Ms. ILAYAA Movie Launched with Formal Pooja

 "మిస్ ఇళయా" ( Ms.ilayaa ) సినిమా ప్రారంభం

Ms. ILAYAA, Kushal Jaan, Vemula G, Matta Srinivas, Chahithi Priya, Cosmic Power Production, Telugu movie, new Telugu film, upcoming movie, Telugu cinema, film launch, movie pooja, latest Telugu movies, Telugu film updates

ప్రొడ్యూసర్ మట్టా శ్రీనివాస్ మరియూ సహ నిర్మాత చాహితీ ప్రియా సమర్పణలో, వేముల జి దర్శకత్వంలో, హీరో కుషాల్ జాన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న చిత్రం 'మిస్ ఇళయా' (Ms. ILAYAA) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కాస్మిక్ పవర్ ప్రొడక్షన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలు అవుతుంది.

 ఈ కార్యక్రమంలో చిత్రబృందం, కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి దింటకుర్తి మురళీ కృష్ణ గారి ఆశీస్సులతో వారి పర్యవేక్షణలో పూజ కార్యక్రమం జరిగింది.

హీరో కుషాల్ జాన్ మాట్లాడుతూ,

"ఈ సినిమా కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నేను ఇలాంటి పాత్రలో చేయడం ఇదే మొదటిసారి. ఇది నా కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించే చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాను. ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురుచూస్తున్నాను," అని తెలిపారు.

డైరెక్టర్ వేముల జి మాట్లాడుతూ,

"ఈ చిత్రం వినూత్నమైన కథతో తెరకెక్కుతుంది. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. హీరో కుషాల్ జాన్ ఈ పాత్రకు న్యాయం చేస్తారని నమ్మకంగా చెప్పగలను. మేము ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబోతున్నాము," అని అన్నారు.

ప్రొడ్యూసర్ మట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ, సహ నిర్మాత చాహితీ ప్రియా "మా బ్యానర్ 'కాస్మిక్ పవర్ ప్రొడక్షన్' పై వస్తున్న ఈ చిత్రం కోసం ఎంతో అన్వేషణ చేసి, మంచి కథను ఎంపిక చేసుకున్నాం. సినిమాకు అనుగుణంగా ఉన్న సాంకేతిక బృందం, ప్రతిభావంతమైన నటీనటులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే సినిమా అవుతుందని నమ్మకం ఉంది," అని తెలిపారు.

'మిస్ ఇళయా' (Ms. ILAYAA) సినిమా తొలి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది.

Post a Comment

Previous Post Next Post