Pranayagodari Grand Release Worldwide On December 13th

డిసెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ‘ప్రణయగోదారి’



విలేజ్ డ్రామాగా రాబోతోన్న ‘ప్రణయగోదారి’ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రాన్ని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌‌ను మేకర్లు ప్రకటించారు.


డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా మేకర్లు అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన పాత్రలను చూపించారు. ఇందులో సాయి కుమార్ అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన వేషధారణ, ఆహార్యం, నటన ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.


ప్రణయ గోదారి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. పాటలు, పోస్టర్‌లు ఇలా అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న రిలీజ్ చేస్తుండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచనున్నారు మేకర్స్. మున్ముందు మరింత కంటెంట్‌తో ఆడియెన్స్‌లో హైప్ పెంచేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.


మార్కండేయ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఈదర ప్రసాద్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. కో డైరెక్టర్స్ గా జగదీశ్ పల్లి మరియు పురం కృష్ణ, డిజైనర్ గా TSS కుమార్,  వర్క్ చేస్తున్నారు. కొరియోగ్రఫర్స్ కళాధర్ , మోహనకృష్ణ , రజిని, ఎడిట‌ర్ గా కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్ డైరెక్టర్‌గా విజయకృష్ణ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. 

Post a Comment

Previous Post Next Post