Megastar Chiranjeevi is Invited for Nandamuri BalaKrishna Golden Jubilee Celebrations

 


మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు ఆహ్వానించిన  తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్


నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న  హైదరాబాద్ హైటెక్స్  నోవోటెల్ హోటల్లో  తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్ నుంచి భరత్ భూషణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్నకుమార్ గారు, రాజా రవీంద్ర గారు, జెమినీ కిరణ్ గారు, కె. ఎల్. నారాయణ గారు, మాదాల రవి గారు, అనుపం రెడ్డి గారు, నిర్మాత సి కళ్యాణ్ గారు, డైరెక్టర్ వీర శంకర్ గారు, నిర్మాత అశోక్ కుమార్ గారు, అనిల్ వల్లభనేని గారు వీర శంకర్... చిరంజీవి గారు ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా నాలుగు సంస్థల పెద్దలతో ముచ్చటించి చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు

Post a Comment

Previous Post Next Post