"వకీల్ సాబ్" ఫస్ట్ షో పడగానే ఇది నెక్ట్ లెవెల్ సినిమా అని తెలిసిపోతుంది - నిర్మాత దిల్ రాజు
పలు సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు. 50 చిత్రాల నిర్మాణ ప్రయాణం ఆయనది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాను నిర్మించి తన కల నెరవేర్చుకున్నారు దిల్ రాజు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా చిత్ర విశేషాలను దిల్ రాజు వివరించారు. దిల్ రాజు మాట్లాడుతూ........
- నాకున్న డ్రీమ్ ప్రకారం పవన్ గారితో వకీల్ సాబ్ సినిమా చేశాను. డ్రీమ్ ట్రూ అయ్యింది కాబట్టి నాలో ఇప్పుడున్నది తృప్తి, వకీల్ సాబ్ విజయం సాధిస్తే, ఆడియెన్స్ వావ్ అంటే అప్పుడు సంతోషం వస్తుంది..బ్యూటిఫుల్ జర్నీ ఇది. ఈ చిత్రాన్ని ఫాస్ట్ గా తీసి రిలీజ్ చేయాలని అనుకున్నాను. 2019 డిసెంబర్ లో మొదలు పెట్టాం. 2020 లో రిలీజ్ చేద్దామనుకున్నాం. లాక్ డౌన్ రావడం వల్ల పరిస్థితి మారిపోయింది. వన్ ఇయర్ హోల్డ్ చేసి అదే ఎనర్జీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇవాళ కూడా పవన్ గారిని కలిశాను. మా జర్నీ ఇంకో లెవెల్ కి పెరిగింది.
- నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ఇది. నాకు సినిమా మీదున్న ప్యాషన్ వేరే వాళ్లు చెప్పడం వేరు పవన్ గారు స్వయంగా సినిమా మేకింగ్ లో చూశారు కాబట్టి నా గురించి చెప్పారు. స్టార్ హీరోలు నిర్మాతకు సినిమా ఇచ్చాక స్క్రిప్ట్, షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్, ప్రమోషన్ ఎలా చేస్తున్నారు. రిలీజ్ ఎలా చేస్తున్నారు. అనేది చూస్తారు. స్టార్ హీరోలకు లిమిటేషన్ ఉంటుంది. షూటింగ్ లో ప్రాబ్లమ్ వస్తుంటాయి. దర్శకుడు, హీరోకు ఒత్తిడి రాకుండా సినిమాను కంప్లీట్ చేయడం పెద్ద టాస్క్. మాకూ కోపాలు వస్తాయి. అరుస్తాం. కానీ అదంతా సినిమా మేకింగ్ లో భాగమే
- పవన్ గారితో సినిమా చేయాలనుకోవడానికి కారణం. తొలి ప్రేమ టైమ్ లో నేను చూసిన క్రేజ్, స్టార్ డమ్ ఇవన్నీ నా మనసులో గట్టి ముద్ర వేశాయి. పవన్ తో సినిమా చేయాలనేది వకీల్ సాబ్ తో తీరింది. వకీల్ సాబ్ సినిమా నా కెరీర్ లో ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది రేపు రిలీజ్ అయ్యాకే. ఘన విజయాన్ని బట్టి చెప్తాను. ఒక మ్యాజిక్ జరగబోతోంది అని వకీల్ సాబ్ బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది. పవన్ గారు నాతో షేర్ చేసుకున్న విషయాలు నా గురించి. అవి నా మనసులో దాచి పెట్టుకున్నాను. 22 సంవత్సరాల డ్రీమ్ తో పాటు నాకు ఒక అదనపు సంతోషం దొరికింది.
- వకీల్ సాబ్ కు ముందు ఇద్దరు ముగ్గురు దర్శకులను అనుకున్నాం. అప్పటికి అల్లు అర్జున్ తో శ్రీరామ్ వేణు సినిమా చేయాల్సి ఉంది. అల్లు అర్జున్ సినిమాలు లాక్ డౌన్ వల్ల ముందుకు జరుగుతూ వచ్చాయి. అలా ఆ సినిమా లేట్ అవుతుంది కదా అని వకీల్ సాబ్ చేయమని చెప్పాం.
- కథను ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా హీరో ఇమేజ్ కు తగినట్లు వకీల్ సాబ్ ఉంటుంది. పింక్ రీమేక్ అనగానే ఇలాంటి సాఫ్ట్ సినిమా ఎందుకు అని చాలా మంది అడిగారు. మేము సినిమా చేస్తున్నాం కాబట్టి అందులో ఏముంటుందనేది మాకు బాగా తెలుసు. ఫార్ములా చెడిపోకుండా, పవన్ గారి ఇమేజ్ కు తగినట్లు శ్రీరామ్ వేణు కథనంపై బాగా కసరత్తు చేశాడు. కథతో పాటు హీరోయిజం హై చేసుకుంటూ వెళ్లారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన సినిమా. కత్తి మీద సాము లాంటి ప్రాజెక్ట్ ఇది. దర్శకుడు చాలా బాగా చేశారు.
- పవన్ గారిని అనుకున్నప్పుడే సాంగ్స్ ను, ఫైట్స్, ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేశాం. రేపు సినిమా చూశాక చాలా మంది తెలిసిన కథనే అయినా కొత్తగా ఉందని ఫీలవుతారు. ఎంజాయ్ చేస్తారు. ఒక ఆడియెన్ గా చెబుతున్నా, పింక్ 50, తమిళ్ చిత్రం 70 అయితే వకీల్ సాబ్ ను 100 మీటర్ లో పెట్టొచ్చు.
