Chanakya Chinna and produced by Monish Pattipati. Telugu beauty Pujitha Ponnada pairs with Adith.

For Our Frontline Workers, Something Special Coming Soon: Nani


For Our Frontline Workers, Something Special Coming Soon: Nani


During the Covid-19 situation, we have seen videos of health workers shaking their leg in hospitals and quarantine centres to cheer up Covid-19 patients. Natural Star Nani says it’s his turn to do something special for these frontline workers.


“For our Frontline Workers.. Something special 😊 Coming soon.. 🎵🩺❤️ @nameisnani #ForOurHeroes ,” reads Nani’s post on Twitter. In fact, the stethoscope emoji in the post indicates doctor. And, the picture he shared designates, Nani along with his team filmed something on doctors.


Nani must be lauded for doing the ‘special’ thing for the frontline workers who are tirelessly working against coronavirus. Any guesses on Nani’s ‘something special’ for the frontline workers?

Hombale Films’s Humble Gesture in Covid-19 Times

 



India is going through a challenging time due to the global pandemic Covid-19. With businesses shutting, common man suffered the most. Also people, who got infected, struggled to get beds and oxygen in hospitals.


Film industry is also one of the worst hits of pandemic restrictions. With film shootings and releases getting stalled, cine workers suffered dearly. In order to help the struggling cine works, India’s leading production house Hombale Films has stepped up.


Hombale has set up two oxygen plants and 20 oxygen bed facility in Mandya, Karnataka with an estimation cost of Rs 2 crore. To all the associations within the Telugu film chamber, Hombale made a contribution of Rs 35 Lakh which has helped 3200 members.


Not just this, for the crew of their upcoming mega budget film ‘Salaar’ Hombale showed its true gesture. The 150 membered crew, were given Rs 5000 each as aid and this helped to gather the essential groceries even though it was just a 10 days work of shoot.


Last year the production house, provided assistance of Rs 5000 for two months to nearly 350 cine labourers.


This help was the need of the hour and Hombale believes that industry is a family that needs to support each other during testing times.

Adith Arun Dear Megha First Look Launched



 అరుణ్ అదిత్ పుట్టిన రోజున డియర్ మేఘ సెకండ్ లుక్ విడుదల చేసిన టీమ్


మేఘా ఆకాష్,అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''డియర్ మేఘ''. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ అవుతున్న ఈ చిత్రానికి ఓటీటీ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి.  'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్', ''డియర్ మేఘ'' చిత్రాన్ని నిర్మిస్తుంది. అర్జున్ దాస్యన్ నిర్మాత. యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. హీరో అరుణ్ ఆదిత్ పుట్టినరోజు సందర్భంగా ''డియర్ మేఘ'' న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  


ఈ సందర్భంగా దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ... హీరో అరుణ్ ఆదిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ''డియర్ మేఘ'' లో అరుణ్ ఆదిత్ పాత్ర సూపర్బ్ గా ఉంటుంది.  అరుణ్ ఆదిత్ నటన ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది అన్నారు.


నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ... మా హీరో అరుణ్ ఆదిత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ''డియర్ మేఘ'' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో సహా కంప్లీట్ అయ్యింది. త్వరలో ఓ బిగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద  ''డియర్ మేఘ'' విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా ''డియర్ మేఘ''ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్మకంతో ఉన్నాం. అన్నారు.


ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ, పీఆర్వో - జీఎస్కే మీడియా. రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

Ccc vaccination Drive for Film Industry Workers :Megastar Chiranjeevi



 సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం : మెగాస్టార్ చిరంజీవి


కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిల్మ్  డైరెక్టర్స్  అసోసియేషన్ అధ్యక్షులు  ఎన్ శంకర్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రెటరీ దొరై లతో పాటు పలువురు సినీ టెక్నీషియన్స్ పాల్గొన్నారు.


ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. కరోనా క్రైసిస్ చారిటి కింద ఈ రోజు సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ, ఫిలిం ఫెడరేషన్ వారందరికీ, అలాగే వారితో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్నీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. అలాగే జర్నలిస్ట్ లకు కూడా వాక్సిన్ ఇస్తున్నాం. ఈ రోజు ఈ సిసిసి తలపెట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ పునః ప్రారంభించాం.  ఈ కార్యక్రమానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, అపోలో 24 / 7ల సహకారంతో ఈ వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం అయింది. పునః ప్రారంభం ఎందుకన్నానంటే .. నిజానికి ఇది మూడు వారల క్రితమే మొదలైంది. అయితే వాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఇక  ఈ వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎంతమంది ఉంటె .. అందరికి వాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే వేలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీసం రోజుకు ఐదారు వందల మందికి వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ సందర్బంగా అపోలో వారికీ నా అభినందనలు తెలుపుతున్నా.  అలాగే ఈ కార్యక్రమంలో తప్పకుండా సినిమా కార్మికులు అందరు  పాల్గొనేలా మోటివేట్ చేసిన భరద్వాజ గారికి, ఎన్ శంకర్ , ఫెడరేషన్ ప్రసిడెంట్ అనిల్ గారికి, సెక్రెటరీ దొరై గార్లకు అభినందనలు తెలియచేస్తున్నాను. తప్పకుండా సినీ కార్మికులందరూ వాక్సిన్ తీసుకోవాలి.


ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో గత ఏడాది ఏర్పాటు చేసిన  సీసీ చారిటి విషయంలో భరద్వాజ గారు, ఎన్ . శంకర్, మెహర్ రమేష్, కె ఎల్ ధాముగారు, సి కళ్యాణ్ గారు, బెనర్జీ, సురేష్ ఇలా అందరు దీనికి సహకరిస్తూ ముందుకు తీసుకెలుతున్నారు. ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి సీసీసీ ఆధ్వర్యంలో గత ఏడాది సినిమా కార్మికులకు మూడు సార్లు నిత్యావసర సరుకులు అందచేశాం. సినీ కార్మికులందరిని ఒకే  వేదికపైకి తెచ్చి సీసీసీ ఆధ్వర్యంలో వాక్సిన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నాం. సీసీసీ చారిటి మొదలెట్టినప్పుడు అందరు ముందుకొచ్చి డొనేషన్స్ ఇచ్చారు దానికి తగ్గట్టుగా సీసీసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పైసా కూడా అవసరం ఉన్నవాళ్లకు చేరేలా చర్యలు తీసుకుంటాం.. దానికి నేను భరోసా.  అలాగే తప్పకుండా 18 ఏళ్ళు నిండిన వారంతా వాక్సిన్ తీసుకోవాలి, వాక్సిన్ విషయంలో ఆలోచనలో ఉన్నవారు కూడా ఎలాంటి సంశయం లేకుండా వాక్సిన్ తీసుకోండి. నేను వాక్సిన్ తీసుకున్నాను. తప్పకుండా అందరు వాక్సిన్ తీసుకుని కరోనా రాకుండా  చేద్దాం'  అన్నారు.

Aha Ardha sathabdam on June 11th


aha-exclusive film Ardha Shathadham set for a grand worldwide premiere on June 11


100% Telugu platform aha is gearing up for a blockbuster weekend with the worldwide premiere of their original film, Ardha Shathabdham, on June 11. This aha-exclusive release, directed by Rawindra Pulle, stars Karthik Rathnam, Krishna Priya, Naveen Chandra, Subhalekha Sudhakar, Sai Kumar and Amani in pivotal roles. The hard-hitting rustic political drama, set in the interiors of Telangana in the early 2000s, addresses issues of class/caste discrimination amid the backdrop of a love story.


"We have shot key portions of the film in Nirmal district, Telangana under challenging weather conditions. The film is an unconventional love story that dives deep into the rotten dimensions of our system, with several characters representing the pillars of democracy. Ardha Shathabdham looks at the constitution from the perspective of the marginalised and focuses on their struggle for equality in society. I'm thrilled with the responses for the teaser and the trailer. I genuinely believe that the film will strike a chord with Telugu audiences on June 11," the filmmaker Rawindra Pulle added.


C/O Kancharapalem-fame Karthik Rathnam, talking about his shoot experiences exclaimed, "It was indeed my dream come true to have shared screen space with my idols like Sai Kumar and Amani (garu). I've overcome stage fear in my early years largely by delivering dialogues from Sai Kumar (garu)'s films. Naveen Chandra is an actor whom I've consistently been in awe of, since Andala Rakshasi. I play a soft-natured youngster who's caught in an ugly game of politics, class and caste in the film. I can't wait for the audiences to watch it."


Actor Sai Kumar stated, "We are grateful to have a platform like aha that brings together a perfect melange of young talent and experience. Stories have no barriers and I'm glad that the platform is giving a voice to many new-age filmmakers. I enjoyed being part of Ardha Shathabdham, where I got an opportunity to work with some of the most exciting talents in the film industry, from Karthik to Krishna Priya and Naveen Chandra. I'm sure the film will engage audiences completely on aha."


