ఎర్ర చీర చిత్రం నుండి తొలి తొలి ముద్దు సాంగ్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు మారుతి !
డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమన్ బాబు, కారుణ్య చౌదరి జంటగా శ్రీరామ్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ఎర్రచీర. ఇటీవలే తెలంగాణ సినిమాట్రోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాలోని తొలి తొలి ముద్దు అనే సాంగ్ ని ప్రముఖ దర్శకుడు మారుతీ సోమవారం ( 5 -ఏప్రిల్ )రోజున విడుదల చేసారు.
ఈ సందర్బంగా దర్శకుడు మారుతీ మాట్లాడుతూ .. సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన ఎర్రచీర సినిమాలోని తొలి తోలి ముద్దు సాంగ్ ని లాంచ్ చేశాను. ఈ సాంగ్ చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి సుమన్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
సుమన్ బాబు మాట్లాడుతూ .. ఈ సినిమాలోని తోలి తోలి ముద్దు అనే సాంగ్ ని లాంచ్ చేసిన దర్శకుడు మారుతీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సాంగ్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రమోద్ పులిగిల్ల సంగీతం అందించగా అంజనా సౌమ్య, హేమచంద్ర ఈ గీతాన్ని ఆలపించారు. ముఖ్యంగా మంచి మ్యూజిక్, లిరిక్స్ కుదిరాయి. అలాగే లేటెస్ట్ గా విడుదలైన టీజర్ తో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి, ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ సాంగ్ అలరిస్తుంది. మరి ముఖ్యంగా ఈ సాంగ్ ని అందరు ఉపయోగించుకునేలా అందిస్తున్నాము.. ఎలాంటి కాపీ రైట్ ఉండదు, కాబట్టి అందరు వాడుకునేలా ఉంటుంది. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గారి పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. అలాగే ఈ సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కవొచ్చాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు .
నటీనటులు:
సుమన్ బాబు, కారుణ్య చౌదరి, శ్రీరామ్, కమల్ కామరాజు, రాజేంద్ర ప్రసాద్, ఆలీ, బేబీ సాయి తేజేస్విని తదితరులు..
ఈ సినిమాకు మాటలు: గోపి విమలపుత్ర, సంగీతం : ప్రమోద్ పులిగిల్ల
కథ స్క్రిన్ ప్లే దర్శకత్వం: సత్య సుమన్ బాబు.
Post a Comment