Actress Samyuktha Steps Up to Help Wayanad Landslide Victims with Heartfelt Donation

 వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన స్టార్ హీరోయిన్ సంయుక్త



వయనాడ్ విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు చిత్ర పరిశ్రమలోని పలువురు స్టార్స్ ముందుకొస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సంయుక్త వయనాడ్ బాధితుల సహాయార్థం కొంత సాయం చేసింది. వయనాడ్ లో సహాయ కార్యక్రమాలు చేస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్ కు చెక్ ను సంయుక్త అందజేసింది.

ఈ సందర్భంగా సంయుక్త సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ - వయనాడ్ ప్రజలకు ఎదురైన విపత్తు ఎంతో బాధను కలిగిస్తోంది. ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలబడి, నా వంతు సపోర్ట్ అందిస్తున్నా. విశ్వశాంతి ఫౌండేషన్ వారు వయనాడ్ లో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు నా వంతు సహాయం అందించా. వయనాడ్ కు సపోర్ట్ గా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అక్కడి ప్రజలు ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. అంటూ పేర్కొంది.

సొసైటీకి తన వంతుగా ఏదైనా చేయాలనే తపన ఉన్న సంయుక్త ఇప్పటికే మహిళా సాధికారత, నిస్సహాయ స్త్రీలను ఆదుకునేందుకు ఆదిశక్తి అనే ఫౌండేషన్ స్థాపించి సేవలు అందిస్తోంది. ఇప్పుడు వయనాడ్ బాధితుల సహాయార్థం ఆర్థిక సాయం అందించడం ఆమె మంచి మనసును చూపిస్తోంది


Post a Comment

Previous Post Next Post