Street Light Trailer Launched



 స్ట్రీట్ లైట్ ట్రైలర్ అండ్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల 


మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం స్ట్రీట్ లైట్. ఈ చిత్రానికి సంబందించిన లిరికల్ వీడియో సాంగ్ తో పాటు టీజర్ విడుదల కార్యక్రమం బుధవారం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా విచ్చేసిన దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయగా, ట్రైలర్ ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత మోహన్ వడ్లపట్ల తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 


అనంతరం ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ .. సాంగ్ చూసాం .. చాలా బాగుంది.. రామసత్యనారాయణ పాన్ ఇండియా అంటున్నారు.. ఇది హాలీవుడ్ కు వెళ్లినా బాగుంటుందేమో అని నా అభిప్రాయం. నిర్మాత శ్రీనివాస్ మంచి థాట్స్ తో ఈ సినిమా తీశారు.. కానీ సెన్సార్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఇక ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను మించిపోయారు అని చెప్పాలి. అయన ఆలోచనలు ఆ రేంజ్ లో ఉన్నాయి. నిర్మాత శ్రీనివాస్ ఛాంబర్ మనిషిగా, ఎగ్జిబిటర్ గా చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఐతే ఈ సినిమాలో మసాలా ఎక్కువగా ఉంది.. కానీ అది శృతి మించకూడదు అని నా సలహా. ఈ సినిమా చూస్తుంటే చాలా ఫైర్ తో తీసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో నెట్ఫ్లిక్స్ లాంటి వేదికపైకి వెళితే చాలా మంచిది. వాళ్లకు కావలసిన కంటెంట్ ఉంది. ఇక శ్రీనివాస్ గారు యూ ఎఫ్ ఓ, క్యూబ్ లాంటి వాటికి పోటీగా వెళ్లి వాళ్లనే భయపెట్టిన వ్యక్తి. అయన చేసిన పోరాటంతో వాళ్ళు ఆయనను కలుపుకు పోయారు. ఆయనను నిర్మాతలుగా మేము కాపాడలేకపోయాం. ఇక అయన జన్మదినం సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వా కూడా రామ్ గోపాల్ వర్మ ని మించే స్థాయిలో సినిమాలు చేయాలనీ ప్రయత్నం చేసినట్టున్నాడు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం అందుకుని దర్శక నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు. 


తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ .. ఈ సినిమాను చుస్తే చిన్న సినిమాల్లో పాన్ ఇండియా సినిమాగా అనిపిస్తుంది. ప్రభాస్ బాహుబలి తరహాలో ఇదికూడా చిన్న బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. నిర్మాత మామిడాల శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్ గా చాలా మంచి పేరున్న వ్యక్తి. అయన అంటే అందరికి అభిమానం అందుకే పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా మంచి విజయం అందుకుని మామిడాల శ్రీనివాస్ కు డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 


నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ .. నిర్మాత శ్రీనివాస్ అటూ డిస్ట్రిబ్యూటర్ గా మంచి పాపులర్ అయిన వ్యక్తి. ఆయనకు ఎలా సినిమా తీయాలో బాగా తెలుసు. అప్పట్లో యూ ఎఫ్ ఓ, క్యూబ్ లాంటి వారితో పోరాటం చేసిన వ్యక్తి. అయన తీసిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకోవాలి. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి క్రేజ్ రావాలని కోరుకుంటున్నాను అన్నారు. 


ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్ బాబు, అల్లు అరవింద్, రమేష్ ప్రసాద్ లాంటి వారు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ని క్రియేట్ చేసిన తరువాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మామిడాల శ్రీనివాస్ కూడా ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసి వారికంటే తక్కువ రేట్స్ కు సినిమా వేస్తామని చెబితే మొదట్లో చాలా సమస్యలు వచ్చాయి. అయినా వారితో పోరాటం చేసి చివరకు వారందరు కలిసి ఆయనను కలుపుకుపోయారు. అలాంటి గట్స్ ఉన్న నిర్మాత. అయన నిర్మిస్తున్న ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి. అలాగే దర్శకుడు విశ్వ గారు ప్రసాద్ పేరు తీసి నేను రామ్ గోపాల్ వర్మ లేని లోటు తీరుస్తా అనే తరహాలో వచ్చారు. అయన తీసిన ఈ సినిమా తప్పకుండా పెద్ద సంచలనం అవుతుంది. ఏ సినిమాకైనా నిర్మాతకు డబ్బులు రావడం అన్నది ఫైనల్ విషయం. అలాగే ఈ సినిమా విషయంలో శ్రీనివాస్ బిజినెస్ కూడా ముందే చేసి ఉంటాడు.. అంత టాలెంట్ ఉన్న వ్యక్తి అయన. ఈ సినిమాలో కాస్త మసాలా ఎక్కువగా ఉందన్న విషయం అర్థం అవుతుంది. ఏది ఏమైనా ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలు బాగా డబ్బులు రావాలి అన్నారు. 


దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ .. శ్రీనివాస్ గారు డిస్ట్రిబ్యూటర్ గా నాకు బాగా తెలుసు. జనరల్ గా చాలా సినిమాలకు రిటర్న్స్ ఎక్కువగా రావు.. కానీ నేను చేసిన తెనాలి రామకృష్ణ సినిమాకు రిటర్న్స్ ఇచ్చిన వ్యక్తి.. అయన నిజాయితీ అక్కడ కనిపించింది. ఈ సినిమాలో కాస్త మసాలా ఎక్కువైంది అని అనిపిస్తుంది. ముక్యంగా సినిమాని తీసిన దర్శకుడు ఇంతకు ముందు భార్య అనే సినిమా చేసాడు.. ఆ సినిమా ఇచ్చిన ప్లాప్ వల్ల వచ్చిన కసితో ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అందుకే మసాలా బాగా దట్టించాడు. ఈ సినిమాకు కాస్త స్టాండర్స్ మైంటైన్ చేసిఉంటే మరో రేంజ్ కి వెళ్ళేది. ఏది ఏమైనా ఓ మంచి ప్రయత్నంతో సినిమా చేస్తున్న శ్రీనివాస్ కు ఈ సినిమా సక్సెస్ అయి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. 


చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ .. ఈ సినిమా జోనర్ గురించి పెద్దలు మాట్లాడారు.. నేను చెబుతున్నాను .. ఇది కచ్చితంగా మెసేజ్ ఇచ్చే సినిమా. ఇందులో కంటెంట్ అలాంటిది కాబట్టి అలా చూపించాం. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి అన్న నేపథ్యంలో ఈ సినిమా తీసాం .. చీకట్లో జరిగే ముక్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం 'రివెంజ్ డ్రామా' ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా తీర్చి దిద్దామ్. అలాగే క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది అన్నారు. 


నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ .. సి కళ్యాణ్ గారికి, దాము గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, ప్రసన్న గారికి, రామసత్యనారాయణ గారికి, ధన్యవాదాలు తెలుపుతున్నాం.. కరోనా అయిపోయాకా సెప్టెంబర్ లో సినిమా మొదలెట్టి డిసెంబర్ వరకు పూర్తీ చేసాం.. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను తీసాం. దర్శకుడు విశ్వ ప్రసాద్ చాలా కష్టపడ్డారు. ఆయనకు కాలు నొప్పి ఉన్నా కూడా నిర్మాత షెడ్యూల్ విషయంలో నష్టపోవద్దు అంటూ రిస్క్ చేసి మరి షూటింగ్ చేసారు. అందుకు ఆయనకు థాంక్స్ చెప్పాలి, అలాగే పక్కా ప్లానింగ్ తో సినిమా చేసాం.. ఇప్పటికే బిజినెస్ పరంగా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ తాన్యా దేశాయ్ అద్భుతంగా చేసింది. అలాగే సీనియర్ వినోద్ కుమార్, చిత్రం శ్రీను, ధన్రాజ్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు . తప్పకుండా ఈ సినిమాను మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు. 


హీరోయిన్ తాన్యా దేశాయ్ మాట్లాడుతూ .. మా నిర్మాత కు హ్యాపీ బర్త్ డే.. అలాగే దర్శకుడు విశ్వా గారికి థాంక్స్ చెప్పాలి. ఈ పాత్రకు నన్ను ఎంపికచేసినందుకు. లిరికల్ వీడియో చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా చూసి అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అన్నారు. 



నటీనటులు : 


తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ , చిత్రం శ్రీను, ధన్రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం తదితరులు నటించారు.


ఈ చిత్రానికి 


దర్శకత్వం : విశ్వ

నిర్మాత: మామిడాల శ్రీనివాస్ 

సినిమాటోగ్రఫీ : రవి కుమార్, 

మ్యూజిక్ : విరించి, 

ఎడిటర్ : శివ, 

ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్, 

ఫైట్స్ : నిఖిల్, 

కొరియోగ్రాఫి : పాల్ మాస్టర్, 

స్టూడియో : యుఅండ్ఐ.

Post a Comment

Previous Post Next Post