Latest Post

Love Story Release Postponed Due to Covid

 


కరోనా తీవ్రత నేపథ్యంలో "లవ్ స్టోరి" సినిమా వాయిదా, మరో మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తాం - చిత్ర యూనిట్


నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా "లవ్ స్టోరి".  దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో "లవ్ స్టోరి" సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ విషయాన్ని తెలిపే ప్రెస్ మీట్ ను హైదరాబాద్ గచ్చిబౌలి ఏఎంబీ థియేటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నాగ  చైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ పాల్గొన్నారు.


*నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ*..."లవ్ స్టోరి" చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేసేందుకు చాలా సంతోషంగా ఎదురుచూశాం. అయితే కొవిడ్ కేసుల పెరుగుదల వల్ల ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మంచి డేట్ చూసి సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.


*దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ*..."లవ్ స్టోరి" సినిమా వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్లో సినిమా ఎప్పుడు చూద్దామా అని వేచి చూశాం. పాండమిక్ తర్వాత వన్ ఇయర్ వేచి చూసి సినిమా విడుదలకు సిద్ధమయ్యాం. రెండు మూడు రోజుల నుంచి కొవిడ్ పరిస్థితి గమనిస్తున్నాం. మేము అనుకున్న ఏప్రిల్ 16వ తేదీకి ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగేలా ఉంది. ఇది అందరూ హ్యాపీగా చూడాల్సిన సినిమా. కొవిడ్ వల్ల వాళ్లంతా థియేటర్లకు రాకపోవచ్చు. డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడాము. సినిమా రెడీగా ఉంది. వీలైనంత త్వరగా చిత్రాన్ని విడుదల చేస్తాం. మొత్తం టీమ్ అంతా ఉత్సాహంగా సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్నాం. మ్యూజికల్ గా "లవ్ స్టోరి" ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. అంతటా పాజిటివ్ వైబ్స్ ఉంది. రైట్ టైమ్ కోసం చూస్తున్నాం. అన్నారు.


*హీరో నాగ చైతన్య మాట్లాడుతూ*...పది రోజుల క్రితం శేఖర్ గారు నాకు సినిమా చూపించారు. "లవ్ స్టోరి" సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చారు, ఏప్రిల్ 16 ఎప్పుడు రాబోతుంది, ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందనే మైండ్ సెట్ లో ఉన్నాను. దురదృష్టవశాత్తూ గత పది రోజుల్లో పరిస్థితి మారిపోయింది. కరోనా అనేది బాగా వ్యాపిస్తూ ఉంది. కాబట్టి అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇలాంటి పరిస్థితిలో సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదు అనుకున్నాం. నా సినిమాలు, శేఖర్ గారి సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసి సక్సెస్ ఇచ్చారు. ఇలాంటి టైమ్ లో ఫ్యామిలీస్ వచ్చి సినిమాను చూస్తాయని ఆశించడం తప్పు. ఆరోగ్యం అనేది ముఖ్యం. పరిస్థితులు బాగుపడ్డాక మంచి డేట్ చూసి మీ ముందుకొస్తాం. "లవ్ స్టోరి" టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ఇంకా చాలా కంటెంట్ సినిమాలో ఉంది. "లవ్ స్టోరి" కంటెంట్ ను నేను చాలా బలంగా నమ్ముతున్నాను. కాస్త ఆలస్యంగా వచ్చినా మంచి కంటెంట్ ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తాననే నమ్మకం ఉంది. ఒక సినిమా పూర్తయ్యాక దాన్ని అలా ఆపి ఉంచాలంటే చాలా ప్యాషన్ కావాలి. అలాంటి ప్యాషన్ ఉన్న మా నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, సునీల్ గారు, పి రామ్మోహన్ గారికి థాంక్స్. కరోనా నిబంధనలు పాటించమని ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.


ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

 

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Street Light Trailer Launched



 స్ట్రీట్ లైట్ ట్రైలర్ అండ్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల 


మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం స్ట్రీట్ లైట్. ఈ చిత్రానికి సంబందించిన లిరికల్ వీడియో సాంగ్ తో పాటు టీజర్ విడుదల కార్యక్రమం బుధవారం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా విచ్చేసిన దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయగా, ట్రైలర్ ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత మోహన్ వడ్లపట్ల తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 


అనంతరం ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ .. సాంగ్ చూసాం .. చాలా బాగుంది.. రామసత్యనారాయణ పాన్ ఇండియా అంటున్నారు.. ఇది హాలీవుడ్ కు వెళ్లినా బాగుంటుందేమో అని నా అభిప్రాయం. నిర్మాత శ్రీనివాస్ మంచి థాట్స్ తో ఈ సినిమా తీశారు.. కానీ సెన్సార్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఇక ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను మించిపోయారు అని చెప్పాలి. అయన ఆలోచనలు ఆ రేంజ్ లో ఉన్నాయి. నిర్మాత శ్రీనివాస్ ఛాంబర్ మనిషిగా, ఎగ్జిబిటర్ గా చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఐతే ఈ సినిమాలో మసాలా ఎక్కువగా ఉంది.. కానీ అది శృతి మించకూడదు అని నా సలహా. ఈ సినిమా చూస్తుంటే చాలా ఫైర్ తో తీసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో నెట్ఫ్లిక్స్ లాంటి వేదికపైకి వెళితే చాలా మంచిది. వాళ్లకు కావలసిన కంటెంట్ ఉంది. ఇక శ్రీనివాస్ గారు యూ ఎఫ్ ఓ, క్యూబ్ లాంటి వాటికి పోటీగా వెళ్లి వాళ్లనే భయపెట్టిన వ్యక్తి. అయన చేసిన పోరాటంతో వాళ్ళు ఆయనను కలుపుకు పోయారు. ఆయనను నిర్మాతలుగా మేము కాపాడలేకపోయాం. ఇక అయన జన్మదినం సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వా కూడా రామ్ గోపాల్ వర్మ ని మించే స్థాయిలో సినిమాలు చేయాలనీ ప్రయత్నం చేసినట్టున్నాడు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం అందుకుని దర్శక నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు. 


తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ .. ఈ సినిమాను చుస్తే చిన్న సినిమాల్లో పాన్ ఇండియా సినిమాగా అనిపిస్తుంది. ప్రభాస్ బాహుబలి తరహాలో ఇదికూడా చిన్న బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. నిర్మాత మామిడాల శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్ గా చాలా మంచి పేరున్న వ్యక్తి. అయన అంటే అందరికి అభిమానం అందుకే పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా మంచి విజయం అందుకుని మామిడాల శ్రీనివాస్ కు డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 


నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ .. నిర్మాత శ్రీనివాస్ అటూ డిస్ట్రిబ్యూటర్ గా మంచి పాపులర్ అయిన వ్యక్తి. ఆయనకు ఎలా సినిమా తీయాలో బాగా తెలుసు. అప్పట్లో యూ ఎఫ్ ఓ, క్యూబ్ లాంటి వారితో పోరాటం చేసిన వ్యక్తి. అయన తీసిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకోవాలి. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి క్రేజ్ రావాలని కోరుకుంటున్నాను అన్నారు. 


ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్ బాబు, అల్లు అరవింద్, రమేష్ ప్రసాద్ లాంటి వారు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ని క్రియేట్ చేసిన తరువాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మామిడాల శ్రీనివాస్ కూడా ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసి వారికంటే తక్కువ రేట్స్ కు సినిమా వేస్తామని చెబితే మొదట్లో చాలా సమస్యలు వచ్చాయి. అయినా వారితో పోరాటం చేసి చివరకు వారందరు కలిసి ఆయనను కలుపుకుపోయారు. అలాంటి గట్స్ ఉన్న నిర్మాత. అయన నిర్మిస్తున్న ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి. అలాగే దర్శకుడు విశ్వ గారు ప్రసాద్ పేరు తీసి నేను రామ్ గోపాల్ వర్మ లేని లోటు తీరుస్తా అనే తరహాలో వచ్చారు. అయన తీసిన ఈ సినిమా తప్పకుండా పెద్ద సంచలనం అవుతుంది. ఏ సినిమాకైనా నిర్మాతకు డబ్బులు రావడం అన్నది ఫైనల్ విషయం. అలాగే ఈ సినిమా విషయంలో శ్రీనివాస్ బిజినెస్ కూడా ముందే చేసి ఉంటాడు.. అంత టాలెంట్ ఉన్న వ్యక్తి అయన. ఈ సినిమాలో కాస్త మసాలా ఎక్కువగా ఉందన్న విషయం అర్థం అవుతుంది. ఏది ఏమైనా ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలు బాగా డబ్బులు రావాలి అన్నారు. 


దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ .. శ్రీనివాస్ గారు డిస్ట్రిబ్యూటర్ గా నాకు బాగా తెలుసు. జనరల్ గా చాలా సినిమాలకు రిటర్న్స్ ఎక్కువగా రావు.. కానీ నేను చేసిన తెనాలి రామకృష్ణ సినిమాకు రిటర్న్స్ ఇచ్చిన వ్యక్తి.. అయన నిజాయితీ అక్కడ కనిపించింది. ఈ సినిమాలో కాస్త మసాలా ఎక్కువైంది అని అనిపిస్తుంది. ముక్యంగా సినిమాని తీసిన దర్శకుడు ఇంతకు ముందు భార్య అనే సినిమా చేసాడు.. ఆ సినిమా ఇచ్చిన ప్లాప్ వల్ల వచ్చిన కసితో ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అందుకే మసాలా బాగా దట్టించాడు. ఈ సినిమాకు కాస్త స్టాండర్స్ మైంటైన్ చేసిఉంటే మరో రేంజ్ కి వెళ్ళేది. ఏది ఏమైనా ఓ మంచి ప్రయత్నంతో సినిమా చేస్తున్న శ్రీనివాస్ కు ఈ సినిమా సక్సెస్ అయి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. 


చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ .. ఈ సినిమా జోనర్ గురించి పెద్దలు మాట్లాడారు.. నేను చెబుతున్నాను .. ఇది కచ్చితంగా మెసేజ్ ఇచ్చే సినిమా. ఇందులో కంటెంట్ అలాంటిది కాబట్టి అలా చూపించాం. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి అన్న నేపథ్యంలో ఈ సినిమా తీసాం .. చీకట్లో జరిగే ముక్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం 'రివెంజ్ డ్రామా' ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా తీర్చి దిద్దామ్. అలాగే క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది అన్నారు. 


నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ .. సి కళ్యాణ్ గారికి, దాము గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, ప్రసన్న గారికి, రామసత్యనారాయణ గారికి, ధన్యవాదాలు తెలుపుతున్నాం.. కరోనా అయిపోయాకా సెప్టెంబర్ లో సినిమా మొదలెట్టి డిసెంబర్ వరకు పూర్తీ చేసాం.. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను తీసాం. దర్శకుడు విశ్వ ప్రసాద్ చాలా కష్టపడ్డారు. ఆయనకు కాలు నొప్పి ఉన్నా కూడా నిర్మాత షెడ్యూల్ విషయంలో నష్టపోవద్దు అంటూ రిస్క్ చేసి మరి షూటింగ్ చేసారు. అందుకు ఆయనకు థాంక్స్ చెప్పాలి, అలాగే పక్కా ప్లానింగ్ తో సినిమా చేసాం.. ఇప్పటికే బిజినెస్ పరంగా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ తాన్యా దేశాయ్ అద్భుతంగా చేసింది. అలాగే సీనియర్ వినోద్ కుమార్, చిత్రం శ్రీను, ధన్రాజ్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు . తప్పకుండా ఈ సినిమాను మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు. 


హీరోయిన్ తాన్యా దేశాయ్ మాట్లాడుతూ .. మా నిర్మాత కు హ్యాపీ బర్త్ డే.. అలాగే దర్శకుడు విశ్వా గారికి థాంక్స్ చెప్పాలి. ఈ పాత్రకు నన్ను ఎంపికచేసినందుకు. లిరికల్ వీడియో చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా చూసి అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అన్నారు. 



నటీనటులు : 


తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ , చిత్రం శ్రీను, ధన్రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం తదితరులు నటించారు.


ఈ చిత్రానికి 


దర్శకత్వం : విశ్వ

నిర్మాత: మామిడాల శ్రీనివాస్ 

సినిమాటోగ్రఫీ : రవి కుమార్, 

మ్యూజిక్ : విరించి, 

ఎడిటర్ : శివ, 

ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్, 

ఫైట్స్ : నిఖిల్, 

కొరియోగ్రాఫి : పాల్ మాస్టర్, 

స్టూడియో : యుఅండ్ఐ.

Telugu Film Chamber of Commerce Thanked Ap Cm



ఎపి సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 


కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లకు సంబంధించి విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన 6 నెలల ఫిక్స్డ్ కరెంట్ చార్జీలను తక్షణమే చెల్లించకుండా వాయిదాలలో చెల్లించేలా. అలాగే ఏ , బి సెంటర్ థియటర్స్ వారు తీసుకున్న 10 లక్షల రూపాయల ఋణం, మరియు సి సెంటర్స్ వారు తీసుకున్న 5 లక్షల ఋణం పై ఉన్న వడ్డీ ని యాభై శాతం మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు నిజంగా భారీ ఊరట లభించనుంది. ఈ నిర్ణయం ప్రకటించడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు తెలుగు పరిశ్రమ, ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు తెలియచేసింది. ఈ సందర్బంగా బుధవారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 


చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కె ఎల్   దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ .. కరెంట్ చార్జీలు, వడ్డీ రాయితీలను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఆనందాన్ని కలుగచేస్తుంది. కరోనా కష్టాల్లో ఉన్న సినిమా పరిశ్రమను, సినీ డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కు ఈ సందర్బంగా  తెలుగు ఫిలిం ఆఫ్ ఛాంబర్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము 9నెలలు కరెంట్ చార్జీలు రద్దు అడిగాము. ప్రభుత్వం 3నెలలు రద్దు చేస్తూ జీవో ఇచ్చారు. మిగతా నెలలు కూడా రద్దు చేస్తారని ఆశిస్తున్నాము, సినిమా ఇండస్ట్రీ కి ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం ఈ జీవో కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతున్నాం అన్నారు. 


ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసిడెంట్ సి కళ్యాణ్ మాట్లాడుతూ: సిని ఇండస్ట్రీ ప్రతినిధులు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి గారిని జూన్ లో కలిసాము. ఎపి లో సినిమాల షూటింగ్స్ కోసం అక్కడ పర్మిషన్ కావాలని చిరంజీవి , నాగార్జున, రాజమౌళి, నేను, దామోదర్ గారు ఇలా చాలా మందిమి వెళ్లి కలిసాం. జగన్ గారు కూడావై ఎస్ తరహాలోనే ఏ నిర్ణయం అయినా వెంటనే చెప్పేస్తారు. అప్పుడు సినిమా థియేటర్స్ మూసివేస్తే రన్ లేకుండా మూసి వేసి ఉంటె మినిమమ్ చార్జీలు  అని చెప్పి కోరడం జరిగింది. థియేటర్స్ ఓపెన్ అయేవరకు వాటిని తీయించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇపుడు మూడు నెలలకు మాత్రమే ఇచ్చారు.  జగన్ గారిని మరోసారి కోరతాం , మాకు ఇక్కడ ఇద్దరు తండ్రులు.. వారిద్దరిని కలుపుకుని ముందుకువెళ్తున్నాం. మళ్ళీ కరోనా కష్టాలు మొదలయ్యాయి. జగన్ గారు ముందే గ్రహించి చెప్పారు. దాంతో మనం జర్నీ చేయాలనీ, అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని థియటర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు మాకు అందిస్తున్న సపోర్ట్ విషయంలో ఆనందంగా ఉంది. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వైజాగ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉందని, ముక్యంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీం అది. దానికి సంబందించిన అన్ని విషయాలు పరిశీలిస్తున్నాం. మన పనులు జరగాలంటే ఇక్కడ ఉండి చేస్తే కుదరదు.. అక్కడికి వెళ్లి మన పనులు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలి. జగన్ గారి కుటుంబం కూడా సినిమా రంగంతో అనుబంధం ఉంది.. గతంలో మీరు డిస్ట్రిబ్యూటర్ గా చేసారు. మనమంతా ఒకటే కుటుంబం కాబట్టి సినిమా పరిశ్రమ విషయంలో మీ సపోర్ట్ ఇంకా అవసరం. అలాగే ఈ విషయంలో సపోర్ట్ చేసిన వారికీ కూడా నా ధన్యవాదాలు అన్నారు. 


ఫిలిం ఛాంబర్ గౌరవ సంయుక్త కార్యదర్శి జి వీర నారాయణ్ బాబు మాట్లాడుతూ : ఎపి ముఖ్యమంత్రి జగన్ గారికి, పేర్ని నాని గారికి, అలాగే విద్యుత్ శాకా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ విషయంలో చాలా సార్లు మాట్లాడాము. ఈ విషయంలో అయన తప్పకుండా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మూడు నెలలకు మాత్రమే ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మిగతా నెలలకు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసిన జగన్ గారికి, పేర్ని నాని గారికి ప్రత్యేకంగా సినిమా పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ముందు ముందు కూడా సినిమా పరిశ్రమకు ఇలాగె సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అన్నారు. 


ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. మార్చ్ 25 నుండి డిసెంబర్ 25 వరకు సినిమా పరిశ్రమ మొత్తం క్లోజ్ అయింది. ఈ తొమ్మిది నెలలకు విద్యుత్ చార్జీలను రద్దు చేయాలనీ అడిగాం.. కానీ వాళ్ళు మూడు నెలలకు రద్దు చేస్తూ జీవో విడుదల చేయడం ఆనందంగా ఉంది. భవిష్యత్తోలో అది కూడా పరిశీలిస్తారని ఆశిస్తున్నాం.. అలాగే షూటింగ్ లొకేషన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. తెలుగు నిర్మాతల మండలి కోసం ల్యాండ్స్ కూడా ఇస్తామని అన్నారు.. ఆ విషయం పై స్పందించి ల్యాండ్స్ విషయంలో కూడా పరిశీలన జరుగుతుంది అని చెప్పారు విజయ్ చందర్ గారు వెంటనే స్పందించి సినిమా పరిశ్రమకు కలవాల్సిన విషయాలన్నీ దగ్గరుండి చూసుకోవడం, అయన ఎప్పుడు నేనున్నాను అన్న తరహాలో మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. 


ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్  వైస్ ప్రసిడెంట్ ముత్యాల రాందాస్, జాయింట్ సెక్రెటరీ సి భరత్ చౌదరి, నిర్మాతల సెక్టార్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శి  మోహన్ వడ్లపట్ల , ట్రెజరర్ టి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Samhari Audio Released

 


సంహారి  ఆడియో విడుదల

శ్రీ తుల్జా భవాని గ్రూప్స్ మూవీ మేకర్స్ పతాకం పై కె. రవి కుమార్ రాణా  మరియు నేహా శ్రీ  హీరో హీరోయిన్ గా లక్ష్మి కేతావత్ మరియు రేణుక కేతావత్ సమర్పణలో కె. రవి కుమార్ రాణా  స్వయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం "సంహారి". ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల ఈరోజు ఘనంగా జరిగింది. ఈ ఆడియో రిలీజ్ వేడుకకి లయన్ సాయి వెంకట్, నాయి కోటి రాజు, గురు చరణ్ మరియు బైలాంపుడి నిర్మాత బ్రహ్మానంద రెడ్డి  ముఖ్య అతిధులుగా విచ్చేసి సంహారి ఆడియో ను విడుదల చేసారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ 


లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ "సంహారి సినిమా ట్రైలర్ మరియు పాటలు చాలా బాగున్నాయి. ఈ చిత్రం మ్యూజికల్ గా మంచి హిట్ అవుతుంది అని నమ్మకం నాకుంది. హీరో దర్శకుడు నిర్మాత రవి కుమార్ రాణా ఎంతో ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం మంచి విజయం సాదించాలి అని కోరుకుంటున్నాను" అని తెలిపారు. 


