రెబల్ స్టార్ ప్రభాస్ 24 ఏళ్ల నట ప్రస్థానం, సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్
బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్రలు సృష్టించే రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం నేటికి 24 ఏళ్లకు చేరుకుంది. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈశ్వర్ తర్వాత వరుసగా సక్సెస్ లతో స్టార్ హీరోగా ఎదిగారు ప్రభాస్. ఇక బాహుబలితో ప్రారంభమైన ఆయన పాన్ ఇండియా జర్నీ ఇప్పుడు పాన్ వరల్డ్ కు చేరుకుంది.
ప్రభాస్ తొలి సినిమా "ఈశ్వర్" 2022, నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజును రెబల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ స్పెషల్ డేగా గుర్తుంచుకుంటారు. నేటితో రెబల్ స్టార్ నట ప్రస్థానం 24 ఏళ్లకు చేరుకున్న సందర్భాన్ని అభిమానులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ @24 ఇయర్స్ స్పెషల్ డిపిలు, పోస్టర్స్ సందడి చేస్తున్నాయి.
తనపై అభిమానుల, ప్రేక్షకుల పెంచుకున్న ప్రేమాభిమానాలతో ప్రభాస్ తన భారీ పాన్ ఇండియా సినిమాల లైనప్ కంటిన్యూ చేస్తున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ, వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న కల్కి 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించనున్న సలార్ 2 చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. ఫౌజీ సినిమా సమ్మర్ లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది. అలాగే స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. కల్కి 2 ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే సలార్ 2 సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.


Post a Comment