Latest Post

Kadambari Kiran Manamsaitham Help To Journalist

 


పాత్రికేయుడికి అండగా నిలిచిన "మనం సైతం" కాదంబరి కిరణ్


ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న నిర్విరామ సేవా కార్యక్రమం మనం సైతం. ఈ కార్యక్రమం ద్వారా ఆపదల్లో ఉన్న ఎంతోమంది పేదలకు చేయూతనందించారు కాదంబరి కిరణ్. తాజాగా ఎన్ టీవీ, భక్తి టీవీలో వీడియో ఎడిటర్ గా పనిచేసిన రవికి అనారోగ్య చికిత్స కోసం 25 వేల రూపాయలు సాయం అందించారు మనం సైతం కాదంబరి కిరణ్. రవికి మెదడులో రక్తస్రావంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. 


మనం సైతం గురించి తెలుసుకుని సాయం కోరారు. వెంటనే స్పందించిన కాదంబరి కిరణ్.. 25 వేల రూపాయలు రవి చికిత్స కోసం అందించారు. చేతనైన సాయం కోసం  ఎప్పుడైనా,ఎవరికైనా, ఎక్కడైనా "మనం సైతం" అండగా ఉంటుందని ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ తెలిపారు.

Deverakonda lo Vijay Prema kadha Review




 Check out the review of Deverakonda lo Vijay prema kadha starring  Mauryani, Vijay Shankar, Nagineedu, Venkata Govindarao, Shivannarayana, Koteshwarao, Rachcharavi, Sunita, , Chalapathirao, Saimani, Subhash Reddy directed by  Venkataramana S .Produced by  Paddana Manmadharao 

Story 

This is the story of Sitaramayya (Nagineedu) who is the head of the village (Deverakonda) his daughter Devika (Mouryani) falls in love with her child hood friend Vijay (Vijay Shankar)  who leads his life by driving auto Vijay also has love towards Devika one day they will join their hands for their registered marriage what happened after that marriage ? What is the reason for registered marriage? How devika father sitaramayya reacts to it forms the rest of the story 

Performances 

In thai segment we must appreciate hero Vijay for his performance even though  its his first film  he has given his best his dialogue delivery  is good .Mauryani has done her part in decent way Mauryani brought the life  to the film  with her role

Naginidu looked very natural in the role of village head asusual he has done his work perfectly Shivannarayana has done karanam role very well he lived in it Rachcha Ravi comedy is good Chalapathirao Subhash and rest of the cast has done as per the requirements

Technical values 

In this segment we must appreciate producers for their production values even though its a small film they has spent quality amount in production  for that producer Manmadharao  should be appreciated  Director S Venkataramana created the love story with a good message along with some   fun and entertainment  he has taken good point and showcased in perfect way he tried his best to engage audience  .Songs are good especially like Nuvvo Sagam, Neno Sagam are impressive  Camera work is great Editing is okay Locations are good 

Verdict 

On whole Deverakonda lo Vijay prema kadha is a decent attempt with some good elements 

Telugucinemas.in Rating 3/5

Himalaya studios production no1 shooting updates

 


దుబాయ్ లో మూడు పాట‌లు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న  హిమాల‌య స్టూడియో మేన్ష‌న్స్  ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం  

   

   స్టార్ హీరోలు, భారీ బ‌డ్జెట్ చిత్రాలు త‌ప్ప మీడియం చిత్రాలు ఇటీవ‌ల కాలంలో విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. అందులో క‌రోనా త‌ర్వాత విదేశాల‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి క్ర‌మంలో  హిమాల‌య మేన్ష‌న్స్ అధినేత పి.ఉద‌య్ కిర‌ణ్‌, నూత‌న ద‌ర్శ‌కుడు సురేష్ ధైర్యంగా ముంద‌డుగేసి ఇటీవ‌ల దుబాయ్‌లో  దాదాపు ప‌ది రోజుల‌కు పైగా  అక్క‌డే ఉండి మూడు పాట‌లు విజ‌య‌వంతంగా  చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్నారు‌.  సాయి రోన‌క్‌, నేహ సోలంకి హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రం  ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత పి.ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ...``ఇటీవ‌ల మా టీమ్ దాదాపు 30 మందికి పైగా దుబాయ్ వెళ్లాము. దుబాయ్ తో పాటు షార్జా లో అంద‌మైన లొకేష‌న్స్ లో మూడు పాట‌లు చిత్రీక‌రించాము.  కొవిడ్ కి సంబంధించిన‌ జాగ్ర‌త్త‌లు అన్నీ పాటిస్తూ చిత్ర యూనిట్ స‌హ‌కారంతో అనుకున్న విధంగా ఈ షెడ్యూల్ పూర్తి చేయ‌గ‌లిగాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.  త్వ‌ర‌లో  ఓ సెల‌బ్రిటీ చేతుల మీదుగా మా సినిమాకు సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు సురేష్ మాట్లాడుతూ...``  ఈ ప్రేమ క‌థా చిత్రానికి   ఇప్ప‌టి వ‌ర‌కు మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థ డిమాండ్ ని బ‌ట్టి ఖ‌ర్చు పెడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల దుబాయ్‌లో మూడు పాట‌లు గ్రాండ్ గా చిత్రీక‌రించాము. భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన అద్భుత‌మైన పాట‌ల‌కు మాస్ట‌ర్ వెంక‌ట్ దీప్ అదే స్థాయిలో కొరియోగ్రఫీ చేశారు `` అన్నారు.

శ‌శాంక్, సిజ్జు,  అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, హేమ‌, ర‌ఘు, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; సాహిత్యం: సురేష్ గంగుల, దేవ్; ఎడిటింగ్ః ఉపేంద్ర‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు;  పిఆర్వోః బాక్సాఫీస్ మీడియా;  సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి;  నిర్మాతః పి.ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్‌.

Winner Trip Audio Launched

 


విన్నర్ ట్రిప్" ఆడియో విడుదల


యఫ్,యమ్ రేడియోలో విన్నర్ ట్రిప్ కు సెలెక్ట్  అయిన బ్యాచ్ గోవాకు వెలుతుంది.. అక్కడికెళ్లిన ఈ బ్యాచ్ ఒక ముఠా చేతిలో చిక్కుకొని ఎలా బయట పడ్డారనేదే "విన్నర్ ట్రిప్" .యస్.యస్.సి క్రియేషన్స్ పతాకంపై మహి, సోనాపాటిల్ హీరో, హీరోయిన్లు గా  తెలుగు శ్రీను దర్శకత్వంలో సంపత్ శ్రీను, కె.లక్ష్మణ్ రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం* "విన్నర్ ట్రిప్".ఈ చిత్రానికి శశాంక్ భాస్కరుని  సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో కన్నుల పండుగలా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధు లుగా విచ్చేసిన సీనియర్ నిర్మాత శ్రీ గురుపాదం టీజర్ ను విడుదల చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్  సెక్రటరీ ప్రసన్న కుమార్ ట్రైలర్ ను విడుదల చేశారు.  ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్ వైస్ చైర్మన్  రాదా రాజేశ్వరి, జబర్దస్త్ అప్పారావు ప్రమోషల్స్ సాంగ్స్ ను  విడుదల చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్  సెక్రటరీ ప్రసన్న కుమార్,సెన్సార్ బోర్డ్ మెంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్  సెక్టార్ వైస్ చైర్మన్ రాదా రాజేశ్వరి మరియు చిత్ర యూనిట్ అందరూ కలసి ఆడియో విడుదల చేశారు.అనంతరం


 ముఖ్యఅతిదిగా విచ్చేసిన సీనియర్ నిర్మాత శ్రీ గురుపాదం మాట్లాడుతూ.. నేను నిర్మాతగా 26 సినిమాలు నిర్మించాను.సీనియర్ నటులు యన్.టి.ఆర్, కృష్ణ, శ్రీదేవి  లాంటి వారితో సినిమాలు నిర్మించాను.అప్పట్లో మీడియా లేకపోవడంతో  మా సినిమాలకు సరైన ప్రమోషన్ లేక నిర్మాతలు ఇబ్బందులు పడేవారు.ఇప్పుడు సోషల్ మీడియా పెరగడంతో  కంటెంట్ ఉన్న ప్రతి సినిమా హిట్ అవుతుంది.అలాంటి మంచి కంటెంట్ తో వచ్చిన "విన్నర్ ట్రిప్" పెద్ద విజయం సాధించాలని అన్నారు.


