Telugu Movie Producers Met DyCM Pawan Kalyan

 ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు




కొత్త ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు


గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ తెలియచేశారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫి శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, నిర్మాతలు శ్రీ సి.అశ్వనీదత్, శ్రీ ఎ.ఎం.రత్నం, శ్రీ డి.సురేష్ బాబు, శ్రీ ఎస్.రాధాకృష్ణ (చినబాబు), శ్రీ దిల్ రాజు, శ్రీ భోగవల్లి ప్రసాద్, శ్రీ డి.వి.వి.దానయ్య , శ్రీమతి సుప్రియ, శ్రీ ఎన్.వి.ప్రసాద్, శ్రీ బన్నీ వాసు, శ్రీ నవీన్ ఎర్నేని, శ్రీ నాగవంశీ, శ్రీ టి.జి.విశ్వప్రసాద్, శ్రీ వంశీ కృష్ణ, శ్రీ వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post