Chethilo cheyyesi cheppu bava Releasing on November 29

 నవంబర్ 29న ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావ’ రిలీజ్

 


దేవదాస్, జాన్ సమర్పణలో కొమరపు ప్రొడక్షన్స్ పతాకంపై ఆదిత్య ఓం, అరుణ్ రాహుల్, అంజన శ్రీనివాస్ రోహిణి ఆర్ చలపతి రాజు తదితరులు  నటించిన చిత్రం చేతిలో చెయ్యేసి చెప్పు బావా . అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  నవంబర్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటో గ్రఫి మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సహనిర్మాత రేగట్టే లింగారెడ్డి మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కే .జోసఫ్ మాట్లాడుతూ"ఇది ఒక వెరైటీ లవ్ స్టోరీ. అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. బండారు దానయ్య కవి గారి అద్భుతమైన  పాటలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఒక మంచి సందేశం తో  ప్రేక్షకులు అందరూ చూసే విధంగా ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ చిత్రాన్ని నవంబర్ 29 ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నాం. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము" అని అన్నారు.

సుమన్, కవిత ,పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి ,,ఆనంద్, జయ వాణి,  చిత్రo శీను, సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, తదితరులు నటించిన ఈ చిత్రానికి :ఎడిటర్ వెంకటేశ్వరరావు, డిఓపి: వేణు మురళీధర్ ,సంగీతం: పార్ధు, స్టోరీ అండ్ ప్రొడ్యూసర్ : కె.జోసఫ్ ,స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, డైరెక్షన్ :కట్ల రాజేంద్రప్రసాద్.

Post a Comment

Previous Post Next Post