 ప్రొడ్యూసర్ కౌన్సిల్  సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... సీనియర్ యన్.టి.ఆర్,కృష్ణ, రాధిక, శ్రీదేవి లతో వయ్యారి భామలు వగలమారి భర్తలు తీసే టైం లొనే  యన్.టి.ఆర్ గారు తెలుగుదేశం స్థాపించి ఘన విజయం సాధించారు.అలాంటి ఆయన చేతుల మీదుగా టీజర్ విడుదల అవుతున్న ఈ విన్నర్ ట్రిప్ కూడా ఘన విజయం సాదించాలని అన్నారు.


 ప్రొడ్యూసర్ కౌన్సిల్  సెక్టార్ వైస్ ఛైర్మన్ రాదా రాజేశ్వరి  మాట్లాడుతూ ..ఈ సినిమా పేరులోనే విన్నింగ్ ఉంది కాబట్టి ఈ "విన్నర్ ట్రిప్" పెద్ద విజయం సాధించాలని అన్నారు.


 చిత్ర దర్శకుడు తెలుగు శ్రీను మాట్లాడుతూ.. యఫ్,యమ్ రేడియోలో విన్నర్ ట్రిప్ కు సెలెక్ట్  అయిన బ్యాచ్ గోవాకు వెలితే.. అక్కడికెళ్లిన ఈ బ్యాచ్ ఒక ముఠా చేతిలో ఇరుక్కొని చివరకు ఎలా బయట పడ్డారు,ఎంత మంది మిగిలారనే ఆశక్తి కరమైన కథాంశంతో ఈ  "విన్నర్ ట్రిప్" ను తీయడం జరిగింది. మొదట"గోవా మాఫియా" పేరుతో షూటింగ్ స్టార్ట్ చేసి 32 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. షూటింగ్ పూర్తి అయిన తరువాత కథకు, సినిమాకు యాప్ట్ అవడం లేదని "విన్నర్ ట్రిప్" టైటిల్ పెట్టడం జరిగింది. నటీ, నటులందరు హార్డ్ వర్క్ తో చాలా బాగా నటించారు. నాకీ అవకాశమిచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.


 చిత్ర నిర్మాత సంపత్ శ్రీను మాట్లాడుతూ.. ఇంటర్ చదువు కొనే రోజుల్లో నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో  2008 లో సినిమాలో హీరో అవ్వాలని వచ్చిన నేను హరో గా చేశాను కానీ ఆ సినిమా విడుదల కాకపోవడంతో తిరిగి మా ఊరికి వెళ్లడం జరిగింది. తరువాత సినిమా  హీరో వచ్చాడని  అందరూ ఎగతాళి చేసేవారు.తరువాత నాతో పాటు మా అమ్మ,, నాన్నలు కూడా ఎంతో అవమానం పడ్డారు దాంతో నాలో కసి పెరిగి ఎలాగైనా సినీ ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకోవాలని చదువు పేరుతో హైదరాబాద్ వచ్చి ఇక్కడ చాలా కష్టపడ్డాను. నా కొడుకు హీరో కాలేకపోయినా నటులకు అవకాశం కల్పించే స్థాయికి ఎడిగాడని నా తల్లి,తండ్రి గర్వంగా చెప్పుకోవాలని ఏంతో కష్టపడి  ఈ సినిమా చేయడం జరిగింది. సినిమా ఔట్ ఫుట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలంటే డబ్బు పెడితే రాదు.మా టీం అంత మనసుపెట్టి ఈ సినిమాకోసం కష్టపడి దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేశారు.అలాగే మా బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్ 2 గా ఇంకొక చిత్రం స్టార్ట్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాలో కూడా కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నాను.అలాగే ఈ "విన్నర్ ట్రిప్"  సినిమా చాలా బాగా వచ్చింది.మీ అందరికీ తప్పక నచ్చుతుంది.వచ్చే నెల మొదటి వారంలో విడుదల అవుతున్న మా సినిమాను ప్రేక్షకులందరు ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.


 హీరో మహి మాట్లాడుతూ .. నేను హీరో అవ్వడానికి ఇన్స్పిరేషన్ మా నాన్నగారే వారి సపోర్ట్ తో ఇండస్ట్రీ లోకి వచ్చిన తరువాత దర్శక,నిర్మాతలు సపోర్ట్ మరచిపోలేను.నాకీ అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞతలు అని అన్నారు.


 హీరోయిన్ సోనాపటేల్ మాట్లాడుతూ ..సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.ఈ చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది అని అన్నారు.


 నటీనటులు

మహి,సోనాపాటిల్,రవి కుమార్, శ్రీకర్, ప్రకాష్, దినేష్,ఆనంద్,కిషోర్, మనోహర్,లోగన్,ప్రవీణ్ తదితరులు


 సాంకేతిక నిపుణులు

నిర్మాత :- సంపత్ శ్రీను(శ్రీను కుక్క మూడి),   సహాయ నిర్మాత :- కె.లక్ష్మణ్ రావు

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం :-  శ్రీను తెలుగు

మ్యూజిక్ :- శశాంక్ భాస్కరుని

బ్యాక్ గ్రౌండ్ స్కోర్..రాము గండికోట

ఎడిటింగ్ :-  ఈశ్వర్ విరాట్

కెమెరా :- మహేష్ మట్టి

పి.ఆర్.ఓ  :-మధు వి.ఆర్

Anil Ravipudi Interview About Gaali Sampath

 *ఫ‌న్ అండ్ ఎమోష‌న్స్‌తో తెర‌కెక్కిన `గాలి సంప‌త్` ఆడియన్స్‌ని ‌ తప్పకుండా థ్రిల్ చేస్తుంది - బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.*



`ప‌టాస్`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి వ‌రుసగా ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించి ప్ర‌స్తుతం ఎఫ్ 3 చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తూ స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ చేస్తున్న‌‌ చిత్రం `గాలి సంప‌త్`.  శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఇంట‌ర్వ్యూ. 


గాలి సంప‌త్ ఎలా మొద‌లైంది?

