పాత్రికేయుడికి అండగా నిలిచిన "మనం సైతం" కాదంబరి కిరణ్
ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న నిర్విరామ సేవా కార్యక్రమం మనం సైతం. ఈ కార్యక్రమం ద్వారా ఆపదల్లో ఉన్న ఎంతోమంది పేదలకు చేయూతనందించారు కాదంబరి కిరణ్. తాజాగా ఎన్ టీవీ, భక్తి టీవీలో వీడియో ఎడిటర్ గా పనిచేసిన రవికి అనారోగ్య చికిత్స కోసం 25 వేల రూపాయలు సాయం అందించారు మనం సైతం కాదంబరి కిరణ్. రవికి మెదడులో రక్తస్రావంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.
మనం సైతం గురించి తెలుసుకుని సాయం కోరారు. వెంటనే స్పందించిన కాదంబరి కిరణ్.. 25 వేల రూపాయలు రవి చికిత్స కోసం అందించారు. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా,ఎవరికైనా, ఎక్కడైనా "మనం సైతం" అండగా ఉంటుందని ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ తెలిపారు.