Veteran actor Subhalekha Sudhakar shared, "I got to essay the role of a politician who's committed to his position and genuinely believes in the power of constitution in ensuring a just society. However, the ground reality leaves him bitter. Ardha Shathabdham emphasises the importance of collective effort in bringing about a change and ushering in a better tomorrow. The film addresses several social issues with sincerity and I'm proud to be a part of a story that aims to bring about a difference."


aha is home to the best Telugu entertainment across the globe, be it blockbuster films, originals or web shows. Earlier this year, the platform went on to have many high-profile releases including Krack, Zombie Reddy, 11th Hour, Naandhi, Chaavu Kaburu Challaga and Kala. Don't forget to fill your popcorn tubs and watch Ardha Shathabdham from June 11, only on aha.


Rahul Vijay as Subhash in 'Panchathantram' First Look unveiled

 Rahul Vijay as Subhash in 'Panchathantram' First Look unveiled on his birthday



Padmasri awardee Brahmanandam, Swathi Reddy, Shivathmika Rajasekhar, Samuthirakani, young hero Rahul Vijay and 'Mathu Vadalara' fame Naresh Agasthya feature in 'Panchathantram', which is being produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, the film is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu.


On Monday, on the occasion of Rahul Vijay's birthday, the actor's first look from the movie was unveiled. He is playing a youngster named Subhash in the movie.


Speaking on the occasion, writer-director Harsha Pulipaka said, "Rahul Vijay will be seen as a 28-year-old man who has specific preferences about how his future wife has to be. The character reflects the confusions and clear-cut perspectives of today's youths about marriage, life partner and other life-long relationships. His is a simple and romantic character."


The producers said, "Team 'Panchathantram' wishes Rahul Vijay a happy birthday. In his character Subhash, today's youngsters will find a reflection of themselves. The realistic character represents the thinking of today's youngsters in a lot of ways. The first looks released so far have received a superb response. We are planning to take up the final schedule in July. Only ten days of shoot is pending. Post-production works have been on during the lockdown."



Cast:

Padmasri Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar,  young hero Rahul  Vijay and 'Mathu Vadalara' fame Naresh Agasthya, Divya Sripada, Srividya, Vikas, Aadarsh Balakrishna and others.


Crew:

PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media), Associate Director: Vikram, Costume Designer: Ayesha Mariam, Editor: Garry BH, Cinematographer: Raj K Nalli, Production Controller: Sai Babu Vasireddy, Line Producer: Suneeth  Padolkar, Executive Producer: Bhuvan Saluru, Creative Producer: Usha Reddy Vavveti, Dialogues: Harsha Pulipaka,  Lyrics: Kittu Vissapragada, Music Director: Prashanth R Vihari, Co-Producers: Ramesh Veeragandhan, Ravali Kalangi, Producers: Akhilesh Vardhan & Srujan Yarabolu, Writer & Director: Harsha Pulipaka

Time Most Desirable Man Vijay Deverakonda

 


ఆల్ ఇండియా "టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్  కొట్టేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ



బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రిసెంంట్ గా హైదరాబాద్ "టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్" గా టాప్ ప్లేస్ సంపాదించుకోగా..ఇప్పుడు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50" లో నేషనల్ వైడ్ గా రెండో స్థానం దక్కించుకున్నారు.పోయిన సంవత్సరం మూడో ప్లేస్ లో ఉన్న విజయ్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. రన్వీర్ సింగ్, వికీ కౌషల్, రణ్ బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ అంతా విజయ్ వెనకే ఉండిపోయారు.


ఆన్ లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలను టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేసింది టైమ్స్ గ్రూప్. నేషనల్ వైడ్ గా జరిగిన ఆన్ లైన్ ఓటింగ్ లో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి స్థానం దక్కించుకోగా...రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. ఆదిత్య రాయ్ కపూర్, వికీ కౌశల్, దుల్కర్ సల్మాన్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.


"అర్జున్ రెడ్డి" సినిమా హిందీ రీమేక్ "కబీర్ సింగ్" తో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ బాగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా "లైగర్" తో హిందీ పరిశ్రమకు విజయ్ దేవరకొండ మరింత దగ్గరవుతున్నారు. "టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50" లిస్ట్ లో విజయ్ సెకండ్ ప్లేస్ గెల్చుకోవడానికి తన ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా దోహదపడింది.దీనితో ఆయన చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా "లైగర్" మీద భారీ అంచనాలు  ఏర్పడ్డాయి.