– నా ఫ్రెండ్‌ ఎస్‌.కృష్ణ నా అన్నిసినిమాలకు రైటర్‌గా పని చేశాడు. నిర్మాతగా లాంచ్‌ అవ్వాలని తను గాలిసంపత్‌ కథ రాసుకున్నాడు. గాలి సంపత్‌ అని విని...గాలికి తిరిగే ఓ వ్య‌క్తి క‌థ ఏమో అనుకున్నాను. కాని నోట్లో నుంచి మాట రాకుండా కేవలం గాలిమాత్రమే వచ్చేలా గాలి సంపత్‌ క్యారెక్టర్‌ ఉంటుంది అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అదీకాకుండా నేను ఇంగ్లీష్ ఫిలింస్ కొన్ని చూశాను. క్యాస్ట్ అవే, లైఫ్ఆఫ్ పై. 127 అ‌వ‌ర్స్ ఇలాంటి ఓన‌ర్‌లో తెలుగులో ఆ సెట్ ఆఫ్ ఫిలింస్ రాలేదు. అలాగే ఒక గొయ్యిలో పడిన వ్యక్తి ఎలా పైకి వస్తాడు? అన్న కాన్సెప్ట్ న‌న్ను ఎగ్జైట్ చేసింది. దాంతో ఒక‌ సమర్పకుడిగా నేను గాలిసంపత్‌ టీమ్‌తో ట్రావెల్‌ అయ్యాను. ఒక టీమ్‌ వర్క్‌లా గాలి సంపత్‌ను పూర్తి చేశాం. రేపు మార్చి 11న సినిమా విడుద‌ల‌వుతుంది. 


అనీష్ మేకింగ్ గురించి చెప్పండి? 

– దర్శకుడు అనీష్‌ చేసిన అలా ఎలా? సినిమా చూశాను నేను. అనీష్‌ సెన్సిబుల్‌ డైరెక్టర్‌. సెకాండాఫ్‌లో వచ్చే గొయ్యి సీన్స్, క్లైమాక్స్‌ సీన్స్‌లో చిత్ర యూనిట్‌ను డిస్ట్రబ్‌ చేయకుండా వారికి కావాల్సిన సహాయం చేశాను. నా ఫ్రెండ్‌ కృష్ణతో పాటు మరికొందరికి ఈ సినిమా తొలి సినిమా. అందుకే కాస్త ఎక్స్‌ ట్రా కేర్‌ తీసుకున్నాం.


ఈ సినిమాకు స్క్రిప్ట్ ప‌రంగా మీ గైడెన్స్ ఎంత వ‌ర‌కూ ఉంది?

- స్క్రిప్ట్‌ పరంగా హెల్ప్‌ చేశాను. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే చూసుకున్నాను. అరకులోని హిల్‌ స్టేషన్‌లో జరిగే కథ ఇది. ఓ ఇంటి వెనక ఉన్న పాడుబడ్డ 30 అడుడుల బావిలో పడిన ఓ మాటలు రాని వ్యక్తి ఎలా భయటపడ్డాడు?. వర్షం పడినప్పుడు అతను ఎదుర్కొన్న పరిస్థితిలు ఏమిటీ? వాళ్లు ముందే ఆ బావిని ఎందుకు పూడ్చలేదు? అన్న అంశాల చూట్టూ గాలిసంపత్‌ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో నేచ‌ర్‌కి సంబందించిన ఒక బిగ్ ఎలిమెంట్ ఉంది. రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు తండ్రీ కొడుకులుగా చేశారు. వారితో పాటు వ‌ర్షం కూడా ఒక పాత్ర పోషించింది. నేచ‌ర్ అనేది విల‌న్‌లాగా ఫీల‌య్యే ఈ మాట‌లు రాని వ్య‌క్తి ఆ నేచ‌ర్‌తో ఎలా ట్రావెల్ అయ్యాడు అనే ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఉంది. ఇవ‌న్ని క‌థ‌కు త‌గ్గ‌ట్టు బ్లెండ్ చేశాం. 


 రాజేంద్రప్రసాద్, శ్రీ విష్ణు పాత్ర‌లు ఎలా ఉంటాయి?

– ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారు, శ్రీ విష్ణు తండ్రీకొడుకులు. తండ్రిది ఒక లక్ష్యం. కొడుకుది మరొక లక్ష్యం. రెండు వేరు వేరు దారులు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య చోటుచేసుకునే ఈగో క్లాషెష్‌నే గాలిసంపత్‌ కథ. రాజేంద్రప్రసాద్‌గారు ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. తండ్రి వల్ల ఇబ్బందులు పడే కొడుకు పాత్రలో శ్రీవిష్ణు యాక్ట్‌ చేశారు. బాగా చేశాడు. శ్రీ విష్ణుకు మంచి లవ్‌ట్రాక్ కూడా ఉంటుంది. తండ్రీకొడుకుల మధ్య దూరం పెరగడానికి ఈ లవ్ కూడా ఓ కారణం. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు ఈ సినిమాలో వర్షం కూడ ఓ విలన్‌లా కనిపిస్తుంది. అదీ ఎలా అనేది సినిమాలో చూడండి. ఆడియన్స్‌ తప్పకుండా థ్రిల్‌ అవుతారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలకు గాలిసంపత్‌ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది.


మీ పేరు ఉంది కాబ‌ట్టి మీ గ‌త చిత్రాల్లాగే ఇది కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్ అనుకుంటారు క‌దా?

– నా పేరు ఉంది కదా అని ఇది కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ అని చెప్పను. ‘ఎఫ్‌2’లా ఉండదు. సినిమాలోని తొలిపార్టు సరదాగా ఉంటుంది. సెకండాఫ్‌లో మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. ఇంతవరకు నేను విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయలేదు. ఈ సినిమాకు అసోసియేషన్‌తో ఆ అనుభవం వచ్చింది. కాస్త కొత్తగా అనిపించింది. మాటలు రాని వ్యక్తి ఊహించని విధంగా గోయ్యిలో పడితే ఎలా ఉంటుంది? అతను ఎలా భయటకు వచ్చాడు? అన్న అంశాలను ఆడియన్స్‌ ప్రిపేరై వస్తే సినిమాను బాగా ఆస్వాదిస్తారు. అందుకే ట్రైలర్‌లోనే ఆల్మోస్ట్ కథ చెప్పేశాము. ఈ సినిమా ఎక్కువమందికి రీచ్‌ కావడానికి వారి వెనక నేను నిలబడ్డాను. కథలో గ్రిప్‌ ఉంది. అందుకే ఎమోషన్స్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను కలిశాయి. వీటిని ఆసక్తికరంగా ఎలా డీల్‌ చేశామన్నది ఆడియన్స్‌ వెండితెరపై చూడాలి. నా ఫ్రెండ్‌, ఈ సినిమా నిర్మాత ఎస్‌.కృష్ణ కథ రాసుకున్నారు. క్యాస్ట్‌ అండ్‌ క్రూ ఎంపికను తనే చూసుకున్నాడు. నేను ఒక ఫ్రెండ్‌గా అతనికి సహాయం చేశాను అంతే.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ అచ్చురాజ‌మ‌ణి గురించి?

– ఈ సినిమాలోని ఆర్‌ఆర్‌ గురించి కాస్త టెన్షన్‌ పడ్డాను. ఎందుకంటే సెకండాఫ్‌లో రాజేంద్ర‌ప్రసాద్‌గారికి కంప్లీట్‌గా మాటలు రాన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తోనే కథ ముందుకు వెళ్లాలి. కానీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ బాగా చేశారు. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక నేను షాక్‌ అయ్యాను. అచ్చులో అంత టాలెంట్‌ ఉందా? అని నాకు అనిపించింది. అలాగే  సత్య క్యారెక్టర్, కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. రాజేంద్రప్రసాద్‌గారి క్యారెక్టర్‌కు డబ్బింగ్‌ చెబుతుంటాడు.