సంగీత దర్శకుడు రాజ్ కిరణ్  మాట్లాడుతూ "సంహారి లో నాలుగు పాటలు ఉన్నాయి. అని పాటలు చాలా మంచిగా కుదిరాయి. మంచి పాటలే కాదు చిత్రీకరణ కూడా బాగుంది. మా నిర్మాత హీరో రవి కుమార్ గారు మంచి డబ్బుతో సంహారి ని నిర్మించారు. చిత్రం చాలా గొప్పగా ఉంటుంది. కొత్త కథ అందరికి నచ్చుతుంది" అని తెలిపారు. 


హీరో నిర్మాత దర్శకుడు రవి కుమార్ మాట్లాడుతూ "మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు మా చిత్రానికి ప్రాణం పోశారు. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే పిచ్చి ఎలాగైనా సినిమా లో నటించాలి అని కోరిక ఉండేది. ఈరోజు నా కోరిక తీరింది. ఇది డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది. త్వరలోనే విడుదల చేస్తాం" అని తెలిపారు. 


నాయి కోటి రాజు మాట్లాడుతూ "హీరో రవి ఫస్ట్ టైం సినిమా చేసాడు. పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. రవి హీరో గా బాగా చేసాడు. సినిమా మంచి విజయం సాదించాలి" అని కోరుకున్నారు. 



సినిమా పేరు : సంహారి


నటి నటులు : కె. రవి కుమార్ రాణా, నేహా శ్రీ 


కెమెరా మాన్  : అంజి బాబు, కృష్ణ నాయుడు 


సంగీతం : రాజ్ కిరణ్ 


ఎడిటింగ్ : వంశీ పెళ్లూరి 


ఫైట్స్ : అశోక్ రాజ్ 


పి అర్ ఓ : పాల్ పవన్ 


డాన్స్ మాస్టర్ : ఉమా శంకర్, మనోజ్ పెద్ది 


కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : కె. రవి కుమార్ రాణా


AMAZON PRIME VIDEO ANNOUNCES JATHI RATNALU PREMIERE

AMAZON PRIME VIDEO ANNOUNCES EXCLUSIVE DIGITAL PREMIERE OF CRITICALLY ACCLAIMED TELUGU COMEDY- JATHI RATNALU

 


Prime members in India and across 240 countries and territories can stream the film starting 11th April

 

Written and directed by Anudeep KV, the film is produced by Nag Ashwin under Swapna Cinema and features superstar Naveen Polishetty, Priyadarshi and Rahul Ramakrishna in lead roles.

 

MUMBAI, India, April 7, 2021: Amazon Prime Video today announced the exclusive digital premiere of blockbuster comedy film Jathi Ratnalu. The film features Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna in pivotal roles. The film which released theatrically last month went on to become a massive hit and was loved by fans and critics alike. Prime members in India and across 240 countries and territories can catch the digital premiere of this hilarious misadventure starting April 11. Jathi Ratnalu also stars Faria Abdullah, Murali Sharma, Brahmanandam and Naresh in supporting roles.

 

Written and directed by Anudeep KV and produced by Nag Ashwin under Swapna Cinema, this mad-cap comedy revolves around the lives of three friends – Srikanth (Naveen Polishetty), Sekhar (Priyadarshi) and Ravi (Rahul Ramakrishna), who head from Jogipet to Hyderabad in pursuit of 'king-size lives'. However, things take a drastic turn as they tumble into a series of dangerous events brewing in the city. 

 

Vijay Subramaniam, Director and Head, Content, Amazon Prime Video, India said, “We’ve always valued our relationship with Swapna Cinema who have a natural instinct for compelling stories and Jathi Ratnalu is another shining example. We are glad to have the opportunity to bring one of the finest comedy films in recent times to Prime members in India and across 240 countries and territories this month, giving our customers with the choice of enjoying this latest Telugu blockbuster movie from the safety and comfort of their homes, not just in India but across the globe.”

"While writing the script, I wondered how we were going to pull it off, but once Naveen, Rahul and Darshi were onboard, I knew this film would go on to be a blockbuster at the box office. But not at this scale. We didn’t expect that," laughed Director Anudeep KV. 


He added, "Without focusing on anything but humour, we went about writing and making Jathi Ratnalu as engaging as possible. The movie's real charm lies in the lead characters, their effortless and innocent humour; and how they manage to wriggle out of weird situations. The film is inspired by my personal life and experiences. While making the film, the only thought that was running in our minds was to entertain the audience and we are absolutely delighted to see their response. I hope with the film’s digital premiere on Amazon Prime Video, not just Telugu viewers but a global audience will watch and enjoy our film."


Sharing his excitement ahead of the film's digital premiere, actor Naveen Polishetty shared, "Working with Nag Ashwin on his maiden production and writer-director Anudeep KV for Jathi Ratnalu was like a homecoming for me. We have known each other for a long time and we share an incredible bond. When I heard the script for the first time, I completely burst into laughter. That very reaction drove me to be a part of this amazing journey. As more and more talent were involved in the film, it indeed became an incredible experience for me, and for us altogether. The film is a complete laughter riot that will take the audiences on a roller-coaster ride of non-stop entertainment. I am excited and looking forward to the film's premiere on Amazon Prime Video for a global audience."


Talking ahead of the digital premiere of Jathi Ratnalu on Amazon Prime Video, Producer Nag Ashwin said, "With no logic and only magic, Jathi Ratnalu is a 2 hour hilarious drama that will keep you on the edge of the seat laughing or maybe even falling on the floor sometimes. It is a film that purely focuses on humour. In recent times, we truly haven’t had such a film and I believe with Amazon Prime Video we are bound to reach movie and comedy lovers, not just in India but across the world.”


Synopsis:

A hilarious misadventure of three buddies as they travel from Jogipet to Hyderabad in search for king size lives, instead tumble into a series of dangerous events brewing in the city. Jathi Ratnalu is the deadliest comedy you can see.


https://twitter.com/primevideoin/status/1379682884617838602?s=21p

Nenu Leni Naa Prema Kadha All Set to Release

 


Much awaited entertainer ... 


‘’NENU LENI NAA PREMA KADHA”


All set to release!!!


The upcoming film, ‘’NENU LENI NAA PREMA KADHA” starring Naveen Chandra, 

Gayatri R Suresh , 

Krish Siddipalli and 

Aditi mykala 

in lead roles, has wrapped the shooting and is all set to release. 


Suresh Utharadhi has helmed this youthful and interesting entertainer which is bankrolled by KALYAN KADUKURI, NIMMAKAYALA DURGA PRASAD REDDY, 

Dr.A.BHASKAR RAO under the banners THRISHALA ENTERTAINMENTS, S.S STUDIOS and SARASWATI CREATIONS.


‘’NENU LENU NAA PREMA KADHA”,  the film with new subject and storyline has been shot in natural and beautiful locations. Recently, the film unit has wrapped up the shoot for song sequences. Juevin Singh has composed music. Prominent editor Prawin Pudi, senior DOP Boopathy have contributed a lot in getting a quality output. 

Dialogue writer SABEER SHA has added heartfelt dialogues to the movie ,and also Three songs wrote by famous lyric writer RAMBABU GOSALA ! 


Producer - KALYAN KADUKURI said, after seeing the amazing output, the UFO got impressed and has tie up with us as a distribution partner. 


Soon, the details pertaining to triler , audio function and movie release date will be announced.

Cherasala Movie Teaser Launch

 


"చెరసాల" టీజర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకులు యస్వీ కృష్ణా రెడ్డి


ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? అనే కథాశంతో  ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమే "చెరసాల". ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ ,రామ్ ప్రకాష్ గుణ్ణం, నిష్కల, శిల్పా దాస్ హీరో, హీరోయిన్లుగా

రామ్ ప్రకాష్ గుణ్ణం దర్శకత్వంలో మద్దినేని సురేష్ సుధా రాయ్ లు నిర్మిస్తున్న చిత్రం "చెరసాల".ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ను విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు "చెరసాల" టీజర్ ను విడుదల చేశారు , ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు "చెరసాల"చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. నిర్మాత ఆచంట గోపీనాథ్, బసి రెడ్డిలు "చెరసాల" చిత్రంలోని పాటలను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన  పాత్రికేయుల సమావేశంలో


 ఎస్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్ర టీజర్ ను నేను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కెమెరామెన్ దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. సినిమా మేకింగ్ చాలా బాగుంది .నిర్మాతలు దర్శకుడికి ఫ్రీడం ఇవ్వడం వలన సినిమా ఇంత బాగా వచ్చింది. దర్శక,నిర్మాతలు నాకీ సినిమాను చూయించారు. సినిమా చాలా బాగుంది.త్వరలో విడుదల అవుతున్న ఈ చిత్రం దర్శక, నిర్మాతలకు  పెద్ద విజయం సాధించి మంచిపేరు తో పాటు,డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నానని అన్నారు


 ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను కొత్త వారైనా చాలా బాగా చేశారు.గత పది సంవత్సరాలుగా చిత్ర దర్శకుడు కెమెరామెన్ గా చేస్తూ 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకొని తనే కథ తయారు చేసుకుని దర్శకుడికి మారడం చాలా మంచి శుభ పరిణామం.ఇది తనకు మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. ఈ మధ్య నిర్మాతలు కొత్త దర్శకులకు అవకాశం కల్పించి వారిలో ఉన్న ట్యాలెంట్ కు అవకాశం కల్పిస్తున్నారు. అలా కొత్తవారిని ఎంకరేజ్ చేసిన ఈ చిత్ర నిర్మాతలు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి.మంచి కంటెంట్ తో వస్తున్న హర్రర్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా "చెరసాల" చిత్రం ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.


