"Ninnu Nannu Kannadi Aadadi Ra" Song Launch

 ఆడపిల్లను కాపాడుకుందాం- మంత్రి సీతక్క. నిన్ను నన్ను కన్న ఆడదిరా సాంగ్ లాంచ్ ఆలీ



ఆలీ ప్రసంగం: ఇక్కడికి అతిథిగా వచ్చిన మంత్రి సీతక్క గారికి, మీడియా స్నేహితులకు నా నమస్కారాలు. ఈ పాటను రూపొందించడానికి ముఖ్య కారణం ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న దుర్మార్గాలు. రేప్ అనే వ్యాధి క్యాన్సర్ కంటే దారుణంగా వ్యాపిస్తోంది. నాకు ఈ పాట వినగానే "యమలీల" సినిమాలో పాట గుర్తొచ్చింది.  

దర్శకుడు రమణారెడ్డి గారు అమెరికా వెళ్లి అక్కడ మంచి జీవితం సాధించినప్పటికీ, మన దేశానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో తిరిగి వచ్చి ఈ పాటను రూపొందించారు.  

ఈ పాటను విన్న వెంటనే మన రాష్ట్రానికి, ఆడవారికి డెడికేట్ చేయాలని భావించాం. ఈ పాటను అన్ని చానెల్స్, ఆడియో కంపెనీలకు ఉచితంగా అందించాం. సమాజంలో మంచి మార్పు కోసం ఈ ప్రయత్నం. మతాలను దాటుకుని సామాజిక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పాటను రూపొందించాం.  

ముంబై నుండి వచ్చి నటించిన హీరోయిన్ కామ్నా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సీతక్క గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.  

సీతక్క గారి ప్రసంగం:  

ఇలాంటి గొప్ప ఆలోచనతో, సమాజంలో జరుగుతున్న దుర్వర్తనాలను అరికట్టే ప్రయత్నం చేసిన దర్శకుడు రమణారెడ్డి గారికి, నటుడు ఆలీ గారికి, హీరోయిన్ కామ్నా గారికి ప్రత్యేక ధన్యవాదాలు.  

కామంతో మృగంలా ప్రవర్తించే వారిలో మార్పు రావాలి. కులం, మతం, వృత్తి అనే పరిమితులు లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. స్నేహితుడు అనే నమ్మకాన్ని కూడా కూల్చి, చిన్న పిల్లల నుండి పెద్దవారివరకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి.  

ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యను అరికట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పాట కూడా ఆ ప్రయత్నంలో ఒక మంచి తొలి అడుగుగా కనిపిస్తోంది.  

పాటలు సమాజంలో మార్పు తీసుకురావడంలో చక్కగా పనిచేస్తాయి. ఈ పాట ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావాలి.  

ఇవే నా ఆకాంక్షలు.  

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.  

దర్శకుడు రమణారెడ్డి గారి మాటలు:  

ఇక్కడికి విచ్చేసిన మంత్రి సీతక్క గారికి, నటుడు ఆలీ గారికి, నటి కామ్నా గారికి, మీడియా స్నేహితులకు నా నమస్కారాలు.  

ఈ పాట సమాజానికి మంచి చేసే విధంగా రూపొందించాం.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్కే న్యూస్ అధినేత బొల్లా రామ కృష్ణ, నటుడు శ్రీనివాస్, నటి మంజుల, శ్రీమతి జుబేదా ఆలీ తదితరులకు నా కృతజ్ఞతలు.  


Post a Comment

Previous Post Next Post