క‌థ, స్క్రీన్ ప్లే మీకు కొత్త కాదు..ఈ సినిమాకి సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎలా అనిపించింది ?

– దర్శకుడిగా వచ్చినప్పుడే హ్యాపీగా ఉన్నాను. సమర్పకుడిగా వచ్చినప్పుడు నిర్మాతకు ఉండే కష్టాలు తెలిశాయి. గాలిసంపత్‌ సినిమాకు సాహు, హరీష్‌లు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. సినిమా పరంగా ఇప్పటివరకు అయితే నిర్మాతలు సేఫ్‌. తక్కువ బడ్జెట్‌లోనే కంప్లీట్‌ చేశాం. లెక్కలు చెప్పలేను. మిర్చి సినిమాలో ప్రభాస్‌గారు చెప్పినట్లు ‘మనం సేఫ్‌’ అన్నారు. సాహుగారితో ఓ సినిమా చేయాలని సుప్రీమ్‌ టైమ్‌ నుంచే అనుకుంటున్నాను. కానీ కుదర్లేదు. త్వరలో వారితో కూడా ఓ సినిమా చేస్తాను.


మీరు ఒక స్టార్ డైరెక్ట‌ర్ కదా..ఈ విధంగా చిన్న సినిమాల‌కు మీ ప్రోత్సాహం కంటిన్యూ అవుతుందా?

– చిన్న సినిమాలను తప్పకుండా ప్రొత్సహిస్తాను. కంటెంటే పెట్టుబడి. నేను స్టార్ట్‌ అయ్యిందదే చిన్న సినిమాల నుంచి. కానీ ప్రజెంట్‌ అనిల్‌ రావిపూడి సినిమాలు అంటే ఆడియన్స్‌లో ఓ రకమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. వాటిని బ్రేక్‌ చేయ కూడదు. టైమ్‌ వచ్చినప్పుడు నేను కూడా చిన్న సినిమాలను చేస్తాను.


‘ఎఫ్‌3’ అప్‌డేట్ ఏంటి?

– ‘ఎఫ్‌3’ షూటింగ్‌ 22 డేస్‌ చేశాం. ‘ఎఫ్‌ 2’ నచ్చిన వారంద‌రికీ ‘ఎఫ్‌ 3’ కూడా నచ్చుతుంది. ఇది ఎఫ్ 2కి సీక్వెల్‌ కాదు. ‘ఎఫ్‌ 2’ అనేది భార్యల గురించి ఫ్రస్ట్రేషన్‌ అయితే ఎఫ్‌ 3 డబ్బు గురించి ఫ్రస్ట్రేషన్‌. ఎఫ్ 2 కంటే మూడింత‌లు ఎక్కువ‌ న‌వ్విస్తుంది ఎఫ్‌ 3 


మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్?

- బాల‌కృష్ణగారితో సినిమా చేయాల‌ని చాలా సార్లు అనుకున్నాం..ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు. మ‌హేష్ బాబుగారితో మ‌రో సినిమా డిస్క‌ర్ష‌న్ స్టేజ్‌లో ఉంది. అలాగే రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. వీటితోపాటు  

ఓ లేడీ ఓరియంటెడ్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేద్దామనుకున్నాను. భవిష్యత్‌లో త‌ప్ప‌కుండా ఓ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేస్తాను. 

* బాలీవుడ్‌లో మా ‘ఎఫ్‌ 2’ సినిమా రీమేక్‌ అవుతోంది. నేను నా సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలనుకుంటే పటాస్‌ను రీమేక్‌ చేస్తాను. ఆ సినిమా హృతిక్‌రోషన్‌తో చేయాలని ఉంది.

* లైఫ్‌లో మనకు ఇల్లు, పని ముఖ్యం. పని ఎలాగు చేస్తున్నాం..చేస్తాం..కాబ‌ట్టి కుటుంబం కోసం ఓ మంచి ఏరియాలో ఇల్లు తీసుకున్నాను.

Tremendous Response for Mini Katha



యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో రూపొందుతున్న 'ఏక్ మినీ కథ' ఫస్ట్ లుక్ కి విశేష స్పంద‌న‌


కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన లుక్ కు మంచి స్పందన వస్తుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్  రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.


నటీనటులు: సంతోష్ శోభన్


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: కార్తీక్ రాపోలు

నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్

కథ: మేర్లపాక గాంధీ

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి

ఎడిటర్: సత్య

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్ 

Friend Ship Teaser Released

 


యాక్షన్ కింగ్ అర్జున్-క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్

"ఫ్రెండ్ షిప్" (సింగ్ & కింగ్) టీజర్ విడుదల!!


     'క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్' కలయికలో...  25 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం "ఫ్రెండ్ షిప్". 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని "ఫ్రెండ్ షిప్" పేరుతోనే.. 'సింగ్ అండ్ కింగ్' అనే ట్యాగ్ లైన్ జోడించి.. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ తెలుగులో నిర్మిస్తున్నారు.

     ఈ చిత్రం చివరి షెడ్యూల్ 

కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. మాజీ 'మిస్ శ్రీలంక' మరియు తమిళ బిగ్ బాస్ విన్నర్ 'లోస్లియా' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో..  ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది.

     నిర్మాత-శ్రీలక్ష్మి జ్యోతి క్తియేషన్స్ అధినేత ఏ.ఎన్.బాలాజీ మాట్లాడుతూ... "ఇప్పటివరకు నేను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 50కి పైగా సినిమాలు నిర్మించాను. నా కెరీర్ లో తొలిసారి "ఫ్రెండ్ షిప్" చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాను. ఈ చిత్రం టీజర్ విడుదల చేశాం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

     ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మాటలు: రాజశేఖర్ రెడ్డి, సంగీతం: డి.ఎం.ఉదయ్ కుమార్, సినిమాటోగ్రఫీ:  శాంతకుమార్, నిర్మాత: ఏ.ఎన్.బాలాజీ, దర్శకత్వం: జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య!!

Oka Yuvatha Kadha Logo Launched

  


`ఒక యువ‌త క‌థ‌` లోగో లాంచ్‌!!

         

   ప్ర‌వీణ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సూర్య కుమారి వ‌ర్క్స్ ప‌తాకంపై శ్రీమ‌తి ఏలూరి సూర్య కుమారి నిర్మాత‌గా ఆప‌తి ప్ర‌వీణ్ కుమార్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఒక యువ‌త క‌థ‌`. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం లోగో లాంచ్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత‌లు తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయి వెంక‌ట్ చేతుల మీదుగా జ‌రిగింది.

 ఈ సంద‌ర్భంగా అతిథులుగా విచ్చేసిన త‌మ్మ‌‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ, ల‌య‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ...``మ‌హిళా దినోత్స‌వం రోజున మ‌హిళా నిర్మాతగా తెర‌కెక్కుతోన్న `ఒక యువ‌త క‌థ‌` చిత్రం లోగో ఆవిష్క‌ర‌ణ మా చేతుల మీదుగా చేయ‌డం ఆనందంగా ఉంది. దాదాపు 30 మందిని కొత్త వారిని తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ రూపొందుతోన్న ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.