 ప్రముఖ నిర్మాత ఆచంట గోపీనాథ్, బసిరెడ్డి లు మాట్లాడుతూ .. ఈ మధ్య వస్తున్న హర్రర్ సినిమాలన్నీ చిన్న సినిమాలుగా విడుదలై మంచి విజయం సాధించి పెద్ద సినిమాల సరసన చేరుతున్నాయి.త్వరలో విడుదల అవుతున్న ఈ "చెరసాల" సినిమా కూడా గొప్ప విజయం సాధించి పెద్ద సినిమాల సరసన చేరాలని కోరుతూ చిత్ర యూనిట్ కు అభినందనలు  తెలియజేశారు.


 చిత్ర దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ..  ఎస్వి కృష్ణారెడ్డి, ప్రసన్నకుమార్, గోపీనాథ్, బసిరెడ్డి లాంటి పెద్దలు మా సినిమాను బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి మా కృతజ్ఞతలు.చిన్నప్పటినుంచి స్కూల్ కన్నా సినిమాల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది.స్టడీస్ తరువాత పేరెంట్స్ సినిమాలపై నాకున్న ఇంట్రెస్ట్ ను గమనించి నాకు సపోర్ట్ గా నిలిచారు. సినిమా పై ఉన్న ఇంట్రెస్ట్ తో  నేను ఇండస్ట్రీ లోకి రావడానికి చాలా  ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ గా జాయిన్ అయ్యిన నేను గత పది సంవత్సరాలుగా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ.. 24 క్రాఫ్ట్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుని ఇండస్ట్రీలో నాకంటూ ఒక చిన్న గుర్తింపు ఉండాలనే తపనతో..ఈ కథ రాసుకోవడం జరిగింది ఈ కథను ప్రొడ్యూసర్ సురేష్ మాదినేని గారికి స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఇంప్రెస్ అయి వెంటనే షూటింగ్ మొదలు పెట్టమని చెప్పారు.దాంతో ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తూ దర్శకుడిగా, నటుడిగా కూడా ఈ చిత్రంలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మేము ఈసినిమా కోసం కరొనా టైంలో స్ట్రగుల్ ఫేస్ అయినా ఈ సినిమా విడుదల తో మాకు హ్యాపీ ఎండింగ్ అవుతుందని ఆశిస్తున్నాను.ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? అనే తాట్ తో ఈ సినిమా చేయడం జరిగింది. దీంట్లో ఎంటర్టైన్మెంట్తో పాటు అందరికీ నచ్చే విధంగా సైలెంట్ కామెడీ వి జోడించి చేయడం జరిగింది. నేను ఈ సినిమాను ఒక డైరెక్టర్ పాయింటాఫ్ వ్యూలో కాకుండా ఒక ఆడియన్ కు ఏది నచ్చుతుంది,ఏది నచ్చదో తెలుసుకొని ఆడియన్స్  పాయింటాఫ్ వ్యూలో అందరికీ నచ్చేలా ఈ సినిమా తీయడం జరిగింది.ఈ సినిమా విడుదల కోసం మేంమంతా క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నాము. ప్రేక్షకులందరూ మా సినిమాను  ఆదరించి ముందుకు తీసుకెళ్తే న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేసినవారవుతారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న "చెరసాల" సినిమా అందరికీ తప్పక నచ్చుతుందని

 అని అన్నారు


 చిత్ర నిర్మాత సుధారాయ్ మాట్లాడుతూ.. రామ్ ప్రకాష్ కెమెరామెన్ అయినా తను చెప్పిన కథకు ఇంప్రెస్స్ అయి ఈ మూవీ చేస్తున్నాము.బ్యూటీఫుల్ లోసెషన్స్ లలో తీసిన ఈ సినిమా మేము అనుకున్న దానికంటే చాలా చక్కగా వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో మీ ముందుకు వస్తున్న మా సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు.



 చిత్ర హీరో సుజిత్ మాట్లాడుతూ ..చరసాల సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.బెంగళూరు నుంచి వచ్చి చేస్తున్న నా మొదటి తెలుగు సినిమా "చెరసాల" .కొత్త వాళ్లమైన మాపై నమ్మకం పెట్టి ఇందులో నటించే అవకాశం .ఇలాంటి మంచి సినిమాలో ఛాన్స్ దొరకే  అదృష్టం కల్పించారు దర్శకనిర్మాతలు వారికీ నా కృతజ్ఞతలు. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను.ఈ సినిమాలో నేను లీడ్ రోల్ ప్లే చేసినా కానీ కంటెంటే హీరో .మేమంతా ఈ కంటెంట్ ని దృష్టిలో పెట్టుకొనే నటించడం జరిగింది. ఈ సినిమా అన్ని వర్గాల వారికి

నచ్చే ఫుల్ ప్యాకేజ్డ్ మూవీ అని కచ్చితంగా చెప్పగలను.ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు



 హీరోయిన్ నిష్కల మాట్లాడుతూ.. నేను కన్నడ, తమిళ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించాను . తెలుగులో నేను చేస్తున్న మొదటి సినిమా "చెరసాల".ఇందులో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు.ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలు ధన్యవాదాలు అని అన్నారు.


 హీరోయిన్ శిల్పా దాస్ మాట్లాడుతూ.. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నేను ప్రస్తుతం కన్నడలో హీరోయిన్ గా ఒక మంచి చిత్రంలో నటిస్తున్నాను. మొదటిసారి తెలుగు సినిమాలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.


 సంగీత దర్శకుడు శంకర్ తమిరి మాట్లాడుతూ..

ఈ సినిమాలోని పాటలు స్విచ్ వేషన్ తగ్గట్లు వస్తాయి.దర్శకుడు అనుకున్న దానికంటే ఇందులోని పాటలు చాలా చక్కగా వచ్చాయి. త్వరలో విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొని మా చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని చూసి మమ్మల్ని, మా టీంను ఆదరించి ఆశీర్వదించాలని కోరుకొంటున్నామని తెలిపారు.


 నటీనటులు

సుజిత్, రామ్ ప్రకాష్ గుణ్ణం, నిష్కల, శిల్పా దాస్


 సాంకేతిక నిపుణులు

ప్రొడక్షన్స్ :- ఎస్ రాయ్ క్రియేషన్స్

ఫిలిం జనరల్ :- కామెడీ, లవ్ అండ్ ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా

మూవీ నేమ్ :- చెరసాల

సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ :- రామ్ ప్రకాష్ గుణ్ణం

ప్రొడ్యూసర్ :- మద్దినేని సురేష్, సుధా రాయ్

స్టోరీ అండ్ డైలాగ్స్ :- ఫణీంద్ర భరద్వాజ్

మ్యూజిక్ డైరెక్షన్ :- శంకర్ తమిరి

పి.ఆర్.ఓ :- సాయి సతీష్ - రాంబాబు పర్వతనేని

Trailer of aha’s Tamannaah-starrer 11th Hour gets great response!


 Trailer of aha’s Tamannaah-starrer 11th Hour gets great response!



The trailer of the much-anticipated aha original web series 11th Hour starring Tamannaah Bhatia in the lead as businesswoman Aratrika Reddy was launched at a grand event in Hyderabad on Tuesday evening. And the response has surely been overwhelming.


With a narrative that takes you through the famous bedtime tale Little Red Riding Hood, which is used as a narrative tool, we see Tamannaah waging a boardroom battle with all the odds being against her. Tamannaah as boss lady Aratrika leaves a striking mark.


The trailer of the 8-episode web series which is high on intensity, drama and thrilling sequences unfolds the fight of a ferocious woman in a man’s world in an attempt to save Aditya Holdings within 12 intriguing hours. The two-minute trailer showed glimpses of popular stars Adith Arun, Vamsi Krishna, Vikram Aditya, Shatru, Roshni Prakash, Abhijeeth Poondla, Madhusudhan Rao, Jayaprakash, Pavithra Lokesh in action.


Written and produced by Pradeep Uppalapati of Introupe films and directed by National Award Winning filmmaker Praveen Sattaru, 11th Hour will premiere on April 9.


 Trailer link: 


http://watch.aha.video/11thHourTrailer




Cast:


Tamannaah


Arun Adith


Vamsi Krishna


Roshni Prakash


Abhijeeth Poondla


Shatru


Madhusudhan Rao


Jayaprakash


Pavithra Lokesh


Anirudh Balaji


Mahathi


Vinay Nallakadi


Srikanth Iyengar


Priya Banerjee


 


Crew:


 


Pradeep Uppalapati - Producer


Praveen Sattaru- Director


Mukesh G- DOP


Dharmendra Kakarala


Bharatt-Saurabh- Music Director

Most Eligible Bachelor-Akhil Birthday Poster Launched

 


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా నుంచి అఖిల్ అక్కినేని బర్త్ డే పోస్టర్ విడుదల..


అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ఎప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే పోస్టర్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో అఖిల్ చాలా స్టైలిష్ లుక్‌తో పాటు నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోకు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే  గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌.. మొన్న విడుదలైన ఏ జిందగీ పాటకు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంలో ఇప్పుడు బర్త్ డే పోస్టర్ కూడా విడుదల చేసారు. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు.