Actor Afsar Azad Foundation Helping Needy people

 


రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. మరో సోనూసూద్

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మెయిన్ విలన్‌గా అనేక భూమికలు పోషించిన రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. ఈ కరోనా కష్టకాలంలో తన ‘ఆజాద్ ఫౌండేషన్’ ద్వారా ఎందరికో సహాయాన్ని అందిస్తూ.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి తన ఫౌండేషన్ ద్వారా.. తనకు చేతనైనంతగా సహాయం అందిస్తూనే ఉన్నారు. ట్యాబ్‌లెట్స్, ఇంజక్షన్స్, ఫుడ్, నిత్యావసర సరుకులు.. ఇలా ఎవరికి ఏ అవసరం ఉంటే.. ఆ అవసరం తీర్చుతూ.. దాదాపు 1400 కుటుంబాలను ఆయన ఈ కష్టకాలంలో ఆదుకున్నారు. అలాగే వందల మందికి కరోనా ఆయుర్వేద మందును అందజేశారు. ఆయన సాయం అందుకున్న వారంతా.. ఆయనని ‘మరో సోనూసూద్’ అంటూ పిలుస్తుండటం విశేషం. జూన్ 5 అఫ్సర్ ఆజాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ఇలాంటి శక్తి మరింతగా లభించాలని కోరుతూ.. ఆయన నుంచి సాయం అందుకున్న వారంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ఎలాంటి శిక్షణ, బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. విలన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా తమిళ్‌, భోజ్‌పురి సినిమాలలో హీరోగానూ ఆయన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇదంతా ఈ రియల్ స్టార్‌లోని ఒక కోణం అయితే.. సమాజానికి సేవ చేయాలనే ధృడ సంకల్పంతో ఆయన ఆజాద్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆజాద్ ఫౌండేషన్ గురించి తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇటీవల ప్రత్యేకంగా అఫ్సర్ ఆజాద్‌ని అభినందించారు. కాగా.. సరైనోడు, భలేభలే మగాడివోయ్, రుద్ర ఐపీఎస్ వంటి చిత్రాలలో ఆయన ప్రముఖ పాత్రాలలో నటించారు.

Thiram songs Dedicated to Spb

 


*మా "తీరం" చిత్రంలోని పాటలు   ఎస్.పి. బాలు గారికి అంకితం- దర్శక-నిర్మాత అనిల్ ఇనమడుగు!!* 


గాన గంధర్వుడు స్వర్గీయ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా..  "తీరం" చిత్రంలోని పాటలన్ని ఆయనకు అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు..  తీరం చిత్రంలోని  ఆయన పాడిన చివరి పాట "అసలేంటీ ప్రేమా" పాటతోబాటు, చిత్రంలోని మిగిలిన 8 పాటలను కూడా ఎస్.పి. బాలూ గారికి అంకితం చేశారు. ఆయన సృతికి అంకితం చేసిన ఈ పాటలను ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులకోసం పూర్తి ఉచితంగా "ఫ్రీ టు ఎయిర్" గా విడుదల చేశారు. ఈ సందర్బంగా జూన్ 4న హైదరాబాద్ జూబ్లీహిల్స్ సినెటేరియా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో "తీరం" సినిమా హీరో శ్రావణ్ వైజిటి, మరో హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, సినెటేరియా నిర్మాత శ్రీలత, సునిల్, అజయ్, ప్రభు ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.


అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, అపర్ణ, క్రిష్టెన్ రవళి నాయికా నాయకులుగా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో  మ్యూజికల్ లవ్ స్టోరీగా అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో   "తీరం" సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని  సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ ద్వారా థియేటర్, డిజిటల్, శాటిలైట్ మరియు ఓవర్సీస్ మార్కెట్లలో సినిమా థియేటర్లు ఓపెన్ అయిన తరువాత విడుదల చేయనున్నారు.


 *ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..* "తీరం 'సినిమాలోని బాలు గారు పాడిన ఏంటీ ప్రేమ'  పాట విన్నాను.. బ్యూటిఫుల్ గా ఉంది. సాహిత్యం పరంగా వేటూరి గారిని, కెమెరా పనితనం పరంగా బాలూమహేంద్ర గారిని, గాత్రం పరంగా బాలూలోని నవయవ్వన మధురస్వరం" మనల్ని మైమరపించేలా ఉంది అని ఆయన తెలిపారు.


 *ప్రముఖ పాటల రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ..* "75 సంవత్సరాల బాలూలోని యువస్వరాన్ని ఆవిశ్కరించింది ఈ తీరం లోని పాట" అన్నారు.. 


 *ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ..* "తీరం సినిమాలో సంగీతం, సాహిత్యం బాలూ గాత్రంలో అమృతమై కురిసిందనీ, ఆ అమృతాన్ని ప్రతిఒక్కరూ ఆస్వాదించాలని" కోరుకుంటూ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. 


