#SK25: శివకార్తికేయన్ 25వ చిత్రం అనౌన్స్‌మెంట్
టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ తన మైల్‌స్టోన్ 25వ చిత్రానికి జాతీయ అవార్డు విజేత, ప్రతిష్టాత్మక డైరెక్టర్ సుధా కొంగరతో చేతులు కలిపారు. ఈ హైయిలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌లో జయం రవి, అథర్వ, శ్రీలీల కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రాన్ని ఆకాష్ బాస్కరన్ డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
నిర్మాత ఆకాష్ బాస్కరన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
"శివకార్తికేయన్ 25వ చిత్రాన్ని నిర్మించడం మా కోసం గొప్ప గౌరవం. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న శివకార్తికేయన్, జాతీయ అవార్డు గ్రహీత సుధా కొంగర దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం ఒక మైల్‌స్టోన్ ప్రాజెక్ట్. జయం రవి, అథర్వ, శ్రీలీల వంటి ప్రతిభావంతుల నటీనటుల సమర్పణ ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకతతో మలుస్తుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ విజువల్స్‌ను డిజైన్ చేస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జీవి ప్రకాష్‌కి 100వ ప్రాజెక్ట్ కావడం మరింత ప్రత్యేకతను తీసుకువస్తోంది. #SK25 ప్రేక్షకులకు ఒక అసాధారణ థియేట్రికల్ అనుభవాన్ని అందించబోతుంది." అని తెలిపారు.
నటీనటులు: శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల
రచన & దర్శకత్వం: సుధా కొంగర
నిర్మాత: ఆకాష్ బాస్కరన్
బ్యానర్: డాన్ పిక్చర్స్
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
డీవోపీ: రవి కె. చంద్రన్
పీఆర్వో: వంశీ శేఖర్
ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి!
Post a Comment