YRF teases the next chapter of Mardaani on the 10th anniversary

రాణి ముఖ‌ర్జీ, య‌ష్ రాజ్ ఫిల్మ్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మర్దానీ’ 10వ వార్షికోత్సవం సంద‌ర్భంగా మూడో భాగానికి సంబంధించి ఆక‌ట్టుకునే  వీడియో విడుద‌ల చేసిన మేక‌ర్స్‌



రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘మర్దానీ’. ఈ సినిమా విడుద‌లై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ చిత్రం విడుద‌లైంది. 2019లో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ఈ రెండు చిత్రాలు సూప‌ర్ హిట్ చిత్రాలుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాణించాయి. అలాగే ఈ సినిమాల‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది. మర్దానీ సినిమా మూడో భాగానికి సంబంధించి ఆక‌ట్టుకునే వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.


Watch the celebration video here :- 


 

మ‌ర్దానీలో శివానీ శివాజీ రాయ్ అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రాణిముఖ‌ర్జీ న‌టించారు. న్యాయం కోసం పోరాడే వారి కోసం ధైర్యంగా నిల‌బ‌డే పాత్ర ఇది. త‌న‌దైన న‌ట‌న‌తో రాణి ముఖ‌ర్జీ ఆ పాత్ర‌కు ప్రాణం పోశారు.


లింగ వివ‌క్ష‌ను చూపించే ఈ స‌మాజంలో ఓ స్త్రీ త‌న పాత్ర‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎలా పోషించింద‌నేది ఈ సినిమాతో నిరూప‌ణ అయ్యింది. క‌ష్టాల్లో ఉన్న వారిని కాపాడ‌టం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే రోల్‌లో రాణిముఖ‌ర్జీ అద్భుతంగా న‌టించి మెప్పించారు.



Post a Comment

Previous Post Next Post