Yentha Pani Chesav Chanti" Trailer Launched by Sensational Director Trinadharao Nakkina

 "ఎంత పని చేశావ్ చంటి" ప్రచారచిత్రం

ఆవిష్కరించిన "ధమాకా" దర్శకుడు

త్రినాథరావు నక్కిన



"ఈ చిత్రం ఆడవాళ్లకు మాత్రమే

మగవారు పొరపాటున కూడా

చూడొద్దు" అంటున్న చిత్ర దర్శకుడు

ఉదయ్ కుమార్!!


పి.జె.కె.మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కిన విభిన్న కథాచిత్రం "ఎంత పని చేశావ్ చంటి". "తస్మాత్ జాగ్రత్త" చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తన ప్రతిభను ప్రకటించుకున్న యువ ప్రతిభాశాలి ఉదయ్ కుమార్ దర్శకత్వంలో "లడ్డే బ్రదర్స్" నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ నేపథ్యంలో "ఎంత పని చేశావ్ చంటి" ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్, నిర్మాతల మండలి హాల్ లో ఘనంగా జరిగింది. సంచలన దర్శకులు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిధిగా విచ్చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి, వైజాగ్ కు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులు రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, మరింతమందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.


ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు శ్రీనివాస్ ఉలిశెట్టి, హీరోయిన్లు దియారాజ్, నీహారిక శాంతిప్రియ, నిర్మాతలు లడ్డే బ్రదర్స్, డి.ఓ.పి. సంతోష్, నటుడు త్రినాథరావు, కో-డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ పాల్గొని, తమ చిత్రం ట్రైలర్ విడుదల చేసి, విషెస్ తెలిపిన త్రినాథరావు నక్కినకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ... "ఎంత పని చేశావ్ చంటి" చిత్రాన్ని మగవాళ్ళు చూడకూడదని, ఈ చిత్రం కేవలం ఆడవాళ్లకు మాత్రమేనని పేర్కొన్నారు. 


జబర్దస్త్ అప్పారావు, భాస్కరాచారి, అమ్మరాజా, నవ్వుల దామోదర్, ఎమ్.టి.రాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్టిల్స్: రామకృష్ణ - లోకేష్, మేకప్ ఛీఫ్: ఎమ్.డి.మల్లిక, పాటలు: తుంబలి శివాజీ, సంగీతం: పవన్ - సిద్దార్ద్, కొరియోగ్రఫీ: మురళీకృష్ణ -నీహారిక, ఎడిటర్; శ్యామ్ కుమార్, సినిమాటోగ్రాఫర్: సంతోష్ డి.జెడ్, కో-డైరెక్టర్: బత్తిన సూర్యనారాయణ, కథ -మాటలు: ప్రసాదుల మధుబాబు, సహనిర్మాత: రాము, నిర్మాతలు: లడ్డే బ్రదర్స్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఉదయ్ కుమార్!!

Post a Comment

Previous Post Next Post