Director Krishna Chaitanya Unveils “Naa Pranamanta” Song from Dev Paaru

 డైరెక్టర్ కృష్ణ చైతన్య చేతుల మీదుగా దేవ్ పారు సినిమా నుంచి నా ప్రాణమంత సాంగ్ లాంచ్

ఏకే ప్రోడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న దేవ్ పారు చిత్రం నుంచి ఈ రోజు నా ప్రాణమంత అనే పాట విడుదల అయింది. సింగర్ కాలభైరవ పాడిన ఈ పాట డైరెక్టర్ కృష్ణ చైతన్య చేతుల మీదుగా ఈ విడుదల అయింది. ఈ పాట ఆదిత్యమ్యూజిక్ లో శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. కాలభైరవతో కలిసి పనిచేశాను. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. దేవ్ పారు మూవీ ఒక ఫ్రెష్, ఎమోషనల్ లవ్ స్టోరీ అని యూత్‌ను ఆకట్టుకుంటుందని చెప్పారు. సినిమాకు అందరూ రిలేట్ అవుతారని చెప్పారు. పాట కూడా చాలా బాగుంది. ఆడియెన్స్ సపోర్ట్ తో సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పారు. 

దర్శకుడు అంజి మాట్లాడుతూ, ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని, అఖిల్ రాజు దర్శకుడిగా గొప్ప భవిష్యత్తు ఉందని ప్రశంసించారు. అందరూ కొత్తవారే అయినప్పటికీ హీరో, హీరోయిన్‌లు అద్భుతంగా నటించారని, వారి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంజి గారు తెలిపారు. కెమెరామెన్ అశ్విన్ తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతమైన క్వాలిటీని అందించారని, మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన సంగీతాన్ని, ధ్రువ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారని ప్రశంసించారు. ప్రొడ్యూసర్ అలీ గారి పాషన్ గురించి తెలుసని ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుంటారని, ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ సినిమాను నిర్మించారని కొనియాడారు. 

ప్రొడ్యూసర్ అలీఖాన్ మాట్లాడుతూ.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే తపన ఈ చిత్రంతో నెరవేరిందన్నారు. డైరెక్టర్ అఖిల్‌తో మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రొడ్యూసర్ తెలిపారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ కాలభైరవ ఒక పాటను పాడడం విశేషం. ఆయన పాట, లిరిక్స్, మ్యూజిక్ అన్నీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పారు. సినిమాలోని లవ్ స్టోరీ, ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలగలిపి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయని అన్నారు. 

హీరో మిహాస్ రోమి మాట్లాడుతూ, జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్ వరకు తన సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా, తన పాషన్‌తో ఈ స్థాయికి చేరానని ఎమోషనల్‌గా తెలిపారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తనకు మంచి పేరు వస్తుందని చెప్పారు. మా టీమ్ పాషన్, ప్రొడ్యూసర్ అలీ, డైరెక్టర్ అఖిల్, డీఓపీ అశ్విన్ సపోర్ట్‌తో ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కామెడియన్ ధీరజ్ బండి తనదైన హాస్యంతో ఈవెంట్‌ను సందడి చేశారు. వెన్నెల కిశోర్, సత్య వంటి వారి నుంచి స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. ఈ సినిమా నాకు వెన్నెల, స్వామి రారా లాంటి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నా అని అన్నారు. ‘దేవ్ పారు సినిమా ఒక ట్రూ స్టోరీ ఆధారంగా రూపొందిన లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన తర్వాత, ఇది తమ కథలా అనిపిస్తుంది. లవర్స్ ఈ సినిమాతో రిలేట్ అవుతారు అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఓషో వెంకట్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ఈ చిత్రం యూత్‌ను ఎంటర్‌టైన్ చేయడంతో పాటు ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుందని చెప్పారు. 

