Top News

Kubera Team Unveiled Dhanush’s Birthday Special A New & Striking Poster

 హీరో ధనుష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసిన శేఖర్ కమ్ముల కుబేర టీం  



నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల, సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ డిఫరెంట్ పోస్టర్లు , గ్లింప్స్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.


ఈరోజు ధనుష్ పుట్టినరోజు. శేఖర్ కమ్ముల కుబేర టీం ధనుష్ పుట్టినరోజునుఅద్భుతమైన పోస్టర్ తో సెలబ్రేట్ చేసుకుంది. పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. ఇదివరకూ ఎన్నడూ చేయని క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ధనుష్‌. ఇందులో ధనుష్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది.


అద్భుతమైన స్టార్ కాస్ట్, టాప్ నాచ్ టెక్నికల్ టీంతో శేఖర్ కమ్ముల కుబేరు హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. హై బడ్జెట్ సోషల్ డ్రామా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.


శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న కుబేర తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది

Post a Comment

Previous Post Next Post