1000 Waala Team Unveiled Valentines day poster

 వాలంటైన్స్ డే సందర్భంగా 1000 వాలా పోస్టర్ విడుదల

సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో, నూతన నటుడు అమిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం 1000 వాలా. యువ దర్శకుడు అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

హీరో అమిత్ మాట్లాడుతూ,

"ప్రేమ అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతి. మా సినిమా 1000 వాలా ప్రేమ, అనుభూతి, యాక్షన్, ఎమోషన్‌లతో మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందింది. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా మా సినిమా నుండి ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. నా కలను నిజం చేసిన మా నిర్మాత షారుఖ్ కు ధన్యవాదాలు. త్వరలోనే మీ ముందుకు వస్తున్నాం."

1000 వాలా టీమ్

Post a Comment

Previous Post Next Post