Kalavedika, Raghavi Media - NTR Film Awards will be Grandly Held Tomorrow

కళావేదిక, రాఘవి మీడియా - ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది



విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్"  2024 , హైదరాబాద్ లోని హోటల్ "దసపల్లా" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును. "కళావేదిక" (R.V.రమణ మూర్తి గారు), " రాఘవి మీడియా"  ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడును. ముందుగా ఈ కార్యక్రమం యొక్క పోస్టర్ లాంచ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ (సీతక్క) గారు, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు, హీరో నారా రోహిత్ గారు, హీరోయిన్ అనన్య నాగళ్ళ గారు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గారు మరియు ఇంకొంత మంది ప్రముఖులు విచ్చేస్తున్నారు.


కళావేదిక భువన గారు మరియు రాఘవి మీడియా మధు గారు మాట్లాడుతూ :

విశ్వవిఖ్యాత, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారక రామారావు గారు పేరు మీద అవార్డ్స్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్ కి ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, దనసరి అనసూయ (సీతక్క) గారికి, దర్శకులు బోయపాటి శ్రీను గారికి, నారా రోహిత్ గారికి, రాహుల్ సిప్లిగంజ్ గారికి, అనన్య నాగళ్ళ గారికి, మరియు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కావున ఈ నెల 29 న సినీ ప్రముఖులు, NTR గారి అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నపం అని అన్నారు.

 

Post a Comment

Previous Post Next Post