ఓటీటీలో యాభై మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సన్సేషన్ సృష్టిస్తున్న 'టుక్ టుక్' చిత్రం
వైవిధ్యమైన సినిమాలకు, న్యూ కాన్సెప్ట్‌లకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రాలకు తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ కోవలోనే ఇటీవల థియేటర్లో విడుదలై ఓ కొత్త అనుభూతిని పంచిన 'టుక్ టుక్' చిత్రం ఇప్పుడు ఓటీటీ అమోజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా అమోజాన్ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ టెన్గా ఉండటంతో పాటు ఇప్పటి వరకు యాభై మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సరికొత్త సంచలనం సృష్టించింది. ఓ చిన్న సినిమాకు ఓటీటీలో ఇలాంటి ఆదరణ లభించడం చాలా అరుదుగా జరగుతోంది. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మించారు.
నిర్మాతలు మాట్లాడుతూ థియేటర్‌తో పాటు మా సినిమాకు ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఉన్న సూపర్ నేచురల్, మ్యాజికల్ పవర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ అందర్ని అలరిస్తుంది. ముఖ్యంగా చిత్రంలో స్కూటర్ మ్యాజిక్ పవర్స్‌ను పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓటీటీలో 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో టాప్ టెన్‌లో ఉంది. . ఈ సినిమాలో ఉన్న ఫాంటసీ, లవ్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది'' అన్నారు.
Amazon Prime : https://www.primevideo.com/region/eu/detail/0LWY4SW98UYTWVVT7U1PTEASTY/ref=atv_hm_hom_c_cjm7wb_2_1?jic=8%7CEgNhbGw%3D
Etv Win : https://www.etvwin.com/original-movies/tuk-tuk?media=movie&layout=movies
Post a Comment