Sundeep Kishan Receives Rising Star In South India Award At SIIMA

 SIIMA- రైజింగ్ స్టార్ ఇన్ సౌత్ ఇండియా అవార్డు అందుకున్న హీరో సందీప్ కిషన్



హీరో సందీప్ కిషన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. తెలుగులో ఊరు పేరు భైరవకోన సంచలన విజయం సాధించగా, తమిళంలో కెప్టెన్ మిల్లర్, రాయన్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)లో సందీప్ కిషన్ సౌత్ ఇండియాలో రైజింగ్ స్టార్ అవార్డును సొంతం చేసుకున్నారు.


సందీప్ కిషన్ తమిళ చిత్రాలైన కెప్టెన్ మిల్లర్, రాయన్‌లలో తన పాత్రలకు ప్రశంసలు అందుకున్నారు. కెప్టెన్ మిల్లర్‌లో కెప్టెన్‌గా పవర్ ఫుల్ పాత్ర పోషించారు, రాయన్‌లో డార్క్ అండ్ కాంప్లెక్స్ క్యారెక్టర్ లో ఆదరగొట్టారు.


ఇంత కాంపిటేషన్ వున్న దక్షిణాది సినిమాల్లో ఒక తెలుగు యాక్టర్ ఇన్ని ప్రశంసలు, అవార్డును సాధించడం చాలా రేర్. ప్రస్తుతం సందీప్ కిషన్‌కి తెలుగు, తమిళం రెండింటిలో అనేక అద్భుతమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post