అరుణ్ అదిత్ పుట్టిన రోజున డియర్ మేఘ సెకండ్ లుక్ విడుదల చేసిన టీమ్
మేఘా ఆకాష్,అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''డియర్ మేఘ''. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ అవుతున్న ఈ చిత్రానికి ఓటీటీ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్', ''డియర్ మేఘ'' చిత్రాన్ని నిర్మిస్తుంది. అర్జున్ దాస్యన్ నిర్మాత. యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. హీరో అరుణ్ ఆదిత్ పుట్టినరోజు సందర్భంగా ''డియర్ మేఘ'' న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ... హీరో అరుణ్ ఆదిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ''డియర్ మేఘ'' లో అరుణ్ ఆదిత్ పాత్ర సూపర్బ్ గా ఉంటుంది. అరుణ్ ఆదిత్ నటన ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది అన్నారు.
నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ... మా హీరో అరుణ్ ఆదిత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ''డియర్ మేఘ'' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో సహా కంప్లీట్ అయ్యింది. త్వరలో ఓ బిగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద ''డియర్ మేఘ'' విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా ''డియర్ మేఘ''ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ, పీఆర్వో - జీఎస్కే మీడియా. రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి
Post a Comment