Annapurna Studios Releases “Balan The Boy On June 19

 జూన్ 19న అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "బాలన్ - ది బాయ్" మూవీ


గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "బాలన్ - ది బాయ్". ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

"బాలన్ - ది బాయ్" సినిమాను ఏపీ, తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ రోజు మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ తో కొలాబ్రేట్ అవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా "బాలన్ - ది బాయ్" సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రేక్షకుడికి చేరువ కానుంది. ఈ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే "బాలన్ - ది బాయ్" మూవీ ఫ్రాన్స్ లో జరిగే ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమై, గ్లోబల్ వేదికపై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మన నేటివిటీతో సాగే కథా కథనాలతో యూనివర్సల్ గా ప్రతి ఆడియెన్ మనసును హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కిస్తున్నారు. థియేటర్స్ లో తప్పక చూడాల్సిన చిత్రమిది అంటూ మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

నటీనటులు - చందు సలీమ్ కుమార్ తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ - వివేక్ హర్షన్

డీపీవో - షైజు ఖాలిద్

మ్యూజిక్ - సుషిన్ శ్యామ్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

రచన - జితూ మాధవన్

నిర్మాతలు - వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్

దర్శకత్వం - చిదంబరం

Post a Comment

Previous Post Next Post