- ప్రతి స్టార్ కు ఒక ఇమేజ్ ఉంటుంది. ఒక్కో హీరోకు ఒక్కో స్టైల్ ఉంటుంది. కళ్యాణ్ గారు అంటేనే స్టైల్. ఆయన బిగినింగ్ సినిమాలు చూస్తే, సుస్వాగతం, తమ్ముడు ఒక స్టైల్, తమ్ముడు, బద్రి, ఖుషి ఒక్కో స్టైల్. అలా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. చాలా క్యారెక్టర్స్ చేశారు కళ్యాణ్ గారు. ఆయన స్టైల్ ను అడాప్ట్ చేసుకుని వకీల్ సాబ్ చేశాం.
- వీళ్లతోనే సినిమా చేయాలనేది నేనెప్పుడూ పెట్టుకోలేదు. ఆల్ మోస్ట్ అందరు స్టార్లతో సినిమాలు చేశాను. ఇకపైనా తీస్తాను. కానీ తొలి ప్రేమ అనే సినిమా నా హృదయంలో అలా ఉండిపోయింది. అందుకే ఫ్యాన్ మూమెంట్ నాలో కలిగింది. నాకు తెలియకుండానే ట్రైలర్ రిలీజ్ రోజు ఒక ఉద్వేగం కలిగింది.
- సోల్ ఫుల్ సినిమా చేయడం అదీ నా డ్రీమ్ హీరోతో అచీవ్ చేయడం బోనస్ గా ఫీలవుతున్నాను. మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి, ప్రభాస్ తో మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా చేసినా ఏదో ఒక సోల్ వెతుకున్నాను. దర్శకుడు హీరో డేట్స్ ఉన్నాయని ఎప్పుడూ సినిమా చేయలేదు.
- మాస్క్, శానిటైజ్ చేసుకుని సినిమాలు చూడమని చెబుతున్నా. మనకున్న ఎంటర్ టైన్ మెంట్ సినిమా. దాన్ని వదలిపెట్టి ఉండలేం. 15 నెలలైంది ఒక స్టార్ హీరో సినిమా చూడక అవుతోంది. కొందరికి భయాలున్నాయి, చాలా మంది సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉంటూ సినిమా చూడమనేది మా రిక్వెస్ట్.
- మన స్టేట్స్ లో 50 పర్సెంట్ సీటింగ్ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. చూడాలి ఏం జరుగుతుందో. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏదైనా జరిగిందా. సేఫ్టీ ఏంటి అనేది కోర్ట్ అడిగింది. ప్రేక్షకుడే సేప్టీ చూసుకుంటూ ఎంజాయ్ చేయమని చెబుతున్నాం. అన్ని థియేటర్స్ దగ్గర మాస్క్ లు, శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
- సక్సెస్ ఫెయిల్యూర్ కామన్, కానీ ఒక సోల్ ఉన్న కథ మనల్ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయదు. కథ క్యారెక్టర్ లో చాలా విషయం ఉంది. కాబట్టి నా జస్టిమెంట్ ఫెయిల్ అవదు. ఏప్రిల్ 9న ఫస్ట్ షో పడగానే వకీల్ సాబ్ మరో లెవెల్ అని మీరే చెబుతారు. సండే రోజు ఆన్ లైన్ ఓపెన్ అయ్యాయి. ఎన్ని షోస్ ఓపెన్ చేస్తే అన్నీ బుకింగ్ అవుతున్నాయి. యూఎస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మాకే మతిపోతుంది. జనాలు కనెక్ట్ అయితే ఆగరు.
- కొత్త వాళ్లతో ఉప్పెన, జాతి రత్నాలు చేస్తే ఎలా బుకింగ్స్ వెళ్లాయో మనకు తెలుసు. జనాలకు ట్రైలర్స్ చూసే ఒక డెసిషన్ కు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మన చేతుల్లో సినిమా లేదు. జనాలకు నచ్చేది, నచ్చదు అనేది బుకింగ్స్ చూస్తే తెలిసిపోతుంది.
- దర్శకుడు శ్రీరామ్ వేణు వందకు వంద శాతం న్యాయం చేశాడు. సినిమాకు ఎన్ని సెట్ అయినా చివరకు దర్శకుడే స్క్రీన్ మీదకు చూపించాలి. శ్రీరామ్ వేణు నేను కూడా ఊహించనంత గొప్పగా సినిమా చేశాడు. డబుల్ పాజిటివ్ చూసి హిట్ సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి. ఫైనల్ మిక్సింగ్ చూసి సూపర్ హిట్ అని చెప్పాను. సక్సెస్ ఫెయిల్యూర్ చూడను. ప్రతి ఒక్కరిలో విషయం ఉంటది. ఒక్కసారి ఫెయిల్ అయ్యారని వారిని దూరం పెట్టను. వారిలో విషయం ఉంటేనే కదా నేను అవకాశం ఇచ్చాను అనుకుంటాను.
- శంకర్ రామ్ చరణ్ సినిమా జూలైలో స్టార్ట్ అవుతుంది, థాంక్యూ సినిమా ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. వకీల్ సాబ్ కథలో 15వ నిమిషంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి కథ ప్రకారం ఆయన వస్తూ ఉంటాడు. రౌడీ బాయ్స్, పాగల్, థాంక్యూ, ఎఫ్ 3, చరణ్, శంకర్ సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో జెర్సీ, హిట్ సినిమాలు రీమేక్ లు చేస్తున్నాము. సల్మాన్ సోదరుడితో మరో రీమేక్ సినిమా ఉంటుంది. త్వరలో అల్లు అర్జున్ తో సినిమా ఉంటుంది. శ్రీరామ్ వేణు దర్శకుడు. ఎప్పుడు అనేది హీరో నిర్ణయించగానే చెబుతాను.
Post a Comment