Om Shanti Shanti Shanti Streaming on Aha from March 4

 మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ''ఓం శాంతి శాంతి శాంతిః''


సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందించనుంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ''ఓం శాంతి శాంతి శాంతిః'' సినిమా మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే ఈ చిత్రాన్ని చూడొచ్చు.

'ఓం శాంతి శాంతి శాంతిః'' సినిమాను నూతన దర్శకుడు AR సజీవ్ రూపొందించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ మూవీని నిర్మించగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ''ఓం శాంతి శాంతి శాంతిః'' జనవరి 30న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది.

Post a Comment

Previous Post Next Post