The Telugu Film Chamber of Commerce has a Sexual Harassment Redressal Panel

 TFCC/HYD/2024     17/09/2024

ప్రెస్ నోట్



తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2018లో ఏర్పాటైన పరిశ్రమలోని లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరిస్తున్న లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ను కలిగి ఉంది.


ప్యానెల్ వారు మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించబడినది. తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ మీద వచ్చిన ఈ ఫిర్యాదును  పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేశారు మరియు ఈ ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉంది, కావున ఆరోపించిన మగ కొరియోగ్రాఫర్‌ను యూనియన్‌లో ప్రెసిడెంట్ పోస్ట్‌లో ఉంచడానికి విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది.


పైన తెలిపిన కేసు విషయమై కమిటీ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్:

K.L. దామోదర్ ప్రసాద్, Hon. సెక్రటరీ & కన్వీనర్, ఝాన్సీ, చైర్‌పర్సన్

అంతర్గత సభ్యులు: తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది

బాహ్య సభ్యులు: రామలక్ష్మి మేడపాటి, సామాజిక కార్యకర్త మరియు మీడియా నిపుణురాలు

              కావ్య మండవ, న్యాయవాది మరియు POSH నిపుణురాలు

ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపల ఫిర్యాదు పెట్టె ఉంచబడింది, దీనిని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య యాక్సెస్ చేయవచ్చు.


ఫిర్యాదుల నిమిత్తమై మమ్మల్ని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా క్రింది చిరునామాకు పంపవచ్చును.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి. రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 096. ఫిర్యాదులను నమోదు చేయడానికి ప్రత్యేక ఫోన్ నంబర్ వాట్సాప్ లేదా టెక్స్ట్   నెం. 9849972280, ఈమెయిల్ ఐడీ: complaints@telugufilmchamber.in

నోట్ : మీరు పంపబడిన వివరాలు గోప్యంగా ఉంచబడును.



(కె.ఎల్. దామోదర్ ప్రసాద్)

        గౌరవ కార్యదర్శి 


Post a Comment

Previous Post Next Post