 చిత్ర‌ నిర్మాత ఏలూరి సూర్య కుమారి మాట్లాడుతూ..``సినిమా రంగంపై ఆస‌క్తితో తొలిసారిగా నిర్మాత‌గా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి  కొత్త వారిని హీరో హీరోయిన్స్ గా ప‌రిచ‌యం చేస్తూ ఈ చిత్రాన్ని ప్రారంభించాము. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. మా యూనిట్ స‌హ‌కారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకున్న విధంగా సినిమా వ‌స్తోంది. ఈ రోజు మా సినిమా లోగో లాంచ్ కి విచ్చేసిన అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తారని కోరుకుంటున్నా`` అన్నారు.

 ద‌ర్శ‌కుడు ఆప‌తి ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ...``ల‌వ్ అండ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశం ఇది. ప్ర‌స్తుత యువత న‌డ‌త ఎలా ఉంది? అనేది చూపిస్తూ అంత‌ర్లీనంగా మంచి సందేశాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాం.  మా నిర్మాత ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ‌తో సినిమా చాలా బాగా వ‌స్తోంది. నటీన‌టులు కొత్త‌వారైన‌ప్ప‌టికీ ఎంతో శ్ర‌ద్ధ‌తో చేస్తున్నారు`` అన్నారు.

 భ‌ర‌త్ మహేశ్వ‌రం, హేమంత్ వ‌ర్మ‌, అజిత్ సింగ్‌, సిరిల్ గాలంకి, ఖుష్బు వైష్ణ‌వ్, నందిగామ పూజిత‌, ప్రియ వైష్ణ‌వ్ యం.ఎస్ నందిని , ర‌త్న‌శ్రీ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః జ‌య‌సూర్య‌;  మాట‌లుః మ‌ల్లేష్ రాజు మొగుడంప‌ల్లి;  కొరియోగ్ర‌ఫీః తాజుద్దీన్‌;  ఫైట్స్ః హుస్సేన్ మాస్ట‌ర్; క‌థ‌-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః ఆప‌తి ప్ర‌వీణ్ కుమార్‌. 


Hebba Patel Telisinavaallu Movie Details

 


A Movie Named Telisinavaallu Is Being Made By New Production House Named Syringe Cinema.

Ksv Films Who Earlier Produced Nandi Award Winning Hithudu With Jagapati Babu Is Presenting It.

Written And Directed By Viplove Koneti, This Film Is Tout To Be A Genre-bending Outing Where Family-romance-thriller-mystery Elements Are Interlinked To Give A New Kind Of Cinema On Telugu Screen. Ram Karthick Essays The Role Of Protagnoist While He Is Paired With Hebah Patel In A Never-seen-before Characterisation In This Movie , Which Is Amply Supported By Exemplary Actors Like Naresh, Pavitra Lokesh, Jaya Prakash In Pivotal Roles And Other Cast Includes Various Persona From Upcoming Talent Bundles. Technicians Were A Blend Of Film School Graduates Along With Seniors In The Industry. The Team Toiled Hard For Two Schedules And The Film Is Finished To 80% And Entering The Final Schedule And Also Starting Post Production Works.


Movie Name  Telisinavaallu

Producer   Syringe Cinema

Presented By  Ksv Films

Story Screenplay Direction: Viplove Koneti

Cinematography  Ajay V Nag

Editor  Dharmendra Kakarala

Music Deepak Venugopalan

Lyrics Doctor Zhivago

Art Upender Reddy

Choreography  Javed Master , Shailaja Master

Fights Ch Ramakrishna

Line Producer Dr Jk Siddhartha

Co Director Katigalla Subbarao

Pro  Madhu Vr

Digitial Promotions Prasad Lingam  , Dheeraj


Paisa Paramathma Releasing on March 12th

 


సస్పెన్స్ ఎంటర్టైనర్ తో రూపొందిన  "పైసా పరమాత్మ" ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తుంది-దర్శక, నిర్మాత విజయ్ కిరణ్ కుమార్  ..!!!


కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం 'పైసా పరమాత్మ' . సాంకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టి.కిర‌ణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కిర‌ణ్ తిరుమల  దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.. కాగా ఈ చిత్రం మహా శివరాత్రి సందర్బంగా  మార్చి 12 భారీగా విడుదల కానుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత కిరణ్ కుమార్ తిరుమల,  హీరోలు సాకేత్, సుధీర్, నటులు కృష్ణ తేజ, ముక్కు అవినాష్, రమణ, హీరోయిన్స్ ఆరోహి నాయుడు, భనిష, సంగీత దర్శకుడు కనిష్క, కోడైరెక్టర్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. 


దర్శక, నిర్మాత కిరణ్ కుమార్ తిరుమల మాట్లాడుతూ.. ' మానవ నిత్య జీవితంలో అందరూ నమ్మేది, నమ్మించేది పైసా.. దానిని బేస్ చేసుకొని 8 క్యారెక్టర్స్ చుట్టూ కథ జరుగుతోంది.. ప్రధానంగా సస్పెన్స్,   యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. రెగ్యులర్ సినిమాలా కాకుండా కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా కనిష్క ఇచ్చిన మ్యూజిక్, అర్ అర్ సినిమాకి మెయిన్ హైలెట్. ఆర్ ఆర్ సాంగ్స్ రింగ్ టోన్స్ పెట్టుకుంటారు. అంత అద్భుతంగా కనిష్క్ చేసాడు.  అలాగే  బాబు ఇచ్చిన విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. సస్పెన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో యాక్షన్ డ్రామా థ్రిల్లర్ చిత్రం ఇది. మార్చి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదు.. అన్నారు. 


మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క మాట్లాడుతూ.. ' డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందిన పైసా పరమాత్మ చిత్రం అందరికీ నచ్చుతుంది. నటీ నటులు అందరూ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చేశారు.. ఈ చిత్రంలో రెండు సాంగ్స్ ఒక రిమిక్ సాంగ్ ఉంటుంది.. సినిమా చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 


హీరో సాకేత్ మాట్లాడుతూ.. ' ఈ చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చిన కిరణ్ గారికి ఋణపడి ఉంటాను. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందిన ఈ చిత్రం అనేక ట్విస్ట్ లతో సాగుతుంది.. అన్నారు. 


మరో హీరో సుధీర్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. మా పైసా పరమాత్మ కూడా కొత్త కంటెంట్ తో వస్తోంది. ఆడియెన్స్ అందరూ మా చిత్రాన్ని ఆదరించాలి  అన్నారు. 


నటుడు కృష్ణ తేజ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో నటించాను. నా 14ఏళ్ళు సినీ కేరియర్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన చిత్రం ఇది. మెస్మరైజింగ్ చేస్తుంది. ప్రతీ ఒక్కరూ నా క్యారెక్టర్ ని ఓన్ చేసుకుంటారు. అంత అద్భుతంగా కిరణ్ డిజైన్ చేసాడు.. ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కూడా ఇంకా బాగుంటుంది.. అన్నారు. 


హీరోయిన్ ఆరోహి నాయుడు మాట్లాడుతూ.. కంప్లీట్ టీం వర్క్ ఇది. డైరెక్టర్ కిరణ్ గారు ప్రతి క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేశాడు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను.. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన కిరణ్ గారికి నా థాంక్స్.. అన్నారు. 