న‌టీ న‌టులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
పీఆర్ఓ - ఏలూరు శ్రీను
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  
దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

RGV Dayyam Trailer Released on RGV birthday



రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా "Rgv దెయ్యం" ట్రైలర్ రిలీజ్


నిత్యం వివాదాలతో సావాసం చేసే రామ్‌ గోపాల్‌వర్మ రాత్’, ‘కౌన్’, ‘భూత్’, ‘ఫూంక్’ చిత్రాలతో భారతదేశంలో హర్రర్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ .మళ్ళీ ఇప్పుడు ‘Rgv దెయ్యం’ అనే కొత్త దెయ్యం కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ,హిందీ 5  భాషలలో విడుదలకు సన్నాహాలు చేసుకొంటుంది.కాగా రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా "Rgv దెయ్యం" ట్రైలర్ ను  రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా


 చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా "Rgv దెయ్యం" ట్రైలర్ ను విడుదల చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము. ఆయన తీసిన ఈ సినిమా అద్బుతంగా వచ్చింది.ఈ సినిమాను ఈ నెల 16 న విదుడల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము ? నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. RGV మార్క్ ఉంది కాబట్టి.చిత్ర ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ చూస్తుంటే రాజశేఖర్ కూతురి పాత్రలో నటించిన స్వాతి దీక్షిత్ యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి..అలాగే రాజశేఖర్ తన పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లో  నటిస్తుండటం విశేషం. చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న Rgv "దెయ్యం" చిత్రాన్ని 5 భాషలలో తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము ?.అలాగే ఈ చిత్రం అందరికీ నచ్చడంతో పాటు సినిమాను చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.



 తారాగణం :

రాజశేకర్, స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు


 సాంకేతిక నిపుణులు

సినిమా పేరు: దెయ్యం

దర్శకుడు: రామ్‌గోపాల్ వర్మ

లైన్ నిర్మాతలు: కొమ్మురి ప్రేమ్‌సాగర్, జె సాయి కార్తీక్ గౌడ్

ఎడిటర్: సత్య, అన్వర్

డి.ఓ.పి: సతీష్ ముత్యాల

సంగీతం: డిఎస్ఆర్

ప్రొడక్షన్ ఇంఛార్జ్: కె రూపేష్

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

 

Producer Dil Raju Interview About Vakeel Saab




 "వకీల్ సాబ్" ఫస్ట్ షో పడగానే ఇది నెక్ట్ లెవెల్ సినిమా అని తెలిసిపోతుంది - నిర్మాత దిల్ రాజు


పలు సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు. 50 చిత్రాల నిర్మాణ ప్రయాణం ఆయనది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాను నిర్మించి తన కల నెరవేర్చుకున్నారు దిల్ రాజు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా చిత్ర విశేషాలను దిల్ రాజు వివరించారు. దిల్ రాజు మాట్లాడుతూ........


- నాకున్న డ్రీమ్ ప్రకారం పవన్ గారితో వకీల్ సాబ్ సినిమా చేశాను. డ్రీమ్ ట్రూ అయ్యింది కాబట్టి నాలో ఇప్పుడున్నది తృప్తి, వకీల్ సాబ్ విజయం సాధిస్తే, ఆడియెన్స్ వావ్ అంటే అప్పుడు సంతోషం వస్తుంది..బ్యూటిఫుల్ జర్నీ ఇది. ఈ చిత్రాన్ని ఫాస్ట్ గా తీసి రిలీజ్ చేయాలని అనుకున్నాను. 2019 డిసెంబర్ లో మొదలు పెట్టాం. 2020 లో రిలీజ్ చేద్దామనుకున్నాం. లాక్ డౌన్ రావడం వల్ల పరిస్థితి మారిపోయింది. వన్ ఇయర్ హోల్డ్ చేసి అదే ఎనర్జీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇవాళ కూడా పవన్ గారిని కలిశాను. మా జర్నీ ఇంకో లెవెల్ కి పెరిగింది. 


- నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ఇది. నాకు సినిమా మీదున్న ప్యాషన్ వేరే వాళ్లు చెప్పడం వేరు పవన్ గారు స్వయంగా సినిమా మేకింగ్ లో చూశారు కాబట్టి నా గురించి చెప్పారు. స్టార్ హీరోలు నిర్మాతకు సినిమా ఇచ్చాక స్క్రిప్ట్, షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్, ప్రమోషన్ ఎలా చేస్తున్నారు. రిలీజ్ ఎలా చేస్తున్నారు. అనేది చూస్తారు. స్టార్ హీరోలకు లిమిటేషన్ ఉంటుంది. షూటింగ్ లో ప్రాబ్లమ్ వస్తుంటాయి. దర్శకుడు, హీరోకు ఒత్తిడి రాకుండా సినిమాను కంప్లీట్ చేయడం పెద్ద టాస్క్. మాకూ కోపాలు వస్తాయి. అరుస్తాం. కానీ అదంతా సినిమా మేకింగ్ లో భాగమే


- పవన్ గారితో సినిమా చేయాలనుకోవడానికి కారణం. తొలి ప్రేమ టైమ్ లో నేను చూసిన క్రేజ్, స్టార్ డమ్ ఇవన్నీ నా మనసులో గట్టి ముద్ర వేశాయి. పవన్ తో సినిమా చేయాలనేది వకీల్ సాబ్ తో తీరింది. వకీల్ సాబ్ సినిమా నా కెరీర్ లో ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది రేపు రిలీజ్ అయ్యాకే. ఘన విజయాన్ని బట్టి చెప్తాను. ఒక మ్యాజిక్ జరగబోతోంది అని వకీల్ సాబ్ బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది. పవన్ గారు నాతో షేర్ చేసుకున్న విషయాలు నా గురించి. అవి నా మనసులో దాచి పెట్టుకున్నాను. 22 సంవత్సరాల డ్రీమ్ తో పాటు నాకు ఒక అదనపు సంతోషం దొరికింది.


- వకీల్ సాబ్ కు ముందు ఇద్దరు ముగ్గురు దర్శకులను అనుకున్నాం. అప్పటికి అల్లు అర్జున్ తో శ్రీరామ్ వేణు సినిమా చేయాల్సి ఉంది. అల్లు అర్జున్ సినిమాలు లాక్ డౌన్ వల్ల ముందుకు జరుగుతూ వచ్చాయి. అలా ఆ సినిమా లేట్ అవుతుంది కదా అని వకీల్ సాబ్ చేయమని చెప్పాం. 


- కథను ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా హీరో ఇమేజ్ కు తగినట్లు వకీల్ సాబ్ ఉంటుంది. పింక్ రీమేక్ అనగానే ఇలాంటి సాఫ్ట్ సినిమా ఎందుకు అని చాలా మంది అడిగారు. మేము సినిమా చేస్తున్నాం కాబట్టి అందులో ఏముంటుందనేది మాకు బాగా తెలుసు. ఫార్ములా చెడిపోకుండా, పవన్ గారి ఇమేజ్ కు తగినట్లు శ్రీరామ్ వేణు కథనంపై బాగా కసరత్తు చేశాడు. కథతో పాటు హీరోయిజం హై చేసుకుంటూ వెళ్లారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన సినిమా. కత్తి మీద సాము లాంటి ప్రాజెక్ట్ ఇది. దర్శకుడు చాలా బాగా చేశారు.


- పవన్ గారిని అనుకున్నప్పుడే సాంగ్స్ ను, ఫైట్స్, ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేశాం. రేపు సినిమా చూశాక చాలా మంది తెలిసిన కథనే అయినా కొత్తగా ఉందని ఫీలవుతారు. ఎంజాయ్ చేస్తారు. ఒక ఆడియెన్ గా చెబుతున్నా, పింక్ 50, తమిళ్ చిత్రం 70 అయితే వకీల్ సాబ్ ను 100 మీటర్ లో పెట్టొచ్చు. 


- ప్రతి స్టార్ కు ఒక ఇమేజ్ ఉంటుంది. ఒక్కో హీరోకు ఒక్కో స్టైల్ ఉంటుంది. కళ్యాణ్ గారు అంటేనే స్టైల్. ఆయన బిగినింగ్ సినిమాలు చూస్తే, సుస్వాగతం, తమ్ముడు ఒక స్టైల్, తమ్ముడు, బద్రి, ఖుషి ఒక్కో స్టైల్. అలా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. చాలా క్యారెక్టర్స్ చేశారు కళ్యాణ్ గారు. ఆయన స్టైల్ ను అడాప్ట్ చేసుకుని వకీల్ సాబ్ చేశాం. 


- వీళ్లతోనే సినిమా చేయాలనేది నేనెప్పుడూ పెట్టుకోలేదు. ఆల్ మోస్ట్ అందరు స్టార్లతో సినిమాలు చేశాను. ఇకపైనా తీస్తాను. కానీ తొలి ప్రేమ అనే సినిమా నా హృదయంలో అలా ఉండిపోయింది. అందుకే ఫ్యాన్ మూమెంట్ నాలో కలిగింది. నాకు తెలియకుండానే ట్రైలర్ రిలీజ్ రోజు ఒక ఉద్వేగం కలిగింది. 


- సోల్ ఫుల్ సినిమా చేయడం అదీ నా డ్రీమ్ హీరోతో అచీవ్ చేయడం బోనస్ గా ఫీలవుతున్నాను. మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి, ప్రభాస్ తో మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా చేసినా ఏదో ఒక సోల్ వెతుకున్నాను. దర్శకుడు హీరో డేట్స్ ఉన్నాయని ఎప్పుడూ సినిమా చేయలేదు. 


- మాస్క్, శానిటైజ్ చేసుకుని సినిమాలు చూడమని చెబుతున్నా. మనకున్న ఎంటర్ టైన్ మెంట్ సినిమా. దాన్ని వదలిపెట్టి ఉండలేం. 15 నెలలైంది ఒక స్టార్ హీరో సినిమా చూడక అవుతోంది. కొందరికి భయాలున్నాయి, చాలా మంది సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉంటూ సినిమా చూడమనేది మా రిక్వెస్ట్. 


