Home » » Ccc vaccination Drive for Film Industry Workers :Megastar Chiranjeevi

Ccc vaccination Drive for Film Industry Workers :Megastar Chiranjeevi



 సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం : మెగాస్టార్ చిరంజీవి


కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిల్మ్  డైరెక్టర్స్  అసోసియేషన్ అధ్యక్షులు  ఎన్ శంకర్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రెటరీ దొరై లతో పాటు పలువురు సినీ టెక్నీషియన్స్ పాల్గొన్నారు.


ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. కరోనా క్రైసిస్ చారిటి కింద ఈ రోజు సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ, ఫిలిం ఫెడరేషన్ వారందరికీ, అలాగే వారితో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్నీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. అలాగే జర్నలిస్ట్ లకు కూడా వాక్సిన్ ఇస్తున్నాం. ఈ రోజు ఈ సిసిసి తలపెట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ పునః ప్రారంభించాం.  ఈ కార్యక్రమానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, అపోలో 24 / 7ల సహకారంతో ఈ వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం అయింది. పునః ప్రారంభం ఎందుకన్నానంటే .. నిజానికి ఇది మూడు వారల క్రితమే మొదలైంది. అయితే వాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఇక  ఈ వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎంతమంది ఉంటె .. అందరికి వాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే వేలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీసం రోజుకు ఐదారు వందల మందికి వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ సందర్బంగా అపోలో వారికీ నా అభినందనలు తెలుపుతున్నా.  అలాగే ఈ కార్యక్రమంలో తప్పకుండా సినిమా కార్మికులు అందరు  పాల్గొనేలా మోటివేట్ చేసిన భరద్వాజ గారికి, ఎన్ శంకర్ , ఫెడరేషన్ ప్రసిడెంట్ అనిల్ గారికి, సెక్రెటరీ దొరై గార్లకు అభినందనలు తెలియచేస్తున్నాను. తప్పకుండా సినీ కార్మికులందరూ వాక్సిన్ తీసుకోవాలి.


ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో గత ఏడాది ఏర్పాటు చేసిన  సీసీ చారిటి విషయంలో భరద్వాజ గారు, ఎన్ . శంకర్, మెహర్ రమేష్, కె ఎల్ ధాముగారు, సి కళ్యాణ్ గారు, బెనర్జీ, సురేష్ ఇలా అందరు దీనికి సహకరిస్తూ ముందుకు తీసుకెలుతున్నారు. ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి సీసీసీ ఆధ్వర్యంలో గత ఏడాది సినిమా కార్మికులకు మూడు సార్లు నిత్యావసర సరుకులు అందచేశాం. సినీ కార్మికులందరిని ఒకే  వేదికపైకి తెచ్చి సీసీసీ ఆధ్వర్యంలో వాక్సిన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నాం. సీసీసీ చారిటి మొదలెట్టినప్పుడు అందరు ముందుకొచ్చి డొనేషన్స్ ఇచ్చారు దానికి తగ్గట్టుగా సీసీసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పైసా కూడా అవసరం ఉన్నవాళ్లకు చేరేలా చర్యలు తీసుకుంటాం.. దానికి నేను భరోసా.  అలాగే తప్పకుండా 18 ఏళ్ళు నిండిన వారంతా వాక్సిన్ తీసుకోవాలి, వాక్సిన్ విషయంలో ఆలోచనలో ఉన్నవారు కూడా ఎలాంటి సంశయం లేకుండా వాక్సిన్ తీసుకోండి. నేను వాక్సిన్ తీసుకున్నాను. తప్పకుండా అందరు వాక్సిన్ తీసుకుని కరోనా రాకుండా  చేద్దాం'  అన్నారు.


Share this article :