చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ను విడుదల చేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. అక్టోబర్ 9న మూవీ గ్రాండ్ రిలీజ్
అనుకోకుండా జరిగే ఓ ఘటన కొన్ని సందర్భాల్లో మనతో పాటు మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ అనుకోని పరిణామాలు చోటు చేసుకోవటానికి కారణమవుతాయి. అలాంటి ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాలయా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీకరణను జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. టీజర్‌ను గమనిస్తే సినిమాలో పాత్రలను పరిచయం చేస్తూ అవెలా ప్రవర్తిస్తాయనే విషయాన్ని రివీల్ చేశారు. సినిమా కథనంలో ఓ వేగం కనిపిస్తూనే ఎంటర్‌టైనింగ్‌గానూ సినిమా ఉంటుందనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ..
తాజాగా మేకర్స్ ఈ సినిమాను దసరా సందర్బంగా అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ రిలీజ్ చేయటం విశేషం. సాంగ్ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని దేవిశ్రీప్రసాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఆజా మేరీ జాని’ సాంగ్ విషయానికి వస్తే..ఇదొక పార్టీ సాంగ్. ప్రధానంగా అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్ లపై ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను కలర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ) సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా..బెన్నీ దయాల్ పాడారు. పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేంత జోష్‌గా ఉంది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చుట్టూ కాన్సెప్ట్‌తో రూపొందిన బా బా బ్లాక్ షీప్ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 9న సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. మేఘాలయా రాష్ట్రంలో చిత్రీకరణను పూర్తిగా కంప్లీట్ చేసిన తొలి దక్షిణాది సినిమా ఇది. ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లోనూ చిత్రీకరించాం. పక్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్టర్ గుణి, నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా ఎంటైర్ టీమ్ సహకారంతో ఇది సాధ్యమైంది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ను అందిస్తాం’’ అన్నారు.
నటీనటులు :
టిను ఆనంద్, ఉపేంద్ర , జార్జ్ మరియన్, అక్షయ్, కార్తికేయ, అభినవ్, హర్ష, కిషోర్ కృష్ణ, విస్మయశ్రీ, మాళవి, సమృద్ధి, విష్ణు ఓయ్, కశ్యప్, రాజా రవీంద్ర, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, అనీష్ కురివిల్లా, కాదంబరి కిరణ్ తదితరులు
సాంకేతిక బృందం :
బ్యానర్ : చిత్రాలయం స్టూడియోస్
నిర్మాత : వేణు దోనేపూడి
సహ నిర్మాత: కొండల్ జిన్నా
దర్శకత్వం : గుణి మంచికంటి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ‌్వేత దోనేపూడి
సంగీతం : స్టీఫెన్, ఆనంద్
ఆర్ట్ : సాహి సురేష్
ఎడిటింగ్ : విజయ్ ముక్తవరపు
కెమెరామెన్ : అజయ్ అబ్రహం జార్జ్
కో డైెరెక్టర్ : కిషోర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైశాఖ్ నాయర్, శ్రీద దోనేపూడి
కాస్ట్యూమ్స్ : ప్రియాంక
కొరియోగ్రఫీ : జెడి. మాస్టర్
యాక్షన్స్ : వింగ్ చున్ అంజి
పి.ఆర్.ఒ : మోహన్ తుమ్మల


Post a Comment