- మన స్టేట్స్ లో 50 పర్సెంట్ సీటింగ్ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. చూడాలి ఏం జరుగుతుందో. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏదైనా జరిగిందా. సేఫ్టీ ఏంటి అనేది కోర్ట్ అడిగింది. ప్రేక్షకుడే సేప్టీ చూసుకుంటూ ఎంజాయ్ చేయమని చెబుతున్నాం. అన్ని థియేటర్స్ దగ్గర మాస్క్ లు, శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.


-  సక్సెస్ ఫెయిల్యూర్ కామన్, కానీ ఒక సోల్ ఉన్న కథ మనల్ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయదు. కథ క్యారెక్టర్ లో చాలా విషయం ఉంది. కాబట్టి నా జస్టిమెంట్ ఫెయిల్ అవదు. ఏప్రిల్ 9న ఫస్ట్ షో పడగానే వకీల్ సాబ్ మరో లెవెల్ అని మీరే చెబుతారు. సండే రోజు ఆన్ లైన్ ఓపెన్ అయ్యాయి. ఎన్ని షోస్ ఓపెన్ చేస్తే అన్నీ బుకింగ్ అవుతున్నాయి. యూఎస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మాకే మతిపోతుంది. జనాలు కనెక్ట్ అయితే ఆగరు. 


- కొత్త వాళ్లతో ఉప్పెన, జాతి రత్నాలు చేస్తే ఎలా బుకింగ్స్ వెళ్లాయో మనకు తెలుసు. జనాలకు ట్రైలర్స్ చూసే ఒక డెసిషన్ కు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మన చేతుల్లో సినిమా లేదు. జనాలకు నచ్చేది, నచ్చదు అనేది బుకింగ్స్ చూస్తే తెలిసిపోతుంది.


- దర్శకుడు శ్రీరామ్ వేణు వందకు వంద శాతం న్యాయం చేశాడు. సినిమాకు ఎన్ని సెట్ అయినా చివరకు దర్శకుడే స్క్రీన్ మీదకు చూపించాలి. శ్రీరామ్ వేణు నేను కూడా ఊహించనంత గొప్పగా సినిమా చేశాడు. డబుల్ పాజిటివ్ చూసి హిట్ సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి. ఫైనల్ మిక్సింగ్ చూసి సూపర్ హిట్ అని చెప్పాను. సక్సెస్ ఫెయిల్యూర్ చూడను. ప్రతి ఒక్కరిలో విషయం ఉంటది. ఒక్కసారి ఫెయిల్ అయ్యారని వారిని దూరం పెట్టను. వారిలో విషయం ఉంటేనే కదా నేను అవకాశం ఇచ్చాను అనుకుంటాను.


- శంకర్ రామ్ చరణ్ సినిమా జూలైలో స్టార్ట్ అవుతుంది, థాంక్యూ సినిమా ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. వకీల్ సాబ్ కథలో 15వ నిమిషంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి కథ ప్రకారం ఆయన వస్తూ ఉంటాడు. రౌడీ బాయ్స్, పాగల్, థాంక్యూ, ఎఫ్ 3, చరణ్, శంకర్ సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో జెర్సీ, హిట్ సినిమాలు రీమేక్ లు చేస్తున్నాము. సల్మాన్ సోదరుడితో మరో రీమేక్ సినిమా ఉంటుంది. త్వరలో అల్లు అర్జున్ తో సినిమా ఉంటుంది. శ్రీరామ్ వేణు దర్శకుడు. ఎప్పుడు అనేది హీరో నిర్ణయించగానే చెబుతాను.

Hollywood Stunt Director Andy Long Roped In For LIGER

 


Hollywood Stunt Director Andy Long Roped In For Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER


Young and promising hero Vijay Deverakonda’s first Pan India film LIGER (Saala Crossbreed) being directed by dynamic director Puri Jagannadh is one of the highly anticipated films.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions.


Interim, Liger is done with a big shooting schedule in a massive set erected in Mumbai. Hollywood stunt choreographer Andy Long who worked with Jackie Chan and many other Hollywood actors is roped in to supervise an intense action sequence shot in the schedule.


Andy Long’s foreign team coming from different places of the world took part in the action sequence.


The makers are planning to begin the next shooting schedule of the film very soon.


Underwent training in mixed martial arts, Vijay Deverakonda sports a completely new look in the film.


Bollywood actress Ananya Pandey is playing the female lead opposite Vijay Deverakonda in the film billed to be an actioner.


Given it is a Pan India film, Puri connects and Dharma Productions are making the film on a grand scale without compromising on budget.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma.


Puri Jagannadh, Charmme Kaur, Karan Johar, Apoorva Mehta and Hiroo Yash Johar together are bankrolling the film.


Ramya Krishnan plays a prominent role in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


Cast: Vijay Deverakonda, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Aali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Karan Johar, Charmme Kaur, Apoorva Mehta, Hiroo Yash Johar and Puri Jagannadh

Banners: Dharma Productions and Puri Connects

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Andy Long


Saranga Dariya joins Aditya Music’s coveted 100 million views club

 Saranga Dariya joins Aditya Music’s coveted 100 million views club



Aditya Music scored a musical blockbuster earlier this year with Uppena. The film’s audio album was

a smashing hit and cumulatively clocked hundreds of millions of views on YouTube.

Last year, Ala Vaikunthapurramulo album which was released through Aditya Music label had

clocked over a billion views and two of its songs - Butta bomma and Ramulo Ramula - got featured in

the top 10 most viewed songs on YouTube in 2020.  We have Vachinde from Fida, Nee Kallu Neeli

Samudhram from Uppena which are into 200 million club.

The latest news is that “Saranga Dariya” from Naga Chaitanya and Sai Pallavi starrer Love Story has

garnered over a 100 million views. This is the latest addition to Aditya Music’s coveted 100 million

views club. The Telangana folk number which has stuck a chord with all sections of audiences is also

the fastest song in Tollywood to clock over a 100 million views.

We have Oke Oka Lokam from Sashi and many more songs that will join this club shortly.

We at Aditya Music put our best foot forward to support engaging content in music industry and

distribute our regional Telugu content pan India. In our endeavours, we thank all the music directors,

singers, lyric writers who are an inseparable part of these accomplishments.

Here are a few other songs which were released through Aditya Music label and clocked over 100

million views.


Butta Bomma from Ala Vaikunthapurramulo - 575 million views

Ramulo Ramula from Ala Vaikunthapurramulo - 353 million views

Vachinde from Fidaa - 295 million views

Nee Kallu Neeli Samudhram from Uppena - 204 million views

Seetimaar from DJ - 202 million views

Samajavaragamana from Ala Vaikunthapurramulo- 173 million views


RGV Dayyam Ready For Release

 


విడుదలకు సిద్దమైన "Rgv దెయ్యం"..

నిత్యం వివాదాలతో సావాసం చేసే రామ్‌ గోపాల్‌వర్మ రాత్’, ‘కౌన్’, ‘భూత్’, ‘ఫూంక్’ చిత్రాలతో భారతదేశంలో హర్రర్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ .మళ్ళీ ఇప్పుడు ‘Rgv దెయ్యం’ అనే కొత్త దెయ్యం కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా

దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..Rgv దెయ్యం సినిమా వెండి తెర ప్రమోషన్స్ మొదలు పెట్టాము.బాలీవుడ్ సినిమా ‘బ్రేకప్’లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురుకు తండ్రిగా రాజశేఖర్ నటించడమే కాక రాజశేఖర్ తన పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లో  నటిస్తుండటం విశేషం.తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న  ‘Rgv దెయ్యం’  చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.

తారాగణం: రాజశేకర్, స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు

సినిమా పేరు: దెయ్యం

దర్శకుడు: రామ్‌గోపాల్ వర్మ

లైన్ నిర్మాతలు: కొమ్మురి ప్రేమ్‌సాగర్, జె సాయి కార్తీక్ గౌడ్

ఎడిటర్: సత్య, అన్వర్

డి.ఓ.పి: సతీష్ ముత్యాల

సంగీతం: డిఎస్ఆర్

ప్రొడక్షన్ ఇంఛార్జ్: కె రూపేష్

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Director Maruthi Launched Yerra Cheera Song

 


ఎర్ర చీర చిత్రం నుండి తొలి తొలి ముద్దు సాంగ్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు మారుతి ! 

 

డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమన్ బాబు, కారుణ్య చౌదరి జంటగా  శ్రీరామ్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ఎర్రచీర. ఇటీవలే తెలంగాణ సినిమాట్రోగ్రఫీ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 


తాజాగా ఈ సినిమాలోని తొలి తొలి ముద్దు అనే సాంగ్ ని ప్రముఖ దర్శకుడు మారుతీ సోమవారం ( 5 -ఏప్రిల్ )రోజున  విడుదల చేసారు. 

ఈ సందర్బంగా దర్శకుడు మారుతీ మాట్లాడుతూ .. సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన ఎర్రచీర సినిమాలోని తొలి తోలి ముద్దు సాంగ్ ని లాంచ్ చేశాను. ఈ సాంగ్ చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి సుమన్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు. 


సుమన్ బాబు మాట్లాడుతూ .. ఈ సినిమాలోని తోలి తోలి ముద్దు అనే సాంగ్ ని లాంచ్ చేసిన దర్శకుడు మారుతీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సాంగ్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది.  ప్రమోద్ పులిగిల్ల సంగీతం అందించగా అంజనా సౌమ్య, హేమచంద్ర  ఈ గీతాన్ని ఆలపించారు. ముఖ్యంగా మంచి మ్యూజిక్, లిరిక్స్ కుదిరాయి. అలాగే  లేటెస్ట్ గా విడుదలైన టీజర్ తో  సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి, ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ సాంగ్ అలరిస్తుంది. మరి ముఖ్యంగా ఈ సాంగ్ ని అందరు ఉపయోగించుకునేలా అందిస్తున్నాము.. ఎలాంటి కాపీ రైట్ ఉండదు, కాబట్టి అందరు వాడుకునేలా ఉంటుంది. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గారి పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. అలాగే ఈ సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కవొచ్చాయి. త్వరలోనే  చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు .  

