సూర్య 45: హీరో సూర్య, త్రిష జంటగా గ్రాండ్ ఎంటర్‌టైనర్
హీరో సూర్య, మల్టీ-టాలెంటెడ్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా ప్రాజెక్ట్ సూర్య 45 ఇటీవల ఘనంగా లాంచ్ అయింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఈ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని వారి అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతోంది.
తాజాగా చిత్ర బృందం అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సౌత్ సూపర్‌స్టార్ త్రిష ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాజెక్ట్‌లో త్రిషను స్వాగతిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆమె అద్భుతమైన ప్రజెన్స్‌ను హైలైట్ చేస్తోంది.
2025 రెండో అర్ధభాగంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇతర కీలక నటీనటుల వివరాలు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, ఇంకా బృందం నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
Post a Comment