తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖ ఫైనాన్సర్ బంగారు బాబు (ఈ.వి. రాజారెడ్డి) కుటుంబంలో నిశ్చితార్థ వేడుక
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆర్థికంగా తోడ్పడిన ఆర్-సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు (ఈ.వి. రాజారెడ్డి) చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి నిశ్చితార్థ వేడుక డిసెంబర్ 15న హోటల్ తాజ్ కృష్ణలో అత్యంత వైభవంగా జరిగింది. క్రాంతి రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త సీతారామిరెడ్డి-రామసీత దంపతుల కుమార్తె శిరీషతో నిశ్చితార్థం జరుపుకున్నారు.
ఈ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బంగారు బాబు దక్కించుకున్న గౌరవం, గుర్తింపుకు నిదర్శనంగా, ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు తరలివచ్చారు.
చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు కె.ఎస్. రామారావు, సి. కళ్యాణ్, శ్యాంప్రసాద్ రెడ్డి, పోకూరి బాబురావు, సునీల్ నారంగ్, కె. అచ్చిరెడ్డి, జెమినీ కిరణ్, సాహు గార్లపాటి, డాక్టర్ కె. వెంకటేశ్వరరావు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవి, ఎర్నేని నవీన్, డి.వి.వి. దానయ్య, బెల్లంకొండ సురేష్, కె. రాధామోహన్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ, యు.వి. క్రియేషన్స్ విక్కీ, పి.డి. ప్రసాద్, లగడపాటి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.
నటులుగా చక్రపాణి, వడ్డే నవీన్, కిరణ్ అబ్బవరం, నవభారత్ బాలాజీ, మాగంటి సుధాకర్, దర్శకులుగా రేలంగి నరసింహారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, మెహర్ రమేష్, సంపత్ నంది తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ వేడుకలో పాల్గొన్న అందరూ బంగారు బాబు సినీ పరిశ్రమకు అందించిన సేవలను ప్రశంసించారు. కుటుంబ ఆనంద వేడుకను ఘనంగా జరిపిన విధానానికి అభినందనలు తెలిపారు.
Post a Comment