నటీనటులు: 

సుమన్ బాబు, కారుణ్య చౌదరి, శ్రీరామ్, కమల్ కామరాజు, రాజేంద్ర ప్రసాద్, ఆలీ, బేబీ సాయి తేజేస్విని తదితరులు..   

ఈ సినిమాకు మాటలు: గోపి విమలపుత్ర,  సంగీతం : ప్రమోద్ పులిగిల్ల

కథ స్క్రిన్ ప్లే దర్శకత్వం: సత్య సుమన్ బాబు.

Rashmika Aada Vaallu Meekujohaarlu Birthday Poster






 

Republic Teaser Launched Grandly



`రిప‌బ్లిక్‌` టీజ‌ర్ చూస్తుంటేనే సినిమాలో ఇన్‌టెన్స్ అర్థ‌మ‌వుతుంది.. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి:  డైరెక్ట‌ర్ సుకుమార్‌

సాయితేజ్‌, దేవ్ క‌ట్ట కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ `రిప‌బ్లిక్‌`. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టులు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈసినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. టీజ‌ర్‌ను సోమ‌వారం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా... 


చిత్ర నిర్మాత జె.పుల్లారావు మాట్లాడుతూ - ``ఈ టీజర్‌ను విడుద‌ల చేయ‌డానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అభిమాన ద‌ర్శ‌కులు సుకుమార్‌గారికి థాంక్స్‌. మా హీరో సాయితేజ్‌, డైరెక్ట‌ర్ దేవ్ క‌ట్ట గారికి కృత‌జ్ఞ‌త‌లు, శుభాకాంక్ష‌లు. ఈ రిప‌బ్లిక్ ప్రాజెక్ట్ చేస్తున్న హీరో సాయితేజ్‌తో తొమ్మిదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాం. ఆ ప్ర‌తిఫ‌ల‌మే ఇది. ఈ ట్రావెల్‌లో సాయితేజ్‌గారితో చాలా క‌థ‌లు డిస్క‌స్ చేసుకున్నాం. అయితే ఏదీ సెట్ కాలేదు. ఇప్పుడు అన్నీ చ‌క్క‌గా కుదిరితే రిప‌బ్లిక్ సినిమా రూపొందుతోంది. చాలా హ్యాపీగా ఉన్నాం. క‌రోనా ముందు పూజా కార్య‌క్ర‌మాలు స్టార్ట్ చేశాం. క‌రోనా త‌ర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాం.  ఆ దేవుడు ఆశీస్సులు, మెగా ఫ్యామిలీ స‌పోర్ట్‌తో ఈ సినిమాను ప్రారంభించాం. క‌రోనా టైమ్‌లో మా టెక్నీషియ‌న్స్ అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేశాం. ద‌ర్శ‌కుడు దేవ్‌గారు సినిమా గురించి అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ్డారు అన్నారు. 


చిత్ర నిర్మాత జె.భగవాన్ మాట్లాడుతూ - ``సుకుమార్‌గారి చేతుల మీదుగా మా `రిప‌బ్లిక్` సినిమా టీజ‌ర్ విడుద‌ల అవ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇంత గొప్ప‌గా తీయ‌డానికి హీరో సాయితేజ్‌, డైరెక్ట‌ర్ దేవాక‌ట్ట‌, ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు. 


డైరెక్ట‌ర్ దేవ్ క‌ట్ట మాట్లాడుతూ - ``నేను సుక్కు సార్‌గారికి ఏక‌ల‌వ్య శిష్యుడిని. ఆయ‌న చేసి వ‌ర్క‌వుట్ కానీ సినిమాలు కూడా ఎంతో గొప్ప‌గా ఉంటాయి. ఆయ‌న డైరెక్ట్ చేసిన `రంగ‌స్థ‌లం` చాలా ఇష్టం. ఓ ల్యాండ్ మార్క్ మూవీ అది. `బాహుబ‌లి` ఎంత ల్యాండ్ మార్క్ మూవీనో `రంగ‌స్థ‌లం` కూడా అంతే ల్యాండ్ మార్క్ మూవీ. క‌థ‌పై న‌మ్మ‌కం, స్టార్‌డ‌మ్ అన్నింటిపై న‌మ్మ‌కం పెంచిన చిత్రం `రంగ‌స్థ‌లం`. చాలా గేట్లు ఓపెన్ అయ్యాయి. ఆ సినిమా కార‌ణంగానే నేను రిప‌బ్లిక్ సినిమా చేశాను. నేను ఈ స్థానంలో ఉండి మాట్లాడ‌టానికి చాలా కాలం ప‌ట్టింది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఎక్కువ‌గా ఈ స్థానంలో ఉండి మాట్లాడుతాన‌ని అనుకుంటున్నాను. నా తేజ్‌, నా నిర్మాత‌లు, నా టీమ్ కార‌ణంగానే రిప‌బ్లిక్ సినిమా పూర్త‌య్యింది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత మీ అంద‌రి జీవితాల్లో భాగ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు. 


డైరెక్ట‌ర్ బుచ్చిబాబు మాట్లాడుతూ - ``నాకు దేవ్‌గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఆయ‌న డైరెక్ట్ చేసిన ప్ర‌స్థానం సినిమా చూసి శ్యామ్ గారిని ఉప్పెన సినిమాకు తీసుకున్నాను. సాయితేజ్‌గారు నాకు బ్ర‌ద‌ర్‌లాంటోడు. ఆయ‌న త‌న సోద‌రుడు వైష్ణ‌వ్‌ను నాకు ఇచ్చారు. ఆయ‌న ప్ర‌తి సినిమా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు`` అన్నారు. 


సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సుకుమార్ మాట్లాడుతూ - ```ప్ర‌స్థానం` వ‌చ్చిన‌ప్పుడు దేవ్‌ను క‌లిసి మాట్లాడాను. ఇప్ప‌టికీ ఆ సినిమాను మ‌నం మ‌ర‌చిపోలేదంటే.. ఆ సినిమాలోని సెన్సిబిలిటీస్‌, నెరేష‌న్ అంత గొప్ప‌గా ఉంటాయి. అలాంటి సినిమాకు ఇచ్చిన దేవాకు థాంక్స్‌. `రిప‌బ్లిక్‌` క‌థ‌ను దేవా నాకు చెబుతానంటే.. వ‌ద్ద‌ని అన్నాను. అందుకు కార‌ణం, ఓ మంచి ద‌ర్శ‌కుడి క‌థ‌ను విన‌డం కంటే చూడాల‌ని నేను అనుకోవ‌డ‌మే. విజ‌న్‌ను మిస్ కాకూడ‌ద‌ని అనుకున్నాను. థియేట‌ర్‌లోనే సినిమాను చూడాల‌ని అనుకున్నాను. టీజ‌ర్ అద్భుతంగా ఉంది. పాండమిక్ టైమ్‌లో అంద‌రూ భ‌య‌ప‌డుతుంటే సాయి.. `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` సినిమాతో మ‌న ముందుకు వ‌చ్చాడు. `ఉప్పెన`లాంటి సినిమాను రిలీజ్ చేయ‌గ‌లిగామంటే కార‌ణం ఆ ధైర్యాన్ని సాయి ఇచ్చిందే. టీజ‌ర్‌లో ఓ షాట్ చాలు. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాల‌నుకుంటున్నాడో. చాలా ఇన్‌టెన్స్ ఉంది. సాయితేజ్ స‌హా యూనిట్‌కి, భ‌గ‌వాన్‌గారికి, పుల్లారావుగారికి ఆల్ ది బెస్ట్‌. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 


సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ - ``మా కార్య‌క్ర‌మానికి విచ్చేసిన సుకుమార్‌గారికి థాంక్స్‌. సినిమా స్టార్టింగ్ అప్ప‌టి నుంచి సుకుమార్‌గారు ఎంతో స‌పోర్టివ్‌గా ఉన్నారు. క‌థ విన‌మంటే దేవాపై చాలా న‌మ్మ‌కం ఉంద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా సుకుమార్‌గారికి థాంక్స్‌. సుకుమార్‌గారు టీచ‌ర్ అయితే, బుచ్చిబాబు ఫ‌స్ట్ బెంచ్ స్టూడెంట్‌.. దేవాగారు మిడిల్ బెంచ్‌, నేను లాస్ట్ బెంచ్‌. హానెస్ట్ అటెంప్ట్ చేశాం. క‌చ్చితంగా అంద‌రికీ రీచ్ అవుతుంద‌ని, ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను టచ్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను. మా ప్రొడ్యూస‌ర్స్ భ‌గ‌వాన్‌గారు, పుల్లారావుగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. మంచి స‌పోర్ట్‌ను అందించారు. మ‌ణిశ‌ర్మ‌గారు అమేజింగ్ వ‌ర్క్ ఇచ్చారు. ఆయ‌న‌తో ఎప్ప‌టి నుంచో ప‌నిచేయాల‌ని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ  కోరిక తీరింది. మంచి మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. సినిమాటోగ్రాఫ‌ర్ సుకుమారన్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించారు. మా దేవాగారితో 2016 చివ‌ర‌లో ప్రయాణం స్టార్ట్ అయితే, ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. దేవాగారితో పని చేయ‌డం ల‌వ్ లీ ఎక్స్‌పీరియెన్స్‌. ప్ర‌తిదీ న‌న్ను బాగా ప్రిపేర్ చేశారు. అద్భుత‌మైన అవ‌కాశం ఇచ్చారు. ఫ్యాన్స్ ఇచ్చిన స‌పోర్ట్‌తోనే ఈ సినిమాను ధైర్యంగా చేయ‌గ‌లిగాను`` అన్నారు. 