నటి బనిష మాట్లాడుతూ.. ' నేను, అవినాష్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. టీమ్ అందరం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ముఖ్యంగా కిరణ్ గారు వన్ మాన్ షోలా ఈ చిత్రాన్ని చేశారు. ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది.. అన్నారు. 


కమిడియన్ ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. కెమెరామెన్ జియల్ బాబు కాల్ చేసి ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఉంది చేయాలి అన్నారు.. కిరణ్ చెప్పిన సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది.. అందరికీ నచ్చుతుంది.. అన్నారు. 


 నటుడు రమణ మాట్లాడుతూ.. కథని నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. ఒక ముఖ్యపాత్రలో నటించాను. సినిమా చూశాను.. చాలా బాగుంది.. అందరికీ నచ్చుతుంది.. అన్నారు. 


రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ' కిరణ్ గారు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సినిమా బాగా వచ్చింది.. మార్చి 12న విడులవుతుంది.. సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు.  


 సాంకేతిక విభాగం : 

బ్యానర్ :  ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్

మ్యూజిక్ : కనిష్క్

దర్శకుడు : విజయ్ కిర‌ణ్ తిరుమల

నిర్మాత  : టి.కిర‌ణ్ కుమార్

Narisenaglobal empowers women spread across 20 countries

Narisenaglobal empowers women spread across 20 countries



At Narisena Global women forum, Hitex. 

Narisena is now having 6,000 members from 20 countries & all over india conducting online courses ,empowering women going with motto women supporting women 

Inspiring remarks derive from women of all walks of life. Now more than ever, women in business, entertainment and everything in between recognize the importance of lifting each other up to thrive in success. These women also understand the growing need to empower one another to be brave in the face of fear.

Looking to celebrate the ladies in your own life? We collected an array of empowering quotes for women to help you find the right words to say.and right Narisena group Find the perfect saying to dedicate and honor the strong women who impact you every day.

RamAlladi to Direct Sanskrit movie titled Nabhamsi


Award winning film maker Ram alladi to direct a sanskrit movie "Nabhamsi"

Award winning director Ram Alladi and the makers of Ra’s Metanoia are again to team up to present “Nabhamsi”, a feature length film set a millennium back into India’s rich and astonishing history. “Nabhamsi” is a Sanskrit word meaning “Skies” in english.


New York based Indian film maker Ram Alladi has previously won plaudits for his documentary, Chiselled, and has more recently released (November 2020) the exceptionally well received Ra’s Metanoia, a celebration of the life of Mohandas Karamchand Gandhi, filmed entirely on digital sets, depicting a range of eras and locations central to Gandhi’s life.      


As a director this is His 3rd project. “Nabhamsi” is the story of one man’s journey, over the course of a lifetime, to identify the source of one of his first and most primal memories. “Nabhamsi”  is a live action romance, unique for being written and performed in one of the subcontinent's most ancient languages, Sanskrit. 


The preproduction work took 5-6 months and film is all set to hit the sets on international women's day 8th March, The 75% of shoot is planned in the US and rest 25% in India. 

The story is accompanied by English open captions and closed captions in many other languages. 


Alongside the literature, “Nabhamsi” s themes will be explored and accentuated through the use of several forgotten Indian dance art forms to narrate the story, all illustrated with a rich palette of vivid colors which reflect the vibrancy and energy of both the period and the culture of India over one thousand years ago.


"Kannada director GV iyer directed first sanskrit movie "Aadhi Sankaracharya" followed by "Bhagavadgita" Audience appreciated them, that inspired me for "Nabhamsi" I learnt sanskrit for this dedicatedly more details will be announced soon and film is planned to be released in 2022" Says Ram alladi (director) 


Dialogues: saritha Navaali, Madhu Guntupalli, editor:Rakesh Challa, Cinematography:Ram alladi -satish rontala, Music: bharadwaj V. Komaragiri, production house:AR it works, screenplay-direction: Ram Alladi


Bumper Offer 2 Announced Shoot Starts Shortly

 


With the blessings of Puri Jagannadh, Sai Raam Shankar's Bumper Offer 2 Announced 


The film ‘Bumper Offer’ was a breakthrough film for hero Sai Raam Shankar. After 12 long years, the second part is ready however this is not a sequel but will be whole together a fresh subject.
With the blessings of Tollywood’s leading Dashing and Daring Director Puri Jagannadh, ‘Bumper Offer 2’ is officially announced. This is going to be an out and out commercial entertainer set against the backdrop of Rayalaseema region.
Jayaravindra who directed ‘Bumper Offer’ will also helm the second part while Ashoka has penned the script. The regular shooting of ‘Bumper Offer 2’ kick starts on Ugadi festival i.e, in April.Heroines and Other Technicians will be announced Soon

Melody Brahma Mani Sharma will be composing music while Pappu will handle the cinematography. Technicians such as Kotagiri Venkateswara Rao and Varma for editing and art work are signed for the movie.

Suresh Yellamaraju is producing the movie under Suresh Vijaya Productions, and also with this film hero Sai Raam Shankar is marking his debut as producer on Cinemaas Dukan

Cast: Sai Raam Shankar

Crew:
Director: Jayaravindra
Producers: Suresh Yellamaraju, Sai Raam Shankar, 
Banners: Cinemaas Dukan, Suresh Vijaya Productions
Executive Producer: Baskar Raju Chamarthi
Music: Mani Sharma
Cinematography: Pappu
Editor: Kotagiri Venkateswara Rao
Story: Ashoka
Art: Varma
PRO: LakshmiVenugopal
Stills: Sebastian Brothers
Publicity Designs: Dhani Aelay

Padmaja Film Factory IKSHU First Look soon

 


పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెంబర్ :1 "ఇక్షు"


పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై హనుమంతరావు నాయుడు, డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మాతగా.. ఋషిక  దర్శకత్వంలో , రామ్ అగ్నివేష్ కథానాయకుడిగా "ఇక్షు" చిత్రం ప్రారంభమై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని దర్శకులు ఋషిక తెలిపారు. ఇటీవలే

 మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాము. ఈ నెలాఖరునుండి మొదలయ్యే రెండవ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ సినిమా చాలా బాగా వస్తుందని, మేము ఏదైతే అనుకుంటున్నామో.. అనుకున్నది అనుకున్నట్టుగా దర్శకులు చాలా బాగా తెరకెక్కిస్తున్నారని, ప్రస్తుతం సాంగ్స్ రికార్డింగ్ అయిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాత అశ్వినీ నాయుడు తెలిపారు.


ఈ మధ్య రిలీజ్ అయిన "ఇక్షు"  టైటిల్ పోస్టర్ కు మంచి ఆదరణ వచ్చింది. త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ తో మీ ముందుకు వస్తానని దర్శకులు ఋషిక తెలిపారు.


