Dhanush Idli Kadai Telugu Rights bagged by Sri Vedakshara Movies

 శ్రీ వేధాక్షర మూవీస్ నిర్మాత చింతపల్లి రామారావు చేతికి ధనుష్ ఇడ్లీ కడై తెలుగు థియేట్రికల్ హక్కులు !!!

Sri Vedakshara Movies, Chintapalli Ramarao, Dhanush, Idli Kadai, Telugu theatrical rights, Nithya Menen, 52nd film, 4th directorial, Summer 2025 release, Vijay Sethupathi, Vidudala 2, Ryan movie, first look response, Raj Kiran, Arun Vijay, Shalini Pandey, GV Prakash Kumar, Prasanna GK, Kiran Kaushik, Wonderbar Films, Don Pictures, Aakash Bhaskaran.

హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'ఇడ్లీ కడై' ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కు ఇది నటుడిగా యాభై రెండో ఫిలిమ్ అలాగే తను డైరెక్ట్ చేస్తోన్న నాలుగో సినిమా ఇదే అవ్వడం విశేషం.

శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఈ ఏడాది వేసవిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల నిర్మాత చింతపల్లి రామారావు విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. 

రాయన్ సినిమా తరువాత ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న సినిమా 'ఇడ్లీ కడై' అందుచేత ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ షాలిని పాండే, కీలక పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న జీకె ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు మరిన్ని మంచి చిత్రాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వాటి వివరాలు త్వరలో మీడియాకు తెలియజేయనున్నారు.

Post a Comment

Previous Post Next Post