 *సంగీత దర్శకులు శ్రీ రఘురాం మాట్లాడుతూ...* "బాలూ గారి స్మృథ్యర్థం ఈ చిత్రంలోని పాటలను" ఆయనకు అంకితం ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయమనీ, ఆ మధురమైన పాట ప్రేక్షకులు హృదయాలలో నిలిచి ఉంటుందని" తెలిపారు.


 *చిత్ర దర్శకుడు, నిర్మాత అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ...* "ప్రముఖ గాయకులు స్వర్గీయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు, తను అనారోగ్యానికి గురికావడానికి మూడు రోజులముందు చెన్నై లోని కోదందపాణి సినీ స్టూడియోలో మా చిత్రం కోసం "ఏంటీ ప్రేమా" అనే పాట పాడారు. ఆ తరువాత మూడురోజులకే ఆయన కొవిడ్ బారినపడి హాస్పిటల్ లో జాయిన్ అయ్యి, ఆతరువాత మనకు అందనంత దూరం వెళ్ళిపోయారు. పాట పాడుతున్నప్పుడు, సంగీతం.. సాహిత్యం ఒకదానికొకటి పోటీ పడ్డాయి అన్నట్లు గా తీర్చి దిద్దారనీ, పాట ఖచ్చితంగా హిట్ అవుతుందని నన్ను అభినందించారు బాలు గారు.  ఆయన మా సినిమా కోసం పాడిన ఈ "ఏంటీ ప్రేమ" పాటతోబాటు, సినిమాలో ఉన్న మిగిలి 8 పాటలను కూడా ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారి దివ్యసృతికి అంకితం ఇస్తున్నాము. అన్ని టెలివిజన్, రేడియో, డిజిటల్ మాధ్యమాలలో ఈ పాటను ఉచితంగా వినేలా "ఫ్రీ టు ఎయిర్" విధానంలో ఈరోజు విడుదల చేస్తున్నామని తెలిపారు.


 *హీరో ప్రశాంత్ వైజిటి మాట్లాడుతూ..* "తీరం సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలోని పాటలు యువతరాన్ని బాగా ఆకట్టుకునెలా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ గా సాగే ఎమోషనల్ లవ్ ప్రేక్షకులను భావోద్వేగానికి  గురిచెయ్యడం ఖాయమనీ, ఈ సినిమా ఖచ్చితంగా యూత్, ప్రేక్షకులను మెప్పించి ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం.. అన్నారు. 


 *హీరోయిన్ క్రిష్టెన్ రవళి మాట్లాడుతూ..* " స్వర్గీయ మహా గాయకుడు స్వర్గీయ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు మా తీరంలో  ఆలపించిన 'ఏంటీ ప్రేమ' పాటలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృస్టం. ఈ సినిమాలో నా పాత్ర పూర్తి స్థాయిలో భావోద్వేగంతో కూడుకుని.. చిలిపిగా ఉంటూనే నటనకు ఆస్కారమున్న పాత్ర చేశాను.. ఇంత మంచి క్యారెక్టర్ డిజైన్ చేసిన అనిల్ గారికి నా స్పెషల్ థాంక్స్.. అన్నారు. 


 *సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని మాట్లాడుతూ..* " ఈ "తీరం" సినిమాను చూశాను.. అత్యద్భుతంగా వచ్చింది. ప్రతి సీను విజువల్ గా అదిరిపోయింది. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన సినిమా ఇది.. అందుకే మా  సినెటేరియా మీడియా వర్క్స్ ద్వారా  లాక్ డౌన్ అయిపోగానే తీరం సినిమాను అత్యధిక థియేటర్స్ లలో గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 

  

 చిత్ర సంగీత దర్శకుడు ప్రశాంత్ బి.జె మాట్లాడుతూ... స్వరీయ ఎస్.పి. బాలు గారితో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. ఏంటీ ప్రేమ పాట రికార్డింగ్ సందర్భంగా శ్రీ ఎస్.పి. బాలూ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు నా జీవితానికి మంచి మార్గాన్ని సూచించాయి.. అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను.. అన్నారు.


 *అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మించిన "తీరం" చిత్రానికి రచన మరియు దర్శకత్వం: అనిల్ ఇనమడుగు, సినెమాటోగ్రాఫర్ మరియు ఎడిటింగ్: శ్రావణ్ జి. కుమార్, సంగీతం ప్రశాంత్ బి.జె. పిఆరోఓ; జిల్లా సురేష్.*