TUYO Unisex Salon Launched by Hero Vishnu Manchu & Viranica Manchu

 టొయో యునిసెక్స్ సెలూన్‌ని ప్రారంభించిన డైనమిక్ హీరో విష్ణు మంచు, విరానికా మంచు



డైనమిక్ స్టార్ హీరో విష్ణు మంచు, విరానికా మంచు వారి వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ మహేష్ టొయో యునిసెక్స్ సెలూన్‌ను శుక్రవారం (నవంబర్ 29) నాడు బంజారాహిల్స్‌లో ప్రారంభించారు. లాంచ్ స్పాట్‌లో ముఖ్య అతిథుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. 

ఈ సందర్భంగా హీరో విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘నేను స్టోర్స్ ఓపెనింగ్స్‌కు చాలా అరుదుగా వెళ్తుంటాను. మహేష్ నా పర్సనల్ హెయిర్‌స్టైలిస్ట్. అతను చాలా టాలెంటెడ్ పర్సన్. 5 సంవత్సరాల క్రితం పర్మనెంట్ పర్సనల్ హెయిర్‌స్టైలిస్ట్ కోసం వెతుకుతున్నప్పుడు నాకు ఈయన తారసపడ్డాడు. మహేష్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అతను ఇందులో ఇంకా ఎక్కువగా మెళుకువలు నేర్చుకోవాలని దుబాయ్, యూరప్‌కు పంపాను. కన్నప్ప చిత్రానికి కూడా స్టైలిస్ట్‌గా పని చేశాడు. ఇప్పుడు ఇలా కొత్తగా సెలూన్ ప్రారంభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

టొయో యునిసెక్స్ సెలూన్ మహేష్ మాట్లాడుతూ.. ‘నా కొత్త సెలూన్ ఓపెనింగ్ సందర్భంగా విష్ణు మంచు గారు, విరానికా మంచు గారు రావడం, ఇలా నా సెలూన్‌ను ప్రారంభించడం, వారు ఆశీస్సులు అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సెలూన్ ప్రారంభించాలని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని విష్ణు గారికి చెప్పాను. కొద్ది రోజులు వేచి ఉండమని ఆయన చెప్పారు. నా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆయన నాకు సలహా ఇచ్చారు. కన్నప్ప సినిమాకు నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఆశీర్వాదంతో సెలూన్‌ని ప్రారంభించాను’ అని అన్నారు.

Post a Comment

Previous Post Next Post