ఈ కార్య‌క్ర‌మంలో మ‌నోజ్ నందం, ర‌వివ‌ర్మ‌, స్క్రీన్ ప్లే రైట‌ర్ కిర‌ణ్ జై కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 


న‌టీన‌టులు:

సాయితేజ్

ఐశ్వ‌ర్యా రాజేశ్‌

జ‌గ‌ప‌తిబాబు

ర‌మ్య‌కృష్ణ‌

సుబ్బ‌రాజు

రాహుల్ రామ‌కృష్ణ‌

బాక్స‌ర్ దిన 


సాంకేతిక వ‌ర్గం:

నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు, జీస్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  దేవ్ క‌ట్టా

స్క్రీన్‌ప్లే:  దేవ క‌ట్ట‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌

సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌

మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌

ఎడిట‌ర్‌:  కె.ఎల్‌.ప్ర‌వీణ్


Zindagi Song Released From Most Eligible Bachelor



 అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్, జిఏ 2 పిక్చర్స్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఏ జిందగీ పాట విడుద‌ల‌. 

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే  గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంలో అక్కినేని అభిమానులకు మరో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఏ జిందగీ పాటను విడుదల చేసారు. ఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పాటను మలయాళీ ఇన్‌ఫ్లూయెన్సర్‌ పాడారు. ఓ మలయాళీ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు పాట పాడే అవకాశం ఇచ్చిన మొట్టమొదటి బ్యానర్ గీతా ఆర్ట్స్ 2. ఆ అమ్మాయి పేరు నఫీసా హాన్యా. విడుదలైన క్షణం నుంచి కూడా ఏ జిందగీ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు. 

న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు.. 

సాంకేతిక నిపుణులు:

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

ఎక్క్యూటివ్ ప్రొడ్యూసర్ : సత్య గమిడి 

పీఆర్ఓ - ఏలూరు శ్రీను 

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

Kshana Kshanam producer did Six Packs at the age of 57



 57 ఏళ్ళ‌ వ‌య‌సులో సిక్స్ ప్యాక్  చేసిన ప్రొడ్యూస‌ర్


"క్ష‌ణ క్ష‌ణం" సినిమాతో నిర్మాత‌గా మారిన డా. వ‌ర్లు ప‌ర్సనాల‌టీ డ‌వ‌లెప్ మెంట్ ట్రైన‌ర్ గా సుప్ర‌సిద్దులు. లాక్ డౌన్ లో అంద‌రికీ పిట్ నెస్ ని పెంచుకుందామ‌నే ఆలోచ‌న తో జిమ్ లోకి అడుగు పెట్టిన వ‌ర్లు సిక్స్ ప్యాక్ చేసి అంద‌రికీ రోల్ మోడ‌ల్ గా నిలిచారు. సిక్స్ ప్యాక్ అనేది పిట్ నెస్ సింబ‌ల్ గా చూస్తారు. 57 ఏళ్ళ వ‌య‌స్సులో సిక్స్ ప్యాక్ చేయాలంటే చాలా ధృడ సంక‌ల్పం కావాలి. మోటివేష‌న‌ల్ ట్రైన‌ర్ గా వేల‌మంది జీవితాల‌లో గొప్ప మార్పులు తెచ్చిన డా. వ‌ర్లు కి ఈ సిక్స్ ప్యాక్ అనేది కొత్త ఛాలెంజ్ గా మారింది. క‌ఠోర శ్ర‌మ‌, అంకిత భావంతో ఐదు నెల‌ల‌లో సిక్స్ ప్యాక్ చేసి అందరినీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. చాలా మందికి రోల్ మెడ‌ల్ గా నిలిచారు.


ఈసంద‌ర్భంగా డా. వ‌ర్లు మాట్లాడుతూ ."క‌రోనా విజృభిస్తున్న టైం లో  అంద‌రికీ ఆరోగ్యంగా ఉండ‌టం, ఫిట్ గా ఉండ‌టం ఎంత అవ‌స‌ర‌మో తెలిసింది. నేను కూడా ఫిట్ నెస్ కోస‌మే జిమ్ లోకి అడ‌గు పెట్టాను. త‌ర్వాత సిక్స్ ప్యాక్ చేయాల‌ని అనిపించింది. మా ట్రైన‌ర్ వెంక‌ట్ కూడా నా ఆలోచ‌న‌ల‌ను ప్రోత్స‌హించారు. అప్ప‌టి నుండి నా డైట్ ని ఆయ‌న సూచించిన విధంగా మార్చుకున్నాను. ఎంత ప‌నుల‌లో ఉన్నా కూడా వ‌ర్క్ అవుట్స్ మానే వాడిని కాను. ఆరోజు చేయ‌వ‌ల‌సిన‌వి చేసే నిద్ర పోయే వాడిని.  మాట్రైన‌ర్ కి కూడా నేను ఎంత సీరియ‌స్ గా ఉన్నానో అర్ధం అయ్యాక నా పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపేవారు.  త‌ర్వాత మా రిలేష‌న్ చాలా ఫ్రెండ్లీగా మారిపోయింది. నేను సిక్స్ ప్యాక్ చేసిన వీడియో చూసిన త‌ర్వాత చాలా మంది ఇది గ్రాఫిక్సా అని కూడా అడిగారు.  నా దృష్టిలో సిక్స్ ప్యాక్ అనేది ఎవ‌ర‌యినా చేయోచ్చు.. దానికి కావ‌ల్సింది డైట్ ని ఫాలో అవ‌డం. క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌ర్క్ అవుట్స్ చేయ‌డం , స‌రైన ట్రైన‌ర్ కూడా చాలా అవ‌స‌రం ఒక్కోసారి మొద‌లు పెట్టిన ప్ర‌యాణం మ‌ద్య‌లో అల‌స‌ట‌గా అవుతుంది. తిరిగి వెన‌క్కు వెళ‌దామా అనిపిస్తుంది అటువంటి సంద‌ర్భాల్లో మ‌న‌ల్ని ఉత్సాహప‌ర‌చి ముందుకు న‌డిపించే ట్రైన‌ర్ చాలా అవ‌స‌రం అవుతాడు. నాకు అటువంటి ట్రైన‌ర్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను సిక్స్ ప్యాక్ చేసిన త‌ర్వాత చాలా మంది నా ఫ్రెండ్స్ కి ఫిట్ నెస్ పై ఆస‌క్తి క‌లిగింది....  అన్నారు. 


ట్రైన‌ర్ వెంక‌ట్ మాట్లాడుతూ*.."చిన్న‌ప్ప‌టి నుండి నాకు స్పోర్ట్స్ అంటే ప్రాణం ఆ ఇంట్రెస్ట్ తోనే ఫిట్ నెస్ పై నాకు ప్యాష‌న్ క‌లిగింది. నేను  చాలా మంది కి సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ ఇచ్చాను. ఫిల్మ్ ప‌ర్స‌నాల‌టీస్ కి కూడా ప‌ర్స‌న‌ల్ ట్రైన‌ర్ గా ఉన్నాను.  కానీ డా. వ‌ర్లు  నాకు ప్ర‌త్యేక మైన స్టూడెంట్ గా ఫీల్ అవుతాను. 57 ఏళ్ళ వ‌య‌స్సులో ఫిట్ నెస్ అంటేనే చాలా మందికి అపోహ‌లుంటాయి. వాళ్ళు వాకింగ్ లాంటివి ఇష్ట‌ప‌డ‌తారు. త‌మ‌కు ఈ వ‌య‌స్సులో చేయ‌లేం అని ముందుగానే ఫిక్స్ అవుతారు. కానీ వ‌ర్లు అలాకాదు. ఆయ‌న ట్రైన‌ర్ ని పూర్తిగా న‌మ్మారు,అలాగే నేను ఈ సిక్స్ ప్యాక్ చేయ‌గ‌ల‌ను అని ఫిక్స్ అయ్యారు. చెప్పిన వ‌ర్క్ అవుట్స్ ని చాలా నిబ‌ద్దత‌‌తో  కంప్లీట్ చేసే వారు  ఇచ్చిన డైట్ ని ఫాలో అయ్యేవారు. దీంతో నాకు చాలా ఇంట్రెస్ట్ క‌లిగింది. ఐదు నెల‌ల‌లో సిక్స్ ప్యాక్ చేయ‌గ‌లిగారు అంటే అది కేవ‌లం ఆయ‌న దృధ సంక‌ల్పంతో నే సాధ్యం అయ్యింది.  మా జిమ్ లో మోటివేష‌న్ కోసం ఆయ‌న సిక్స్ ప్యాక్ చేసిన వీడియో పెడుతున్నాం అంత‌గా ఆయ‌న మా అంద‌రినీ ఇన్స్ ఫైర్ చేసారు... అన్నారు.

Allu Aravind clarifies about ‘Covid +ve’ reports

 Allu Aravind clarifies about ‘Covid +ve’ reports




For the past few days, there have been reports claiming that renowned producer, Allu Aravind contracted COVID-19 despite taking two doses of Covid vaccine. 

Aravind took it upon himself to clarify about the reports and released a video through which he addresses his experience with COVID.

“Yes, it is true that I have tested positive for Covid-19. But the rumors which claim I contracted the virus even after taking two doses of Covid vaccine are false. I took a single dose of Covid vaccine,” he said. 

The acclaimed producer added that getting vaccinated is essential. 

“I and two of my friends recently visited a village. I and another friend of mine had taken the Covid vaccine while the other hadn’t. All three of us contracted the virus. I and my other friend who had taken the vaccine recovered from the virus fairly quickly. We suffered from light fever for three days and we are feeling better now. But the third person who did not take the vaccine is currently hospitalised.  I have observed that those who are vaccinated are not facing serious medical conditions after contracting Covid. I hereby urge everyone to get vaccinated,” he concluded.