దర్శకుడు అఖిల్ రాజు తన సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి తనకు ప్రధాన ప్రేరణ అని ఎమోషనల్‌గా తెలిపారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాను. మా ఇంట్లో ట్రంక్‌లో ఆయన ఫోటోలు అతికించి ఉండేవి. ఆయన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలోకి రావాలని, డైరెక్టర్‌గా స్థిరపడాలని కలలు కన్నాను. ఆయనే నాకు దేవుడు లాంటివారు. ఈ స్టేజ్‌పై నిలబడటానికి ఆయనే కారణం, అని అఖిల్ తెలిపారు. 

అఖిల్ మాట్లాడుతూ, మా డాడీ ఎప్పుడూ నన్ను ముందుకు నడిపించేవారు. ఇప్పుడు ఆయన బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. లేకపోతే ఈ ఈవెంట్‌లో ముందు కూర్చొని నన్ను సపోర్ట్ చేసేవారు. ఐ మిస్ యూ డాడ్ అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఓషో వెంకట్, తమన్ గారి దగ్గర ప్రోగ్రామర్‌గా పనిచేసిన అనుభవంతో, ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్ ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్‌లో ఉండాల్సిన ఎమోషనల్ ట్రాక్. అందరూ విని, స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాం, అని అఖిల్ తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ టీమ్, నిరంజన్, మాధవ్ గార్ల సపోర్ట్‌కు కూడా థాంక్స్ చెప్పారు. 

హీరోయిన్ యష్ణ ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్‌లో కూడా చాలా క్యూట్‌గా ఉంటుంది. సినిమాలో టీనేజర్, మెచ్యూర్డ్ అమ్మాయిగా రెండు షేడ్స్‌లో అద్భుతంగా నటించిందని చెప్పారు. హీరో మిహాస్ వైల్డ్, పొసెసివ్ క్యారెక్టర్ కావాలని రాసాను. మిహాస్ ఆ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుందని ప్రశంసించారు. ప్రొడ్యూసర్ అలీ నాకు బాబాయ్ లాంటివారు. నేను ఏ ఐడియా చెప్పినా నో అని ఎప్పుడూ అనలేదు. స్టోరీ వినకముందే నా కాన్ఫిడెన్స్ చూసి అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా సాధ్యం కాదు అని కృతజ్ఞతలు తెలిపారు. 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రియా మాట్లాడుతూ.. 10 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నాను. అఖిల్ కథ, టీమ్ పాషన్ నన్ను ఆకర్షించాయి. మేమంతా 24 క్రాఫ్ట్స్‌లా ఒక ఫ్యామిలీగా పనిచేశాం. ప్రొడ్యూసర్ అలీ సపోర్ట్ అద్భుతం. మిహాస్‌లో ఉదయ్ కిరణ్‌లా లవబుల్ క్వాలిటీ కనిపిస్తుందని అన్నారు.

చిత్రం: దేవ్ పారు

నటీనటులు : మిన్హాజ్ రూమి, యష్నా ముత్తులూరి, తనుజా మధురపంతుల, ధీరజ్ బండి, మానస చావా, విశిష్ట సక్సేనా, అశోక్ వర్ధన్, కిరీటి దామరాజు

నిర్మాత: లోడీ ఫాహద్ అలీఖాన్

రచయిత, దర్శకత్వం: అఖిల్ రాజ్

మ్యూజిక్: ఓషో వెంకట్

ఎడిటర్: ప్రతీక్ నూటి

డీఓపీ: అశ్విన్ అంబేద్

ఎగ్జ్‌గ్యూటీవ్ ప్రొడ్యూసర్: ప్రియా అండలూరి

ప్రొడక్షన్ మేనజర్: మెహర్ మోనిష్

ఆర్ట్ డైరెక్టర్: సాయి కధిర

కాస్ట్యూమ్ డిజైనర్: పరమేశ్వర్ కృష్ణ

లిరిక్స్: ఆర్ ఆర్ ధృవన్

డీఐ: వి చిట్టకాంగ్

పీఆర్ఓ: హరీష్, దినేష్

Post a Comment

Previous Post Next Post