1000 Waala Ready for Release

 భారీ అంచనాలతో

విడుదల కి సిద్ధం అవుతున్న

1000 వాలా సినిమా

సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకం పై షారుఖ్ నిర్మాణంలో నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నటులు సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా 1000 వాలా చిత్రం నుండి సరికొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

అదిరిపోయే నాలుగు ఎనర్జిటిక్ పాటలు, థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల చేసి, భారీ ఎత్తున ప్రీ - రిలీజ్  ఈవెంట్, ఇంటర్వ్యూలు నిర్వహించే పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది.

అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, పోస్టర్లు సోషల్ మీడియా లో అందరిని ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా లో వచ్చిన స్పందన చూసి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనేక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సత్తా ఉన్న ఈ సినిమా అందరి అంచనాలను మించి తప్పక భారీ విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని చిత్ర బృందం తెలిపారు. 

చిత్రం పేరు : 1000 వాలా 

నటి నటులు : అమిత్, షారుఖ్, నమిత, కీర్తి, సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్, తదితరులు 

కథ : అమిత్

కథనం, మాటలు : గౌస్ ఖాజా

కెమెరా : చందు ఏజె

ఎడిటింగ్ - డి ఐ : రవితేజ జి 

డాన్స్ : బాలు మాస్టర్, సూర్య కొలుసు

ఫైట్స్ : డైనమిక్ మధు

మిక్సింగ్: విజన్ స్టూడియోస్ 

సౌండ్ ఇంజనీర్: కలక శ్రీనివాసరావు

పబ్లిసిటీ డిజైన్స్: చిత్రలహరి ఎడిట్స్ 

డిజిటల్ ప్రమోషన్స్: S3 మీడియా వర్క్స్ 

సంగీతం : వంశీకాంత్ రేఖాన

నిర్మాత : షారుఖ్

దర్శకత్వం : అఫ్జల్

Post a Comment

Previous Post Next Post