Kayadu Lohar Returns to Malayalam; New Poster of ‘Pallichattambi’ Released

 మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ప్రెస్టీజియస్ మూవీ "పళ్లిచట్టంబి" నుంచి హీరోయిన్ కయదు లోహర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల, ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు కయదు లోహర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. డ్రాగన్ మూవీ సక్సెస్ తర్వాత ఆడియెన్స్ లో పెరిగిన ఆమె క్రేజ్ ఈ సినిమాను ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్ చేసిన "పళ్లిచట్టంబి" మోషన్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ ప్రెస్టీజియస్ మూవీ ఏప్రిల్ 9న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 50, 60 దశకాల నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ మూవీలో హీరో టొవినో థామస్ ఇప్పటిదాకా చూడని విధంగా సరికొత్తగా కనిపించనున్నారు. "పళ్లి చట్టంబి" సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

నటీనటులు - టొవినో థామస్, కయదు లోహర్, విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ - మంజూష రాధకృష్ణన్

మేకప్ - రషీద్ అహ్మద్

ప్రొడక్షన్ డిజైన్ - దిలీప్ నాథ్

ఎడిటింగ్ - శ్రీజిత్ సరంగ్

సినిమాటోగ్రఫీ - టిజో టోమీ

మ్యూజిక్ - జేక్స్ బిజోయ్

స్క్రిప్ట్ - ఎస్ సురేష్ బాబు

అసోసియేట్ ప్రొడ్యూసర్స్ - మేఘశ్యామ్, తంజీర్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

ప్రొడ్యూసర్స్ - నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్

డైరెక్టర్ - డిజో జోస్ ఆంటోనీ

Post a Comment

Previous Post Next Post