 నటీనటులు

రాజీవ్ కనకాల, కాళికేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిద, కెప్టెన్ చౌదరి, తదితరులు


 సాంకేతిక నిపుణులు

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం :- ఋషిక

మ్యూజిక్ :- వికాస్ బాడిస

ఎడిటింగ్ :- ఎస్.బి ఉద్ధవ్

కెమెరా :- నవీన్ తొడిగి

ఆర్ట్స్ :- రాజు

పాటలు :- కాసర్ల శ్యామ్

కొరియోగ్రఫీ :-మనిత శ్రీనివాస్

మాటలు :- మున్నా ప్రవీణ్,

మూల కథ :- మనోహర

కో- డైరెక్టర్ :- మురళీకృష్ణ.ఎస్, సూర్య బండారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- సుజిత్ కుమార్ గుత్తుల, చిత్రం శ్రీను

క్యాస్టూమ్స్ :- అయ్యప్ప గుంటూరు

మేకప్ :- నారాయణ

మేనేజర్ :- సి.హెచ్. శ్రీనివాస్

పోస్టర్ డిజైనర్ :- వివ

పబ్లిసిటీ డిజైనర్ :- వివారెడ్డి

రవిప్రసాద్ యూనిట్,సారథి స్టూడియోస్

పి ఆర్ ఓ :-మధు వి.ఆర్


Tremendous Response for Chavu Kaburu Challaga Trailer



అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న కార్తికేయ ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ థియేట్రికల్ ట్రైలర్.. 


మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారు పేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌ తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్.. మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్, ఇంట్రోతో పాటు క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు, క‌దిలే కాలాన్ని, పైన పటారం లోన లొటారం పాటల‌‌కు అనూహ్య స్పంద‌న ల‌భించింది. తాజాగా ట్రైలర్ కూడా అదే రకంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రికి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

"ఆకలి నిద్ర మూర్ఖత్వం ఇవి కాకుండా.. 

జాలి దయ మానవత్వం అంటే ఏంటో తెలుసారా నీ మనస్సాక్షికి.. "

"అమ్మాయిలందరూ ఎదవలకే పడతారంటారు.. అందులో నేను నెంబర్ వన్.. నన్ను మించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది నీకు.."

" ఇందాక ఫోన్ లో చూసావే.. నాది యాక్టింగ్ మాత్రమే.. నువ్వు ఎక్కువ చేసావ్ అనుకో.. నీకు ఒరిజినల్ పడిపోద్ది.." 

అంటూ ట్రైలర్ లో వచ్చే డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న వస్తుంది. మాస్ అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే ట్రైలర్ కూడా వచ్చింది అని తెలిపారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.


నటీనటులు..


కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు


సాంకేతిక వ‌ర్గం..


స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్

బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్

నిర్మాత - బ‌న్నీ వాసు

దర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి

ఎడిట‌ర్‌- స‌త్య జి

ఆర్ట్‌ - జి ఎమ్ శేఖ‌ర్‌

మ్యూజిక్ - జేక్స్‌ బిజాయ్

సినిమాటోగ్రాఫ‌ర్ - క‌ర‌మ్ ఛావ్లా

అడిషిన‌ల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ - రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు

పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

లిరిక‌ల్ వీడియోస్ - క్రేజీ షౌట్

ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ - మ‌నిషా ఏ ద‌త్‌

కాస్ట్యూమ్ డిజైన‌ర్ - మౌనా గుమ్మ‌డి 

Teja Sajja Priya Varrier Mega Super Good Films ISHQ First Zolt Out

 Teja Sajja Priya Varrier Mega Super Good Films ISHQ First Zolt Out



South India’s Prestigious Banner Megaa Super Good films is back in action in Telugu and their first film this year is with young hero Teja Sajja who recently scored a super hit with Zombie Reddy.


Priya Prakash Varrier plays the leading lady in the film directed by SS Raju. It is the joint production venture of NV Prasad, Paras Jain and Vakada Anjan Kumar. RB Choudary presents it.


Titled ISHQ, the film comes up with the tagline- Not a love story. The film’s first zolt is out and it is remarkable.


Teja looks serious in the poster, while Priya Prakash Varrier looks cool here flashing a smile on her face. The First Zolt is impressive and it justifies the tagline.


Mahathi Swara Sagar renders soundtracks and first song of the film released recently to good response. Sam K Naidu cranks the camera. Srimani pens lyrics, while A Vara Prasad and Vithal Kosanam handle editing and art departments respectively.


ISHQ will be hitting the screens soon.


Cast: Teja Sajja, Priya Prakash Varrier


Technical Crew:


Director  SSRaju

Producers: NV Prasad, Paras Jain, Vakada Anjan Kumar

Presenter: RB Choudary

Cinematography: Sam K Naidu

Music Director: Mahathi Swara Sagar

Editor: A Vara Prasad

Art Director: Vithal Kosanam

Lyric Writer: Srimani

 PRO: Vamsi-Shekar

Celebrated director SS Rajamouli unveils teaser of 'Aakashavaani'

 Celebrated director SS Rajamouli unveils teaser of 'Aakashavaani' 



'Aakashavaani', starring versatile actor Samuthirakani, Vijay Varma, Teja Kakumanu and Prashanth in key roles, is produced by Padmanabha Reddy on AU & I Studios. Ashwin Gangaraju, who has worked in the direction department of SS Rajamouli previously, is its debutant director. On Friday, the celebrated director Rajamouli unveiled its teaser and wished the team of the film all the best. "Such fresh visuals and groovy sound. I’m excited to see what Ashwin has created with his debut film (sic)," he tweeted, sharing the teaser. 


An idyllic village in the lap of a jungle; happy people inhabiting the serene village; joyous children who seem to be having fun... These visuals give way to the sight of a child getting scared at spotting a jungle man, and the villagers showing shock on their faces at the sight of an unrevealed element. At nights, the villagers are in search for something. The teaser is highly captivating with these elements. Samuthirakani is seen at two places in the teaser, which ends with him telling a character that something wrong is unfolding in the village. 


Composer Kala Bhairava, who is the son of MM Keeravani, is the film's music director. Well-known writer Sai Madhav Burra has penned the dialogue. Cinematography is by Suresh Raguthu. Sreekar Prasad, the National Award-winning editor, has edited the film. A period drama, the film has got a distinct concept. Post-production works are going on at a fast pace. 


Cast:


Samuthirakani, Vinay Varma, Teja Kakumanu, Prashanth and others. 


Crew:


Music Director: Kala Bhairava

Cinematographer: Suresh Raguthu

Dialogue writer: Sai Madhav Burra

Editor: Sreekar Prasad

Art Director: Mohan

Producer: Padmanabha Reddy

Writer, director: Ashwin Gangaraju

Good Response from Vijayawada Leaders for Devineni

 


బెజవాడ నాయకుల మెప్పు పొందిన "దేవినేని"



నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం) అనేది ట్యాగ్ లైన్. ఏపీ హైకోర్టు  విజయవాడ  నాయకులకు 'దేవినేని' సినిమా చూపించమని తెలపడంతో ఈ చిత్ర్రాన్ని గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో బెజవాడ నాయకులతో పాత్రికేయులకుకు ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందీ. చిత్ర ప్రదర్శమ అనంతరం చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా


 చిత్ర దర్శకుడు నర్రా శివనాగు మాట్లాడుతూ..

