Kartikeya Gummakonda and UV Concepts #Kartikeya8 pre look out now, first look tomorrow

యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా ప్రీ లుక్ రిలీజ్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రేపు విడుదల




ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ గుమ్మకొండ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీడేస్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.


ఇవాళ ఈద్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. రేపు మధ్యాహ్నం 12.06 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


ప్రీ లుక్ ఇన్నోవేటివ్ గా ఉండి ఆకట్టుకుంటోంది. కార్తికేయ నటిస్తున్న 8వ చిత్రమిది. న్యూ కాన్సెప్ట్ బేస్డ్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.


నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు


టెక్నికల్ టీమ్-

మాటలు: మధు శ్రీనివాస్

ఆర్ట్: గాంధీ నడికుడికర్

ఎడిటర్: సత్య జి

సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్

మ్యూజిక్ (పాటలు) - రధన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి

ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్

దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి

 

Post a Comment

Previous Post Next Post