ఈ సినిమా కోసం చాలా గొడవలు జరిగిన విషయం

మనందరికీ తెలిసిన విషయమే.. కొంతమంది నాయకులు దర్శకుడు నర్రా శివనాగు "దేవినేని" టైటిల్ తో బెజవాడను కించపరచడానికి తీశాడని, ఈ సినిమా విడుదల అయితే ప్రశాంతంగా ఉన్న బెజవాడ కత్తుల వాడగా మారుతుందని  డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లును సినిమా విడుదల చేయకూడదని  హెచ్చరిచారు. అలాగే మా సినిమా పై కేసు వేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే.దానికి హైకోర్టు మాకు నోటీసులు పంపడం జరిగింది. దాంతో మేము కొంతమంది నాయకులతో మాట్లాడడం జరిగింది.ఆ తరువాత ఏపీ హైకోర్టు "దేవినేని" సినిమాను బెజవాడ  నాయకులకు ఈ సినిమా చూపించమని తెలపడం జరిగింది .కోర్టు చెప్పిన మేరకు ఈ సినిమాను బెజవాడ నాయకులకు చూపించడం జరిగింది సినిమా చూసిన తర్వాత వారు ఇందులో ఎలాంటి రెచ్చగొట్టే అంశాలు లేవని, విజయవాడలో రౌడీయిజం లేదని  గొప్పగా చూపించారని.ఈ సినిమా చాలా బాగుంది అని వారు ప్రశంసించారు. వారికి నా ధన్యవాదాలు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ భయపడకుండా ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించేలా బెజవాడ నాయకులు సహాయం చెయ్యాలని మనవి చేసుకొనుచున్నాను. ఈ వారంలో  విడుదలవుతున్న 14 సినిమాలలో  మా  సినిమా అత్యధికంగా 250 థియేటర్ విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉంది .మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకుని తీసిన ఈ సినిమా తెలుగు ప్రజలందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.


 చలసాని వెంకటరత్నం పాత్రలో నటించిన తుమ్మల ప్రసన్న కుమార్  మాట్లాడుతూ .విజయవాడ లో ఎలాంటి గొడవలు లేవని చిత్రం ద్వారా తెలియజేస్తూ..వంగ వీటి,దేవినేని ల మధ్య స్నేహం, బాంధవ్యాన్ని సినిమాటిక్ గా శివనాగు  తెరకెక్కించడం జరిగింది.సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని అన్నారు


 నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ .. దేవినేని గారి ఆశీస్సుల వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది విజయవాడ నుండి వచ్చిన వారు ఈ సినిమా చూసి బాగుందని చెప్పడంతో  నాకు ఎంతో సంతోషం అనిపించింది  వారి మాటలతో మా సినిమాకు మరిన్ని థియేటర్ పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నాను..మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కుటుంబం సమేతంగా చూడదగ్గ చిత్రం. ప్రేక్షకూలందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని అసిస్తున్నానని అన్నారు.


 చందు రమేష్ మాట్లాడుతూ.. రాజకీయానికి రాజధాని విజయవాడ ఆ  విజయవాడనీ కథగా తీసుకొని సినిమా తీశాడు శివనాగు.ఏ వ్యక్తికి అనుకూలంగా తీయకుండా సినిమాను ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చూపించాడు సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపారు


 లంకపల్లి నివాస్  మాట్లాడుతూ .. అన్ని వర్గాల వారిని నచ్చే విధంగా ఉన్న దేవినేని పెద్ద విజయం సాధించాలని అన్నారు.


 ఆర్టిస్ట్  మురళి మాట్లాడుతూ ...ఇందులో నేను దేవినేని మురళి గా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసిన తరువాత నేను చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు



 నటీనటులు

నందమూరి తారకరత్న , సురేష్ కొండేటి, ధ్రువతార,

బెనర్జీ తుమ్మల ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు కోటి,తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ,బాక్స్ ఆఫీస్ చందు రమేష్,లక్ష్మీ నివాస్, లక్ష్మీ నరసింహ తదితరులు


సాంకేతిక నిపుణులు

ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్

నిర్మాతలు :-జిఎస్ఆర్, రాము రాథోడ్

డైరెక్టర్ :-నర్రా శివనాగు

లిరిక్ రైటర్ :- మల్లిక్,

పి ఆర్ ఓ.:- మధు వి.ఆర్

Director Ram Gopal Varma’s ‘D Company’ Trailer Launched


 Director Ram Gopal Varma’s ‘D Company’ Trailer Launched


Director Ram Gopal Varma is a synonym for underworld mafia and gangster genres. Films like ‘Satya’ and ‘Company’ have showed the real face of the underworld and now RGV is bringing the true story of most wanted criminal Dawood Ibrahim with ‘D Company.’ The film has already generated enough buzz with its first look and now we have the trailer.


The trailer shows how a young lad rose to be the most wanted gangster in Mumbai. The film is set in the 1980s and how crime ruled the city. It also deals with 1993 Mumbai bomb blasts and how many gangsters made a name under the shadow of ‘D Company.’


The dialogues are powerful and yet again RGV gives his touch of capturing the visuals. The camera angles are placed in an interesting manner.


With ‘D Company’ Ashwat Kanth Sharma is making his debut as hero while Naina Ganguly and Irra mor are the female leads.


The film is produced by Sagar Machanuru on Spark Production Company. Currently in post-production stages, ‘D Company’ will release in theatres on March 26th.

Vijay Deverakonda Launched Papa o papa Video Song From Gaali Sampath




 క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేసిన గాలిసంప‌త్  `పాప ఓ పాప` సాంగ్‌.


బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో  శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా    రూపొందుతున్న చిత్రం `గాలి సంప‌త్`. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి  అనీష్  దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కి, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీలోని పాప ఓ పాప సాంగ్‌ని క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల‌చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.


`పాప ఓ పాప నీ పేరు త‌లిచినే మజ్నున‌య్యానే..పాప ఓ పాప నా పేరే మ‌రిచినే పిచ్చోన్న‌య్యానే..

హే పాపా.. అరే నా కోస‌మే నువుపుట్టావే..హే పాపా  నా నిద్ద‌ర‌నే చెడ‌గొట్టావే పాప

నా ఎద‌పై నీ కాటుక క‌న్నుల కుంచ‌ల‌తో ఐల‌వ్‌యూ రాసినావే..`` అంటూ హుశారుగా సాగే ఈ పాట‌కి స్టార్ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా బెన్ని ద‌యాల్‌, బెన్ హ్యూమ‌న్‌, అనుదీప్ దేవ్ ఫుల్ ఎనర్జీతో ఆల‌పించారు. అచ్చురాజ‌మ‌ణి బాణీలు సంగీత ప్రియుల్ని అల‌రిస్తున్నాయి.

మొత్తంగా ఈ ట్రైల‌ర్, పాట‌లు చూస్తుంటే వ‌రుస‌గా ఐదు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా `గాలి సంప‌త్` రూపొందుతోంది అని తెలుస్తోంది. మార్చి7న  `గాలి సంప‌త్ గ్రాండ్ ప్రీ రిలీజ్` ఈవెంట్‌ని జ‌రిపి మార్చి 11న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి,

క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌,

ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌,

సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌,

సంగీతం: అచ్చురాజ‌మ‌ణి,

ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌,

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌,

మాట‌లు: మిర్చికిర‌ణ్‌,

లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్ర్తి,

ఫైట్స్‌: న‌భ‌,

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్, భాను,

మేక‌ప్‌: ర‌ంజిత్‌,

క్యాస్ట్యూమ్స్‌: వాసు,

చీఫ్ కో డైరెక్ట‌ర్‌: స‌త్యం బెల్లంకొండ‌.

నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, షైన్ స్క్రీన్స్,

నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌,

స్క్రీన్ ప్లే, సమ‌ర్ప‌ణ‌, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి,

ద‌ర్శ‌క‌త్వం: అనీష్.